10.4 C
New York
Saturday, October 23, 2021

Famous People Born on October 12 | Sneha | Akshara Hasan | Shri Tv Wishes

అక్టోబర్ 12  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Sneha  :  . స్కిన్ షోలకు దూరంగా ఉంటూ మంచి సినిమాలు చేసి సావిత్రి, సౌందర్యలు ఎలాగైతే మెప్పించారో.. ఆ తరువాత వచ్చిన స్నేహ కూడా అలానే ముందుకు వెళ్లింది. ఆమె పుట్టిన రోజు ఈరోజు. ముంబైలో పుట్టి దుబాయ్ లో పెరిగి 2000 సంవత్సరంలో మలయాళంలో ఓరు నీల పక్షి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత 2001లో ప్రశాంత్ సినిమా చేసింది. ప్రశాంత్ చేసిన సినిమా పర్వాలేదనిపించింది.  ఈ సినిమా తరువాత స్నేహకు తెలుగులో తొలివలపు సినిమాతో అవకాశం వచ్చింది.  ఆ సినిమా మంచి విజయం దక్కించుకుంది.  స్నేహ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ఆ తరువాత వరసగా ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారథి, మధుమాసం, సంక్రాంతి, వెంకీ, పాండురంగ వంటి సినిమాలు చేసింది.  పాండురంగ సినిమా తరువాత వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.  ఓ బిడ్డకు తల్లైన తరువాత స్నేహ మరలా తెలుగులో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.  కాగా, ఇప్పుడు స్నేహ రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నది.  దీంతో స్నేహ మరలా సినిమాలకు దూరంగా ఉన్నది.   పద్ధతైన పాత్రల్లోనే మెరిసిన ఆమె, ‘శ్రీరామదాసు’, ‘రాధాగోపాలం’, ‘పాండురంగ’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టారు. ‘రాధా గోపాలం’ సినిమాకిగాను నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారాన్ని అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలలో కలిపి స్నేహ ఇప్పటివరకు 75 సినిమాలపైగా నటించింది. సినిమాలతో పాటు, బుల్లితెరపై కూడా మెరిశారు, పలు రియాలిటీ షోలకి వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.  

  2.       Akshara Haasan : అక్షర హాసన్ ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. అక్షర హాసన్ ప్రముఖ తమిళ నటుడు కమల్ హసన్ రెండో కూతురు అక్టోబర్ 12, 1991లో చెన్నైలో జన్మించారు. అక్షర హసన్ ముందు సొసైటీ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు ఆ తర్వాత బొంబాయిలో పలు సినిమాలకు,  యాడ్స్ కు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. 2015లో శమితాబ్ అనే సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఇందులో ఆవిడ అమితాబ్ బచ్చన్, తమిళ హీరో ధనుష్ లతో కలిసి నటించింది, అలాగే హీరో అజిత్ తో వివేగం అనే తమిళ సినిమాలో నటించింది.

  3.       Soubin Shahir : సౌబిన్ శాహిర్ ప్రముఖ మలయాళ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. సౌబిన్ శాహిర్ అక్టోబర్ 12, 1983లో కేరళలోని కోచిలో జన్మించారు. ఈయన తండ్రి బాబు శాహిర్ సినిమా ఇండస్ట్రీ లోనే ప్రొడక్షన్ కంట్రోలర్ గా పని చేసే వారు. 2003లో వచ్చిన క్రానిక్ బాచిలర్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు క్రానిక్ బాచిలర్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. ఆ తర్వాత ప్రముఖ మలయాళ దర్శకులు ఫాజిల్, సిద్దికి, పి.కుమార్, సంతోష్ శివన్, రాజీవ్ రవి లాంటి వారి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసారు. 2015లో వచ్చిన ప్రేమమ్ సినిమాలో నటించాడు ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నటుడిగా చార్లీ, మహిషింతే ప్రతీకారం, కాళీ,కమ్మాటి పాదం, వెళ్ళo, మాయానది, కామ్రేడ్ ఇన్ అమెరికా, కుంబలంగి నైట్స్ సినిమాలతో నటుడిగా బిజీ అయ్యారు. 2018 లో వచ్చిన సుడాని ఫ్రo నైజీరియా అనే సినిమాలో హీరోగా నటించాడు ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ స్టేట్ అవార్డు గెలుచుకున్నారు. 2017లో పరవ అనే సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. అంబిలి, వికృతి, ఆండ్రాయిడ్ కున్జప్పాన్ అనే సినిమాల్లో హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.

  4.       Rukhsar Dhillon  :  రుఖ్సర్ ధిల్లాన్ ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. రుఖ్సర్ ధిల్లాన్ అక్టోబర్ 12, 1993లో జన్మించారు. 2016లో రన్ అంటోనీ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. 2017లో ఆకతాయి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2018లో నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఆ తర్వాత అల్లు శిరీష్ తో కలిసి ABCD అనే సినిమాలో నటించింది. 2020లో భాంగ్రా పా అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

  5.        P. S. Ramakrishna Rao :  పి.యస్.రామకృష్ణారావు ప్రముఖ  తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు ఈరోజు ఆయన జన్మదినం. 1918, అక్టోబర్ 12 న కర్నూలులో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్గా మా రాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబుల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.
  హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి భానుమతిని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఇద్దరు కలిసి భరణి పిక్చర్స్ స్థాపించారు రామకృష్ణ దర్శకునిగా గృహలక్ష్మి, వివాహ బంధం, అనుబంధాలు, ఆత్మబంధువు, బాటసారి, కణల్ నీర్,  శభాష్ రాజా, మనమగళ్ థెవై, వరుడు కావాలి, చింతామణి, విప్రనారాయణ, చక్రపాణి, బ్రతుకు, కాథల్, ప్రేమ, లైలా మజ్ఞు, రత్నమాల అనే సినిమాలు చేసారు.

  6.       VIJAY Merchant : విజయ్ మర్చంట్ ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1911, అక్టోబర్ 12న జన్మించిన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 71.64 సగటును కలిగియుండి ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ తరువాత అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
  విజయ్ మర్చంట్ 10 టెస్టులు ఆడి 47.72 సగటుతో 859 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 154 పరుగులు. ఈ స్కోరును అతని చివరి టెస్టులో ఇంగ్లాండుపై ఢిల్లీలో 1951-52లో సాధించాడు. ఇదే టెస్టులో ఫీల్డింగ్ చేయుసమయంలో దురదృష్టవశాత్తు భుజానికి గాయమై క్రికెట్ నుంచే రిటైర్ అయ్యాడు. 1937లో విజ్డెన్ ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన ఐదుగురిలో విజయ్ మర్చంట్ ఒకరు. అంతేకాదు భారతదేశం నుంచి టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌లలో విజయ్ ఒకడు. తన తొలి సెంచరీని 1951-52లో ఇంగ్లాండుపై 40 ఏళ్ళ వయసులో సాధించాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!