-0.7 C
New York
Wednesday, January 26, 2022

Famous Celebrities Born on Jan 01 || Nana Patekar || Sonali Bendre || Shri Tv Wishes

Famous Celebrities Born on Jan 01 || Nana Patekar || Sonali Bendre || Shri Tv Wishes

జనవరి 1 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Nana Patekar  : నానాపటేకర్‌ ఇండియన్ సినిమాలో అత్యంత విలక్షణమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు.  1951 జనవరి 1న మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లాలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. 1978లో  గమన్‌’ చిత్రంతో సహాయనటుడిగా చిత్రసీమకు పరిచయ్యారు. ఆ తరువాత మరాఠా చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించిన మెప్పించారు. జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే పాత్రలో ‘లార్డ్‌ మౌంట్‌బాæన్‌: ది లాస్ట్‌ విక్టరీ’ వెబ్‌సిరీస్‌ల్లో నటించి మెప్పించారు. ఆయన తొలిసారిగా జాతీయ దృష్టిని ఆకర్షించింది 1990లో వచ్చిన ‘పరిందా’ చిత్రంతోనే. విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన ఈ క్రైమ్‌ డ్రామా చిత్రంలో నానా కనబర్చిన నటనకు తొలిసారి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ‘అంగార్‌’ చిత్రంతో ఉత్తమ ప్రతినాయకుడిగా మరో ఫిలింఫేర్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక 1995లో వచ్చిన ‘క్రాంతివీర్‌’ మరోసారి నానాపటేకర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. 1997లో ‘అగ్నిసాక్షి’తో మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా మెరుపులు మెరిపించాడు. ‘అంధాయుధ్‌’, ‘పరిందా’, ‘రాజు బన్‌గయా జెంటిల్మెన్‌’, ‘తిరంగా’, ‘అపహరణ్‌’, ‘అగ్ని సాక్షి’, ‘సలాంబాంబే’, ‘రాజ్‌నీతి’, క్రాంతివీర్‌’, ‘శక్తి: ది పవర్‌’, ‘నæసామ్రాట్‌’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచాయి. 1991లో వచ్చిన ‘ఫర్‌హార్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాక గొప్ప దాతగా కూడా ఆయన ‘అనుభూతి’ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా బీహార్‌లో వరదలు కారణంగా నిరాశ్రయులైన వారికి ఆసరాను అందించారు. ‘రాజ్‌కపూర్‌’ అవార్డు ద్వారా నానాకు వచ్చిన రూ.10లక్షల నగదును మహారాష్ట్రలో కరవు సహాయానికి విరాళం అందించారు. 2015లో ‘నామ్‌’ ఫౌండేషన్‌ను స్థాపించి మరింత సామాజిక సేవ చేస్తున్నారు. భారత ప్రభుత్వం నానాపటేకర్‌కు 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. 

  2.      Sonali Bendre       : ఇంద్ర, నరసింహ నాయుడు, మురారి సినిమాలతో తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే ఈరోజు ఆవిడ పుట్టిన రోజు.  1975 జనవరి 1న ముంబైలో జన్మించిన సోనాలి బింద్రే.. మోడలింగ్‌ రంగం నుంచి 90లలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 1994లో వచ్చిన ‘ఆగ్‌ అనే హిందీ  సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది ఈ సినిమాతో తొలి ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. ఆ తరువాత ఆమె చేసిన ‘దిల్‌జాలే’, ‘భాయ్‌’, ‘కహర్‌’ సినిమాలు వరుస హిట్లు అందుకోవడంతో బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయికగా ఎదిగింది. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్, సన్నీడియోల్, సల్మాన్‌ ఖాన్, ఆమీర్‌ ఖాన్, అనీల్‌ కపూర్, అక్షయ్‌ కుమార్, షారుఖ్‌ ఖాన్‌ వంటి టాప్ హీరోలతో కలిసి నటించింది. హిందీలో సోనాలి చేసిన వాటిలో ‘మేజర్‌ సాబ్‌’, ‘సర్ఫరోష్‌’, ‘హమ్‌ సాత్‌ సాత్‌ హైనా’, ‘దిల్‌ హై దిల్‌ మైన్‌’, ‘హమారా దిల్‌ ఆప్‌ కే పాస్‌ హై’ చిత్రాలు ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 1999లో మణిరత్నం నిర్మించిన ‘కాదలార్‌ దినం’ అనే తమిళ సినిమా చేసింది. ఆ సినిమా ‘ప్రేమికుల రోజు’ పేరుతో తెలుగులో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక సోనాలి బింద్రే నటించిన తొలి తెలుగు సినిమా ‘మురారి’ ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో ఆమెకు మంచి  అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె చేసిన ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘ఖడ్గం’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. తన కెరీర్లో హిందీ,తెలుగు,మరాఠి,తమిళ్ భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించిన సోనాలీ ఉత్తమ నటిగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. ఇండియన్ ఐడల్, ఇండియా స్ గాట్ టాలెంట్, మిషన్ సప్నే లాంటి టీవీ షోస్ కూడా ఆవిడ చేసారు.  

  3.       Vidya Balan         :   డర్టీ పిక్చర్‌, కహానీ, తుమ్హారీ సులు లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వంద కోట్లు సాధించాయంటే అది విద్యా బాలన్ టాలెంట్ వల్లే, డిఫరెంట్ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యా బాలన్ పుట్టిన రోజు నేడు.   పద‌హా‌రేళ్ల వయ‌సులో ఏక్తా‌క‌పూర్‌ తీసిన టీవీ షో ‘హమ్‌ పాంచ్‌’తో నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసిన విద్యా బాలన్ ‘భలే థేకో’ అనే బెంగాలీ చిత్రంలో మొదటసారి నటించింది ఆ సినిమాలో ఉత్తమ నటిగా ఆనం‌దలోక్‌ పుర‌స్కా‌రా‌నికి ఎంపి‌కైంది. ఆ తర్వాత ‘పరి‌ణీత సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది ‘లగే రహే మున్నా‌భాయ్‌’ ‘గురు’, ‘సలామ్‌ ఎ ఇష్క్‌’, ‘ఏక‌లవ్య’, ‘హే బేబీ’, ‘భూల్‌ భులయా’, ‘హల్లాబోల్‌’, ‘కిస్మత్‌ కనె‌క్షన్‌’, ‘పా’, ‘ఇష్కియా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘థ్యాంక్యూ’ లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘ది డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘తుమ్హారీ సులు’ సినిమాలతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా విద్యా బాలన్ కు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ‘బాంబే టాకీస్‌’, ‘బాబీ జాసూస్‌’, ‘కహానీ 2’, ‘హమారి అదూరి కహాని’, ‘టీన్‌’, ‘ఏక్‌ అల్బేల’, ‘కహానీ2: దుర్గా రాణి సింగ్‌’, ‘బేగమ్‌ జాన్‌’, ‘మిషన్ మంగళ్’, ‘శకుంతలా దేవి’ సినిమాల్లో నటించింది. తెలుగులో బాలకృష్ణతో కలిసి ‘యన్‌.టి.ఆర్‌ బయోపిక్’ చిత్రంలో బసవతారకంగా కూడా నటించింది.

  4.        Aishwarya R. Dhanush  :  ఐశ్వర్య ఆర్ ధనుష్ ప్రముఖ డైరెక్టర్, సింగర్ నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ప్రముఖ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, తమిళ హీరో ధనుష్ భార్య. ఐశ్వర్య జనవరి1, 1982లో తమిళనాడులోని చెన్నై లో జన్మించారు. ఈవిడ 2011లో వచ్చిన 3 అనే సినిమాతో డైరెక్టర్ గా మరింది. ఆ తర్వాత వై రాజా వై, సినిమా వీరన్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈవిడ 2010లో న్యూస్ మేకర్ అఫ్ ద ఇయర్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. 2003లో వచ్చిన విజిల్ సినిమాకి, 2010లో వచ్చిన ఆయిరతిల్ ఒరువన్ సినిమాలలో పలు పాటలు కూడా పాడారు.    

  5.       Kalabhavan Mani   :  విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన జెమినీ సినిమా గుర్తుందా అందులో జంతువుల్లా చిత్ర విచిత్రంగా సౌండ్స్ చేస్తూ వెరైటీ గా నటించిన విలన్ కళాభవన్ మణి  ప్రముఖ మలయాళ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈయన జనవరి1, 1971లో కేరళ లోని చలకుడి లో జన్మించారు, అసలు పేరు కున్నిస్సేరి వీట్టిల్ రామన్ మణి. ఈయన తన కెరీర్ ని మిమిక్రీ ఆర్టిస్టుగా స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత ఈయన 1995లో వచ్చిన అక్షరం అనే సినిమాతో నటుడిగా మారారు 1996లో వచ్చిన సల్లాపం అనే సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఇక ఆ తర్వాత మలయాళం, తమిళ్ లో కలిపి దాదాపు 200 సినిమాల్లో నటించారు. తెలుగులో జెమినీ సినిమాలో లాడ్డగా ఆయన నటన ప్రేక్షకులను ఏంతో ఆకట్టుకుంది ఆ తర్వాత ఆయుధం, అర్జున్, నరసింహుడు, బ్రహ్మస్త్రం, ఎవడయితే నాకేంటి, నగరం సినిమాల్లో నటించారు. ఈయనకు వాసంతియుం లక్ష్మియుం పిన్నె నిజనo అనే సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు(స్పెషల్ జ్యూరీ), కేరళ స్టేట్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, కథా రచయితగా ఆయన పలు సినిమాలు చేసారు.

  6.       Ravi Prakash  :  డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాడని చాలామంది అంటారు కానీ డాక్టర్ అయ్యి ఆ తర్వాత నటుడయిన వ్యక్తీ మన తెలుగు నటుడు రవి ప్రకాష్ నేడు ఆయన పుట్టినరోజు. రవి ప్రకాష్ జనవరి1, 1981లో విజయవాడలో జన్మించారు. రష్యా లో MBBS డాక్టరేట్ పొందారు ఆ తర్వాత నటుడిగా 2000లో వచ్చిన శుభవేళ అనే సినిమా చేసారు. ఆ తర్వాత 2002లో ఈశ్వర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒకరికి ఒకరు, సీతయ్య, ఘర్షణ, అతడు, షాక్, స్టాలిన్, అతిధి,చింతకాయల రవి,  వేదం, సింహ, దూకుడు, జులాయి, బాద్ షా, సన్ అఫ్ సత్యమూర్తి, లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఫిబ్రవరి 14, సరోజ, మట్టరన్, మేఘ, సాగాసం లాంటి సినిమాల్లో  నటించిన రవి ప్రకాష్ ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 102 సినిమా చేసారు.  

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!