6.7 C
New York
Thursday, December 2, 2021

Famous Celebrities Born on Nov 22 | Ajay Devgan | Saroj Khan | Shri Tv Wishes

Famous Celebrities Born on Nov 22 | Ajay Devgan | Saroj Khan | Shri Tv Wishes

నవంబర్22  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Ajay Devgn  : అజయ్ దేవగన్ ప్రముఖ బాలీవుడ్ హీరో, నిర్మాత నేడు ఆయన పుట్టిన రోజు. అజయ్ దేవగన్ అంటేనే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఒక స్టంట్ మాస్టర్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అజయ్ బాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్, స్టంట్‌మాస్టర్‌ వీరూ దేవగన్‌ కొడుకుగా పరిచయమైన తన తొలి సినిమా ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి అజయ్ దేవగన్ కు తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డు సంపాదించిపెట్టింది. ఇక అక్కడి నుంచి అజయ్ వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన జిగర్, సంగరం, విజయపత్, దిల్వాలే,సుహాగ్ లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నారు. అయితే 1999లో వచ్చిన హమ్ దిల్ దే చుకే సనం సినిమా నటుడిగా మంచి పేరు తీసుకొచ్చి కొత్త అజయ్ ను పరిచయం చేసింది. ఆ తర్వాత కంపెనీ, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, రెయిన్ కాట్, గంగాజల్,యువ, అపహరణ్,ఓంకార,గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్,ద్రిశ్యం,తానాజీ లాంటి సినిమాలతో అటు కమర్షియల్ సినిమాలు తీస్తూనే డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజయ్ తన కెరీర్లో మొత్తం 100కు పైగా సినిమాల్లో నటించి 2 నేషనల్ అవార్డ్స్, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. 2016లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది.

  2.      Kartik Aaryan  : సోను కె టిటు కి స్వీటీ ఒక చిన్న సినిమాగా వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా హీరోనే కార్తిక్ ఆర్యన్ చూడడానికి చాక్లెట్ బాయ్ లా ఉంటాడు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు అయినా సరే బాలీవుడ్ లో ఆదరగోడుతున్నాడు. నవంబర్ 22, 1990లో మధ్య ప్రదేశ్లో జన్మించిన ఆర్యన్ తన కాలేజీ చదువు ముగియక ముందే 2011లో ప్యార్ కా పంచనామా అనే సినిమాలో నటించాడు లవ్, బ్రేకప్స్ మీద వచ్చిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది ఆర్యన్ కు హీరోగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆకాశ వాని, కాంచి, ప్యార్ కా పంచనామా 2 సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్న ఆర్యన్ 2018లో వచ్చిన సోను కె టిటు కి స్వీటీ సినిమాతో బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సాధించాడు. 2019లో ఆర్యన్ నటించిన లుక చుప్పి సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తో లవ్ ఆజ్ కల్ 2 సినిమా, పతి పత్నీ ఔర్ వో లాంటి సినిమాలు చేసాడు. ఆర్యన్ ప్యార్ కా పంచనామా, సోను కె టిటు కి స్వీటీ సినిమాలకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్స్ అందుకున్నాడు.

  3.      Saroj Khan  : దేవదాస్ సినిమాలో మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ కలిసి డాన్స్ చేసిన డోలారే పాట గుర్తుందా అందులో వారిద్దరితో అద్భుతంగా డాన్స్ చేయించిన క్రెడిట్ ఆ పాట నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ కె దక్కుతుంది నేడు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 22, 1948లో బొంబాయిలో జన్మించంది. 1950లో గ్రూప్ డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన సరోజ్ ఖాన్ శ్రీదేవి, మాధురి దీక్షిత్ లాంటి టాప్ హీరోయిన్లకు తమ కెరీర్ బెస్ట్ సాంగ్స్ కు కోరియోగ్రఫీ చేసింది ఇక హీరోల సంగతయితే చెప్పనక్కరలేదు అనిల్ కపూర్ నుంచి షారుఖ్ వరకు ఇటు సౌత్ లో రజనీకాంత్ నించి అల్లు అర్జున్ వరకు ఆమెతో కలిసి వర్క్ చేయని హీరో, హీరోయిన్స్ లేరు తన కెరీర్లో కొన్ని వందల సాంగ్స్ కు కోరియోగ్రఫీ చేసిన సరోజ్ ను ద మదర్ ఆఫ్ కోరియోగ్రఫీ ఇన్ ఇండియా అని పిలుస్తారు. తన కెరీర్లో మొత్తం 3 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న సరోజ్ నచ బలియే, నచ లే విత్ సరోజ్, ఝలక్ దిక్ లాజా లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ లలో జడ్జీగా వ్యవహరించంది.

  4.    Scarlett Johansson : స్కార్లెట్‌ జొహాన్సన్‌ ప్రముఖ హాలీవుడ్ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. న్యూయార్క్‌ లో 1984లో పుట్టిన స్కార్లెట్‌ పదేళ్ల వయసులోనే ‘నార్త్‌’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. నటిగా, గాయనిగా హాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఈ అందాల తార చిన్నప్పటి నుంచీ చురుకే. పాటలతో, డ్యాన్స్‌ లతో పాటు నాటక రంగంపైకి చిన్న వయసులోనే అరంగేట్రం చేసింది. ‘మన్నీ అండ్‌ లో’, ‘ద హార్స్‌ విస్పరర్‌’, ‘ఘోస్ట్‌ వరల్డ్‌’, ‘లాస్ట్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌’, ‘గర్ల్‌ విత్‌ పెర్ల్‌ ఇయర్‌రింగ్‌’, ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘ద ప్రెస్టీజ్‌’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా అందచందాలతోను, అభినయంతోను మెప్పించింది. తను చేసిన సినిమాలతో అందాల శృంగార తారగా గుర్తింపు వచ్చింది. వంద మంది మేటి సెలబ్రిటీల జాబితాలో ఎన్నో సార్లు ఫోర్బ్స్ పత్రిక ఎంపిక చేసింది. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్టార్‌ హోదా దక్కించుకుంది, అలాగే ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటి,  ఎన్నో ఛారిటీ సంస్థలకు భారీ విరాళాల ఇచ్చిన నేపథ్యం ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్న నటి స్కార్లెట్‌ జొహాన్సన్‌.

  5.      Jamie Lee Curtis : జామీలీ కర్టిస్‌ ప్రముఖ హాలీవుడ్ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. ఎక్కువగా హారర్ సినిమాల్లో నటించి ‘స్క్రీమ్‌ క్వీన్‌’గా పేరు తెచ్చుకున్న ఈవిడ కాలిఫోర్నియాలో 1958 నవంబర్‌ 22న పుట్టిన ఈమె తల్లి జానెట్‌లీ, తండ్రి టోనీ కర్టిస్‌, అక్క కెల్లీ కర్టిస్‌ కూడా సినీ నటులే. దాంతో చిన్నప్పటి నుంచి తనూ సినిమా మీద ఇష్టం పెంచుకుని ‘హలోవీన్‌’ (1978) అనే సినిమా ద్వారా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ సినిమాలోనే కెవ్వుమని కేకలు పెడుతూ ‘స్క్రీమ్‌ క్వీన్‌’గా మారిన ఈమె, ఆ తర్వాత ఇలాంటివే ‘ద ఫాగ్‌’, ‘ప్రోమ్‌ నైట్‌’, ‘టెర్రర్‌ ట్రైన్‌’, ‘హలోవీన్‌’ సీక్వెల్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. నిజానికి ఈమె భయానక సినిమాలే కాదు కామెడీ, యాక్షన్, రొమాంటిక్‌ చిత్రాల్లో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్, శాటర్న్‌ లాంటి అవార్డులెన్నో అందుకుంది. జేమ్స్‌కామెరాన్‌ దర్శకత్వంలో ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగర్‌ నటించిన ‘ట్రూ లైస్‌’ సినిమాతో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. ‘ట్రేడింగ్‌ ప్లేసెస్‌’, ‘ఎ ఫిష్‌ కాల్డ్‌ వాండా’, ‘బ్లూ స్టీల్‌’, ‘మై గర్ల్‌’, ‘ఫరెవర్‌ యంగ్‌’, ‘ద టైలర్‌ ఆఫ్‌ పనామా’, ‘ఫ్రీకీ ఫ్రైడే’, ‘బెవర్లీహిల్స్‌ చిహువాహువా’, ‘నైవ్స్‌ ఔట్‌’ లాంటి సినిమాలతో మెప్పించింది. నాటకాలు, టీవీల్లో సైతం పేరు తెచ్చుకుంది.

  6.      Tridha Choudhury  : త్రిద చౌధురి ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. నవంబర్ 22, 1990లో కలకత్తాలో పుట్టిన ఈవిడ 2013లో వచ్చిన మిశ్వర్ రావ్హోశ్యో అనే బెంగాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వతా తెలుగులో హీరో నిఖిల్ తో సూర్య వెర్సెస్ సూర్య సినిమాలో, సందీప్ కిషన్ తో మనసుకు నచ్చింది, అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అనే సినిమాలలో నటించింది.కేవలం సినిమాలే కాకుండా దాహ్లీజ్, స్పాట్ లైట్ లాంటి పలు టీవీ సీరియల్స్ లలో నటించింది. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!