6.8 C
New York
Thursday, December 2, 2021

Famous People Born on November 11 | Boney Kapoor | Robin Uthappa | Shri Tv Wishes

Famous People Born on November 11 | Boney Kapoor | Robin Uthappa | Shri Tv Wishes

నవంబర్ 11  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Johnny Walker :  జానీవాకర్‌’ పేరు వింటే స్కాట్లాండ్‌కు చెందిన ఖరీదైన మద్యం గుర్తొస్తుంది. జానీవాకర్‌ పూర్తి పేరు బద్రుద్దీన్‌ జమాలుద్దీన్‌ ఖాజీ. నవంబర్‌ 11, 1920న మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో జన్మించారు.  అతడే రెండవతరం హిందీ సినిమాల్లో మూడు వందలకు పైగా హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రేడు ‘జానీవాకర్‌’. జానీవాకర్‌ పూర్తి పేరు బద్రుద్దీన్‌ జమాలుద్దీన్‌ ఖాజీ. పుట్టింది నవంబర్‌ 11, 1920న మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో.  ‘బాజి’ నటుడిగా తొలి సినిమా ఆ తర్వాత ‘ఆగ్‌ కా దరియా’ (1953) అనే సినిమాలో జానీవాకర్‌ నటించాడు. అందులో జానీవాకర్‌కు ‘జా చలి జా ఓ ఘటా’ అనే డ్యూయట్‌ కూడా వుంది. ఈ సినిమాలో జానీవాకర్‌ నటనకు మంచి పేరొచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు నటుడిగా ఎంత బిజీ అయిపోయాదంటే 1955లో జానీవాకర్‌ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి.  ‘మేరే మెహబూబ్‌’, ‘ప్యాసా’, ‘దిఖిదీ’, ‘నయా దౌర్‌’, టాక్సీ డ్రైవర్‌’, ‘చోరి చోరి’  ‘మెరైన్‌ డ్రైవ్‌’ జానీవాకర్‌ హాస్య నటుడిగా యెంతగా ప్రసిద్ధికెక్కాడంటే, 1957లో అతని పేరుమీదే ‘జానీవాకర్‌’ సినిమా వచ్చింది. అందులో జానీవాకరే హీరో. ‘మధుమతి’ సినిమాలో నటనకు జానీవాకర్‌కు తొలి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. 1968లో విడుదలైన ‘షికార్‌’ సినిమాలో అందించిన గంభీరమైన పాత్రకు జానీవాకర్‌ రెండవ ఫిలింఫేర్‌ బహుమతి గెలుచుకున్నాడు. ఆయన తన కెరీర్లో దాదాపు మూడు వందల సినిమాల్లో నటించాడు.

  2.       Mala Sinha  : ప్రత్యేకించి నక్షత్రాల్లా మెరిసిపోయే కళ్ళు, నేపాలీ సోయగం ఉట్టిపడుతూ అరవయ్యో శకంలో హిందీ, బెంగాలీ సినిమాలలో చిత్రరంగాన్ని శాసించిన అద్భుత అందాల తార మాలాసిన్హా. ఆరోజుల్లో మాలాసిన్హాకు వున్నంతమంది అభిమానులు మరేనటికీ లేరంటే నమ్మాలి. ఆమె సినిమాల్లో కన్నీళ్లు పెట్టుకుంటుంటే మహిళా అభిమానులు సినిమా హాల్లో యేడ్చేసేవారు ఆవిడే మాల సిన్హా నేపాల్ యువతి, తండ్రి ఆల్బర్ట్ సిన్హా ఆమె పుట్టింది 11 నవంబరు 1936 న కలకత్తాలో వారిది క్రిస్టియన్ కుటుంబం. మాలాసిన్హా కొన్ని బెంగాలీ సినిమాల్లో బాలనటిగా నటించేది చిన్నప్పుడే సంగీతాన్ని, నాట్యాన్ని అభ్యసించింది. ఆల్ ఇండియా రెడియోలో ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉంటూ తొలిరోజుల్లో పాటలు పాడేది, వివిధ భాషల నాటకాల్లో నటిస్తూ ఆమె పాటలు పాడేది. హీరోయిన్ గా తొలి సినిమా ‘రోషనార’ తరవాత ‘జోగ్ వియోగ్’, ‘చిత్రాంగద’, ‘ధూళి’ లాంటి బెంగాలి సినిమాల్లో నటించింది. మాలాసిన్హా నటించిన తొలి హిందీ సినిమా ‘బాద్షా’ సుహాగ్’ ఆ తర్వాత ‘రియాసత్’ ఏక్ షోలా’, ‘రంగీన్ రాతే’ ‘ప్యాసా ‘ఫూల్ బనే అంగారే’, ‘మర్యాదా’, ‘కర్మయోగి’’నయా జమానా ‘మర్యాదా’  ‘ధూల్ కా ఫూల్’ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది.  మాలాసిన్హా వంద సినిమాలకు పైగా నటించడం విశేషం. బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ‘జహా ఆరా’, ‘హిమాలయ్ కి గోద్మే’ సినిమాలలో నటనకు మాలాసిన్హాకు ఉత్తమ నటి పురస్కారాన్ని అందించారు. సిక్కిం ప్రభుత్వం ‘సిక్కిం సమ్మాన్’ పురస్కారాన్ని అందజేసింది. నేపాల్ ప్రభుత్వం మాలాసిన్హాను ఘనంగా సత్కరించింది. ఫిలింఫేర్, స్టార్ స్క్రీన్ సంస్థల తోబాటు కెల్వినేటర్ సంస్థ ఆమెకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ సంస్థ మాలాసిన్హా కు ‘సినీ ఐకన్’ బిరుదు ప్రదానం చేసింది.

  3.       Demi Moore :  ఆమె చిన్నప్పుడు మెల్లకళ్లతో బాధపడేది… దానికి సాయం కిడ్నీలు సరిగా పనిచేయలేదు… ఓ పక్క అనారోగాల మధ్య, శస్త్రచికిత్సల మధ్య బాల్యం గడించింది… ఓసారి అమ్మానాన్నల పెళ్లి సర్టిఫికెట్‌ కనిపించింది… అందులో తేదీ చూసి ఆశ్చర్యపోయింది… ఎందుకంటే అది తను పుట్టిన ఏడాది తర్వాతది… అమ్మని అడిగితే అప్పుడు తెలిసింది, తను ఇన్నాళ్లూ నాన్న అనుకుంటున్నది సొంత నాన్న కాదని, అసలు నాన్న తను పుట్టక ముందే అమ్మను వదిలేసి వెళ్లిపోయాడని… ఇలాంటి పరిస్థితుల్లో 16 ఏళ్లు వచ్చేసరికల్లా ఆ అమ్మాయి చదువు సైతం వదిలేసి ధైర్యంగా గడప దాటింది… మోడల్‌గా ప్రయత్నం చేసింది… టీవీల్లో నటించింది… ఆపై వెండితెర నటిగా మారి మేటి తారగా ఎదిగింది! ఈ కథంతా డెమీ మూర్‌ది. ‘బ్లేమ్‌ ఇట్‌ ఆన్‌ రియో’, ‘సెయింట్‌ ఎల్మోస్‌ ఫైర్‌’, ‘ఘోస్ట్‌’, ‘ఇన్‌డీసెంట్‌ ప్రొపోజల్‌’, ‘డిస్‌క్లోజర్‌’, ‘స్టిప్ర్‌టీజ్‌’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ‘నౌ అండ్‌ దెన్‌’, ‘‘ఇఫ్‌ దీజ్‌ వాల్స్‌ కుడ్‌ టాక్‌’, ‘జి.ఐ.జనే’ చిత్రాలకు నటిగా, నిర్మాతగానూ వ్యవహరించింది. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా డెమీ పేరు కెక్కింది. 

  4.       Leonardo DiCaprio : ఓ ప్రేమికడు… ఓ మానసిక రోగి… ఓ తుపాకీ వేటగాడు… ఓ మాదక ద్రవ్యాల వ్యసన పరుడు… ఇలాంటి పాత్రల్ని సమర్థవంతంగా, ప్రశంసనీయంగా పోషించిన నటుడు లియోనార్డో డికాప్రియో. ఇన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించిన చాలా అరుదైన నటుల్లో ఒకడిగా పేరు పొందాడితడు. ‘టైటానిక్‌’ సినిమాలో ఓ యువ ప్రేమికుడిగా గుర్తుండిపోయినా, అంతకు మించి పర్యావరణాన్ని ప్రేమించే మనసున్న వాడితడు. మొదట టీవీ సీరియల్స్‌లో మెప్పించి, ఆనక వెండితెరపై వెలిగాడు. ‘క్రిట్టర్స్‌3’, ‘దిస్‌ బాయిస్‌ లైఫ్‌’, ‘వాట్స్‌ ఈటింగ్‌ గిల్బర్ట్‌ గ్రేప్‌’, ‘ద బాస్కెట్‌బాల్‌ డైరీస్‌’, ‘రోమియో జూలియట్‌’లాంటి సినిమాల్లో నటించినా ‘టైటానిక్‌’ సినిమాతోనే అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మర్మోగిపోయింది. ‘ద మ్యాన్‌ ఇన్‌ ద ఐరన్‌ మాస్క్‌’, ‘క్యాచ్‌మీ ఇఫ్‌ యుకెన్‌’, ‘బ్లడ్‌ డైమండ్‌’, ‘ద డిపార్టెడ్‌’, ‘ఇన్‌సెప్షన్‌’లాంటి సినిమాల నటనలో విలక్షణతను చూపించాడు. ‘ద రివెనంట్‌’ (2015) సినిమాతో ఆస్కార్‌ సహా పలు అవార్డులు అందుకున్నాడు. లాస్‌ఏంజెలిస్‌లో 1974 నవంబర్‌ 11న పుట్టిన ఇతడిని, పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ఇచ్చిన వ్యక్తిగా ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

  5.       Boney Kapoor  : అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సంజయ్  కపూర్ ల పెద్దన్నబోనీ. ఈయన కుమారుడు అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ హీరో.  నవంబర్ 11, 1955న ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. బోనీ కపూర్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురిందర్ కపూర్ పెద్ద కుమారుడు బోనీ తమ్ముళ్ళు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ కూడా బాలీవుడ్ లో నటులు. బోనీ 1996 జూన్ 2న అందాల తార శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జాహ్నవి, ఖుషి.
  ఈయన కెరీర్ మొదట్లో కపూర్ ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సమంత వద్ద సహాయకునిగా పనిచేశారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా, బోనీ నిర్మాణంలో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా ఆయన కెరీర్ లో ప్రఖ్యాతమైన సినిమాగా నిలిచింది. బోని కపూర్ తన కెరీర్లో  బోణీ కపూర్ మొత్తం 28 సినిమాలు నిర్మాతగా చేసారు.

  6.       Robin Uthappa : రాబిన్ ఊతప్ప ఇండియన్ క్రికెటర్ నేడు ఆయన పుట్టిన రోజు. 1985 నవంబర్ 11 న కర్ణాటక లోని కొడగులో జన్మించిన రాబిన్ ఉత్తప్పకు చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఇష్టం ఉండేది. 2005లో కర్నాటక కు ఫస్ట్ క్లాసు క్రికెట్ ఆడటం ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత 2006లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్ డే మ్యాచ్ ఆడటం ద్వార ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. తన కెరీర్లో మొత్తం 46 మ్యాచ్ లు ఆడి 934 పరుగులు చేసాడు వీటిలో 5 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి. 13 T20 లు ఆడి 249 పరుగులు చేసాడు. IPLలో రాజస్తాన్ రాయల్స్ టీం తరపున ఆడుతున్నాడు.    


ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!