2.1 C
New York
Tuesday, January 18, 2022

Famous Celebrities Born on Jan 03 || Rajanala || Bellamkonda Sai Sreenivas || Shri Tv Wishes

Famous Celebrities Born on Jan 03 || Rajanala || Bellamkonda Sai Sreenivas || Shri Tv Wishes

జనవరి 3 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.      Rajanala   : తెలుగులో ‘కింగ్‌ ఆఫ్‌ విలన్స్‌’ గా పేరు తెచ్చుకున్న నటుడు రాజనాల పుట్టిన రోజు నేడు. 1925 జనవరి 3న నెల్లూరులో పుట్టిన రాజనాల కాళేశ్వరరావు రెవెన్యూ ఇనస్పెక్టర్‌ ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవారు ఆపై సినిమాల్లోకి వచ్చారు. 1952లో రాజమార్గం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ తర్వాత చేసిన ‘ప్రతిజ్ఞ’ (1953) చేసిన సినిమా ప్రేక్షకులకు ఆయనను దగ్గర చేసింది. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు  జయసింహ, తెనాలి రామకృష్ణ, సువర్ణ సుందరి, కుటుంబ గౌరవం, వినాయక చవితి, రాజమకుటం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, ఉషా పరిణయం జగదేకవీరుని కథ, సిరిసంపదలు, గులేబకావలి కథ, చిట్టి తమ్ముడు, దక్ష యజ్ఞం గుండమ్మ కథ, పరువు ప్రతిష్ట, నర్తన శాల, రాముడు భీముడు, దేవత, బొబ్బిలి యుద్ధం, సిఐడి, శ్రీ సింహాచల క్షేత్ర మహిమ, సత్య హరిచంద్ర, శ్రీ కృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీ కృష్ణావతారం, ‘జగదేక వీరుని కథ’, ‘బందిపోటు’, ‘శ్రీకృష్ణ పాండవీయం’ ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో రాజనాల లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా రాజనాల పాత్రపోషణ సన్నివేశానికి గాంభీర్యాన్ని తీసుకువచ్చేది ముఖ్యంగా జానపద చిత్రాల్లో ఎన్టీఆర్, కాంతారావులకు విలన్ గా వాళ్ళతో దీటుగా నటించారు. 1966లో ‘మాయాది మాగ్నిఫిషన్‌’ అనే హాలీవుడ్ చిత్రంలో రాజనాల నటించి ఆ ఘనత సాధించైనా తొలి తెలుగు నటుడిగా అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించారు. 1953 నుంచి 1966 వరకు 150 చిత్రాలలో నటించారు అదొక రికార్డు.

  2.       Bellamkonda Sai Sreenivas  : బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ప్రముఖ తెలుగు నటుడు నేడు ఆయన పుట్టినరోజు. ఈయన జనవరి3, 1993లో జన్మించారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈయన్ తండ్రి, సాయి శ్రీనివాస్ 2014లో తన మొదటి సినిమా అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమయ్యారు ఆ సినిమా మంచి హిట్ అయ్యిoది. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయనకి 2014లో అల్లుడు శ్రీను సినిమాలో యాక్టింగ్ కి గాను ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.  

  3.    Saindhavi   : సైంధవి పముఖ భారతీయ ప్లే బ్యాక్ సింగర్ ఈరోజు ఆవిడ పుట్టినరోజు. సైంధవి జనవరి3, 1989లో జన్మించారు. ఈవిడ తన పన్నెండు ఏళ్ళు ఉన్నప్పటినుంచే పాడడం మొదలు పెట్టింది. సైంధవి తన మొదటి పాట 2005లో వచ్చిన అన్నియన్ సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి, తొట్టి జయ, పట్టియల్, పరమసివన్, ఆతి, అజ్హగియ తమిళ్ మగన్, వేడి, వెట్టి, తలైవ, రాజ రాణి, కప్పల్, సేతుపతి, తేరి, 88, అసురాన్, పొంమగల్ వందల్ లాంటి సినిమాలలో పాడారు. ఈవిడ తెలుగులో శశిరేఖ పరిణయం సినిమాలో ఏదో ఎదో, శక్తి సినిమాలో ప్రేమదేశం యువరాణి, ఇష్క్ సినిమాలో సూటిగా చూడకు అనే పాటలు పాడారు.

  4.    Navaneet Kaur  : నవనీత్ కౌర్ ప్రముఖ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. నవనీత్ కౌర్ జనవరి3, 1986లో ముంబై లో జన్మించారు. ఈవిడ తన 2004లో వచ్చిన కన్నడ సినిమా “దర్శన్” తో పరిచయమయ్యారు. తెలుగులో 2004లో వచ్చిన శీను వసంతి లక్ష్మి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జగపతి, గుడ్ బాయ్, రూమ్ మేట్స్, మహారధి, యమదొంగ, భుమ, టెర్రర్, ఫ్లాష్ న్యూస్, నిర్ణయం, కాలచక్రం, లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నవనీత్ కౌర్ ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 23సినిమాల్లో నటించారు.   

  5.    Mel Gibson  : మెల్‌ గిబ్సన్‌ హాలీవుడ్‌లో యాక్షన్‌ హీరో ఈరోజు ఆయాన్ పుట్టిన రోజు. న్యూయార్క్‌ లో 1956లో పుట్టిన గిబ్సన్‌ పన్నెండేళ్లకే యాక్టింగ్‌ స్కూల్లో చేరాడు. ‘రోమియో జూలియట్‌’, ‘గల్లిపోలి’, ‘ద ప్యాసన్‌ ఆఫ్‌ ద క్రీస్ట్‌’, ‘అపోకలిప్టో’, ‘ద బ్రేవర్‌’ లాంటి సినిమాలతో మెప్పించారు. స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘బ్రేవ్‌హార్ట్‌’ సినిమా ద్వారా ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘హాక్‌సా రిడ్జ్‌’ సినిమా రెండు ఆస్కార్లు పొందింది.

  6.    Ray Milland   :  రే మిల్లాండ్‌ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. వేల్స్‌ లో 1907 జనవరి 3న పుట్టిన ఇతడు, బ్రిటిష్‌ సైన్యంలో పనిచేసిన తర్వాత సినిమా రంగంలోకి వచ్చాడు. ‘రీప్‌ ద వైల్డ్‌ విండ్‌’, ‘డయల్‌ ఎమ్‌ ఫర్‌ మర్డర్‌’, ‘లవ్‌స్టోరీ’, ‘ద ఫ్లైయింగ్‌ స్కాట్స్‌మన్‌’, ‘థ్రీ స్మార్ట్‌ గర్ల్స్‌’, ‘ద జంగిల్‌ ప్రిన్సెస్‌’, ‘ద మేజర్‌ అండ్‌ ద మైనర్‌’, ‘ద బిగ్‌క్లాక్‌’, ‘ద థీఫ్‌’లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ద లాస్ట్‌ వీకెండ్‌’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందాడు. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!