6.7 C
New York
Thursday, December 2, 2021

Famous Celebrities Born on Nov 23 | Naga Chaitanya | Vishnu Manchu | Shri Tv Wishes

Famous Celebrities Born on Nov 23 | Naga Chaitanya | Vishnu Manchu | Shri Tv Wishes

నవంబర్ 23  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Naga Chaitanya  : అక్కినేని నాగచైతన్య అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన రెండో తరం వారసుడు నేడు ఆయన పుట్టిన రోజు. నాగార్జున పెద్ద కొడుకైన ఈయన ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోతూ రాణిస్తున్నారు. నాగచైతన్య 1986 నవంబరు 23న నాగార్జున, దగ్గుబాటి లక్ష్మిలకి చెన్నైలో జన్మించారు. అక్కడే పెరిగిన ఆయన హైదరాబాద్‌లో డిగ్రీ చదువుకొన్నారు. రెండో సంవత్సరంలో ఉండగానే నటనపై తనకున్న మక్కువని బయటపెట్టడంతో ముంబైలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత లాస్‌ ఏంజిలిస్‌ వెళ్లి అక్కడ కూడా నటన, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకొన్నారు. 2009లో దిల్‌రాజు నిర్మాణంలో, వాసు వర్మ దర్శకత్వం వహించిన ‘జోష్‌’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రం సెట్స్‌పై ఉన్న దశలోనే రెండో చిత్రం ‘ఏ మాయ చేసావె’కి సంతకం చేశారు. ‘జోష్‌’ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా, ‘ఏమాయ చేసావె’ ఆయనకి మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత సుకుమార్‌ తెరకెక్కించిన ‘100 % లవ్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. ‘దడ’, ‘బెజవాడ’లాంటి పరాజయాలు ఎదురైనా, ‘తడాఖా’, ‘మనం’ చిత్రాలతో మళ్లీ సత్తా చాటారు. ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాలతో నటుడిగానూ తన ప్రతిభని చాటి చెప్పారు. ‘మహానటి’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ చిత్రాలతో అలరించారు. సమంతతో కలిసి మూడు సినిమాల్లో నటించిన నాగచైతన్య ఆమెని ప్రేమించి 2017లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత ఈ జోడీ ‘మజిలీ’ చిత్రంలో నటించింది. తన మేనమామ అయిన వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’లో కూడా నటించాడు.

  2.       Vishnu Manchu  : ‘మంచు విష్ణు నటుడు మోహన్‌బాబు వారసుడిగా తెరపైకొచ్చినా  ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలతో విజయాల్ని అందుకొని సొంతంగా గుర్తింపు తెచ్చుకొన్నారు ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1981 నవంబరు 23న చెన్నైలో జన్మించిన విష్ణు, తన తండ్రి మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రగిలే గుండెలు’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. 2003లో ‘విష్ణు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. అయితే విజయం కోసం ‘ఢీ’ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.  విష్ణు బలం కామెడీ అది పండించడంలో తనకంటూ ఓ శైలి ఉందని చాటారు. ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘రౌడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’, ‘అనుక్షణం’, ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ తదితర చిత్రాలతోనూ ప్రేక్షకుల్ని అలరించారు విష్ణు కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రస్తుతం మోసగాళ్ళు అనే సినిమా చేస్తున్నారు.  విష్ణు 2009లో వెరొనికా రెడ్డిని వివాహం చేసుకొన్నారు వెరొనికా మాజీ ముఖ్యమంత్రి కీ.శే. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సోదరుడి కుమార్తె. ఈ దంపతులకి నలుగురు పిల్లలు. తన తండ్రి స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌ బాధ్యతలు చూసుకొంటూనే, న్యూయార్క్‌ అకాడమీతో పాటు, స్పి్రంగ్‌ బోర్డ్‌ ఇంటర్నేషనల్‌ ప్రి స్కూల్‌ని స్థాపించి విద్యావేత్తగా రాణిస్తున్నారు విష్ణు. ఆయన భార్య కూడా ఈ సంస్థల నిర్వహణ బాధ్యతల్ని చూసుకొంటున్నారు.

  3.       Baba Sehgal : బాబా సెహగల్ కరో కరో జరా జల్సా, దేఖో దేఖో గబ్బర్ సింగ్ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని తన పాటలతో వుర్రుతలుగించిన సింగర్ బాబా సెహగల్ నేడు ఆయన పుట్టిన రోజు. బాబా 23నవంబర్, 1965లో  ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లో జన్మించారు.  1990లో తన మ్యూజిక్ కెరీర్ మొదలుపెట్టిన బాబా ఒక హిందీ పాప్ మ్యూజిక్ ఆల్బం రిలీజ్ చేసారు. అది MTVలో టెలికాస్ట్ అయ్యి బాబాకి మంచి పేరు తెచ్చింది. బాబా చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ లో దిల్ రుబా , అలీ బాబా , తండ తండ పాని లాంటి ఆల్బమ్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత 2005లో నలిక్ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. 2006లో భూత అంకుల్ అనే సినిమాకి కూడా మ్యూజిక్ చేసాడు. తెలుగులో జల్సా, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో తన పాటలతో ఆకట్టుకున్నారు. 2006లో వచ్చిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నారు.

  4.       Sajid Khan : సాజిద్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు, టీవీ హోస్ట్. నేడు ఆయన పుట్టినరోజు. ప్రముఖ బాలీవుడ్ కోరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ తమ్ముడైన ఇతను ముందుగా టీవీ సీరియల్స్ లో నటించడం ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత 2006లో వచ్చిన డర్న జరూరి  హై అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత బాలీవుడ్ లో హే బేబీ, హౌస్ ఫుల్, హౌస్ ఫుల్ 2, హిమ్మత్ వాల లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

  5.       Chimbu Devan : చింబు దేవన్ ప్రముఖ తమిళ దర్శకుడు నేడు ఆయన పుట్టినరోజు. చింబు 23నవంబర్, 1975లో తమిళనాడు లోని మధురైలో జన్మించారు. చింబు సినిమాల్లోకి రాకముందు  కార్టూనిస్ట్ గా  ఆనంద్ వికటన్ వీక్లీ మ్యాగ్ జైన్ లో పనిచేసేవారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు చేరణ్ దగ్గర చింబు పనిచేసారు. 2006లో ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలుతో హింసించే 23వ రాజు పులకేశి అనే సినిమా తీసి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 2008లో సంతానంతో కామెడీ అరై ఎన్ 305 ఇల కడవుల్ అనే సినిమా, 2010లో లారెన్స్ తో ఇరుమ్బుక్కోట్టై మురట్టు సింగం, 2015లో ఒరు కన్నియుం మూను కలవానికలుం అనే సినిమా తీసారు. తమిళ టాప్ హీరో విజయ్ తో పులి అనే సినిమా చేసారు ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి ఒక ముఖ్య పాత్రలో నటించింది.   

  6.       Tannishtha Chatterjee : తనిష్ట చటర్జీ ప్రముఖ బాలీవుడ్ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. 2004లో వచ్చిన జర్మనీ సినిమా షాడోస్ అఫ్ టైం సినిమాలో ఈవిడ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన హావ ఆనే దో, స్ట్రింగ్స్, కస్తూరి లాంటి సినిమాలు  ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ల్లో ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకున్నాయి. 2010లో ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ లో ఈమె జూరీ కమిటి మెంబెర్ గా ఉంది. తనిష్ట పర్చాడ్ సినిమాలో నటనకు గాను ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్ అవార్డు గెలుచుకుంది, తన కెరీర్లో మొత్తం 33సినిమాల్లో నటించింది. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!