17.7 C
New York
Tuesday, October 19, 2021

Famous People Born on October 01 | Allu Ramalingaiah | Sivaji Ganesan | Shri Tv Wishes

అక్టోబర్ 1  మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

 హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.    Allu Ramalingaiah :  అల్లు రామలింగయ్య ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు నేడు ఆయన జన్మదినం. ఈయన పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. చిన్నప్పుడు నాటకాలను బాగా చూసేవారు. ఒకసారిభక్త ప్రహ్లాదఅనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. వేషాన్ని అదురూ బెదురూ లేకుండా రక్తి కట్టించారు రామలింగయ్య. మొదట డబ్బులు ఎదురిచ్చి నాటకాల్లో వేషాలు సంపాదించడంతో రామలింగయ్య నట జీవితం మొదలైంది. 1952లో వచ్చిన పుట్టిల్లు అనేది ఈయన నటించిన మొదటి సినిమాపల్లెపడుచు’ (1954) చిత్రంలో నటించాక రామలింగయ్యకు విజయావారిమిస్సమ్మ’, అన్నపూర్ణావారి ప్రధమ చిత్రందొంగరాముడుసినిమాలలో అవకాశం వచ్చింది. ఇక అటు నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు 1960లో అల్లు రామలింగయ్య చిత్రసీమలో నిలదొక్కుకొని హాస్యపాత్రలు, హాస్యంతో కూడిన విలన్‌ పాత్రలు పోషిస్తూ మాయాబజార్, మూగమనసులు, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, శంకరాభరణం, అందాలరాముడు, బుద్ధిమంతుడు, ప్రేమించి చూడు వంటి సినిమాలలో రామలింగయ్యకు అద్భుతమైన పాత్రలు దొరకడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరిర్లో ఈయన మొత్తం 1030 సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసారు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే అల్లు రామలింగయ్య కెరీర్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. భారత ప్రభుత్వం 1990లో ఆయనకుపద్మశ్రీపురస్కారాన్ని అందజేసింది. 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకరఘుపతి వెంకయ్యఅవార్డుతో రామలింగయ్యను సత్కరించింది. ఆయన కాంస్య విగ్రహాన్ని సొంతవూరు పాలకొల్లులోను, విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ రోడ్డులోను ప్రతిష్టించారు. భారత తపాలా శాఖ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. నృత్య కళామండలి వారు రామలింగయ్యకు ‘‘హాస్య కళా ప్రపూర్ణ’’ అనే బిరుదు ప్రసాదించారు. రామలింగయ్య నిర్మాతగా మారి 1972లోగీతా ఆర్ట్స్సంస్థను నెలకొల్పారు. ’బంట్రోతు భార్య’, ‘దేవుడే దిగివస్తే’, ‘బంగారు పతకంవంటి చిత్రాలు నిర్మించారు. తర్వాత కుమారుడు అల్లు అరవింద్‌ తండ్రి ప్రస్థానం కొనసాగిస్తూ మంచి సినిమాలు నిర్మిoచారు.

  2.    Julie Andrews  :  జులీ ఆండ్రూస్‌ ప్రముఖ ఇంగ్లీష్ నటి నేడు ఆవిడ జన్మదినం. ఇంగ్లండ్‌లో 1935 అక్టోబర్‌ 1 పుట్టిన ఈవిడ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. కింగ్‌ జార్జి, క్వీన్‌ ఎలిజెబెత్‌ సమక్షంలో ప్రదర్శన ఇచ్చింది. ఆపై రేడియో, టీవీ, నాటక రంగాలు ఆమె ప్రతిభకు స్వాగతం పలికాయి. డిస్నీ వారి సినిమామేరీ పాపిన్స్‌సినిమా ఘన విజయంతో ఆమె పేరు మార్మోగిపోయింది తొలి సినిమాతోనే ఆస్కార్‌ అందుకుంది. అమెరికనైజేషన్‌ ఆఫ్‌ ఎమిలీ’, ‘హవాయి’, ‘టోర్న్‌ కర్టెన్‌’, ‘థరౌలీ మోడర్న్‌ మిల్లీ’, ‘స్టార్‌’ ‘డ్యూ ఫర్‌ వన్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. పిల్లల కోసం ఎన్నో కథలు రాసింది. ‘హోమ్‌: మెమోయిర్‌ ఆఫ్‌ మై ఎర్లీ ఇయర్స్‌పేరుతో ఆత్మకథ రాసింది. జులీ తన కెరీర్లో గాయనిగా, నాటక టీవీ రంగాల్లో నటిగా, రచయితగా ఎదిగి వెండితెరను ఏలి ఆస్కార్‌ సహా అనేక అవార్డులు అందుకుంది బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చేమోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌పురస్కారాన్ని అందుకుంది.

  3.    Brie Larson :  బ్రీ లార్సన్‌ ప్రముఖ హాలీవుడ్ నటి నేడు ఆవిడ జన్మదినం. కాలిఫోర్నియాలో 1989 అక్టోబర్‌ 1 పుట్టిన లార్సన్ తన చిన్నతనంలోనే ఏవేవో కథలు రాసి, కారు షెడ్డులో తోటి పిల్లల చేత పాత్రలు వేయించి కెమేరాతో షూట్‌ చేసేది! ఆరేళ్ల కల్లా సినిమాల్లోకి వెళ్లానంటూ అమ్మానాన్నలకు చెప్పేసింది! వయసులోనే ప్రముఖ యాక్టింగ్‌ స్కూలులో సీటు సంపాదించేసింది! పదకొండేళ్లకల్లా బుల్లితెరపై అరంగేట్రం చేసేసింది! పదహారేళ్లకల్లా గాయనిగా ఆల్బమ్‌ విడుదల చేసింది! పదిహేడేళ్ల వయసులోనే వెండితెరపై మెరిసింది! పాతికేళ్లకల్లా ఆస్కార్‌ అవార్డు కొట్టేసింది! 28 ఏళ్లకు దర్శకురాలైపోయింది! ‘13 గోయింగ్‌ ఆన్‌ థర్టీన్‌చిత్రంతో వెండితెరపైకి చిన్న పాత్రతో మొదలైయనికార్న్‌ స్టోర్‌’, ‘బాస్మతి బ్లూస్‌’ ‘కెప్టెన్‌ మార్వెల్‌లాంటి సినిమాల్లో తన సత్తా చాటింది. సంవత్సరం ఏప్రిల్‌ నెల్లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా విజయఢంకా మోగించినఅవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌లో కరోల్‌ డాన్‌వెర్స్‌ పాత్రలో నటించి మెప్పించింది.

  4.    Ramana Reddy :  రమణ రెడ్డి ప్రముఖ తెలుగు హాస్య నటుడు నేడు ఆయన జన్మదినం. ఈయన అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి 1951లో వచ్చిన మానవతి ఈయన మొదటి సినిమా. తర్వాత బంగారుపాప, మిస్సమ్మ, మాయా బజార్, గుండమ్మ కథ, రోజులు మారాయి చిత్రాలతో మంఛి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాల్లో అల్లు రామ లింగయ్య రమణ రెడ్డి జోడీ కామెడీ బాగా సక్సెస్ అయ్యింది. తన 24 ఏళ్ళ కెరీర్లో రమణ రెడ్డి మొత్తం 200 సినిమాలకు పైగా నటించారు. 1957 లో తెలుగులో వచ్చిన అక్కా చెల్లెళ్ళు అనే సినిమాలో మేజిషియన్ పాత్ర చేయాల్సి వచ్చినప్పుడు పాత్ర కోసం ఆయన నిజంగానే మ్యాజిక్ నేర్చుకున్నారు.

  5.      Sivaji Ganesan : ‘నడిగర్ తిలకంశివాజీ గణేశన్ ప్రముఖ తమిళ సినీ నటుడు నేడు ఆయన జన్మదినం. ఈయన అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే గణేశన్ కుకట్ట బ్రహ్మన్నవీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి నాటకాన్నికంబళత్తాన్ కూత్తుఅనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు, నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. నాటకాల మీద ఆసక్తిని గమణించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీనిశ్రీ బాలగానసభఅనే నాటకాల కంపెనీలో చేర్చింది.
  శివాజీ నేషనల్ పిక్చర్స్ వారిపరాశక్తిద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కీ.శే.అణ్ణాదురై అండతో సినిమా మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు.
  తమిళ్ మూడువందలకు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో అలరించారు అలా  తెలుగులో పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, పరాశక్తి, బొమ్మలపెళ్ళి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు లాంటివి ఉన్నాయి. తెలుగులో ఆయనకు జగ్గయ్య డబ్బింగ్ చెప్పే వారు.  తమిళంలో బి.ఆర్.పంతులు తీసినకర్ణన్చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆచిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో శివాజీని అలెగ్జాండర్ గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ప్రేమ్ నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టివసంత మాళిగైపేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు. ఆయన కెరీర్లో నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లభించాయి. భారత ప్రభుత్వం ఈయనకు 1997లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చింది. శివాజీ రాజకీయాల్లోకి కూడా వెళ్ళినప్పటికీ అక్కడ సక్సెస్ అవలేకపోయారు.

  6.Richard Harris :  రిచర్డ్‌ హ్యారిస్‌ ప్రముఖ ఐరిష్ నటుడు, గాయకుడు నేడు ఆయన పుట్టిన రోజు. ఐర్లాండ్‌లో 1930 అక్టోబర్‌ 1 పుట్టిన హ్యారిస్‌ యువకుడిగా ఉన్నప్పుడు రగ్బీ, అథ్లెటిక్స్‌ లాంటి క్రీడల్లో బాగా రాణించేవాడు. టీనేజిలో ఉండగా అనూహ్యంగా క్షయ వ్యాధి సోకడంతో క్రీడలకు దూరమయ్యాడు. వ్యాధి నుంచి కోలుకున్నాక సినీ రంగం అతడిని ఆకర్షించింది. దర్శకత్వ రంగంలో ప్రవేశిద్దామన్నా, నటుడిగా ప్రయత్నిద్దామన్నా ఆడిషన్‌ దశలోనే ఫెయిల్‌ అయ్యాడు. దశలో నాటకాలే అతడికి దారి చూపించాయి. అయితే అక్కడా నాటకానికి స్వయంగా నిర్వహణ, దర్శకత్వం చేసినా అది జనాదరణ పొందక పోవడంతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అయినా నాటకరంగాన్నే నమ్ముకుని ఎలాంటి చిన్న పనులైనా చేస్తూ పదేళ్లు గడిపాడు. మధ్యలో గాయకుడిగా కొన్ని ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. అలా పదేళ్లు గడిపాక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. అయితేగ్లాడియేటర్‌సినిమాలో ఎంపరర్‌ మార్కస్‌ ఆరెలియస్‌ అనే పాత్రతో హ్యారీపాటర్సినిమాల్లో ఆల్బస్‌ డంబుల్‌డోర్‌ పాత్రతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడిగా ఎదిగాడు. గోల్డెన్‌గ్లోబ్, కేన్స్, గ్రామీ లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు. ‘గన్స్‌ ఆఫ్‌ నవరోన్‌’, ‘ ఫాల్‌ ఆఫ్‌ రోమన్‌ ఎంపైర్‌’, ‘ టెరిబుల్‌ బ్యూటీ’, ‘దిస్‌ స్పోర్టింగ్‌ లైఫ్‌’, ‘ హవాయి’, ‘కేమ్‌లట్‌’, ‘ మ్యాన్‌ కాల్డ్‌ హార్స్‌’, ‘క్రామ్‌వెల్‌లాంటి సినిమాలతో మంచి నటుడనిపించుకున్నాడు. ఐరిష్ టైమ్స్ ఐర్లండ్స్ గ్రేటెస్ట్ ఆక్టర్స్ ఆఫ్ అల్ టైం లిస్టు లో 3 స్థానంలో నిలిచాడు. తన కెరీర్లో ఒక గ్రామీ అవార్డు తో పాటు ఎన్ని యురోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు.     

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,988FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!