7.5 C
New York
Friday, December 3, 2021

Famous People Born on November 02 | Shah Rukh Khan | Nivetha Thomas | Shri Tv Wishes

నవంబర్ 2 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Shah Rukh Khan  : బాలీవుడ్‌ బాద్‌షా, కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్, కింగ్‌ఖాన్‌ లాంటి పేర్లతో అంతర్జాతీయంగా ప్రాచుర్యంపొందినహీరోనేషారుఖ్‌ఖాన్‌.ముప్ఫై ఏళ్ల కిత్రం టెలివిజన్‌లో చిన్న చిన్న వేషాలు వేసే ఆ కుర్రాడిని చూసినప్పుడు అతగాడు వెండితెరపై సింహాసనం వేసుకుని కూర్చుంటాడని, ప్రజాభిమానాన్ని కిరీటంలా ధరిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ కుర్రాడే షారూఖ్…  న్యూదిల్లీలో 1965 నవంబర్‌ 2న పుట్టిన షారుఖ్‌ చదువులోను, ఆటల్లోను చురుగ్గా ఉండేవాడు. హాకీ, ఫుట్‌బాల్‌ ఆడుతూ క్రీడాకారుడవ్వాలనుకున్నాడు కానీ, భుజానికి దెబ్బ తగలడంతో ఆటలు విరమించాడు. యువకుడిగా నాటకాలు వేస్తూ బాలీవుడ్‌ హీరోలను అనుకరించి అందరినీ ఆకట్టుకునేవాడు. నటన మీద అభిలాషతో యాక్టింగ్‌ స్కూలులో చేరాడు. ‘దిల్‌ డరియా’, ‘ఫౌజీ’, ‘సర్కస్‌’, ‘ఇడియట్‌’లాంటి టీవీ సీరియల్స్‌ లో నటించేప్పుడే తనదైన నటన శైలితో ఆకట్టుకున్నాడు. వెండితెర ఆశలతో ముంబై చేరాక ‘దీవానా’ (1992)తో మొదలుపెట్టి ‘డర్‌’, ‘బాజీగర్‌’, ‘అంజామ్‌’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘దిల్‌తో పాగల్‌ హై’, ‘కుచ్‌కుచ్‌ హోతా హై’, ‘మొహబ్బతే’, ‘కభీ ఖుష్‌ కభీ ఘమ్‌’, ‘దేవ్‌దాస్‌’… ఇలా ఒక్కో సినిమాతో మురిపిస్తూ కింగ్‌ అనిపించుకున్నాడు.తన కెరీర్లో మొత్తం 80 సినిమాల్లో నటించిన షారుఖ్ 14 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం. ఫిలింఫేర్, జీ సినీ, స్కీన్ర్‌ అవార్డ్‌ కార్యక్రమాలకు హోస్ట్ గా, ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ చైతన్య టెలివిజన్‌ షోలకు యాంకర్ గా షారుఖ్‌ వ్యవహరించారు, ఇండియా నయీ సోచ్‌ వంటి టాక్‌ షోలకు ప్రయోక్తగా నిలిచారు. 2005లో షారుఖ్‌ ఖాన్‌కు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం చేసింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ను, అత్యున్నత సివిలియన్‌ అవార్డును ఇచ్చి గౌరవించింది.

  2.       Nivetha Thomas   :  ఎనిదేళ్లకే నటన ప్రారంభించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ యువనటి పురస్కారం అందుకుంది. మలయాళం, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్‌.. ఏ భాషైనా మాడ్లాడగలుగుతుంది. యువతతో ‘నిన్ను కోరి ఎగసే నా ఊపిరి’ అని పాడించుకుంది ఆమే నివేదా థామస్‌. అందం కాదు అభినయం ప్రధానం అనే ఈ నటి పుట్టిన రోజు నేడు. 2002లో మలయాళ చిత్రం ‘ఉత్తర’తో బాటనటిగా తెరంగ్రేటం చేసింది. ‘వెరుథె ఒరు భార్య’ అనే మలయాళం చిత్రంలో నటుడు జయరాం కుమార్తె పాత్రలో ఒదిగిపోయింది నివేదా. ఆ సినిమాలు నటనకు ప్రశంసలతోపాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ యువనటి అవార్డు అందుకుంది. ‘పాపనాసం’ అనే తమిళ చిత్రంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు కూతురుగా నటించింది. ఇలా మలయాళ, తమిళ్‌ చిత్రాల్లో నటిస్తూ 2016లో నాని కథానాయకుడుగా వచ్చిన ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమైంది నివేదా. కేథరిన్‌ పాత్రతో తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మళ్లీ నానితో ‘నిన్నుకోరి’ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’, కళ్యాణ్ రాం తో 118’, శ్రీవిష్ణుతో ‘బ్రోచేవారెవరురా’, సుదీర్ బాబుతో ‘V’ సినిమాల్లో నటించింది.

  3.       Esha Deol  : అమ్మ హేమా మాలినీలా వివిధ భాషల్లో సత్తాచాటి ఉండక పోవచ్చు.. చిత్రసీమలోని అగ్రతారలందరి సరసన ఆడిపాడకపోవచ్చు చేసింది పట్టుమని పాతిక చిత్రాలే కావచ్చు. ఆ పాతిక చిత్రాలతోనే ఎందరో సినీ ప్రియుల అభిమానాన్ని సంపాదించుకుంది ఇషా డియోల్‌. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ ఉత్తమ నటి డెబ్యూగా ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోని తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. 1982 నవంబరు 2న ప్రముఖ నటులు ధర్మేంద్ర, హేమా మాలిని దంపతులకు జన్మించిన ఇషా చిన్నతనం నుంచే తల్లి స్ఫూర్తితో సినిమా రంగంపై మక్కువ పెంచుకుంది. ముంబయిలోని మితిబాయ్‌ కళాశాలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తి చేసిన ఇషా.. తొలిసారి 2002లో ‘కోయీ మేరే దిల్‌ సే పూచే’ చిత్రంతో వెండితెరకు పరిచయమైందితరువాత ఇషా‘ఎల్‌ఓసీ కార్గిల్‌ ‘యువ’, ‘ధూమ్‌’, ‘ఇన్సాస్‌’, ‘కాల్‌’, ‘మై ఐసా హై హూ’, ‘దస్‌’, ‘నో ఎంట్రీ’, ‘కాష్‌’, ‘షాదీ నెం.1’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. తన కెరీర్లో మొత్తం 28 సినిమాల్లో నటించిన ఇషా ‘కోయి మేరె దిల్‌ సే పూచే’ సినిమాకు బాలీవుడ్‌ మూవీ అవార్డ్స్, ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ నుంచి బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూ పురస్కారాలన్ని అందుకుంది. ‘కోయి మేరె దిల్‌ సి పూచే’, ‘నా తుం జానో న హమ్’, ‘క్యా దిల్‌ నే కహా’ సినిమాలకు ఫిమేల్‌ మోస్ట్‌ ప్రామిసింగ్‌ న్యూ కమర్‌గా స్టార్‌ స్క్రీన్‌ అవార్డులను అందుకుంది.

  4.       Burton Stephen Lancaster  : హాలీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాల కాలంలో ఉత్తమ నటులుగా పేరొందిన వారిలో బర్టన్‌ స్టెఫెన్‌ లాంకాస్టర్‌ ఒకడు. న్యూయార్క్‌లో 1913 నవంబర్‌ 2న పుట్టిన బర్టన్‌‘ఎల్మర్‌ గ్యాంట్రీ’ (1960) సినిమాకు ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకోవడంతో పాటు, ‘ద బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ అల్కాట్రాజ్‌’, ‘అట్లాంటిక్‌ సిటీ’ సినిమాలకు బాఫ్తా పురస్కారాలు పొందాడు. నిర్మాతగా ‘ట్రెపీజ్‌’, ‘స్వీట్‌ స్మెల్‌ ఆఫ్‌ సక్సెస్‌’, ‘రన్‌సైలెంట్‌’, ‘రన్‌ డీప్‌’, ‘సెపరేట్‌ టేబుల్స్‌’ లాంటి సినిమాలు అందించాడు. 1964లో వచ్చిన ‘సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే’ చిత్రంలో క్రిక్‌ డగ్లస్, ఫెడ్రిక్‌ మార్చిలాంటి హేమాహేమిలతో కలిసి నటించారు.

  5.       David Lawrence Schwimmer   :  చదువుకునే రోజుల్లోనే రంగేసుకుని రంగస్థలం మీద అదరగొట్టాడా కుర్రాడు. అభిరుచికి తగినట్టుగానే అభినయాన్ని అభ్యసించాడు. పెద్దయ్యాక బుల్లితెరపై జెండా ఎగరేసి, ఆపై వెండితెరపై ముద్ర వేశాడు. అతడే డేవిడ్‌ లారెన్స్‌ స్క్విమ్మర్‌న్యూయార్క్‌లో 1966 నవంబర్‌ 2న పుట్టిన ఇతడు పదేళ్ల వయసులోనే స్కూల్లో డ్రామాలు వేయడం ద్వారా ప్రశంసలు అందుకున్నాడు. నాటకం, టీవీ, సినిమా రంగాల్లో అవార్డులు అందుకున్నాడు. ‘ద పాల్‌ బేరర్‌’, ‘కిస్సింగ్‌ ఎ ఫూల్‌’, ‘సిక్స్‌ డేస్‌ సెవెన్‌ నైట్స్‌’, ‘యాప్ట్‌ ప్యూపిల్‌’, ‘పికింగ్‌ అప్‌ ద పీసెస్‌’, ‘బిగ్‌ నథింగ్‌’, ‘నథింగ్‌ బట్‌ ద ట్రూత్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు, దర్శకుడిగానూ మెప్పించాడు.

  6.       Jyothi Lakshmi  :  జ్యోతి లక్ష్మీ ఈ పేరు చెపితే కుర్రకారు మతులు పోయేవి ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే కవ్వించే కైప్పేక్కించే శృంగార గీతాలతో ఒక వెలుగు వెలిగింది, 1970లలో తెలుగు సినిమాల్లో ఈ పేరు ఒక సంచలనం ఆవిడే జ్యోతి లక్ష్మీ. జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో1948లో జన్మించింది. ఆమె తండ్రి పేరు టి.కె. రామరాజన్, తల్లి పేరు శాంతవి ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో విడుదలైన పెద్దక్కయ్య.1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాటతో ఆంధ్రదేశపు ప్రేక్షకులను ఉర్రూతలూగించిoది. ఐటెం సాంగ్స్ తో  ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపింది జ్యోతిలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడు వందల సినిమాలకు పైగా నటించిన జ్యోతిలక్ష్మి.. వెయ్యికి పైగా పాటల్లో డ్యాన్స్ చేసింది. దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!