8.6 C
New York
Friday, December 3, 2021

Famous Celebrities Born on Nov 26 | Arjun Rampal | Anupriya Kapoor | Shri Tv Wishes

Famous Celebrities Born on Nov 26 | Arjun Rampal | Anupriya Kapoor | Shri Tv Wishes

నవంబర్ 26  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.    Arjun Rampal : సహాయ నటుడిగా అలరించాడు.. ప్రతినాయకుడిగా మెప్పించాడు. రొమాంటిక్‌ పాత్రలతో యువతరానికి కిర్రెక్కించాడు. పాత్ర ఏదైనా తనదైన నటనతో జీవం పోశాడు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుతో పాటు ఫిలింఫేర్‌ను సొంతం చేసుకున్నాడు అతనే అర్జున్‌ రాంపాల్‌ నేడు ఆయన పుట్టిన రోజు. 1972 నవంబరు 26న మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు అర్జున్‌ రాంపాల్‌ కేవలం నటుడిగానే కాక స్కీన్ర్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞను చూపించాడు అర్జున్‌. 1972 నవంబరు 26న మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు అర్జున్‌ రాంపాల్‌ తొలుత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు ఆ తర్వాత  ‘ప్యార్‌ ఇష్క్‌ మొహబ్బత్‌’ (2001)తో వెండితెరపై అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్నివ్వనప్పటికీ.. నటుడిగా అర్జున్‌ రాంపాల్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌కు నామినేట్‌ అయ్యాడు. ఆ తరువాత ‘దివానాపన్‌’, ‘దిల్‌ హై తుమ్హారా’, ‘ఆంఖే’, ‘దిల్‌ కా రిష్తా’ ‘డాన్‌’, ‘ఓం శాంతి ఓం’, ‘రాక్‌ ఆన్‌’, ‘హౌస్‌ ఫుల్‌’, ‘రాజ్‌ నీతి’, ‘రా వన్‌’ చిత్రాలు అర్జున్‌ రామ్‌పాల్‌ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ‘రాక్‌ ఆన్‌’ చిత్రం అర్జున్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో అతను కనబర్చిన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుతో పాటు తొలి ఫిలింఫేర్‌ను అందుకున్నాడు దాదాపు 18 ఏళ్ల సినీ కెరీర్‌లో 40 చిత్రాల్లో నటించాడు కానీ వాటిలో గుర్తుండిపోయే పాత్రలే చేసాడు.

  2.    Jassie Gill : జస్సి గిల్ ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. జస్సి గిల్ తన కాలేజీ రోజుల నుంచే పాడటం మొదలు పెట్టి కాలేజీ లో జరిగిన మ్యూజిక్ పోటిలలో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. 2011లో బ్యాచ్ మేట్ అనే ఆల్బం తో మొదటి సారి గుర్తింపు వచ్చింది ఆ తర్వత రిలీజ్ చేసిన తన రెండో ఆల్బం బ్యాచ్ మేట్ 2 ఆల్బం కూడా పెద్ద హిట్ అవడంతో 2014లో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ 420 అనే పంజాబీ సినిమాలో తొలిసారిగా నటించాడు. ఆ తర్వత దిల్ విల్ ప్యార్ వ్యార్, మున్దేయన్ తోన్ బచ్కే రహిన్, ఓహ్ యారా ఐనవయి లుట్ గయా, దిలదరియాన్,సర్గి, మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స లాంటి పంజాబీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 2018లో హ్యాపీ ఫిర్ర్ బాగ్ జయేగి అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు 2019లో హై ఎండ్ యారియాన్ అనే సినిమా చేసాడు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో పంగా అనే సినిమాలో చేసిన పాత్రకు మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది.

  3.    Vidya V Pillai  : విద్య వి పిళ్ళై ప్రముఖ ఇండియన్ స్నూకర్ ప్లేయర్ నేడు ఆవిడ పుట్టిన రోజు. ఈవిడ 26నవంబర్, 1977లో తమిళనాడులోని తిరుచ్చిలపల్లి లో జన్మించారు. విద్య 2005లో ఇండియన్ నేషనల్ 9’బాల్ పూల్ ఛాంపియన్ షిప్ గెలిచింది. ఆ తర్వాత వరుసగా తొమ్మిది సార్లు ఉమెన్స్ నేషనల్ స్నూకర్  ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో మొదటిసారిగా వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత 2013లో వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. స్పోర్ట్స్ రంగంలో విద్య చేసిన విశేష కృషికి గానూ 2016లో కర్ణాటక ప్రభుత్వం ఈమెను ఏకలవ్య అవార్డుతో సత్కరించింది.

  4.    Anand Shankar : ఆనంద్ శంకర్ ప్రముఖ తమిళ సినిమా డైరెక్టర్ నేడు ఆయన పుట్టినరోజు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన తర్వాత 2014లో అరిమ నంబి అనే సినిమాతో ఆనంద్ శంకర్ దర్శకుడిగా మారారు ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు ప్రభు కుమారుడు విక్రం ప్రభు హీరో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 2016లో విక్రం హీరోగా ఇరుముగన్ అనే సినిమా కు దర్శకత్వం వహించారు. 2018లో విజయ్ దేవరకొండ హీరోగా నోట సినిమా తెరకెక్కించారు.

  5.    Meera Nandan : మీరా నందన్ ప్రముఖ మలయాళ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. మీరా 26నవంబర్, 1988లో కేరళ లోని కోచిలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు మీరా ఆసియా నెట్ టీవీ ఛానల్, అమృత టీవీ, జీవన్ టీవీలలో యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత 2008లో ముళ్ళ అనే మళయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆ సినిమాలో నటనకి మీరాకి మంచి గుర్తింపు వచ్చింది. మీరా తమిళ్ లో వాల్మికి అనే సినిమాలో నటించింది. 2011లో తెలుగులో జై బోలో తెలంగాణా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మీరా తన కెరీర్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 39సినిమాల్లో నటించింది.

  6.    Anupriya Kapoor : అనుప్రియ కపూర్ ప్రముఖ భారతీయ టీవీ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. అనుప్రియ 26నవంబర్, 1990లో జన్మించారు. అనుప్రియ కపూర్ స్టార్ వన్ లో వచ్చిన మిలీ జాబ్ హమ్ తుం అనే సీరియల్ లో మొదటి సారిగా నటించింది. ఆ తర్వాత సెవెన్, ssshhh…phir koi hai, రిష్ట డాట్ కాం, తేరే లియే, హల్లా  బోల్, కోడ్ రెడ్, భాగ్య లక్ష్మి అనే టీవీ సీరియల్స్ లో నటించింది. అనుప్రియా కపూర్ తేరే లియే అనే సీరియల్ కు ఉత్తమ నటిగా ఇండియన్ టెలివిషన్ అకాడమీ అవార్డు గెలుచుకుంది.      

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!