3 C
New York
Saturday, December 4, 2021

Famous People Born on October 05 | Kancha Ilaiah | Rama Prabha | Kate Winslet | Shri Tv Wishes

అక్టోబర్ 5 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. 1.       Kate Winslet  :  టైటానిక్ హీరోయిన్ కేట్‌ విన్‌స్లెట్‌ పుట్టిన రోజు రోజు. 1975 అక్టోబర్‌ 5 పుట్టిన కేట్‌విన్‌స్లెట్‌ది ఒక విధంగా నట కుటుంబమనే చెప్పవచ్చు. అమ్మమ్మ, తాతయ్య నాటకరంగంలో నటులు. తండ్రి కూడా చిన్నా చితకా పాత్రలు వేసేవాడు. స్కూల్లో చదువుకునేప్పుడే అక్కలతో కలిసి అయిదేళ్ల వయసులోనే స్టేజి ఎక్కింది కేట్‌. పదకొండేళ్లకి యాక్టింగ్‌ స్కూలుకి ఎంపికైంది.
  పక్క వ్యాపార ప్రకటనలకు మోడలింగ్‌ చేస్తూ, పదహారేళ్లకల్లా టీవీలో మెరిసింది. ‘హెవెన్లీ క్రియేచర్స్‌’ (1994) సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కేట్, ఆపైసెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ’ (1995)తో బాఫ్తా అవార్డు అందుకుంది. ‘టైటానిక్‌’ (1997) సినిమాతో ఆమె స్టార్‌డమ్‌ అందుకుంది. తరువాతక్విల్స్‌’, ‘ఐరిస్‌’, ‘ఎటర్నల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ స్పాట్‌లెస్‌ మైండ్‌’, ‘ఫైండింగ్‌ నెవెర్‌ లాండ్‌’, ‘లిటిల్‌ చిల్డన్ర్‌’, ‘రివల్యూషనరీ రోడ్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ‘ రీడర్‌’ (2008) సినిమాతో ఉత్తమ నటిగా బాఫ్తా, ఆస్కార్‌ అవార్డులు అందుకుంది. 2011లోకార్నేజ్‌’, 2013లోమూవీ 43’, ‘లబోర్‌ డే’,లాంటి చిత్రాల్లో నటించారు. ‘టైటానిక్‌చిత్రం విజయం తరువాత దర్శకుడు జిమ్‌ ఎడ్వర్డ్‌ ట్రిప్లీటన్‌ను 1998లో పెళ్లి చేసుకొంది. అమెరికా వినోద పరిశ్రమలో టీవీ, రికార్డింగ్, సినిమా, నాటక రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు ఇచ్చే ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డులన్నింటినీ అందుకున్న అరుదైన కళాకారుల్లో కేట్‌విన్‌స్లెట్‌ ఒకరు. వీటితో పాటు మూడు బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులు, అనేక ప్రశంసలతో పాటు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చేమోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌అవార్డు లను గెలుచుకుంది.

  2.       Rama Prabha : రమా ప్రభ ప్రముఖ తెలుగు సినీ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. ఈవిడ అక్టోబర్ 5 అంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించారు. తనకు 4 సంవత్సరాల వయసులో తమిళ సినిమా ద్వారా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తరువాతచిలకా గోరింకాఅనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆవిడ తెలుగులో ఎక్కువగా హాస్య పాత్రలు వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాట తెలుగు సినిమాల్లో రమాప్రభ, రాజబాబు లది సూపర్ హిట్ కామెడీ పెయిర్ వీళ్లిద్దరూ కలిసి రెండు, మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. రమా ప్రభ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ సినిమాలలో కూడా నటించారు. తన మొత్తం కెరీర్లో ఆవిడ ఇప్పటి వరకు 14౦౦ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

  3.       Kancha Ilaiah :  కంచ ఐలయ్య ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక కార్యకర్త నేడు ఆయన పుట్టిన రోజు. 1952, అక్టోబరు 5 వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం లోని పాపయ్యపేట గ్రామంలో జన్మించారు. ఐలయ్య గౌతమబుద్ధుని రాజకీయ తత్త్వంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రాజనీతిశాస్త్రంలోడాక్టరేటు పొందాడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగపు అధ్యక్షుడు. భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈయనను అనేకమంది విమర్శకులు  హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారు అయితే  తాను హిందూ మతాన్ని ద్వేషిస్తానని ఐలయ్య స్వయంగా చెప్పుకున్నాడు. ఐలయ్య ఇంగ్లీషులో “Why I am not a Hindu?” పేరుతో వ్రాసిన పుస్తకం తెలుగులో నేను హిందువు నెట్లయిత? అనే పేరుతో ప్రచురితమయ్యింది. బుక్ తర్వాత అనే వివాదాలకు గురయ్యింది.

  4.    Madhurantakam Rajaram  :  మధురాంతకం రాజారాం (అక్టోబర్ 5, 1930 – ఏప్రిల్ 1, 1999) ప్రముఖ తెలుగు కథకులు ఈరోజు ఆయన జన్మదినం. చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో 1930, అక్టోబర్ 5 ఆదిలక్ష్మమ్మ, విజయరంగం పిళ్ళై దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఒక ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. 1945 లో చిత్తూరులోని జిల్లా బోర్డు హైస్కూలు (ప్రస్తుతం పి. సి. ఆర్ కళాశాల) నుంచి ఎస్. ఎస్. ఎల్. సి పూర్తి చేశాడు. చదువుకునే రోజుల నుంచి ఆయన సాహిత్యం పట్ల అభిరుచి కలిగి ఉండేవాడు రాజారాం వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ముందు గేయ రచయితగా తన రచనా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు. ఎన్నో గొప్ప తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన కథలు అనేకం తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనువాదించారు. ఈయన రాసిన చిన్ని ప్రపంచంసిరివాడ అనే నవల రష్యన్ భాషలోకి ట్రాన్స్ లేట్ చేయబడి ప్రచురితమైంది. 1968లో ఆయనకు ఉత్తమ కథకుడిగా సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది, 1993 లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

  5.  Adil Hussain :  ఆదిల్ హుస్సేన్ ప్రముఖ భారతీయ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. ఈయన అక్టోబర్ 5, 1963లో అస్సాంలో జన్మించారు. ఆదిల్ హుస్సేన్ కు చిన్నప్పటి నుంచే తమ స్కూల్ లో నాటాకాలు వేసారు. తర్వాత కాలేజీ లోకి వచ్చేసరికి స్టాండప్ కమెడియన్ గా మారారు. తర్వాత హేన్గుల్ ధియేటర్ అనే నాటక సంస్థలో చేరి అనేక సంవత్సరాలు నాటకాల్లో నటించాకా 2004లో శ్రీకాంత అనే బెంగాలి సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు. హిందీలో చేసిన కమినే, ఇశ్కియా, శ్రీదేవితో చేసిన ఇంగ్లీష్ విన్గ్లిష్ సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అస్సామీ భాషలో కుడా ఈయా అనేక సినిమాలు చేసారు. లైఫ్ ఆఫ్ పై అనే ఇంగ్లీష్ సినిమాలో చేసారు.  ఆదిల్ హుస్సేన్ తన కెరీర్లో హిందీ, బెంగాలి, అస్సామీ, బెంగాలి దాదాపు 80 సినిమాల్లో నటించారు.

  6.  Pujita Ponnada : పూజిత పోన్నాడా ప్రముఖ తెలుగు సినిమా నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. పూజిత అక్టోబర్ 5, 1989లో విశాకపట్నంలో జన్మించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన పూజిత సినిమాల మీద ఇష్టంతో ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత తెలుగులో దర్శకుడు అనే సినిమాతో తన సినీ కెరీర్ స్టార్ట్ చేసారు. తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం లోనూ నటించారు. పూజిత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి సినిమాల్లో మంచి పాత్రలు చేసి వేర్ ఇజ్ వెంకట లక్ష్మి అనే సినిమాతో హీరోయిన్ గా మారింది

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!