2.1 C
New York
Tuesday, January 18, 2022

Famous Celebrities Born on Jan 04 || Pradeep Kumar || Nirupa Roy || Shri Tv Wishes

Famous Celebrities Born on Jan 04 || Pradeep Kumar || Nirupa Roy || Shri Tv Wishes

జనవరి 4 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Nirupa Roy    : మనకి బాలీవుడ్ లో ట్రాజెడీ కింగ్ గా దిలీప్ కుమార్ తలుసు మరి ట్రాజెడీ క్వీన్ ఎవరో తెలుసా ఆవిడే ఈ నిరూప రాయ్ అలనాటి బాలీవుడ్ నటి ఈరోజు ఆవిడ పుట్టినరోజు. నిరూప రాయ్ జనవరి4, 1931లో ముంబై లో జన్మించారు ఈవిడ పూర్తి పేరు కోకిల కిషోర్ చంద్ర బుల్సర. తను 1946లో వచ్చిన అమర్ రాజ్ సినిమాతో పరిచయమై ఉద్ధర్, రాం జన్మ, దో బిఘ జమీన్, చక్రధారి, దుర్గ పూజ, దుల్హన్, శేహ్ నాయి, బెనజీర్, జాల్, మహారాజ, మా, సుహాగ్, నమక్, జహాన్ తుం లే చలో,  ‘చక్రధారి’,‘గరం కోట్‌’, ‘టోంగా-వాలి’దీవార్‌’‘బ్లడ్‌ స్వెట్‌’, ‘ముకద్దర్‌ కా సికందర్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంథోనీ’, ‘సుహాగ్‌’, ఇంకిలాబ్‌’, ‘గంగా జమున సరస్వతి’ లాంటి సినిమాల్లో నటించారు. 1940-50 మధ్యకాలంలో నిరూపరాయ్‌ పౌరాణిక సినిమాలలో ఎక్కువగా నటించేది వాటిల్లో హిందూ దేవతల పాత్రలు పోషించడంతో ప్రేక్షకులు ఆమెను కలిసి దీవెనలు కోరేవారు. చాలామంది సినీ ప్రియులు ఆమె ఇంటికి వచ్చి దేవతల పాత్రలు పోషించినందుకు ఆమె పాదాలకు వందనం చేసేవారు.‘మునీంజీ’ (1956), ‘ఛాయా’ (1962), ‘షెహనాయి’ (1965) సినిమాలలో నటనకు నిరూపరాయ్‌ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్‌ బహుమతులు అందుకుంది. బాలీవుడ్‌లో ఆమెను ‘బాలీవుడ్‌ ‘మా’ జీ’ అని ‘క్వీన్‌ ఆఫ్‌ మిజరీ’ అని పిలుచుకుంటారు.

  2.    Jiiva : తెలుగులో డబ్బింగ్ సినిమా గా వచ్చి భారి హిట్ అయిన రంగం సినిమా గుర్తుందా ఆ సినిమా హీరోనే జీవా అసలు పేరు అమర్ చౌదరి. ఈరోజు ఆయన పుట్టినరోజు. జీవ జనవరి4, 1984లో చెన్నై లో జన్మించారు. జీవా తన మొదటి సినిమా 2003లో వచ్చిన ఆసై ఆసైయై సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తితికుందే, రాం, డిష్యుం, కీర్తి చక్ర, ఇ, పోరి, తెనవట్టు, సింగం పులి, కొ, రౌతిరం, ముగామూడి, డేవిడ్, జిల్లా, యాన్, పొక్కిరి రాజ, తిరుణాల్, కలకలప్పు 2, కీ, గొరిల్లా, సీరు, జిప్సీ లాంటి సినిమాల్లో హీరోగా నటించారు,  ఈయన ప్రముఖ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి కొడుకు.

  3.    Kelly Dorji     : డాన్, కింగ్, బిల్లా, బద్రీనాథ్, రెబెల్, బాద్షా, నేనొక్కడినే లాంటి సినిమాల్లో విలన్ గా చేసిన కెల్లీ డోర్జీ పుట్టిన రోజు నేడు. కెల్లీ డోర్జీ జనవరి4, 1971లో భూటన్ లో జన్మించారు. ఈయన మొదట 2005లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన టాంగో చార్లీ సినిమాలో నటించారు. ఆ తర్వాత 2008లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి డాన్ సినిమాతో పరిచయమయి కింగ్, ద్రోణ,బిల్లా, కేడి,బద్రినాథ్,దడ,రెబల్, బాద్ షా, నేనొక్కడినే సినిమాలతో తెలుగులో టాప్ విలన్ గా ఎదిగారు. డోర్జీ ఇప్పటివరకు తన కెరీర్లో హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం బెంగాలీ, తమిళ్ భాషల్లో కలిపి 28సినిమాల్లో నటించారు.

  4.    Aditya Pancholi  : ఆదిత్య పంచోలి ప్రముఖ భారతీయ యాక్టర్, ప్రొడ్యూసర్, ప్లే బ్యాక్ సింగర్ ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆదిత్య పంచోలి జనవరి4, 1965లో జన్మించారు. ఈయన 1986లో వచ్చిన సస్తి దుల్హన్ మేహ్న్గా దుల్హ సినిమాతో పరిచయమై, దయవన్, మాలామాల్, క్యటిల్, మొహబాత్ కా పైఘం, జడ్డుగర్, లడాయి, ఆషికి, వీరు డాడ, అకైల, సాతి, శివ్ రాం, దుష్మన్ దేవత, లాల్ పరీ, ముకాబ్లా, ఎక్ థా రాజా, ఎస్ బాస్, దేవత, బినాం, బాడీగార్డ్, ఇడియట్, రేస్2, షాడో, జై హో, హీరో, బాజీరావు మస్తాని, తయిష్ లాంటి సినిమాల్లో నటించారు. ఈయన సినిమాల్లోనే కాకుండా మహాశక్తి, మై ఫాదర్, గాడ్ ఫాదర్ లాంటి పలు టీవీ సీరియల్స్ లో కూడా చేసారు. ఆదిత్య పంచోలి కి ఎస్ బాస్ సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 96 సినిమాల్లో నటించారు.   

  5.    Pradeep Kumar       :  అలనాటి హిందీ నటుడు ప్రదీప్ కుమార్ పుట్టిన రోజు నేడు. జనవరి 4, 1925న కలకత్తాలోని బెంగాలీ కుటుంబంలో పుట్టారు. పదిహేడు సంవత్సరాల వయసులో చదువుకు స్వస్తి చెప్పి ప్రదీప్‌ నాటకరంగం వైపు వచ్చారు. 1946లో ‘కృష్ణలీల’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు.ఆ తర్వాత ఆలకనంద, ‘స్వామి’ సినిమాల్లో నటించారు అయితే ‘అనార్కలి’ సినిమా నటుడిగా బ్రేక్ ఇచ్చింది.  ‘ఆదిలే జహంగీర్‌‘శుభా కా తారా’,  ‘బాద్షా’, 1955 నుంచి 60 దాకా ప్రదీప్‌ కుమార్‌ అనేక సినిమాల్లో నటించారు. వాటిలో ముఖ్యంగా ‘తాజ్‌’, ‘అప్సర’, ‘అరబ్‌ కా సౌదాగర్‌’, ‘హీరో’, ‘పోలిస్‌’, ‘పోలీస్‌ ఇండియా’, ‘హిల్‌ స్టేషన్‌’, ‘ఫ్యాషన్‌ృ’, ‘గెట్‌ వే ఆఫ్‌ ఇండియా’ సినిమాలు నటుడిగా ఆయనకు స్టార్డం తీసుకొచ్చాయి, 1999లో ప్రదీప్‌కు కళాకార్‌ వారి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. 

  6.    Archana Kavi   :అర్చన కవి ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. అర్చన జనవరి4, 1988లో ఢిల్లీలో జన్మించారు. ఈవిడ తన కెరీర్ ని 2009లో వచ్చిన నీలతామర అనే మళయాళ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత మమ్మీ అండ్ మీ, బెస్ట్ అఫ్ లక్, సాల్ట్ అన్ పెప్పర్, స్పానిష్ మసాలా, హనీ బీ, బ్యాoగిల్స్, టు నూరా విత్ లవ్, డే నైట్ గేమ్, దూరం లాంటి సినిమాల్లో నటించింది. అర్చన 2012లో వచ్చిన అరవాన్ అనే సినిమాతో పరిచయమై జ్ఞాన కిరుక్కన్, సినిమాలో నటించారు. తెలుగులో 2013లో వచ్చిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలో కూడా నటించారు. ఈవిడ నీలతామర సినిమాకి ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డు, జై హింద్ అవార్డు, సూర్య ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు, లాంటి అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. అర్చన కవి తన కెరీర్లో ఇప్పటివరకు మొత్తం 23సినిమాల్లో నటించారు.  

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!