2.1 C
New York
Tuesday, January 18, 2022

Famous Celebrities Born on Jan 07 || Bipasha Basu || Irrfan Khan || Shri Tv Wishes

Famous Celebrities Born on Jan 07 || Bipasha Basu || Irrfan Khan || Shri Tv Wishes

జనవరి 7 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     B. Saroja Devi   : బి.సరోజ అలనాటి తెలుగు సినిమా హీరోయిన్ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. బెంగళూరులో 1938లో పుట్టిన బి.సరోజ 17 ఏళ్ల వయసులోనే కన్నడ చిత్రం ‘మహాకవి కాళిదాస’ (1955) చిత్రంలో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి సినిమా ‘పాండురంగ మహత్యం’ (1959) ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’, ‘జగదేక వీరుని కథ’, ‘దాగుడు మూతలు’ ‘అమరశిల్పి జక్కన్న’, ‘రహస్యం’, ‘ఆత్మబలం’లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు, ఎన్టీఆర్, అక్కినేని లాంటి  అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించారు. కేవలం 23ఏళ్లలో 154 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెదే! అలాగే ప్రపంచంలో 29 ఏళ్ల పాటు 161 సినిమాల్లో వరుసగా హీరోయిన్‌ పాత్రలు చేసిoది. కేవలం 8 ఏళ్లలో 62 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రికార్డు కూడా ఆమె సొంతం. ఆమెకు ‘అభినయ సరస్వతి’, ‘కన్నడ చిలుక’ అనే బిరుదులూ కూడా ఉన్నాయి. బి.సరోజకు పద్మభూషణ్, కలైమామణి అవార్డ్స్ కూడా వచ్చాయి.  బి.సరోజాదేవి తమిళ, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు.

  2.    Bipasha Basu    : బిపాసా బసు పరిచయం అవసరం లేని బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు.  దిల్లీలో 1979లో పుట్టి కోల్‌కతాలో పెరిగిన ఈమె మోడలింగ్‌లో మెరుపులు మెరిపించింది. 2001లో వచ్చిన ‘అజనబీ’సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయమైంది.  ఆ తర్వాత వచ్చిన ‘జిస్మ్‌’లో అయితే జాన్‌ అబ్రహామ్‌ సరసన హాట్ హాట్ గా కనిపించి సెక్స్‌ సింబల్‌ అనే గుర్తింపును తెచ్చుకొంది. ‘నో ఎంట్రీ’, ‘ఫిర్‌ ఫెరా ఫెరి’, ‘ధూమ్‌2’, ‘రేస్‌’‘అపహరణ్‌’, ‘కార్పోరేట్‌’, ‘బచ్‌ నా యే హసీనా’ చిత్రాలతో నటిగా కూడా గుర్తింపును తెచ్చుకొంది. తెలుగులో మహేష్‌బాబు సరసన ‘టక్కరి దొంగ’ సినిమాలో నటించింది. అలాగే తమిళంలో విజయ్‌ సరసన ‘సచిన్‌’ అనే సినిమాలో నటించింది. గాయకుడు సోనూ నిగమ్‌కి చెందిన ‘కిస్మత్‌’ అనే ఆల్బమ్స్‌లో బిపాసా కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ‘నో స్మోకింగ్‌’, ‘ఓంకారా’ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేసి అలరించింది. ‘కన్సెటింగ్‌ అడల్ట్స్‌’ అనే హాలీవుడ్ చిత్రంలో బిపాసా ఓ ప్రతినాయిక పాత్రలో మెరిసింది. ‘కార్పోరేట్‌’, ‘రాజ్‌’, ‘జిస్మ్‌’లాంటి సినిమాలకు ఉత్తమ నటిగా పలు అవార్డ్స్ అందుకుంది. 

  3.    Reena Roy     : రీనారాయ్‌ ఒకప్పటి బాలీవుడ్ అందాల తార ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. ముంబైలో 1957 జనవరి 7న పుట్టింది, ఆమె అసలుపేరు ‘సైరా ఆలి’. ‘జరూరత్‌’ సినిమాతో నటిగా బాలీవుడ్ కు పరిచయమైంది ఆ తర్వాత ‘జైసే కో తైసా’, ‘కాళిచరణ్‌’,‘నాగిన్‌’, ‘జాని దుష్మన్‌’, ‘ముకాబలా’, ‘రాజ్‌ తిలక్‌’, ‘రిష్తే’ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆవిడ నటించిన ‘ప్యాసా సావన్‌’‘ఆశా’, ‘అర్పన్‌’ సినిమాలు క్లాసిక్స్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.  ‘అప్నాపన్‌’ చిత్రంలో రీనారాయ్‌ నటనకు ఫిలింఫేర్‌ ఉత్తమ సహాయనటి అవార్డు లభించింది. రాజేష్‌ ఖన్నాతో ‘ధన్వన్‌’ ధర్మేంద్ర ‘నౌకర్‌ బీవి కా’, వినోద్‌ ఖన్నా సరసన నటించిన ‘జైల్‌ యాత్ర’, శత్రుఘ్నసిన్హాతో చేసిన మాటి మాంగతే ఖూన్‌’, ‘కాలి బస్తి’ సినిమాలు స్మాషింగ్‌ హిట్లయ్యాయి. ‘సనం తేరి కసమ్‌’లోకమలహాసన్‌ సరసన రీనా హీరోయిన్‌గా నటించింది. రీనా రాయ్ కు 1998లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచివేమేంట్ అవార్డు లభించిoది.

  4.    Nicolas Cage    : ఒకే సినిమాకి మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందడం అరుదైన విషయమే. అదే సాధించాడు హాలీవుడ్‌ నటుడు నికొలాస్‌ కేజ్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు, అసలు పేరు నికొలాస్‌ కిమ్‌ కొప్పాలా. కాలిఫోర్నియాలో 1964 జనవరి 7న పుట్టిన కి చిన్నప్పటి నుండే నటుడవ్వాలనే కోరిక ఉంది ఈయన బాబాయ్‌ ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పాలా ఫేమస్ హాలీవుడ్ దర్శకుడు చదువుకునేప్పుడే నాæకాల్లో వేషాలు వేసిన నికొలాస్‌ నటనలో తగిన శిక్షణ తీసుకున్నాక తన పేరును నికొలాస్‌ కేజ్‌గా మార్చుకుని తొలిసారిగా ‘ఫాస్ట్‌ టైమ్స్‌ ఎట్‌ రిడ్జిమాంట్‌ హై’ (19782)తో వెండితెరకు పరిచయమై చిన్న చిన్న పాత్రలు వేశాడు. ‘లీవింగ్‌ లాస్‌ వెగాస్‌’ (1995)లో నæనకు ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు పొందాడు. ఆపై ‘ద రాక్‌’, ‘ఫేస్‌ ఆఫ్‌’, ‘కాన్‌ ఎయిర్‌’, ‘సిటీ ఆఫ్‌ ఏంజెల్స్‌’, ‘అడాప్టేషన్‌’, ‘నేషనల్‌ ట్రెజర్‌’, ‘కిక్‌ యాస్‌’, ‘ఘోస్ట్‌ రైడర్‌’లాంటి సినిమాలతో అతడి పేరు మార్మోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఎన్నో సినిమాల్లో యాక్షన్‌ హీరోగా, విలక్షణ నటుడిగా వెరైటీ  పాత్రలతో మెప్పించి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలు చేసారు.

  5.    Irrfan Khan      : ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ విలక్షణ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు.  జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, సలామ్ బాంబే’ సినిమాతో 1988లో ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘కఖ్బూల్’ సినిమాతో ఇర్ఫాన్ ఖాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నటనకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత హాసిల్, మక్బూల్, ద నేమ్ సేక్, లైఫ్ ఇన్ ఏ మెట్రో, లంచ్ బాక్స్, తల్వార్, హిందీ మీడియం, పీకు, హైదర్, అంగ్రేజీ మీడియం లాంటి హిందీ సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.  ‘పాన్ సింగ్ తోమార్’ సినిమాలో నటనకు గాను ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. హిందీతో పాటు స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సైనికుడు’ సినిమాతో టాలీవుడ్‌‌కు కూడా పరిచయమయ్యారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

  6.    B.A. Raju:  తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేమస్ పీఆర్వో, నిర్మాత అయిన బి.ఎ.రాజు పుట్టిన రోజు నేడు. సినీ పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించిన బి.ఎ.రాజు తెలుగు చిత్రసీమలో అంచలంచలుగా ఎదిగి, విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆర్‌.జె.సినిమాస్‌ పేరుతో నిర్మాణ సంస్థని నెలకొల్పిన ఆయన ఆయన వైఫ్ బి.జయ దర్శకత్వంలోనే ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’, ‘చంటిగాడు’ తదితర చిత్రాల్ని నిర్మించి విజయాల్ని అందుకొన్నారు. వెయ్యికిపైగా సినిమాలకి పీఆర్వోగా పనిచేసారు మహేష్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌ తదితర అగ్ర కథానాయకులతో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!