-0.7 C
New York
Wednesday, January 26, 2022

Famous Celebrities Born on Jan 15 || Bhanupriya || Rahul Ramakrishna || Shri Tv Wishes

Famous Celebrities Born on Jan 15 || Bhanupriya || Rahul Ramakrishna || Shri Tv Wishes

జనవరి 15 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Bhanupriya :  అర్థం చేసుకోరూ… అంటూ ప్రత్యేకమైన విరుపుతో సంభాషణ చెప్పి నవ్వించినా, ఆకాశంలో ఆశల హరివిల్లు… అంటూ అందంగా ఆడిపాడినా భానుప్రియకే చెల్లింది ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. జనవరి 15, 1966లో రాజమహేంద్రవరం సమీపంలోని రంగంపేటలో పాండు బాబు, రాగమాలి దంపతులకి జన్మించిన భానుప్రియ అసలు పేరు మంగభామ. వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. స్వతహాగా కూచిపూడి నాట్య కళాకారిణి అయిన భానుప్రియకి తమిళం నుంచి తొలి అవకాశం అందింది. ఆ తరువాత వంశీ దర్శకత్వం వహించిన ‘సితార’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఇక భానుప్రియకి వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. అందులోని ‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి…’, ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా… కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా.. మిల మిల మెరిసిన తార… మిన్నుల విడిసిన సితార…’ పాటలతోనూ, ఆ పాటల్లో భానుప్రియ కనిపించిన విధానంతోనూ ఆమె ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు. ‘రౌడీ’, ‘రామాయణంలో భాగవతం’, ‘అనసూయమ్మగారి అల్లుడు’, ‘పల్నాటిపులి’, ‘గృహలక్ష్మి’, ‘మొగుడు పెళ్లాలు’, ‘అన్వేషణ’, ‘విజేత’… 1980 నుంచి 1993 వరకు కథానాయికగా ఆమె ప్రయాణం తిరుగులేని రీతిలో సాగింది. అక్కినేని నాగేశ్వరరావు, మోహన్‌బాబు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ తదితర అగ్రకథానాయకుల సరసన నటించి ఆమె విజయాల్ని అందుకొన్నారు. దమ్ము, చత్రపతి లాంటి సినిమాల్లో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 110కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొన్నారు భానుప్రియకు తన కెరీర్లో రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, మూడు నంది అవార్డ్స్, రెండు తమిళ నాడు స్టేట్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రోజా, ఊర్మిళ, మనీషా కోయిరాలా,రంభ, ప్రియా రామన్, రోషిని లాంటి హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్పారు. కేవలం సినిమాల్లోనే కాకుండా పలు టీవీ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకూ చేరువయ్యారు.

  2.    Neil Nitin Mukesh  : నీల్ నితిన్ ముకేష్ ప్రముఖ భారతీయ నటుడు నేడు ఆయన పుట్టినరోజు. నీల్ నితిన్ ముకేష్ జనవరి15, 1982లో మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఈయన 1988లో వచ్చిన హిందీ సినిమా విజయ్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి జైసి ఖర్ని వైసి భర్ణి, ఆ దేఖేన్ జార, న్యూ యార్క్, జైల్, ప్లేయర్స్, డేవిడ్, 3G, వజీర్, జానీ గద్దర్, లాంటి సినిమాల్లో నటించారు. ఈయన తెలుగులో కవచం, సాహో లాంటి సినిమాల్లో నటించారు. నీల్ నితిన్ ముకేష్ జానీ గద్దర్ సినిమాకి అప్సర ఫిల్మ్ అవార్డు, జీ సినీ అవార్డు వచ్చాయి. ఈయన తమిళ్ లో చేసిన కత్తి సినిమాకి ఉత్తమ విలన్ గా SIIMA అవార్డు గెలుచుకున్నారు. సాహో సినిమాకి జీ సినీ అవార్డ్స్ తెలుగు గెలుచుకున్నారు. నీల్ నితిన్ ముకేష్ తన కెరీర్లో మొత్తం 23సినిమాల్లో నటించారు.

  3.    Vikram Prabhu   : విక్రమ్ ప్రభు ప్రముఖ తమిళ నటుడు ప్రభు కొడుకు అలానటి తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ మనవడే  విక్రం ప్రభు ఈరోజు ఆయన పుట్టినరోజు. విక్రం ప్రభు జనవరి15, 1986లో చెన్నైలో జన్మించారు. ఈయన 2012లో వచ్చిన తమిళ సినిమా కుమ్కి తో హీరోగా పరిచయమై ఇవన్ వీరమతిరి, అరిమ నంబి, ఇదు ఎన్న మాయం, వీర శివాజీ. పక్క, తుప్పాకి మునై, లాంటి సినిమాల్లో నటించారు. విక్రం ప్రభు తన కెరీర్లో మొత్తం 13సినిమాల్లో నటించారు. ఈయన  కుమ్కి సినిమాకి విజయ అవార్డు, తమిళ నాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, SIIMA అవార్డు లాంటి అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు.

  4.    Rahul Ramakrishna  : మీకు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్ర గుర్తుందా ఆ పాత్ర చేసిన నటుడే రాహుల్ రామకృష్ణ నేడు ఆయన పుట్టినరోజు. రాహుల్ జనవరి 15, 1991లో తెలంగాణా సికింద్రాబాద్ లో జన్మించారు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తో పాపులర్ అయిన రాహుల్ రామకృష్ణ ఆ తర్వత  2016లో వచ్చిన జయమ్ము నిశ్చయమ్ము రా సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్  చేసి అర్జున్ రెడ్డి, ఇంటెలిజెంట్, భరత్ అనే నేను, సమ్మోహనం, గ్యాంగ్ స్టార్స్, చి ల సౌ, గీత గోవిందం, హుషారు, మిఠాయి, కల్కి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, ప్రెషర్ కుక్కర్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి, బ్రోచేవారెవరురా సినిమాలకి బెస్ట్ కమెడియన్ గా SIIMA అవార్డు, జీ సినీ అవార్డ్స్ తెలుగు లాంటి అవార్డ్స్ ని గెలుచుకున్నారు.  

  5.    Mohan Raja     :  మోహన్ రాజ ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు నేడు ఆయన పుట్టినరోజు. మోహన్ రాజ జనవరి15, 1976లో జన్మించారు. తెలుగులో హనుమాన్ జంక్షన్ అనే సినిమా తీసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ మోహన్ రాజ.  తెలుగులో తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన జయం సినిమాని తమిళ్ లో రీమేక్ చేసారు ఆ సినిమా అక్కడ మంచి హిట్ అయ్యింది  ఆ తర్వాత మోహన్ రాజా M. కుమారన్ సన్ అఫ్ మహాలక్ష్మి, సమ్ థింగ్ సమ్ థింగ్ ఉన్నక్కుం ఎనక్కుం, సంతోష్ సుబ్రహ్మణ్యం, తిల్లలంగడి, వెలయుధం, తని ఒరువన్, వేలైక్కరన్ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఈయన ఉత్తమ దర్శకుడిగా సంతోష్ సుబ్రహ్మణ్యం సినిమాకి తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, తని ఒరువన్ సినిమాకి ఎడిసన్ అవార్డు, IIFA ఉత్సవం అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు లని గెలుచుకున్నారు.

  6.    Chaganti Somayajulu  : చాగంటి సోమయాజులు ప్రముఖ తెలుగు రచయిత చాసోగా అందరికీ సుపరిచితులు ఈరోజు ఆయన పుట్టిన రోజు. కళాశాల విద్యార్థిగానే ఆయన కవితా రచనకి శుభారంభం పలికారు. తొరుదత్‌, సరోజినీ నాయుడు ల కవిత్వం, లియో టాల్‌స్టాయ్, మాక్సిం గోర్కీ ల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి. సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చారు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంద . ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ వీరి రచనలో ప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. 

 ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు 

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!