20.1 C
New York
Thursday, October 21, 2021

Famous People Born on October 13 | Ashok Kumar | Pooja Hegde | Hanuma Vihari | Shri Tv Wishes

అక్టోబర్ 13  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Ashok Kumar  :  అశోక్ కుమార్ ప్రముఖ భారతీయ సినీ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. అశోక్‌ కుమార్‌ అసలు పేరు కుముద్‌ లాల్‌ గంగూలీ. 1936లో‘జీవన్‌ నయా’ అతని మొదటి సినిమా ఈ సినిమా తర్వాత అశోక్‌ కుమార్‌ హీరోగా ఇక వెనకకు తిరిగి చూసుకోలేదు. ‘అచ్చుత్‌ కన్య’ ‘జన్మభూమి’, ‘ప్రేమ్‌ కహాని’, ‘నిర్మల‘, ‘బంధన్‌సావిత్రి’, ‘ఇజ్జత్‌’, ‘కంగన్‌’, ‘ఆజాద్‌అంజాన్‌’, ‘ఝూలా’, ‘కిస్మత్‌’ లాంటి సినిమాలతో స్టార్ట్ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత బాంబే టాకీస్ బ్యానర్ మీద ‘జిద్దినీల్‌ కమల్‌’మహల్‌ లాంటి సినిమాలు నిర్మించారు. తర్వాత క్యారక్టర్‌ ఆర్టిస్టుగా మారి. ‘కానూన్‌’,‘బందిని,’‘చిత్రలేఖ’  ‘జవాబ్‌’, ‘విక్టోరియా 203’సినిమాలు చేసారు. ‘జ్యువెల్‌ థీఫ్‌’ (1967), ‘ఆశీర్వాద్‌’ (1968) చిత్రాల్లో నటనకు అశోక్‌ కుమార్‌కు ఫిలింఫేర్‌ బహుమతులతోబాటు జాతీయ బహుమతి కూడా లభించింది. తన కెరీర్లో మొత్తం 275 సినిమాల్లో అశోక్‌ కుమార్‌ నటించారు. ఆయన మంచి చిత్రకారుడు, హోమియో వైద్యం చేసేవారు. ఈయనకు 1995లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచివేమేంట్ అవార్డు, 1999లో పద్మ భూషణ్ అవార్డ్లతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ లభించాయి.

  2.       Pooja Hegde  :  పూజా హెగ్డే ప్రముఖ భారతీయ మోడల్, నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. పూజ 2010లో జరిగిన మిస్ యూనివర్స్ విశ్వసుందరి పోటీలలో ఇండియా నుంచి పాల్గొని రెండో స్థానంలో నిలవడం ద్వారా గుర్తింపు వచ్చింది. దీని తరువాత 2012లో తమిళ సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. 2016లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యింది.  పూజా తెలుగులో అల్లు అర్జున్ తో చేసిన డి.జె., అల వైకుంటపురములో సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

  3.       Sacha Baron Cohen : సచా బారన్‌ కొహెన్‌ ప్రముఖ ఇంగ్లీష్ నటుడు, రచయిత,దర్శకుడు,నిర్మాత నేడు ఆయన పుట్టిన రోజు. ఇంగ్లండ్‌లో 1971 అక్టోబర్‌ 13న పుట్టిన ఇతగాడు డిగ్రీ పూర్తయిన తర్వాత నటనపై దృష్టి పెట్టి నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అలీ జీ’, ‘బోరట్‌ సగ్‌దియేవ్‌’, ‘బ్రూనో గెహార్డ్‌’, ‘ఎడ్మైరల్‌ జనరల్‌ అలాదీన్‌’ లాంటి పాత్రల ద్వారా అభిమానులకు గుర్తుండిపోయాడు. ‘మడగాస్కర్‌’, ‘టల్లాడిగా నైట్స్‌: ద బేలడ్‌ ఆఫ్‌ రికీ బాబీ’, ‘స్వీనీ టాడ్‌: ద డెమన్‌ బార్బర్‌ ఆఫ్‌ ఫ్లీట్‌ స్ట్రీట్‌’, ‘హగో’, ‘యాంకర్‌మేన్‌: ద లెజెండ్‌ కంటిన్యూస్‌’ ‘గ్రిమ్స్‌బీ’, ‘ఎలైస్‌ త్రూ ద లుకింగ్‌ గ్లాస్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆస్కార్‌ నామినేషన్‌ సహా బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి అవార్డులు అందుకున్నాడు. తన కెరీర్లో కేవలం నటుడిగానే కాకుండా రచయితగా దర్శకుడిగా కూడా బుల్లితెర, వెండితెరలపై తనదైన ముద్ర వేయగలిగాడు.

  4.        Abburi Chayadevi :  అబ్బూరి ఛాయాదేవి ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత నేడు ఆవిడ పుట్టిన రోజు. ఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు13లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. బోన్‌సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది. ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
  1993లో రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.

  5.       Ramesh Babu  :  ఘట్టమనేని రమేష్ బాబు ప్రముఖ తెలుగు సినీ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. ఈయన ప్రముఖ తెలుగు హీరో కృష్ణ కుమారుడు తన చిన్నతనం నుంచే తండ్రితో కలిసి అల్లూరి సీతారామ రాజు, దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు లాంటి అనేక సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసారు. 1987లో సామ్రాట్ అనే సినిమాతో హీరోగా మారారు ఆ తర్వాత దాదాపు 12సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత ప్రొడ్యూసర్ గా మారి మహేష్ బాబుతో అర్జున్, అతిధి, దూకుడు, ఆగడు లాంటి సినిమాలు చేసారు.  

  6.       Hanuma Vihari : హనుమ విహారి ప్రముఖ క్రికెటర్ నేడు ఆయన పుట్టిన రోజు. ఈయన  కాకినాడలో 1993, అక్టోబరు 13 న జన్మించాడు. 2013లో రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత IPLలో సన్ రిజేర్స్ హైదరాబా ద టీం కు ఆడి కొన్ని మ్యాచ్ లను తన అద్భుత ప్రదర్శనతో గెలిపించాడు. ఆ తర్వాత 2017-18లో జరిగిన రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేయడంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. టెస్టుల్లో 111 ఈయన అతుత్తమ స్కోర్. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!