-0.7 C
New York
Wednesday, January 26, 2022

Famous Celebrities Birthdays on Jan 13 || Imran Khan || Ashmit Patel || Shri Tv Wishes

Famous Celebrities Birthdays on Jan 13 || Imran Khan || Ashmit Patel || Shri Tv Wishes

జనవరి 13 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Imran Khan   : బాలీవుడ్ హీరో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసింది పదిహేను చిత్రాలే అయినా తనదైన ప్రతిభతో బాలీవుడ్‌ తెరపై తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నాడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. . 1983 జనవరి 13న అమెరికాలోని మాడిసన్‌లో అనిల్‌ పాల్, నుజాత్‌ ఖాన్‌ దంపతులకు జన్మించిన ఇమ్రాన్‌ అసలు పేరు ఇమ్రాన్‌ పాల్‌. తన తొలి చిత్రం ‘జానే తు.. యా జానే నా’ (2008)తోనే ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ (డెబ్యూ) పురాస్కారాన్ని అందుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించాడు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో జై సింగ్‌గా ఇమ్రాన్‌ కనబర్చిన నæనకు సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దీని తరువాత ఇమ్రాన్‌ చేసిన ‘కిడ్నాప్‌’, ‘లక్‌, ‘ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌’, ‘మేరే బ్రదర్‌ కీ దుల్హాన్‌’, ‘దిల్లీ బెల్లీ’, ‘బాంబే టాకీస్‌’, ‘కట్టీ బట్టీ’ చిత్రాలు ఇమ్రాన్‌ కెరీర్‌లో మెచ్చుకోదగ్గ చిత్రాలుగా ‘జానే తు..’’ చిత్రం కన్నా ముందు ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ (1988), ‘జో జీతా వొహీ సికిందర్‌’ (1992) సినిమాల్లో బాల నటుడిగా తళుక్కున మెరిశాడు ఇమ్రాన్‌. కేవలం నటుడిగానే కాక ‘పెటా’ సంస్థ తరపున జంతు సంరక్షణ కోసం అనేక ప్రకటనల్లో నటించాడు.

  2.    Palnati Surya Pratap  : కరెంట్, కుమారి 21F సినిమాల దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ పుట్టిన రోజు నేడు. జనవరి 13, 1978లో భద్రాచలంలో జన్మించారు. సినిమాల్లోకి రాక ముందు అల్ ఇండియా రేడియో లో పని చేసారు ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర రచయితగా పనిచేశాక 2009లో వచ్చిన కరెంట్ సినిమాతో దర్శకుడిగా మారారు ఆ సినిమా తర్వాత సుకుమార్ మహేష్ బాబు సినిమా ‘1 నేనొక్కడినే’కు రచయితగా పనిచేసిన సూర్య ప్రతాప్ సుకుమార్ నిర్మాతగా ఆయన అందించిన కథతో వచ్చిన ‘కుమారి 21F’ సినిమాకు దర్శకత్వం వహించారు. సుకుమార్ దర్శకత్వంలో 2017లో వచ్చిన రంగస్థలం సినిమాకు సహా రచయితగా పని చేసారు.   

  3.    Ashmit Patel         : అస్మిత్ పటేల్ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. జనవరి 13, 1978లో జన్మించారు ఈయన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ సోదరుడు. పటేల్ ఆక్టర్ అవడానికి ముందు బాలీవుడ్ దర్శకుడు విక్రం భట్ దగ్గర ఆప్ ముజె అచ్చే లగ్నే లగే, అవారా పాగాల్ దీవానా, రాజ్, ఫుట్ పాత్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఆ తర్వాత 2004లో వచ్చిన ఇంతేహా అనే హిందీ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. హిందీలో మర్డర్, నజర్, సిల్సిలే, దిల్ దియా హై, బనారస్, ఫైట్ క్లబ్, కుడియోన్ కా హై జమాన, టాస్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ బిగ్ బాస్ 4 సీజన్ లో కoటేస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ గా నిలిచాడు. కేవలం నటుడిగానే కాకుండా UTV బిందాస్ ఛానల్ లో సూపర్ స్టడ్, సూపర్ డ్యూడ్ అనే షోస్ లకు హోస్ట్ గా పని చేసారు అలాగే 2014లో సోనీ టీవిలో వచ్చిన పవర్ కపుల్ అనే టీవీ సిరీస్  లో కూడా నటించాడు.    

  4.    V. Manikandan      : షారుఖ్ మై హూ నా, అపరిచితుడు, రావణ్, బాయ్స్, ఓం శాంతి ఓం, రా.వన్ లాంటి సినిమాలకు తన విజువల్స్ తో గ్రాండ్ లుక్ తీసుకొచ్చిన కెమరామెన్ మనికందన్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. జనవరి 13, 1968లో తమిళ నాడులోని కోయంబత్తూర్ లో జన్మించారు. సినిమాల్లోకి రాక ముందు యాడ్ లకు కెమరామెన్ గా పనిచేసిన ఈయన దాదాపు 3000 లా యాడ్స్ కు పని చేసారు. ఆ తర్వాత 1994లో అధర్మం అనే తమిళ్ సినిమాతో కెమరామెన్ అయ్యారు ఆ తర్వతా సరిగమపదని, సేన్గోట్టై, మిస్టర్ రోమియో, పెన్నిన్ మనతై తొట్టు అనే సినిమాలకు పని చేసారు. అయితే 2005లో ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన అన్నియన్ సినిమా కెమరామెన్ గా బ్రేక్ ఇచ్చింది ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు హిందీలో షారుఖ్ ఖాన్ తో ఓం శాంతి ఓం, బిల్లు బార్బర్, ఐశ్వర్య రాయ్ రావణ్, అక్షయ్ కుమార్ కట్టా మీటా, షారుఖ్ రా.వన్, రణబీర్ దీపికల యేజవాని హై దీవాని, సల్మాన్ కన్ ప్రేమ రతన్ ధన్ పాయో లాంటి టాప్ హీరోల సినిమాలకు పని చేసారు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతావాసిసినిమాకు కెమరామెన్ గా పని చేసారు. తమిళ్ లో అన్నియన్, హిందీలో ఓం శాంతి ఓం సినిమాలకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు.       

  5.    Orlando Bloom     : ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫాంటసీ సినిమాలు ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’, ‘ద హాబిట్‌’, ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియాన్‌’, ‘ట్రాయ్‌’లాంటి చిత్రాల్లో ఆకట్టుకున్న నటుడు ఆర్లాండో బ్లూమ్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఇంగ్లండ్‌లో 1977లో పుట్టిన ఇతడు తల్లి ప్రోత్సాహంతో నటుడిగా మారి అటు రంగ స్థలం మీద, ఇటు వెండితెర మీద రాణించాడు. ‘రిడ్లీ స్కాట్స్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ హెవెన్‌’, ‘ఎలిజబెత్‌ టౌన్‌’ లాంటి చిత్రాల్లో పేరుతెచ్చుకున్న ఇతడు యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి ప్రతిష్ఠాత్మకమైన బాఫ్తా బ్రిటానియా హ్యుమానిటేరియన్‌ అవార్డు అందుకున్నాడు.

  6.    Patrick Dempsey   : ప్యాట్రిక్‌ డెంప్సీ ప్రముఖ హాలీవుడ్ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. అమెరికాలో 1966 జనవరి 13న పుట్టిన ఇతగాడు, చిన్నప్పుడు డిస్లెక్సియా వ్యాధితో బాధ పడ్డాడు. దాన్నుంచి బయటపడ్డాక నటన వైపు వచ్చి  ‘కాంట్‌ బై మీ లవ్‌’, ‘లవర్‌బాయ్‌’, ‘ఔట్‌బ్రేక్‌’, ‘స్క్రీమ్‌3’, ‘స్వీట్‌హోమ్‌ అలబామా’, ‘బ్రదర్‌ బేర్‌2’, ‘ఎన్‌ఛాంటెడ్‌’, ‘మేడ్‌ ఆఫ్‌ ఆనర్‌’, ‘వేలంటైన్స్‌ డే’, ‘ఫ్లైపేపర్‌’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌: డార్క్‌ ఆఫ్‌ ద మూన్‌’లాంటి సినిమాలతో ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాడు. ఇతడికి కార్లంటే పిచ్చి . స్పోర్ట్స్‌ కార్లు, వింటేజ్‌ కార్లు సేకరించడం సరదా ఎన్నో కార్‌ రేసుల్లో పాల్గొని పతకాలు సాధించాడు కేవలం నటుడిగానే కాకుండా రేస్‌ కార్‌ డ్రైవర్‌గా కూడా దూసుకుపోయాడు ప్యాట్రిక్‌ డెంప్సీ. బుల్లితెరైనా, వెండితెరైనా పాత్రలో ఒదిగిపోయి ఇటు ఇంటింటి వీక్షకులను, అటు వెండితెర ప్రేక్షకులను అలరించాడు. నాటకాలు, టీవీలు, సినిమాల ద్వారా మంచి పేరు, అవార్డులు పొందాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు 

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!