8.6 C
New York
Friday, December 3, 2021

Famous Celebrities Born on Nov 21 | Neha Sharma | Monalisa | Shri Tv Wishes

Famous Celebrities Born on Nov 21 | Neha Sharma | Monalisa | Shri Tv Wishes

నవంబర్21  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Neha Sharma  : నేహ శర్మ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత హీరోయిన్ ఆ సినిమాలో తన డాన్స్, పొగరుబోతు అమ్మాయిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 21, 1987లో బిహార్లోని భగల్ పూర్ లో జన్మించింది తండ్రి భగల్ పూర్ MLA. నేహాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండడంతో తను కథక్, హిప్ హాప్, సల్సా లాంటి డాన్స్ నేర్చుకుంది. 2007లో చిరుత సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేసింది. 2010లో క్రూక్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తర్వాత తేరి మేరి కహాని, క్యా సూపర్ కూల్ హై హమ్, యమ్ల పాగాల్ దీవానా 2, యంగిస్తాన్, తుం బిన్2, ముబారకాన్, తానాజీ లాంటి సినిమాల్లో నటించింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో చేసిన సోలో సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.

  2.       Helen  : షోలే సినిమాలో మెహబూబా మెహబూబా అనే పాట గుర్తుందా ఆ పాటలో అద్భుతంగా డాన్స్ చేసి ఆ రోజుల్లోనే కుర్రకారుకు వేర్రేకించిన భామనే హెలెన్ 1970, 80 లలో ఆమె తన హుశారయినా డాన్సులతో ఐటమ్ సాంగ్స్ లతో ఒక వెలుగు వెలిగింది ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 21, 1938లో బర్మాలో జన్మించిన హెలెన్ 1958లో వచ్చిన హౌరా బ్రిడ్జి అనే సినిమాలో మేరా నామ్ చిన్ చిన్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 1965లో వచ్చిన గుమ్నాం అనే సినిమాలో తన నటనకు ఉత్తమ సపోర్టింగ్ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది. 1971లో వచ్చిన కారవాన్ సినిమాలో “పియా తు ఆబ్ తు ఆజా” పాట అప్పట్లో ఒక సంచలనం ఆ పాటతో హెలెన్ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాతా ప్రముఖ బాలీవుడ్ రచయిత సలీం ఖాన్ ను పెళ్ళి చేసుకున్న హెలెన్ తన కెరీర్లో  పాపులర్ అయిన చాల పాటల్లో తన డాన్స్ తో ఆదరగోట్టింది. హెలెన్ తన కెరీర్లో దాదాపు 120 సినిమాల్లో నటించింది రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది భారత ప్రభుత్వం ఆమెకు 2009లో పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది.

  3.       Aarti Chabria : ఆర్తి చాబ్రియా ఒకరికి ఒకరు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 21, 1982లో ముంబై లో జన్మించింది తనకు కేవలం మూడు సంవత్సరాల వయసున్నప్పుడే ఫారెక్స్ యాడ్ లో నటించింది. ఆ తర్వాత మోడలింగ్ మొదలు పెట్టి దాదాపు 300 యాడ్స్  లో నటించింది.  మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2000 టైటిల్ గెలుచుకున్న ఆర్తి తర్వాత మ్యూజిక్ వీడియోలలో నటించింది 2002లో వచ్చిన తుమ్సే అచ్చా కౌన్ హై అనే సినిమాతో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత రాజ భయ్యా, శాడి నెo.1, పార్టనర్, హే బేబీ, మిలేంగే మిలేంగే సినిమాల్లో నటించింది. తెలుగులో వెంకటేష్ తో చింతకాయల రవి శ్రీకాంత్ తో ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాల్లో నటించిoది.

  4.       Anandiben Patel  :ఆనందిబెన్ పటేల్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నేడు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 21, 1941లో విజ్ పూర్ అనే గ్రామంలో గుజరాత్ లో జన్మించింది. ఈవిడ తన చిన్నప్పుడు పిక్నిక్ కు వెళ్ళినప్పుడు నదిలో పడిన ఇద్దరు పిల్లల్ని రక్షించడంతో రాష్ట్రపతి నుంచి సహస బాలిక అవార్డు తీసుకుంది. ఆ తర్వాత ఈవిడ గురించి తెలుసుకున్న BJP పార్టీ తమ పార్టీలోకి ఆనందిని చేర్చుకుంది అలా ఈవిడ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. 1994లో మొదటి సారి రాజ్య సభకు ఎన్నికయింది ఆ తర్వాత 1998లో అసెంబ్లీ కి పోటి చేసి గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేసింది. ఆ తర్వాత వరుసగా ఎన్నికల్లో విజయం సాధించి పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆనంది చివరకు 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. పార్టీ అధిష్టానం 2018లో ఈవిడను మధ్య ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది.2014లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ ఇండియాలో 100 మోస్ట్ ఇన్ఫ్లు యెన్ షియల్ పర్సన్స్ లిస్టు లో ఈవిడ స్థానం దక్కించుకుంది.

  5.       Monalisa  :  మోనాలిస ప్రముఖ భోజ్ పురి నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 21, 1982లో కోల్ కతాలో పుట్టిన ఈవిడ అసలు పేరు అంతర బిస్వాస్. మొదట టీవీ సిరియల్స్ లో నటించడం మొదలు పెట్టిన మోనాలిస ఆ తర్వాత 2004లో వచ్చిన తౌబ తౌబ అనే సినిమాలో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అజయ్ దేవగన్, సునీల్ శెట్టి హీరోలుగా 2005లో వచ్చిన బ్లాక్ మెయిల్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తన కెరీర్లో ఎక్కువగా భోజ్ పురి సినిమాలు చేసిన మోనాలిస సెక్సీ స్టార్ గా పేరు తెచ్చుకుంది.

  6.       Prem Nath  :  ప్రేమ్ నాథ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. నవంబర్ 21, 1926లో పెషావర్ లో పుట్టిన ఇతను దేశ విభజన జరిగిన తర్వాత బొంబాయి కు వచ్చాడు. నటుడవ్వాలన్న కోరికతో సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్సిస్తూ 1948లో  అనే సినిమాతో నటుడయ్యాడు.  ఆ తర్వాత ఆన్, తీస్రీ మంజిల్, జానీ మేరా నామ్, తేరే మేరె సప్నే, ధర్మాత్మ, కాలిచరన్, బాబీ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో 1957లో సముందర్ అనే సినీ తీసారు. 1973లో వచ్చిన షార్ అనే సినిమాలో నటనకు ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు.  

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!