23.2 C
New York
Sunday, June 26, 2022

Famous Celebrities Born on March 17 || Puneeth Rajkumar || Saina Nehwal || Shri Tv Wishes

Famous Celebrities Born on March 17 || Puneeth Rajkumar || Saina Nehwal || Shri Tv Wishes

మార్చి 17  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1.       Saina Nehwal  : సైనా నెహ్వాల్ ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. మార్చి 17, 1990లో హర్యానాలోని హిసార్ లో జన్మించింది 2006లో ఫిలిప్పీన్స్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌తో మొదలుపెట్టి లెక్కకు మించిన టోర్నమెంట్‌లలో గెలిచారామె. బీడబ్లు్యఎఫ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో విజయం చేజారింది. అదే జూనియర్‌ చాంపియన్‌షిప్‌ని రెండేళ్ల తర్వాత గెలిచే వరకు ఆ దాహం తీరలేదామెకు. ఒలింపిక్స్, ఇండోనేసియా ఓపెన్, సింగపూర్‌ ఓపెన్, చైనీస్‌ తైపీ ఓపెన్‌లు గెలుచుకున్నారు. ఉమెన్స్‌ సింగిల్స్‌లో ఆమె గెలుచుకున్న స్వర్ణాలు ఆమె కీర్తిని పతాక స్థాయిలోకి తీసుకెళ్లాయి. స్విస్‌ ఓపెన్, థాయిలాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి, ఇండోనేసియా సూపర్‌ సిరీస్, డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌  సిరీస్‌లో విజయం దూరంగా ఉండిపోయింది. తిరిగి 2012లో లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు సైనా. మూడేళ్ల కిందట 2015 ఇండియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రిలో స్పానిష్‌ ప్లేయర్‌ కరోలినా మారిన్‌ మీద గెలిచి స్వర్ణంతో విజయ పరంపరకు మళ్లీ తెరలేపారు. అదే ఏడాది బీడబ్లు్యఎఫ్‌ సూపర్‌ సిరీస్‌లో గెలిచి బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్‌లో నంబర్‌ వన్‌ కి చేరారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండవ వ్యక్తిగత గోల్డ్‌ మెడల్‌ సాధించిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆమె.  ఈవిడ తన కెరీర్లో అర్జున అవార్డు, రాజీవ్‌ ఖేల్‌ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డ్స్ గెలుచుకున్నారు.1957

2.       Puneeth Rajkumar   : కన్నడ కంటిరీవ సూపర్ స్టార్ రాజ్ కుమార్ వారసుడిగా పరిచయమయ్యారు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ ప్రముఖ కన్నడ నటుడు, ప్రొడ్యూసర్, సింగర్ నేడు అయన పుట్టినరోజు. ఈయన మార్చి17, 1975లో చెన్నై లో జన్మించారు. పునీత్ రాజ్ కుమార్ 1976లో వచ్చిన ప్రేమద కనికే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై దాదాపు 13 సినిమాలు చేసారు. ఆ తర్వాత 1989లో వచ్చిన పరశురం సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆకాష్, అజయ్, అరసు, మిలన, వంశీ, రాజ్, జాకి, హుదుగరు, అన్న బాండ్, రానా విక్రమ, రాజ కుమార, అంజనీపుత్ర, లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ ప్రొడ్యూసర్ గా కవులుదారి, మాయాబజార్2016, లా, ఫ్రెంచ్ బిరియాని లాంటి సినిమాలు చేసారు. ఈయన సింగర్ గా దాదాపు 85 సినిమాలలో పాటలు పాడారు. పునీత్ రాజ్ కుమార్  కన్నడద కొత్యాధిపతి టీవీ షో కి హోస్ట్ గా కూడా చేసారు. ఈయన బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా  నేషనల్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకున్నారు.  అరసు, మిలన, వంశీ, రాజ్, జాకి, హుదుగరు, అన్న బాండ్, రానా విక్రమ, రాజ కుమార, అంజనీపుత్ర, సినిమాలకి బెస్ట్ యాక్టర్ గా 2 కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 4సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, 4ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్, 3సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్, 2సౌత్ స్కోప్ అవార్డ్స్, గెలుచుకున్నారు. పునీత్ రాజ్ కపూర్ బెస్ట్ సింగర్ గా కూడా ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు.

3.       Pragathi         : ప్రగతి ప్రముఖ తెలుగు సినీ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. ప్రగతి మార్చి 17, 1976lo హైదరాబాద్ లో జన్మించారు.సినిమాల్లోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ప్రగతి మైసూర్ సిల్క్స్ కోసం మోడల్ గా పని చేశారు.  తెలుగులో 2002లో వచ్చిన బాబీ సినిమాతో నటిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, గంగోత్రి, లీల మహల్ సెంటర్, సాంబ, కుషి కిషిగా, చిరుత, అతిథి, లక్ష్యం, పౌరుడు, రెడీ, చింతకాయల రవి, కుర్రాడు, నమో వెంకటేశ, రామ రామ కృష్ణ కృష్ణ, బృందావనం, ఏమైంది ఈ వేళ, అలా మొదలైంది, శక్తి, తీన్ మార్, మిస్టర్ పర్ఫెక్ట్, బద్రినాథ్, కందిరీగ, దూకుడు, వీర, అందాల రాక్షసి, బాడీ గార్డ్, నిప్పు, పూల రంగడు, దేనికైనా రెడీ, బాద్ షా, డమరుకం, జబర్దస్త్, అంతకు ముందు ఆ తరువాత, రభస, లౌక్యం, కళ్యాణ వైభోగమే, చలో,  F 2,  ఓ బేబీ, అర్జున్ సురవరం, 90ML లాంటి సినిమాల్లో నటించారు. ఈవిడ తమిళ్ లో కూడా దాదాపు 21 సినిమాల్లో మలయాళం లో రెండు సినిమాల్లో నటించారు. ప్రగతి కేవలం సినిమాల్లోనే కాకుండా పెన్, వసం, నాతి చరామి, అరన్మనై కిలి లాంటి తమిళ్ టీవీ సీరియల్స్ లో కూడా నటించారు.

4.       Rahul Raj           : ఓ మై ఫ్రెండ్ సినిమాతో తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రాజ్ పుట్టిన రోజు నేడు. ఈయన మార్చి 17, 1978లో కేరళ లోని కొచ్చి లో జన్మించారు.లండన్ లో మ్యూజిక్ లో ట్రైనింగ్ తీసుకున్న రాహుల్ ఆ తర్వాత ఆయనే సొంతంగా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్ లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో దాదాపు వందకు పైగా యాడ్ లకు జిoగిల్స్ కంపోజ్ చేశారు.2007లో వచ్చిన చోటా ముంబై అనే మలయాళ సినిమాతో సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత మలయాళంలో దాదాపు 35 సినిమాకు సంగీతం అందించారు. సిద్దార్థ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమాతో తెలుగుకు కూడా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. రాహుల్ తమిళ్ లో కూడా 11 సినిమాలకు సంగీతం అందించారు. తన కెరీర్లో తెలుగు. తమిళ్,మలయాళ భాషల్లో కలిపి దాదాపు 50కి పైగా సినిమాలు చేసిన రాహుల్ 2009లో వచ్చిన రితు అనే మలయాళ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కేరళ స్టేట్ అవార్డ్, ఓ మై ఫ్రెండ్ సినిమాకు మా మ్యూజిక్ అవార్డ్ అందుకున్నారు.

5.       John Boyega           : ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుని కాసులు కురిపించిన ‘స్టార్‌వార్స్‌’ సినిమాలను చూసినవారికి అతడు ఇట్టే గుర్తుంటాడు పేరు జాన్‌ బొయేగా అసలు పేరు జాన్‌ అడెడయో బి.అడెగ్బోయెగా. ఇంగ్లిష్‌ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. లండన్‌లో 1992 మార్చి 17న పుట్టిన ఇతగాడు ప్రైమరీ స్కూల్లోనే పులివేషం వేసి రక్తి కట్టించాడు. తొమ్మిదేళ్ల వయసులో స్కూలు నాటకంలో పాత్ర ధరించిన ఇతడు ఓ దర్శకుడి దృష్టిలో పడ్డాడు. నటనలో శిక్షణ పొంది నాటకాల ద్వారా మెప్పు పొందాడు. ఆపై సినిమాల్లోకి వచ్చి ‘స్టార్‌వార్స్‌’ సీక్వెల్‌ సినిమాలతో పాటు ‘ఎటాక్‌ ద బ్లాక్‌’, ‘డెట్రాయిట్‌’, ‘పసిఫిక్‌ రిమ్‌ అప్‌రైజింగ్‌’, ‘ఇంపెరియల్‌ డ్రీమ్స్‌’ లాంటి సినిమాలతో పాటు టీవీ సిరీస్‌ల్లో కూడా మంచి నటుడిగా ఆకట్టుకున్నాడు. ప్రతిష్ఠాత్మకమైన బాఫ్టా రైజింగ్‌ స్టార్‌ అవార్డ్‌ అందుకున్నాడు.

6.       Kurt Russell   : అంతర్జాతీయంగా ఆకట్టుకున్న హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు కర్ట్‌ వోగెల్‌ రసెల్‌. అమెరికాలో 1951 మార్చి 17న పుట్టిన ఇతడి తండ్రి బింగ్‌ రసెల్‌ కూడా నటుడే, తల్లి జులియా డాన్సర్. పన్నెండేళ్లకే టీవీ నటుడైన ఇతడు, ‘సిల్క్‌ఉడ్‌’, ‘ఎస్కేప్‌ ఫ్రమ్‌ లాస్‌ఏంజెలిస్‌’, ‘ద థింగ్‌’, ‘ఓవర్‌బోర్డ్‌’, ‘బ్యాక్‌డ్రాఫ్ట్‌’, ‘టూంబ్‌స్టోన్‌’, ‘స్టార్‌గేట్‌’, ‘డెత్‌ప్రూఫ్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’, ‘ద హేట్‌ఫుల్‌ ఎయిట్‌’, ‘బిగ్‌ ట్రబుల్‌ ఇన్‌ లిటిల్‌ చైనా’, ‘ఎస్కేప్‌ ఫ్రమ్‌ న్యూయార్క్‌’ సినిమాల్లో నటించి యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ గా  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!