21.9 C
New York
Tuesday, September 28, 2021

Famous People Born on August 21 || Bhumika Chawla || Radhika Sarathkumar | Shri Tv Wishes

ఆగస్టు 21 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 Bhumika Chawla
మిలీనియం మొదట్లో ఖుషీ లాంటి సంచ‌ల‌న సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన భూమిక పుట్టిన రోజు రోజు.   సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే. తర్వాత వరస సినిమాలు చేసి దశలో నెంబర్ వన్ పీఠానికి చేరువైంది. తెలుగు లో కుర్రాళ్ల‌కు తార‌క‌మంత్రం పేరుగా మారింది. ఖుషీ తర్వాత కూడా ఒక్కడు, సింహాద్రి, సాంబ, వాసు లాంటి సినిమాలు చేసింది భూమిక. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు.భ‌ర‌త్ ఠాకూర్‌తో పెళ్ళైన త‌ర్వాత సినిమాల‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంది భూమిక‌. త‌ర్వాత బాలీవుడ్ వెళ్లి అక్క‌డ కొన్ని రోజులు సినిమాలు చేసింది. సల్మాన్ ఖాన్‌తో నటించిన తేరే నామ్ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులో శేషు.. తమిళంలో సేతుగా హిందీలో తేరే నామ్‌గా రీమేక్ అయింది. విభిన్నమైన పాత్రల ద్వారా మంచి విజయాలను అందుకుంది. కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకున్న భూమిక రీ ఎంట్రీ తరువాత అక్క .. వదిన పాత్రలలో కనిపిస్తోంది. పాత్రలకి ప్రాధాన్యత ఉంటేనే ఆమె అంగీకరిస్తుంది.అలామిడిల్ క్లాస్ అబ్బాయి’.. ‘ సవ్యసాచివంటి సినిమాల్లో నటించిన భూమిక, తాజాగా మరో సినిమాలో హీరోకు అక్క పాత్రలో కనిపించబోతోంది.

2 రాధిక శరత్ కుమార్

తన నటనా కౌశల్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి రాధిక పుట్టిన రోజు రోజు పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించిన రాధిక, రాడాన్ అనే సంస్థ ద్వారా పలు టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తోంది. రాధిక ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ, నిర్మాతగా కూడా రాణిస్తోంది. రాధిక అలనాటి తమిళ హాస్య నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి శ్రీలంకకు చెందినది.  రాధికా శరత్‌కుమార్ హీరోయిన్‌గా ఒకానొక సమయంలో ఒక వెలుగువెలిగింది. తెలుగులో చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రంన్యాయం కావాలి’. “ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయి.. మోసం చేసిన అబ్బాయిపై చేసిన న్యాయపోరాటంలో ఎటువంటి విజయాన్ని సాధించింది?” అనే క‌థాంశంతోన్యాయం కావాలిరూపొందింది. నవలా రచయిత్రి డి.కామేశ్వరి రచించినకొత్తమలుపునవలాధారంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు దర్శకుడు కోదండ‌రామిరెడ్డి.
చిరంజీవికి జోడిగా నటించిన రాధికని నటశిఖరాగ్రాన నిలబెట్టిందీ సినిమా. అంతేకాదు.. తెలుగునాట హీరోయిన్ గా పరిచయమైన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన అభిన‌యంతో కట్టిపడేసింది రాధిక. సినీ హీరోయిన్ గా ఎన్నో చిత్రాలు, ఎంతో పేరు, అవార్డ్ లు సాధించిన ఆమె వయస్సు మీద పడగానే  రాడాన్ మీడియా సంస్థను ప్రారంభించి బుల్లితెర టీవీ సీరియల్స్‌లోకి ప్రవేశించింది. సంస్థ నుండి ఎన్నో బిగ్ సీరియల్స్‌ని అందించింది. ఇక రాధిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రాధికకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి.  

 3 Kim Victoria Cattrall 
టీవీ సీరియల్‌ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని, అభిమానులను, అవార్డ్ లను సంపాదించుకోవటం అంటే మాటలు కాదు. ఘనత సాధించిన స్టార్   కిమ్‌ విక్టోరియా కట్రాల్‌ .  ఆమె పుట్టిన రోజు రోజు.  హెచ్‌బీఓలో వచ్చినసెక్స్‌ అండ్‌ సిటీసీరియల్‌ 1998 నుంచి 2004 వరకు ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసింది. అందులో కీలక పాత్రలో నటించిన కిమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియల్ ని సినిమాగా కూడా తీశారు. రెండింటిలోనూ ఒకే పాత్రలో నటించి ఒప్పించిన నటి కిమ్‌ విక్టోరియా కట్రాల్‌.ఇందులో నటనకు కిమ్‌ అయిదు ఎమ్మీ, నాలుగు గోల్డెన్‌గ్లోబ్‌ నామినేషన్లు పొందంది. ఉత్తమ సహాయ నటిగా 2002లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. ఇదే పేరుతో 2008లోను, 2010లోను తీసిన సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకుంది కిమ్‌. ‘రోజ్‌బడ్‌’ (1975) సినిమాతో తెరంగేట్రం చేసిన ఈమెటికెట్‌ టు హెవెన్‌’, ‘పోలీస్‌ అకాడమీ’, ‘బిగ్‌ ట్రబుల్‌ ఇన్‌ లిటిల్‌ చైనా’ ‘మిడ్‌నైట్‌ క్రాసింగ్‌’, ‘ రిటర్న్‌ ఆఫ్‌ మస్కటీర్స్‌లాంటి చిత్రాల ద్వారా ఆకట్టుకుంది

4 sana Khan
లీవుడ్ లో కళ్యాణ్ రామ్కత్తి’ – మిస్టర్ నూకయ్యగగనం సినిమాలలో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్ పుట్టిన రోజు రోజు. సినిమాలలో తన అందం అభినయం ఫర్వాలనిపించేలా ఉన్నా కూడా ఆఫర్స్ మాత్రం తలుపుతట్టలేదు. దీంతో అమ్మడు తట్టాబుట్టా సర్దుకుని మళ్లీ హిందీ చిత్రపరిశ్రమకు వెళ్లిపోయింది. రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అలరించింది. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన ముంబై భామతన మకాంను బాలీవుడ్ కు షిఫ్ట్ చేసి అవకాశాలు వెతుక్కునే పనిలో పడింది. తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారులో క్రేజ్ తెచ్చుకుంది. చేతిలో సినిమాలు లేక పోయినా సోషల్ మీడియా ద్వారా సనా ఫుల్ బిజీగా ఉంటూ వస్తుంది. ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వెరైటీ పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది

5 Nathan Jones (wrestler)
  మధ్యన రిలీజైన హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీమ్యాడ్ మాక్స్సినిమాలో విలన్ గుర్తున్నాడా…? కండలు తిరిగిన దేహంచూడగానే భయపెట్టే భారీ ఆకారమున్న నాథన్ జోన్స్ ప్రేక్షకులను అవలీలగా భయపెట్టేశాడు. రెజ్లర్‌గా రిటైరైన నాథన్ ప్రస్తుతం పలు హాలీవుడ్ చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నారు.   6 అడుగుల 11 అంగుళాల నటుడికి పేరు గుర్తింపు ఉన్నాయి. ఆయన పుట్టిన రోజు రోజు. ఆయన నటుడు కావటం ముందు నుంచే ఇంటర్నేషనల్ రెజ్లింగ్ స్టార్‌.  రెజ్లింగ్‌తో చాలామందికి సుపరిచితుడైన నాథన్ జోన్స్. ట్రాయ్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరి లాంటి సినిమాల్లో విలన్ నటించిన నతన్ జాన్స్ను పై ఇండియన్ ఫిలిం మేకర్స్ కన్ను పడింది. ఇటీవలే ఆయన తమిళంలోజయంరవి హీరోగా నటించినభూలోగమ్సినిమాలో విలన్‌గా నటించారు.  అలాగే  జోన్స్  బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నఫ్లైయింగ్ జాట్సినిమాలోనూ విలన్గా నటించారు.

6 Kanika Kapoor
బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా  కపూర్ పుట్టిన రోజు రోజు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ పాటలు ఆమె గొంతు నుంచి జాలువారాయి. ‘బేబి డాల్‌, చిట్టియాన్‌ కలైయాన్‌వంటి ప్రాచుర్యం పొందిన పాటలను ఆమె ఆలపించారు. లక్నోలో పుట్టి పెరిగిన ఆమె చిన్ననాటి నుంచి సింగర్ కావాలని కలలు కనేది. స్కూల్ డేస్ లోనే తను పాడిన పాటలకు ఎన్నో బహుమతులు పొందింది. అయితే లండన్ కు చెందిన బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని వెళ్లింది. కానీ తర్వాత విడాకులు తీసుకుని ముంబై వచ్చి తను సింగర్ గా ఎదగాలనే జీవిత లక్ష్యం వైపు ప్రయాణం పెట్టుకుంది. ఆమె మొదటి సాంగ్ జుగ్నుజీ సూపరర్ హిట్ అయ్యింది. తర్వాత ఆమె రాగిణీ ఎమ్ ఎమ్ ఎస్ 2 కోసం పాడిన బేబీ డాల్ సాంగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చాలా కాలం టాప్ ఛార్ట్ లలో ఉంది. ఆమె సింగింగ్ స్టైల్ ని చాలా మంది మెచ్చుకుంటారు. ఆమెకు పాట బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని తెచ్చిపెట్టింది. భారత్ లోకి కరోనా వచ్చిన కొత్తలో వైరస్ బారిన పడి  వార్తల్లోకి ఎక్కింది. ఆమెకు ఉన్న హై సొసైటీ పరిచయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూంటాయి.


ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!