11.3 C
New York
Saturday, October 23, 2021

Famous People Born on October 11 | Amitabh Bachchan | Hardik Pandya | Shri Tv Wishes

అక్టోబర్ 11  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Salur Rajeswara Rao : సాలూరు రాజేశ్వరరావు  ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు నేడు ఆయన పుట్టిన రోజు. విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో వుండే శివరామపురంలో జన్మించారు. రాజేశ్వరరావుకు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి వుండేది. ‘జయప్రద’ ఆయన మొదటి సినిమా, రాజేశ్వరరావు ‘ఇల్లాలు’ సినిమాలో తొలిసారి ప్లేబ్యాక్‌ పద్ధతి ప్రవేశపెట్టారు. ‘జీవన్ముక్తి’ (1942), ‘బాలనాగమ్మ‘చంద్రలేఖ’(1946) అపూర్వ సహోదరులు’, ఆ చిత్ర హిందీ వర్షన్‌ ‘నిషాన్‌’ (1950) మల్లీశ్వరి ‘విప్రనారాయణ’మిస్సమ్మభక్త ప్రహ్లాద’‘చెంచులక్ష్మి’రంగులరాట్నం’, ‘బంగారు పంజరం, అమరశిల్పి జక్కన్న, ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మగౌరవం’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘ఆత్మీయులు’, పి.ఎ.పి. వారి ‘భార్యాభర్తలు’, ఇద్దరు మిత్రులు’, ‘ఆరాధన’, ‘ఆత్మగౌరవం’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘ఆత్మీయులు’, పి.ఎ.పి. వారి ‘భార్యాభర్తలు’, పవిత్ర బంధం, కురుక్షేత్రం, తాండ్ర పాపా రాయుడు లాంటి ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం అందించారు. రాజేశ్వరరావు 150 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు.

  2.       Amitabh Bachchan  :  అమితాబ్ బచ్చన్ ప్రముఖ హిందీ సినిమా నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. అమితాబ్ అసలు ఇంటిపేరు శ్రీవాత్సవ. 1969లో ‘సాత్ హిందుస్తానీ’ మొదటి సినిమా 1971లో వచ్చిన ఆనంద్ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. తొలి బ్రేక్ ఇచ్చిన సినిమాగా ‘బాంబే టు గోవా’ నిలిచింది. తొలి బ్రేక్ ఇచ్చిన సినిమాగా ‘బాంబే టు గోవా’ నిలిచింది. 1973 లో ‘జంజీర్’ సినిమా అమితాబ్ ను ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ గా నిలబెట్టింది  1975 లో వచ్చిన దీవార్ షోలే ‘అమర్ అక్బర్ ఆంథోని ‘త్రిశూల్ డాన్ ‘మిస్టర్ నట్వర్ లాల్’, ‘కాలా పత్తర్’, ‘దోస్తానా’, ‘లావారిస్ ‘షెహన్ షా ఖుదా గవా’సినిమాలతో హిందీ సినిమాల్లో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్’ (ABC) స్థాపించి సినిమాల నిర్మాణం, పంపిణీ, ఆడియోల విడుదల వంటి కమర్షియల్ వ్యాపారం మొదలుపెట్టారు 2000నుంచి సపోర్టింగ్ పాత్రలు, వైవిధ్య మైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఆ తర్వాత ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవీ ప్రోగ్రాం చేసారు అది దేశ వ్యాప్తంగా పెద్ద హిట్ అయ్యింది. తన కెరీర్లో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు. ఆయనకు 15 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి.   లండన్, న్యూయార్క్, హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, ఢిల్లీ నగరాలలోని మేడం టుస్సాడ్ మ్యూజియంలలో అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మలను ఆవిష్కరించారు. 2011లో పద్మభూషణ్, 2015 లో పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలను భారతప్రభుత్వం ప్రదానం చేసింది. ఫ్రెంచ్ ప్రభుత్వం నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది.

  3.       Jayanthi  :  జయంతి ప్రముఖ భారతీయ సినీ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. జయంతి అసలు పేరు కమల కుమారి. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు.జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు.  తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్‌ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, కొండవీటి సింహం, దేవదాసు, కంటే కూతుర్నే కను, జస్టిస్ చౌదరి, బడిపంతులు, వంశానికొక్కడు, స్వాతి కిరణం, కొదమ సింహం, కొండవీటి సింహం, అమ్మ మనసు, భక్త ప్రహ్లాద, రాజా విక్కమార్క, ఘరానా బుల్లోడు, శారద లాంటి సినిమాల్లో నటించారు. జయంతి తన కెరీర్లో మొత్తం ఏడు కర్ణాటక స్టేట్ అవార్డ్స్, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్గెలుచుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఆవిడను అభినయ శారదే అన్న బిరిదుతో సత్కరించింది.

  4.       Hardik Pandya : హార్దిక్ పాండ్యా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ నేడు ఆయన పుట్టిన రోజు. ఇతను  అక్టోబర్ 11, 1993లో గుజరాత్ లోని సూరత్ లో జన్మించాడు. ఇతను ముందు బరోడా క్రికెట్ టీంకు ఆడడం స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత 2015 లో జరిగిన IPL మ్యాచ్ లలో అద్భుతంగా రాణించడం ద్వారా 2016 లో ఆస్ట్రేలియా తో టీ20 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత 2016లో న్యూజీ ల్యాండ్ తో సిరీస్ కు వన్ డే టీం లో చోటు దక్కించుకున్నాడు. మళ్ళీ 2016లోనే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోకి జట్టులోకి టీసుకున్నా తుది జట్టులో ఆడలేదు. చివరికి 2017లో శ్రీ లంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.. తన అద్భుత ఆటతీరుతే అనతికాలంలోనే అన్ని ఫార్మాట్లో కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్లో పాండ్యా ఇప్పటి వరకు మొత్తం 45 వన్ డే లు ఆడి 757 పరుగులు చేసి 45 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే మొత్తం 11 టెస్ట్ లు ఆడి 532 పరుగులు చేసి 17 వికెట్స్ తీసుకున్నాడు. T20 లలో 38 మ్యాచ్ లు ఆడి 296 పరుగులు చేసాడు 36 వికెట్స్ తీసుకున్నాడు.IPL లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.

  5.       Nivin Pauly  :  నివిన్ పౌలీ ప్రముఖ మలయాళ సినిమా నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. 009లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మలర్వాడీ ఆర్ట్స్ క్లబ్ సినిమా ఆడిషన్స్ కు హాజరైన నివిన్ హీరోగా ఎంపికయ్యారు, నటుడు దిలీప్ ఈ సినిమాను నిర్మించారు జూలై 2010లో విడులైంది ఈ చిత్రం. ఆ తరువాత కొన్ని చిన్న పాత్రలు, అతిథి పాత్రలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.  నివిన్ మళ్ళీ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన తట్టతిన్ మరయాదు (2012) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నేరం (2013), 1983 (2014), ఓం శాంతి ఓషానా (2014), బెంగళూర్ డేస్ (2014), ఒరు వడక్కన్ సెల్ఫీ (2015), ప్రేమమ్ (2015), యాక్షన్ హీరో బిజు (2016) సినిమాలతో మలయాళం లో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నారు. 2015 లో వచ్చిన ప్రేమమ్ సినిమా సంచలన విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తమిళ్ లో నేరం (2013) సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నూతన నటుడిగా అవార్డ్ అందుకున్నారు. 2015లో బెంగళూర్ డేస్, 1983 చిత్రాలకుగానూ కేరళ స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. 2016 లో వచ్చిన ఆక్షన్ హీరో బిజు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

  6.       Luke Perry  : ల్యూక్‌ పెర్రీ ప్రముఖ హాలీవుడ్ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. అమెరికాలో 1966 అక్టోబర్‌ 11న పుట్టిన పెర్రీ, చిన్నతనంలో నిలదొక్కుకోడానికి నానా కష్టాలూ పడ్డాడు. ఎవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అరకొర సంపాదనతో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడే అతడి దృష్టి నటనపై పడిందిముందు ‘బెవెర్లీ హిల్స్‌’ టీవీ సీరియల్‌లో డైలన్‌ మెకే పాత్ర ద్వారా ‘టీన్‌ ఐడల్‌’గా యువతను ఆకట్టుకున్నాడు. ఇంకా ఎన్నో టీవీ కార్యక్రమాల ద్వారా అలరించాడు, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ‘బఫీ ద వాంపైర్‌ స్లేయర్‌’, ‘8 సెకండ్స్‌’, ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’, ‘టెర్మినల్‌ బ్లిస్‌’, ‘ఇన్వేషన్‌’, ‘రియోట్‌’, ‘స్టార్మ్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!