8.8 C
New York
Tuesday, December 7, 2021

Famous Celebrities Born on Nov 13 | P Susheela | Juhi Chawla | Shri Tv Wishes

Famous Celebrities Born on Nov 13 | P Susheela | Juhi Chawla | Shri Tv Wishes

నవంబర్ 13  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     P. Susheela  : భారతీయ భాషల్లో అత్యధిక పాటలు పాడి గిన్నిస్‌ రికార్డు, ఆసియా రికార్డు సాధించిన ఏకైక గాయని పులపాక సుశీల. ఆరు దశాబ్దాలుగా తన మధుర గాత్రంతో 40 వేల పాటలు పాడి శ్రోతలను మైమరపించిన సుశీల అయిదు జాతీయ పురస్కారాలు అందుకున్న గాయని. విజయనగరంలో 1935లో పుట్టిన సుశీల మాతృభాష తెలుగే అయినా తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృత, తులు, బడగ, సింహళ భాషల్లో పాటలు పాడి మెప్పించారు. అమె సినీరంగ ప్రవేశం చేసిన 1952 నాటికే బాలసరస్వతీదేవి. జిక్కి, పి. లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. ఆమె మొదటి పాట ‘కన్నతల్లి’ చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎందుకు పిలిచావెందుకు అన్న ఆ పాటను ఎ.ఎం రాజాతో కలిసి పాడారు. అయితే కెరీర్ తోలి నాళ్ళలో సుశీల గాత్రం పీలగా వుంటుందనీ విమర్శలు ఎదుర్కున్నా తన పాటలతోనే సమాధానం చెప్పింది అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ సుశీల పాటలేని సినిమా దాదాపు లేకపోయింది. 1960ల నుంచి 1970ల తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతభిమానులు భావిస్తారు. ‘‘1980 తర్వాత సినిమాలో వేగం పెరిగింది. గుగ్గుగ్గుగ్గు గుడిసుంది’ లాంటి పాటలు పాడనన్నా నాచేత పాడించారు. అవి మరోతరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి’’ అంటారు సుశీల, తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రంలో ఆమెది ఘనతర ఆధ్యాయం.

  2.    Juhi Chawla  : ఒక పక్క శ్రీదేవి, మరోపక్క మాధురీదీక్షిత్‌ అప్పటికే స్టార్ హీరోయిన్స్ వీళ్ల మధ్య నెగ్గుకురావడమంటే ఆషామాషీనా? కానీ జుహీచావ్లా మాత్రం తన ప్రతిభను నమ్ముకొంది. తన అందంపై అపారమైన విశ్వాసాన్ని కనబరించింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. వాళ్లకు దీటుగా రాణించాలంటే ‘నేనూ ఆల్‌రౌండర్‌నే’ అని నిరూపించుకోవాలనుకొంది. అందుకోసం ఒక్కోమెట్టు ఎక్కింది. కామెడీ పండించడంలో పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌ ఉన్న కథానాయికగా గుర్తింపు తెచ్చుకొంది. డ్యాన్సుల్లోనూ ఇరగదీసింది. స్టార్‌ కథానాయిక అనిపించుకొన్నాక.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. వయస్సు యాభైలో ఉన్నా, ఇప్పటికీ అదే హుషారుతో నటిస్తోంది. ‘గులాబ్‌ గ్యాంగ్‌’లో ఆమె నటనను చూసి ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. విమర్శకులు శభాష్‌..అన్నారు.హర్యానాలోని అంబాలాలో 1967లో పుట్టిన జుహీ, తొలి చిత్రం ‘సుల్తానత్‌’ (1986) మొదలుకుని, ‘ఖయామత్‌ సే ఖయామత్‌’, ‘స్వర్గ్‌’, ‘ప్రతిబంధ్‌’, ‘బోల్‌ రాధా బోల్‌’, ‘రాజు బన్‌గయా జెంటిల్‌మ్యాన్‌’, ‘లూటెరే’, ‘హమ్‌ హై రాహీ ప్యార్‌ కే’, ‘డర్‌’, ‘సాజన్‌కా ఘర్‌’, ‘లోఫర్‌’, ‘దీవానా మస్తానా’ ‘ఇష్క్‌’, ‘గులాబ్‌ గ్యాంగ్‌’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా చలాకీగా, హుందాగా నటించి అలరించింది. హిందీతోపాటు తమిళం, తెలుగు, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొంది. తెలుగులో ‘కలియుగ కాముడు’, ‘విక్కీదాదా’, ‘శాంతి క్రాంతి’ తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ని భాషల్లో నటించినా.. తెరపై ఆమె ఎప్పుడూ ప్రతినాయక పాత్రలో కనిపించలేదు. తొలిసారి ‘గులాబ్‌ గ్యాంగ్‌’తో విలన్‌గా మారింది. షారుఖ్‌తో కలిసి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీని సొంతం చేసుకొంది. కొన్ని టీవీ షోలని నిర్మించడంతో పాటు, ‘జలక్‌ దిఖ్‌లాజా’ అనే రియాల్టిషోకి జడ్జీగాను వ్యవహరించింది.

  3.    Whoopi Goldberg  : వినోద రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ (టీవీ రంగం), గ్రామీ (సంగీతం), అకాడమీ (అభినయం), టోనీ (నాటక రంగం) అవార్డులన్నీ అందుకున్న వారు అరుదుగానే ఉంటారు. ఆ కొద్దిమందిలో ఒకరిగా ఊపి గోల్డ్‌బర్గ్‌ ప్రాచుర్యం పొందింది. నాలుగు రంగాల్లో అత్యున్నతమైన నాలుగు అవార్డులు పొందడం ఒక విశేషమైతే, వర్ణ వివక్షలను దాటుకుని ఓ నల్లజాతి మహిళ కళా రంగంలో ఇంతటి గుర్తింపు పొందడం మరో విశేషం. నటిగా, కమేడియన్‌గా, రచయిత్రిగా, బుల్లితెర ప్రముఖురాలిగా అభిమానుల గుండెల్లో వికసించిన నల్ల కలువ ఆమె. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ‘ద కలర్‌ పర్పుల్‌’ సినిమాలో నటనకు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డును, ఆస్కార్‌ నామినేషన్‌ను అందుకుంది. ‘ఘోస్ట్‌’ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ‘సిస్టర్‌ యాక్ట్‌’, ‘మేడిన్‌ అమెరికా’, ‘కొరీనా కొరీనా’, ‘ద లయన్‌ కింగ్‌’, ‘ద లిటిల్‌ రాస్కెల్స్‌’, ‘బాయిస్‌ ఆన్‌ ద సైడ్‌’, ‘థియోడర్‌ రెక్స్‌’, ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ మిసిసిపీ’, ‘హౌ స్టెల్లా గాట్‌ హెర్‌ గ్రూవ్‌ బ్యాక్‌’, ‘గర్ల్‌ ఇంటరెప్టెడ్‌’, ‘ఫర్‌ కలర్డ్‌ గర్ల్స్‌’, ‘టీనేజ్‌ మ్యుటెంట్‌ నింజా టర్టిల్స్‌’, ‘నోబడీస్‌ ఫూల్‌’, ‘స్టార్‌ట్రెక్‌: ద నెక్స్ట్‌ జెనరేషన్‌’ లాంటి సినిమాల్లో ఆమె నటన అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్‌లో 1955 నవంబర్‌ 13న పుట్టిన ఆమె అసలు పేరు కేరిన్‌ ఎలైన్‌ జాన్సన్‌. గోల్డ్‌బెర్గ్‌ ఆమె తల్లి పిలిచే ముద్దుపేరు. చిన్నతనంలోనే నాటకరంగానికి ‘ఊపి’గా పరిచయమైంది. నాటకాలు, టీవీ, సినిమా రంగాల్లో అంచెలంచెలుగా దూసుకుపోడానికి ఆమె చలాకీతనం, ప్రతిభలే కారణమయ్యాయి. బుల్లితెరపై నటిగా, వ్యాఖ్యాతగా ఆమె ముద్ర ప్రశంసనీయం. రచయిత్రిగా పిల్లల కోసం మంచి పుస్తకాలు కూడా రాసిన ఆమె, వేర్వేరు రంగాల్లో రాణించి 50కి పైగా అవార్డులను అందుకుంది.

  4.    Nikita Dutta  :నిఖితా దత్తా ఫెమినా మిస్ ఇండియా 2012 ఫైనలిస్ట్ ఆ తర్వాత మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టి 2014లో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నిర్మించిన లేకర్ హమ్ దీవన దిల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత డ్రీం గర్ల్ అనే టీవీ సీరియల్ లో నటించింది కానీ సోనీ టీవీ కోసం ఆమె చేసిన ఏక్ దూజే కె వాస్తే టీవీ సిరీస్ లో చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. 2018లో అక్షి కుమార్ హీరోగా వచ్చిన గోల్డ్ అనే సినిమాలో ఒక మంచి పాత్ర చేసింది దాంతో వెంటనే కబీర్ సింగ్ అదే మన తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ లో అవకాశం లభించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి నటి అన్న గుర్తింపు తెచ్చుకున్న నికిత 2017లో  ఏక్ దూజే కె వాస్తే టీవీ సిరీస్ కు, 2018లో హాసిల్ అనే టీవీ సిరీస్ కు ఉత్తమ నటిగా లయన్స్ గోల్డ్స్ అవార్డ్స్ గెలుచుకుంది.

  5.    Abhinaya  :  పుట్టుకతోనే మూగ చెవుడు ఇంకొకరయితే ఇంకా జీవితం అయిపోయిన్ద్జి అనుకునే వారేమో కానీ ఆవిడ అలా అనుకిలేదు సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా  రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది ఆవిడే మన తెలుగు నటి అభినయ. 2009లో వచ్చిన నాడోడిగల్ అనే తమిళ సినిమాలో నటించింది ఆ సినిమాకు ఆవిడకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది తనకు మాటలు రావు వినలేదు అని చెపితే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో రవితేజ హీరోగా శంబో శివ శంబో అని రీమేక్ చేస్తే మళ్ళీ తన పాత్ర తనే చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వత తెలుగులో దమ్ము, డమరుకం,జీనియస్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ధ్రువ,రాజు గారి గది 2 లాంటి సినిమాల్లో నటించింది. అభినయ కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పటి వరకు తమిళ్, మలయాళం,హిందీ భాషల్లో కలిపి మొత్తం 28 సినిమాల్లో నటించింది.

  6.    Harman Baweja : హర్మాన్ బవేజా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత ఈయన నవంబర్ 13, 1980లో చండీఘర్ లో జన్మించారు. 2008లో వచ్చిన ‘లవ్ స్టొరీ 2050’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2009లో విక్టరీ అనే స్పోర్ట్స్ ఫిల్మ్ లో హీరోగా నటించాడు. 2009 ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో కలిసి వాట్స్ యువర్ రాశి అనే సినిమాలో నటించాడు ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మొత్తం 12 పాత్రల్లో కనిపించడం విశేషం. ఆ తర్వాత 2014లో డిస్కియాన్ అనే సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.   

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,050FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!