8.6 C
New York
Friday, December 3, 2021

Famous People Born on November 01 | Aishwarya rai | V.V.S Lakshman | Shri Tv Wishes

నవంబర్ 1 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Aishwarya Rai Bachchan :  ఐశ్యర్యరాయ్‌ గురించి ఏ భాషలో చెప్పాలన్నా పదాలు వెతుక్కోవలసిందే. ఆమె అందానికి, హుందాతనానికి సరిగ్గా సరిపోయే పర్యాయ పదాల కోసం తంటాలు పడాల్సిందే అందుకే ఆమె ‘ప్రపంచంలోనే అత్యంత సౌందర్యవతి’ అని ఊరుకోవడం ఉత్తమం. మొదట ఐశ్వర్యారాయ్ డాక్టర్‌ అవుదామనుకుంది ఆ తరువాత ఆర్కిటెక్ట్‌ అవ్వాలనుకుంది కానీ అందాల భరిణై కూర్చుంది.  ఐశ్వర్యారాయ్ 1973 నవంబర్‌ 1న, కర్ణాటక లోని బెంగలూరు లో జన్మించింది.  ఐశ్వర్యరాయ్‌ బాల్యం, విద్యాభాసం ముంబైలో సాగింది. చదువుల్లో 90 శాతం మార్కులు తెచ్చుకుంటూనే సంప్రదాయ నృత్యాన్ని ఐదేళ్లు అభ్యసించింది. ఐశ్వర్యారాయ్ అందమైన రూపం, మోడల్‌ ప్రపంచానికి స్వాగతం పలికింది. పద్దెనిమిదేళ్ల కల్లా అంతర్జాతీయ సూపర్‌ మోడల్‌ పోటీలో గెలిచి ‘వోగ్‌’ పత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయం అయింది. ఆమీర్‌ఖాన్‌తో కలిసి నటించిన పెప్సీ ప్రకటనలో ‘హాయ్‌ ఐయామ్‌ సంజన’ అనే ఆమె డైలాగ్‌ను ముచ్చటగా చెప్పి వీక్షకులను ముగ్ధుల్ని చేసింది. 1994లో ఐశ్వర్యారాయ్ మిస్ వరల్డ్ గా ఎంపికై ఎన్నో పతకాలు గెలుచుకుంది. దర్శక దిగ్గజం మణిరత్నం గారు తీసిన తమిళ సినిమా ‘ఇరువర్‌’తో తొలిసారిగా వెండితెరపై బంగారు సంతకం చేసింది ఈ ప్రపంచపు సౌందర్యవతి. ఆపై ఆమె సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’గా గుర్తించినా, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ పురస్కారం ఇచ్చినా, అనేక ఫిలింఫేర్‌లాంటి బహుమతులు వరించి వచ్చినా, అవన్నీ సినీ ప్రేక్షకుల గుండెల్లో అభిమానమనే సింహాసనం అధిష్టించిన ఐశ్వర్యారాయ్‌కి అదనపు అలంకారాలే. ఐశ్వర్యరాయ్ ఇప్పటివరకు 50 సినిమాలలో నటించింది.

  2.       Ileana D’Cruz : టాలీవుడ్‌లో ‘జీరో సైజ్‌’ హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇలియానానే అంటారందరూ. నాజూకు అందంతో కుర్రకారు మతులు పోగొట్టిన ఇలియానా డిక్రూజ్ తెలుగు, హిందీ, తమిళ  సినిమాల్లో విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. గోవా కుటుంబీకులకు ముంబైలో 1987 నవంబర్‌ 1న పుట్టిన ఇలియానా మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చింది. ‘దేవదాసు’ ‘పోకిరి’ ‘జల్సా’ ‘కిక్‌’ ‘జులాయి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇలియానా ఇప్పటివరకు తన కెరీర్లో దాదాపు 28 సినిమాలల్లో నటించింది. ఈ అందాల ముద్దుగుమ్మ ఎన్నో అవార్డులని కూడా సొంతం చేసుకుంది. జీ సినీ అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్, సంతోషం అవార్ద్స్, లైఫ్ ఓకే నౌ అవార్డ్స్ లాంటి అవార్డ్స్ గెలుచుకుంది.

  3.       VVS Laxman :  లక్ష్మణ్ అవుట్ చేయడం మాకు అసాధ్యం అనిపించింది అని ఆస్ట్రేలియా క్రికెట్ పాంటింగ్ అంతటివాడు అన్నాడంటే అతనెంత గొప్ప ఆటగాడో తెలుస్తుంది అతనే VVS లక్ష్మణ్… తన అద్భుత ఆటతో క్రికెట్ అభిమానులతో వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అనిపించుకున్నాడు. పూర్తిపేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. VVS నవంబర్ 1, 1974లో అప్ హైదరాబాద్ లో జన్మించారు. VVS లక్ష్మణ్ 1993 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ టీం తరపున పంజాబ్ తో మ్యాచ్ తో ఫస్ట్ క్లాసు క్రికెట్ స్టార్ట్ చేసాడు తన అద్భుత ప్రదర్శనతో 1996లో సౌత్ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు లక్ష్మణ్ తన కెరీర్లో మొత్తం 134 టెస్టులు ఆడి 8781 పరుగులు చేసాడు వీటిలో 17 సెంచరీ లు, 56 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి 281 అత్యుత్తమ స్కోర్. అలాగే 1998లో జింబాంబె తో జరిగిన మ్యాచ్ తో వన్ డే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు లక్ష్మణ్ తన కెరీర్లో మొత్తం 86 మ్యాచ్ లు ఆడి 2338 పరుగులు చేసాడు వీటిలో 6 సెంచరీ లు, 10 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి. IPL లో హైదరాబాద్ కు ఒకసారి ఆ తర్వత కోచి టీం కు ఒకసారి ఆడినా ఆ తర్వాత IPL లో లక్ష్మణ్ ఆడలేదు. 2011లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది, 2012లో లక్ష్మణ్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా పై కోల్ కతాలో లక్ష్మణ్ చేసిన 281 ఇన్నింగ్స్ ను ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

  4.       తెలుగులో వెంకటేష్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు పాటలు పాడి ఆకట్టుకున్నాడు అతనే టిప్పు గా పేరు పొందిన ఎల్. ఎన్. ఏకాంబరేష్ తమిళనాడుకు చెందిన సినీ నేపథ్య గాయకుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 4000కి పైగా పాటలు పాడాడు.
  టిప్పు అసలు పేరు ఏకాంబరేష్. నవంబరు 1, 1978 న తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోని పొన్మలైలో లక్ష్మీ నారాయణన్, మీనాక్షి దంపతులకు జన్మించాడు. పురస్కారాలు
  టిప్పుకు 2007లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం లభించింది. 2010లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడిగా అవార్డు వచ్చింది. టిప్పుకు తెలుగులో ఉన్నమాట చెప్పనీవు (సినిమా:నువ్వునాకునచ్చావ్) నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి (సినిమా: సింహాద్రి) లాంటి పాటలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

  5.       Ishaan Khatter  : అతిలోక సుందరి శ్రీదేవి కూతురి తొలి సినిమాలో హీరోగా చేసి ప్క్కసారిగా అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు అతనే ఇషాన్ కట్టర్. నవంబర్ 1, 1995లో ముంబైలో జన్మించాడు. తండ్రి రాజేష్ కట్టర్, తల్లి నీలిమ కూడా సినిమా నటులే ప్రముఖ బాలీవుడ్ హీరో షహీద్ కపూర్ కు తమ్ముడి వరస అవుతాడు. ఇలాంటి కుటుంబ నేపథ్యం వున్న ఇషాన్ 2005లో వచ్చిన వా లైఫ్ హో తో ఐసి అనే సినిమాలో షహీద్ కపూర్ తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తర్వాత 2017లో ప్రముఖ ఇరానీ దర్శకుడు మాజిది మాజిది తీసిన బియాండ్ ద క్లౌడ్స్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వత జాన్వీ కపూర్ తో దడక్ సినిమా చేసి మంచి నటుడు అనిపించుకున్నాడు. తన తోలి సినిమా బియాండ్ ద క్లౌడ్స్ కు ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

  6.       Vattikota Alwar Swamy  : వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు. భాషా సాహిత్యాల దగ్గర్నుంచి పౌర హక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు. 1915 నవంబర్ 1 తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించాడు. తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేశాడు. గ్రంథాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పనిచేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. దానితో ఆయన జైలు పాలు అయ్యాడు. వంటపనిలో, ప్రూఫ్ రీడింగ్‌లో, హోటల్ సర్వర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేశాయి. నిజాంను గడగడలాడించిన ‘ఆంధ్రమహాసభ’ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాడు. వట్టికోట జైలు తెలంగాణ ప్రజా జీవిత నేపథ్యంతో 1952లో “ప్రజల మనిషి” అనే నవల రచించాడు..  

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!