6.7 C
New York
Thursday, December 2, 2021

Famous Celebrities Born on Nov 24 | Yarlagadda Lakshmi Prasad | Arundhati Roy | Shri Tv Wishes

Famous Celebrities Born on Nov 24 | Yarlagadda Lakshmi Prasad | Arundhati Roy | Shri Tv Wishes

నవంబర్ 24  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Salim Khan : సలీం ఖాన్ ఈయన ప్రముఖ బాలీవుడ్ రచయిత, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి నేడు ఆయన పుట్టినరోజు. సలీం ఖాన్ పూర్తి పేరు సలీం అబ్దుల్ రాషిద్ ఖాన్. ఈయన 24నవంబర్, 1935లో మధ్య ప్రదేశ్ లో జన్మించారు. మొదట నటుడిగా తన కెరీర్ మొదలుపెట్టిన సలీం ఖాన్ దాదాపు 25సినిమాల్లో చిన్నా, చితకా పాత్రలు చేసారు. ఆ తర్వాత రాజేష్ ఖాన్న హీరోగా నటించిన హాతి మేరె సాతి సినిమాకు మరొక రైటర్ జావేద్ అక్తర్ తో కలిసి పనిచేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అందాజ్, సీత ఆవుర్ గీత, యాదోన్ కి బారాత్, జంజీర్, దీవార్, షోలే, డాన్, త్రిశూల్, దోస్తాన, క్రాంతి, జామ్న, MR. ఇండియా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి జావేద్ అక్తర్ తో కలిసి పనిచేసి హిందీలో తోలి స్టార్ రైటర్ అయ్యారు. ఆ తర్వాత జావేద్ అక్తర్ తో  విడిపోయి అంగారే, నామ్, కబ్జా, జుర్మ్, లాంటి సినిమాలకి సోలో రైటర్ గా పనిచేసారు. సలీం ఖాన్ తన కెరీర్లో శక్తి, దీవార్, జంజీర్ సినిమాలకి ఉత్తమ కథా, మాటల రచయితగా జావెద్ అక్తర్ తో కలిసి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

  2.       Celina Jaitly :  డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన వారి కోవలోకే వస్తుంది సెలీనా జైట్లీ. నేడు ఆవిడ పుట్టినరోజు. సెలీనా 24నవంబర్, 1981లో హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో జన్మించారు. తండ్రి ఆర్మీ కల్నల్ దాంతో సెలీనా  కూడా చిన్నప్పటినుంచే ఆర్మీలో పైలట్ లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ ఆ తర్వాత మార్కెటింగ్ జాబ్ చేసిన సెలీనా లోకల్ గా జరిగిన బ్యూటీ కాoపిటేషన్ లో గెలవడంతో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2001లో విజేతగా నిలిచింది. జానశీన్ అనే సినిమాతో 2003లో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్న మని మని, రెడ్, శకలక భూమ్ భూమ్, గోల్మాల్ రిటర్న్స్, థ్యాంక్ యు లాంటి సినిమాలతో హిందిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో  మంచు విష్ణుతో సూర్యం అనే సినిమాలో నటించింది.

  3.       Arundhati Roy : అరుంధతి రాయ్ ప్రముఖ రచయిత బుకర్ ప్రైజ్ విజేత. నేడు ఆవిడ పుట్టిన రోజు. అరుంధతి 24నవంబర్, 1961లో అస్సాం లోని శిల్లోంగ్ లో జన్మించారు. ఆ తర్వాత 1985లో మస్సెయ్ సాహిబ్ అనే సినిమాలో నటించింది. 1997లో ఆవిడ రాసిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకి బుకర్ ప్రైజ్ వచ్చింది. 2006లో ఈవిడకి సాహిత్య అవార్డు వచ్చింది. 2014లో టైమ్స్ మ్యాగ్ జైన్ 100మోస్ట్ ఇన్ఫ్లు లేన్శియల్ పీపుల్ లిస్టులో అరుంధతి రాయ్ కి స్థానం దక్కింది.    

  4.       Amit Mishra  : అమిత్ మిశ్రా ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్ నేడు ఆయన పుట్టిన రోజు. నవంబర్ 24, 1982లో ఫరిదాబాద్ లో జన్మించిన అమిత్ రంజీ ట్రోఫీలో హర్యానా కు ఆడటం ద్వారా తన ఫస్ట్ క్లాసు క్రికెట్ స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత 2003లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన వన్ డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు తన మొత్తం కెరీర్లో 36 వన్ డే లు ఆడి 64 వికెట్స్ తీసుకున్నాడు 6/48 తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అలాగే 2008 లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో తన తోలి టెస్ట్ ఆడిన అమిత్ మిశ్రా తన కెరీర్లో మొత్తం 22 టెస్టులు ఆడి 76 వికెట్స్ తీసుకున్నాడు తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 5/71. 2013లో జరిగిన IPL లో సన్ రైసర్స్ టీం కు ఆడిన మిశ్రా పూణే తో జరిగిన మ్యాచ్ లో హట్రిక్ తీసి రికార్డు క్రియేట్ చేసాడు.

  5.       Yarlagadda Lakshmi Prasad  : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రముఖ తెలుగు రచయిత, రాజకీయ నాయకుడు నేడు ఆయన జన్మదినం. 1953 నవంబరు 24లో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర వానపాములలో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. వ్రాసిన ‘ద్రౌపది’ తెలుగునవలకుగాను లక్ష్మీప్రసాద్ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యాడు. ఆయనకు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌ సహానీ వ్రాసిన ‘తామస్‌’ అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందాడు.  పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. రాజ్యసభ సభ్యునిగా  కూడా ఆయన తన సేవలందించాడు. పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా కూడా పనిచేసారు.ఈయనకు 2003లో పద్మ శ్రీ అవార్డ్, 2016లో పద్మ భూషణ్ అవార్డ్స్ వచ్చాయి.

  6.       Katherine Heigl  : కేథరిన్‌ మేరీ హీగల్‌ ప్రముఖ హాలీవుడ్ నటి, నిర్మాత నేడు ఆవిడ పుట్టిన రోజు. వాషింగ్టన్‌లో 1978లో పుట్టిన కేథరిన్‌ ‘దట్‌ నైట్‌’ (1992) అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత  ‘మై ఫాదర్‌ ద హీరో’, ‘అండర్‌సీజ్‌2’, ‘నాక్డ్‌ అప్‌’, ‘24 డ్రెసెస్‌’, ‘ద అగ్లీట్రూత్‌’, ‘కిల్లర్స్‌’, ‘అన్‌ ఫర్గెటబుల్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది.  అలా ఫ్యాషన్‌, సినీ రంగాల్లో మెరుపుల తారగా ఎదిగిన కేథరిన్‌ మేరీ హీగల్‌ నటిగా, నిర్మాతగా ముద్రవేసింది. మరో పక్క నాటక, టీవీ రంగాల్లో కూడా అలరించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.  

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!