7.5 C
New York
Friday, December 3, 2021

Famous People Born on November 06 | Bobby Simha | Yashwant Sinha | Shri Tv Wishes

నవంబర్6 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Shekhar Master  : మెగాస్టార్ చిరంజీవితో అమ్మడు కుమ్ముడు అని స్టెప్పులు వేయించినా ఆయన తనయుడు రాం చరణ్ తో కుంగ్ ఫు కుమారి అని ఆడించినా అల్లు అర్జున్ తో రాములో రాములా అనిపించి, టాప్ లేచి పోద్ది అని ఊర మాస్ స్టెప్స్ వేయించినా అది ఒక్క శేకర్ మాస్టర్ కె సొంతం. ఈయన పుట్టింది విజయవాడలో ఆ తర్వాత డాన్స్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని రోజులు డాన్సర్ గా పని చేసి డాన్స్ మాస్టర్ అయ్యాడు. ఆయన చేసిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో, సరైనోడు, జులాయి, బాద్ షా,DJ, ఖైది నెంబర్ 150,ఇస్మార్ట్ శంకర్ లాంటి ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.శేఖర్ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తన క్రీర్లో మొత్తం 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ETVలో వచ్చే డీ –జోడి డాన్స్ ప్రోగ్రాం కు జడ్జీగా ఉన్నారు.

  2.       Emma Stone  : నాలుగేళ్లకే నాటక రంగంలోకి అడుగుపెట్టింది… పదిహేనేళ్లకల్లా వెండితెరపై ఆశపడింది… అమ్మానాన్నల్ని ఒప్పించి ప్రయత్నాలు మొదలెట్టింది… టీవీల్లో మెరిసి, వెండితెరపైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగింది.ఎంతలా అంటే ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకునేంతగా!
  ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుర జాబితాలోకి ఎక్కేంతగా!!
  ఆమే ఎమిటీ జీన్‌ స్టోన్‌. ఎమ్మాస్టోన్‌గా చిరపరిచితురాలైన ఈ చలాకీ తార ఆస్కార్, బాఫ్తా, గోల్డెన్‌గోల్డ్‌ లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకుంది. అరిజోనాలో 1988 నవంబర్‌ 6న పుట్టిన ఎమ్మాస్టోన్‌ సినిమా ఆశలతో హాలీవుడ్‌కి వచ్చి ‘సూపర్‌బ్యాడ్‌’ (2007) సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆపై ‘జాంబీలాండ్‌’, ‘ఈజీ ఏ’, ‘క్రేజీ స్టుపిడ్, లవ్‌’, ‘ద హెల్ప్‌’, ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’, ‘లా లా ల్యాండ్‌’, ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సెక్సెస్‌’, ‘ద ఫేవరిట్‌’ లాంటి సినిమాలతో మెప్పించింది. ఈ సంవత్సరం రూబెన్‌ ఫ్లీషర్‌ దర్శకత్వంలో వచ్చిన జోంబియాల్యాండ్‌: డబుల్‌ ట్యాప్‌’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

  3.       Sally Field  : రెండు ఆస్కార్‌ అవార్డులు, మూడు ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, ఓ స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు అందుకోవడంతో పాటు రెండు బాఫ్తా, ఓ టోనీ అవార్డులను నామినేషన్లు పొందిన ఘనత సాలీ ఫీల్డ్‌ది. . కాలిఫోర్నియాలో 1946 నవంబర్‌ 6న పుట్టిన ఈమె బుల్లితెరతో ప్రయాణం మొదలు పెట్టి వెండితెరపై వెలుగులీనింది. ‘మూన్‌ పైలట్‌’, ‘స్టే హంగ్రీ’, ‘స్మోకీ అండ్‌ బండిట్‌’, ‘హీరోస్‌’, ‘ద ఎండ్‌’, ‘హోపర్‌’, ‘నోమా రే’, ‘ప్లేసెస్‌ ఇన్‌ ద హార్ట్‌’, ‘కిస్‌ మీ గుడ్‌బై’, ‘మర్ఫీస్‌ రొమాన్స్‌’, ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’, ‘ఫారెస్ట్‌ గంప్‌’లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’ సినిమాల్లో ఆన్ట్‌ మేరీ పాత్రలో మెప్పించింది. దర్శకురాలిగా కూడా బుల్లితెర, వెండితెరలపై ఆకట్టుకుంది ఆపై అంచెలంచెలుగా ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’ గౌరవం పొందే స్థాయికి ఎదిగింది.

  4.       Bobby Simha  :  తమిళ్ లో సిద్దార్థ్ హీరోగా వచ్చిన జిగర్ తాండా సినిమా గుర్తుందా అందులో విలన్ గా చేసిన అతనే బాబీ సింహ ఆ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నాడు ఇతను మన తెలుగు వాడే!!! సింహా పుట్టింది హైదరాబాద్ లోనే కానీ తన చిన్నప్పుడే ఫ్యామిలీ కోడై కెనాల్ కు షిఫ్ట్ అవడంతో అక్కడే పెరిగాడు. సినిమా మీద ఇష్టంతో చెన్నై వచ్చినప్పుడు అక్కడ తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో పరిచయం సింహా కెరీర్ ను మలుపు తిప్పింది. కార్తిక్ తీసిన పిజ్జా సింహ మొదటి సినిమా ఆ సినిమాకు తనకు మంచి పేరు వచ్చింది ఇక అక్కడి నుంచి తన సినీ కెరీర్ గాడిలో పడింది. ఆ తర్వాత నేరం, సుదూ కావ్యం సినిమాలు చేసాకా మళ్ళీ కార్తీక్ జిగర్ తాండా సినిమాలో చేసిన విలన్ వేషంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ నటుడు రజనీకాంత్, విక్రమ్ లతో కలిసి నటించి ఒక స్థాయికి ఎదిగాడు. తెలుగులో రవితేజ తో కలిసి డిస్కో రాజా సినిమాలో విలన్ గా నటించాడు.

  5.       Sri M : అసలు పేరు ముంతాజ్ అలీ  ఓ ఆధ్యాత్మిక వేత్త జిడ్డు కృష్ణమూర్తిలా ఓ వేదాంతి. 6 నవంబరు, 1948 కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జన్మించారు. ఈయన కూడా జిడ్డు కృష్ణమూర్తికి చెందిన రిషి వ్యాలీతో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి. జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం, శాంతి కొరకు యావత్ భారతదేశం పర్యటించి, శాంతి, తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక యాత్రలను కార్యక్రమాలను చేపట్టాడు. ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో “The Modern Mystic: Sri M of Madnapalle” అనే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు. మదనపల్లె సమీపంలో సత్సంగ్ కుటీరంలో తన నివాసం.

  6.       Yashwant Sinha  : యశ్వంత్ సిన్హా భారత దేశ మాజీ ఆర్ధిక శాక మంత్రి. ప్రస్తుతం నరేంద్ర మోడీ కాబినెట్ లో ఏవియేషన్ మంత్రిగా ఉన్నారు. నవంబర్ 6, 1937లో బిహార్ లోని పాట్నాలో పుట్టిన ఈయన ముందు కలెక్టర్ గా 24 ఇయర్స్ వర్క్ చేసి ఆ తర్వాత 1984లో జనతా పార్టీలో జాయిన్ అయ్యి తన రాజకీయ ప్రస్తానం స్టార్ట్ చేసారు. 1996లో BJP ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. ఆ తర్వాత MP గా గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!