6.8 C
New York
Thursday, December 2, 2021

Famous People Born on November 04 || Tabu | ESL Narasimhan || Shri Tv Wishes

నవంబర్ 4 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 
 హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Veeramachaneni Rajendra Prasad  :  దసరాబుల్లోడు’ చూస్తే వాణిజ్య ప్రమాణాల గురించి తెలుస్తుంది, ‘మంచి మనుషులు’ చూస్తే మానవ సంబంధాల విలువ అర్థమవుతుంది, ‘అంతస్తులు’ చూస్తే వ్యక్తిత్వం ఎంత గొప్పదో అవగాహనకు వస్తుంది, ‘ఆత్మబలం’ చూస్తే ప్రేమ ఎంత గాఢమైనదో అవగతమవుతుంది. ఇలా ఆయన అందించిన చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోయేవే. ఆయన నిర్మాత అయినా దర్శకుడయిన రచయిత అయినా ఆయన ఎప్పుడూ ప్రేక్షక జనరంజకమైన సినిమాలే రూపొందించారు ఆయనే వి.బి.రాజేంద్రప్రసాద్‌. గుడివాడలో 1932 నవంబర్‌ 4న పుట్టిన వీబీ రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను అందించి అలరించారు. నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఆయన అనుకోకుండా దర్శకుడై ‘దసరబుల్లోడు’ (1971) తీస్తే అది ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా తెలుగులో బంగారు బాబు, మంచి మనసులు, పిచ్చిమారాజు, బంగారు బొమ్మలు, రామ కృష్ణులు సినిమాలకు దర్శకత్వం వహించారు. హిందీలో  రాస్తే ప్యార్ కె, బెకరార్, తమిళ్ లో పట్టాకత్తి భైరవన్, ఉతామన్, ఎంగళ్ తంగ రాజా అనే సినిమాలు తీసారు.  1965లో అంతస్తులు సినిమాకు ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్నారు అలాగే 1966లో ఆస్తి పరులు సినిమాకు కూడా ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు వరసగా రెండు సంవత్సరాలు అందుకున్న ఏకైక వ్యక్తీ  వీబీ రాజేంద్రప్రసాద్. 2003లో ఆయనకు రఘపతి వెంకయ్య అవార్డు వచ్చింది.

  2.       Tabu  : రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు… ఆరు ఫిలింఫేర్‌ అవార్డులు… భారత ప్రభుత్వం నుంచి  పద్మశ్రీ… ఇన్నీ ఘనతలు సాధించిన నటే టబు. అసలు పేరు తబుస్సుమ్‌ ఫాతిమా హష్మి.  హిందీ చిత్రసీమ నుంచి వచ్చినా తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, బెంగాలీ సినిమాలతో పాటు ఇంగ్లిషు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌ ముస్లిం కుటుంబంలో పుట్టిన టబు బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ మేనకోడలు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిషు భాషలు అనర్గళంగా మాట్లాడే టబు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో మంచి నటిగా పేరుతెచ్చుకుంది.

  3.       Will Rogers  : విల్‌ రోజర్స్‌ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి అతను నటుడు, కౌబాయ్, హ్యూమరిస్ట్, న్యూస్‌పేపర్‌ కాలమిస్ట్, సోషల్‌ కామెంటేటర్‌.  ఓక్లహామాలో 1879 నవంబర్‌ 4న ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఇతడు చిన్నప్పుడే నటన పట్ల ఆకర్షితుడయ్యాడు.  హాలీవుడ్‌లో 50 మూకీలు, 21 టాకీల్లో నటించిన ఇతడు అప్పట్లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా పేరొందాడు. న్యూస్‌ పేపర్‌ కాలమిస్ట్‌గా దాదాపు 4,000 వ్యాసాలు రాయడం విశేషం. ఆయన ఇన్ని రంగాల్లో ప్రముఖుడు కాబట్టే అతడిని ‘ఓక్లహామా ఫేవరిట్‌ సన్‌’ అని పిలుస్తారు. విమానంలో ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టి వచ్చిన సాహసికుడు కూడా.

  4.       Matthew McConaughey   : నటుడిగా, నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుల్లో మేథ్యూ మెకనాగీ ఒకడు. ఆస్కార్‌ సహా ప్రతిష్ఠాత్మకమైన అనేక పురస్కారాలు అందుకున్న ఇతడు ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘ద సీ ఆఫ్‌ ద ట్రీస్‌’, ‘ఫ్రీ స్టేట్‌ ఆఫ్‌ జోన్స్‌’, ‘గోల్డ్‌’, ‘ద డార్క్‌ టవర్‌’, ‘ద లింకన్స్‌ లాయర్‌’, ‘కిల్లర్‌ జోయ్‌’, ‘ద వూల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌’, ‘డేజ్డ్‌ అండ్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌’ లాంటి సినిమాల ద్వారా మంచి నటుడిగా మెప్పించాడు. టెక్సాస్‌లో 1969 నవంబర్‌ 4న పుట్టిన ఇతడు టెలివిజన్‌ కమర్షియల్స్‌ ద్వారా వెలుగులోకి వచ్చి అవకాశాలు అందుకున్నాడు. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్, క్రిటిక్స్‌ ఛాయిస్, పీపుల్స్‌ ఛాయిస్, ఎమ్మీ, ఎమ్టీవీ మూవీ, శాటర్న్, స్పిరిట్‌ రోబెర్ట్‌ ఆల్ట్‌మ్యాన్, హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికాలాంటి ఎన్నో అవార్డులు అతడి ప్రతిభకు గీటురాళ్లు.

  5.      Shankar Jaikishan  : సంగీత దర్శకుల జంట శంకర్‌ జైకిషన్‌ గురించి తెలియని సంగీత అభిమానులు ఉండరేమో అద్భుత సంగీతానికి కర్తలుగా కలిసి, స్నేహానికి ప్రతీకలుగా నిలచిన ఈ సంగీత ద్వయంలోని ఒకరే జైకిషన్‌. శంకర్‌తో కలిసి 1949 నుంచి 1971 వరకు దాదాపు ఇరవై రెండేళ్లు హిందీ చిత్రసీమకు అద్భుత సంగీతాన్ని అందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంగీత ప్రయోగాలు చేస్తూ, గొప్పగొప్ప పాటలకు జీవంపోస్తూ జంట సంగీత దర్శకులుగా చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా ‘ఆగ్‌’ (1948), ఆ తర్వాత రాజ్ కపూర్ బర్సాత్ చేసారు ఆ సినిమా పాటలు సూపర్ హిట్ అవడంతో ఇక అక్కడి నుంచి వీరిద్దరూ వెనుతిరిగి చూసుకోలేదు.  ‘ఆవారా’ (1951) చిత్రంతో మొదలైన వారి హవా వరసగా, బాదల్, పూనమ్, అవురత్, నాగినా, కాలి ఘటా, పర్బత్, ఆహ్, బాద్షా, మయూర్‌ పంఖ్, సీమా, శ్రీ 420, బసంత్‌ బహార్, హలకు, న్యూ ఢిల్లీ, కట్‌ పుత్లి, అనారి, చోరి చోరి, దాగ్, బేగునా, యాహుది, బూట్‌ పాలిష్, చోటి బెహన్, షరారత్, లవ్‌ మ్యారేజ్, ఉజాలా వంటి సినిమాలతో అందలం ఎక్కేశారు. ఈ చిత్రాలకు వారు అందించిన అద్భుతమైన సంగీతం పది కాలాలపాటు నిలిచి, అజరామరమైంది. సినిమాలో హీరోలకన్నా శంకర్‌ జైకిషన్‌ లు ఎక్కువ పారితోషికం అందుకునేవారు. ఆ తర్వాత వచ్చిన మనస్పర్తల వలన శంకర్‌తో విభేదించిన జైకిషన్‌ దూరం జరిగాడు. శంకర్‌ జైకిషన్‌లకు 1968లో సంయుక్తంగా భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం చేసింది. అలాగే 2013లో భారత తపాలా శాఖ వీరి ప్రతిమలతో తపాల బిళ్లను విడుదల చేసింది. ఉత్తమ సంగీత దర్శకులుగా శంకర్‌ జైకిషన్‌ తొమ్మిదిసార్లు ఫిలింఫేర్‌ బహుమతులు అందుకున్నారు. పదకొండుసార్లు  ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్‌ అయ్యారు.

  6.      ESL Narasimhan  : ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్. పూర్తీ పేరు ఈక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివారు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా ప‌నిచేశారు.  ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబరు 28, 2009న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు మాజీ గవర్నర్.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!