7.5 C
New York
Friday, December 3, 2021

Famous People Born on October 31 | Vallabhai Patel | CK Nayudu | Karanam Balaram | Shri Tv Wishes

అక్టోబర్ 31 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు


హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Peter Jackson  :  ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకున్న ‘లార్స్‌ ఆఫ్‌ రింగ్స్‌’ ట్రయాలజీ సినిమాలను అందించిన వ్యక్తిగా పీటర్‌ జాక్సన్‌ గుర్తుండిపోతాడు. ఆ సినిమాలకు రచన, దర్శకత్వం, నిర్మాత కూడా అతడే. ఇదే కాక ‘హాబిట్‌’ ట్రయాలజీ సినిమాలకు కూడా అతడే సృష్టికర్త. ‘హెవెన్లీ క్రియేచర్స్‌’, ‘ఫరగాటెన్‌ సిల్వర్‌’, ‘ద ఫ్రైట్నర్స్‌’, ‘కింగ్‌కాంగ్‌’, ‘ద లవ్లీ బోన్స్‌’, ‘డిస్ట్రిక్ట్‌9’, ‘ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టిన్‌టిన్‌: ద సీక్రెట్‌ ఆఫ్‌ ద యూనికార్న్‌’, ‘వెస్ట్‌ ఆఫ్‌ మెంఫిస్‌’, ‘మోర్టల్‌ ఇంజిన్స్‌’లాంటి సినిమాల రూపకర్త అతడు. ‘ది లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌: ద రిటర్న్‌ ఆఫ్‌ ద కింగ్‌’ సినిమాకు మూడు ఆస్కార్‌ అవార్డులు అందుకున్నాడు. వాటిలో ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా ఉంది. ఇంకా గోల్డెన్‌గ్లోబ్, శాటర్న్, బాఫ్తా లాంటి పురస్కారాలను పొందాడు.  న్యూజిలాండ్‌లో 1961 అక్టోబర్‌ 31న పుట్టిన జాక్సన్‌కి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి. తనకు బహుమతిగా వచ్చిన చిన్న వీడియో కెమేరాతో అతడు చిన్నప్పుడే స్నేహితులను పెట్టి లఘు చిత్రాలు తీశాడు. తొమ్మిదేళ్ల వయసులో ‘కింగ్‌కాంగ్‌’ సినిమా తీసి దాన్ని తిరిగి కొన్ని బొమ్మల సాయంతో తన బుల్లి కెమేరాతో తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్నప్పుడు తననెంతో ఆకర్షించిన ‘కింగ్‌కాంగ్‌ సినిమాను యూనివర్శల్‌ స్టూడియోస్‌ కోసం తీశాడు.ఈ సినిమా కోసం అతడు 20 మిలియన్‌ డాలర్ల పారితోషికాన్ని అందుకోగలిగాడు. ఈ సినిమా 2005లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 550 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత దర్శకనిర్మాతగా పేరొందిన ఇతడు అనేక పురస్కారాలతో పాటు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నాడు.

  2.       John Candy : అంతర్జాతీయంగా అలరించిన ‘హోమ్‌ ఎలోన్‌’ సినిమాలో నటించి ఆకట్టుకున్న నటుడు జాన్‌ ఫ్రాంక్లిన్‌ క్యాండీ. ఎన్నో హాలీవుడ్‌ సినిమాల్లో హాస్య ప్రధాన పాత్రల్లో మెప్పించాడు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ‘1941’ సినిమాలో ఇతడి నటన అభిమానులను అలరించింది. ‘స్ట్రైప్స్‌’, ‘స్ప్లాష్‌’, ‘కూల్‌ రన్నింగ్స్‌’, ‘సమ్మర్‌ రెంటల్‌’, ‘ద గ్రేట్‌ ఔట్‌డోర్స్‌’, ‘స్పేస్‌బాల్స్‌’, ‘అంకుల్‌ బక్‌’లాంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీ సీరియల్స్‌ ద్వారా కూడా ప్రాచుర్యం పొందాడు. కెనడాలో 1950 అక్టోబర్‌ 31న పుట్టిన ఇతగాడు నాటకాలు, టీవీల ద్వారా వెండితెర అవకాశాలు అందుకున్నాడు. ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నాడు.

  3.       Vallabhbhai Patel : భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. పటేల్ ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది. గుజరాత్ లో పటేల్ గారి 182 మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని ప్రతిష్టించారు ఇది ప్రపంచంలోకెళ్లా అతి పెద్ద విగ్రహం.

  4.    C.K.Nayudu: క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు సచిన్, ధోని, కోహ్లి లేదు అంటే పాట తరం కపిల్, గవాస్కర్ కానీ వీళ్ళందరికంటే ఒకడు భారత క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నాడు అదీ మన తెలుగు వాడు అయిన  సి. కె. నాయుడు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అసలు పేరు కొట్టారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు.1916లోనే ఫస్ట్ క్లాసు క్రికెట్ ఆడాడు, ఆరు దశాబ్దాలపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి. కె. నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మాచ్‌లో 52 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు, 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న వారు మరొకరు లేరు.ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచురీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సి.కె. ఒకరు.భారత జట్టుకి ఆడినవారిలో “విజ్డెన్” పత్రిక “క్రికెటర్ ఆఫ్ ది యియర్”గా ఎంపికైన మొదటి వ్యక్తి.

  5.    తెలుగులో అక్కినేని కి ఎన్నో హిట్స్ ఇచ్చాడు హిందీలో సంజీవ్ కుమార్, జితేంద్ర లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసాడు ఆయనే కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31న గుడివాడలో జన్మించాడు. ముందు జర్నలిస్ట్‌ గా కెరీర్ మొదలు పెట్టారు ఆ తర్వాత సినీరంగంలోకి ప్రవేశించి కథా రచయితగా, అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు.కృష్ణకుమారి, అక్కినేని ప్రధానపాత్రలు పోషించిన భార్యాభర్తలు చిత్రంతో 1961లో దర్శకుడుగా మారారు. ఇది తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ తరువాత అక్కినేని హీరోగా పలు చిత్రాలను రూపొందించారు ప్రత్యగాత్మ. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన భార్యాభర్తలు కూడా హిట్‌. ఈ చిత్రానికిగాను కేంద్ర ప్రభుత్వం నుంచి రెండవ ఉత్తమ చిత్రంగా రజిత కమలం దక్కింది.చక్కని కుటుంబ కథకు సెంటిమెంట్లు జోడించడం, మంచి డ్రామా పండించగల నేర్పు, హిట్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడం అనేవి ప్రత్యగాత్మలోని ప్రత్యేకతలు. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ ఆత్మ ఆర్ట్స్ ప్రారంభించాడు. కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ అక్కినేని హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించాయి. అమ్మకోసం, ముగ్గురు అమ్మాయిలు, మా వదిన, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు, గడుసు అమ్మాయి, కన్నవారి ఇల్లు, కమలమ్మ కమతం తదితర చిత్రాలు ప్రత్యగాత్మ రూపొందించినవే. 1980లో దర్శకత్వం వహించిన నాయకుడువినాయకుడుఈయనచివరిచిత్రం.హిందీలో కె.పి.ఆత్మ పేరుతో దో లడ్కియా, మెహమాన్, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ, బచ్‌పన్, తమన్నాలాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

  6.    Karanam Balaram Krishna Murthy :  కరణం బలరామకృష్ణ మూర్తి సాక్ష్యాత్తు భారత ప్రధాని ఇందిరా గాంధీ మీద ఒంగోలులో దాడి జరిగితే ఆమెను రక్షించి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన రాజకీయ నాయకుడు.  ఈయన అక్టోబరు 31, 1946 ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించాడు. 1978 ఎన్నికలలో ఇంరిన అతన్ని అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికలలో మొదటిసారిఎన్నికయిశాసనసభలోప్రవేశించాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!