8.8 C
New York
Tuesday, December 7, 2021

Famous People Born on November 09 | Prithvi Shaw | Priyanka Upendra | Shri Tv Wishes

Famous People Born on November 09 | Prithvi Shaw | Priyanka Upendra | Shri Tv Wishes

నవంబర్ 9 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Shankar Nag : RK నారాయణ్ రాసిన మాల్గుడి డేస్ కథల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది అంత గొప్ప ప్రాచురయం పొందిన మాల్గుడి డేస్ టీవీ సీరియల్ గా తీసి దర్శకత్వం వహిస్తూ నటించిన నటుడే శంకర్ నాగ్ ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ ఈయన తమ్ముడు. ఈయన నవంబర్ 9, 1954లో మైసూరులో జన్మించారు. కన్నడ సినిమాలో సేతు రామ, ఆటో రాజ, ప్రీతీ మాడు తమశే నోదు లాంటి కమర్షియల్ హిట్స్ సాధించినా ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలు తీసి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.తనే దర్శకుడిగా మారి ఆక్సిడెంట్, ఒండు ముట్టిన కథే, నోడి స్వామి నవిరోడు హిగే, లలచ్ అనే సినిమాలు తీసాడు. 1980లో తను దర్శకత్వం వహించిన మించిన ఓట సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు.  

  2.    Hedy Lamarr : ఇంత వరకు ఇలాంటి అందమైన అమ్మాయిని సినిమాల్లో చూడలేదు’ అన్నారందరూ!‘ఎంత అందమైన అమ్మాయైతే మాత్రం, ఛీ.. ఛీ.. ఇదేం పని?’ అని ఈసడించుకున్నారు చాలామంది! అటు ప్రశంసల్ని, ఇటు విమర్శల్ని కూడా చూసిన ఆ తార మాత్రం నటనకే పరిమితం కాలేదు. ఓ పరిశోధకురాలిగా కూడా పేరు తెచ్చుకుంది. ఆమె హాలీవుడ్‌ పేరు హెడీ లామర్‌. ఆస్టియ్రాలో పుట్టింది మాత్రం హెడ్విగ్‌ ఎవా కీస్లర్‌గా. పదిహేడేళ్లకే ఆస్టియ్రన్‌ సినిమాల్లో తెరంగేట్రం చేసింది కానీ ఉన్నట్టుండి ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోవడానికి కారణమైన సినిమా మాత్రం ‘ఎక్‌స్టసీ’(1933). ఓ చలన చిత్రంలో తొలిసారి నగ్నత్వాన్ని చూపించిన సినిమా అది. అందులో లామర్‌ నగ్నంగా నటించడం ఆ కాలంలో పెద్ద సంచలనమైపోయింది. ఓ ధనికుడైన వృద్ధుడిని పెళ్లి చేసుకుని అసంతృప్తితో విడాకులిచ్చి మరో యువకుడికి చేరువైన అమ్మాయి పాత్రలో ఆమె నటన సాహసోపేతంగా ఉందని కొందరంటే, కొన్ని దేశాలు మాత్రం ఆ సినిమానే నిషేధించాయి. ఈవిడ రెండు దశాబ్దాల పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘శ్యామ్‌సన్‌ అండ్‌ డిలైలా’ (1949) సహా ‘అల్‌గియర్స్‌’ (1938), ‘బూమ్‌టౌన్‌’, ‘ఐ టేక్‌ దిస్‌ ఉమన్‌’, ‘కామ్రేడ్‌ ఎక్స్‌’, ‘కమ్, లివ్‌ విత్‌ మి’ లాంటి సినిమాల్లో అందాల రాశిగా పేరు పొందింది. సినిమాలతోనే ఆగిపోకుండా సైనికులు రహస్యంగా సందేశాలు ఇచ్చుకునే పరికరానికి సంబంధించిన పేటెంట్‌ పొందింది. ఈ సాంకేతిక ఆలోచన ఇప్పుడు మొబైల్‌ ఫోన్లలో వైఫై సౌకర్యానికి దగ్గరగా ఉండడం విశేషం. ‘సీక్రెట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌’గా ఈమె పేటెంట్‌ తీసుకున్న ఆలోచన, రెండో ప్రపంచ యుద్ధంలో మిసైల్స్‌కి సంకేతాలు ఆపే శత్రు సైనికుల ఆటలు కట్టించేలా ఉపయోగపడుతుందని ఈమె ప్రకటించింది.

  3.    Harshvardhan Kapoor  :  హర్షవర్ధన్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కొడుకు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 2016లో వచ్చిన మిర్జా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కానీ తోలి సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత విక్రమాదిత్య మొత్వానే తో కలిసి భావేష్ జోషి సూపర్ హీరో అనే సినిమా చేసాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ అభినవ్ బింద్రా లైఫ్ స్టొరీలో త్వరలో నటించబోతున్నాడు. మిర్జ్యా సినిమాకి గానూ ఉత్తమ నూతన నటుడిగా స్టార్ స్క్రీన్ అవార్డు, స్టార్ డస్ట్ అవార్డ్స్ గెలుచుకున్నాడు.

  4.    Prithvi Shaw : సచిన్ టెండూల్కర్ తర్వాత భార క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రిథ్వి షా పేరు క్రికెట్ ప్రేమికులoదరికీ తెలుసు. 2016-17లో రంజీ ట్రోఫీలో ముంబై టీంకు ఆడడంతో తన ఫస్ట్ క్లాసు క్రికెట్ స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత 2018లో వరల్డ్ కప్ సాధించిన అండర్ 19 టీం కు కెప్టెన్ గా ఉన్న షా తన అద్భుత ప్రదర్శనతో, నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించి విశ్వ విజేతగా నిలిపాడు. 2018లో వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా షా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు తన తోలి మ్యాచ్ లోనే సెంచరీ చేసి అతి చిన్న వయసులో ఆ ఘనత సాధించిన ఇండియన్ క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేసాడు. 2020లో న్యూ జీలాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా షా వన్ డే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

  5.    గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (జననం నవంబర్ 9, 1948) పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. “వినరో భాగ్యము విష్ణుకథ..”, “జగడపు చనువుల జాజర..”, “పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు..” వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియ రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించాడు. కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నాడు. 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరాడు. అన్నమయ్య సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరకు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన సభ్యుడిగా ఉన్నాడు. వివిధ స్థాయిలలో ఈ సంస్థను గొప్ప సాంసృతిక సంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశాడు. నాలుగు దశాబ్దాల నాదోపాసనలో సంపూర్ణ విశ్వాసంతో, అంకిత భావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించాడు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేశాడు. తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశాడు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించాడు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించాడు.

  6.    Priyanka Upendra  :కన్నడ హీరో ఉపేంద్ర తెలుసు కదా ‘రా’, ‘ఉపేంద్ర’, ‘స్టుపిడ్’ లాంటి విభిన్న సినిమాలతో విలక్షణ నటనతో ఆకట్టుకున్న నటుడు ఆయన భార్యే ఈ ప్రియాంక ఉపేంద్ర.  నవంబర్ 9, 1977లో కోల్కతాలో జన్మించారు.1998లో హోతాట్ బ్రిష్టి అనే బెంగాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత కన్నడలో కోతిగూబ అనే సినిమాలో నటించింది ఉపేంద్ర తో కలిసి రా, H2O అనే సినిమాల్లో కలిసి నటించాకా ఉపేంద్రను 2003లో పెళ్ళి చేసుకున్నారు. ప్రియాంక తన కెరీర్లో తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలి, తమిళ్, ఒడియ భాషల్లో కలిపి దాదాపు 40 సినిమాల్లో నటించింది.  


ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,050FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!