21.9 C
New York
Tuesday, September 28, 2021

Famous People Born on September 08 || Asha Bhosle || M M Srilekha || Chakravarthy || Shri Tv Wishes

సెప్టెంబర్ 8 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.  Asha Bhosle 

  ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే పుట్టిన రోజు రోజు. మరో ప్రముఖ గాయనియైన లతా మంగేష్కర్ కు ఈవిడ స్వయానా  సోదరి.  కెరీర్ తోలి నాళ్ళలో ఆశా భోస్లే వాయిస్ బాగాలేదని ఆమె సరిగ్గా పాడడం లేదని ఎన్నో విమర్శలను అవమానాలను ఎదుర్కుంది. తర్వాత తన ప్రతిభతో హిందీ సినిమాలలో ఎన్ని పాటలు పాడింది. అయితే 1954 లో రాజ్ కపూర్ తీసిన బూట్ పోలిష్ అనే సినిమాలో నన్నే మున్నె బచ్చే అనే పాటతో ఆశా భోస్లే కెరీర్ మలుపు తిరిగింది. తర్వతా .పి.నయ్యర్, RD బర్మన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకుల సినిమాలలో మంచి పాటలు పాడింది. తన సొంత అక్కయ్య లతా మంగేష్కర్ దీటుగా ఆశా భోస్లే కూడా మంచి పేరు తెచ్చుకుంది. తన 62 ఏళ్ళ వయసులో ఆశా భోస్లే రంగీలా సినిమాలో ఊర్మిళ పాత్రకు పాట పాడటం ఒక సంచలంగా చెప్పుకోవచ్చు సినిమాలో ఆమె పాడిన తన్హా తన్హా అనే పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. తర్వాత 2001లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ సినిమాలో కూడా రాధ కైసే నే జేలే అనే పాటతో మరోసారి తన ప్రతిభ నిరూపించుకుంది. 79 ఏళ్ళ వయసులో 2013లో వచ్చిన మై అనే సినిమాతో నటిగా కూడా మారింది. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది.  ఆశా భోస్లే ఉత్తమ గాయనిగా రెండు జాతీయ అవార్డు లు,  ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డు లతో పాటు 2001లో ఫిల్మ్ ఫేర్ వారు ఇచ్చిన లైఫ్ టైం అచివ్ మెంట్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆశా భోస్లే సినిమా ఇందుస్త్ర్యకి చేసిన సేవలకు గానూ 2000 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డు లను కూడా గెలుచుకున్నారు.  

  2. Music Director Chakravarthi

  తన సంగీతంతో తెలుగు వారిని అలరించిన చక్రవర్తి జయంతి రోజు. ఆయన అసలు పేరు  కొమ్మినేని అప్పారావు.మొదటగా కన్నడంలో రాజన్‌నాగేంద్ర సంగీతం అందించినమాంగల్య యోగంఅనే సినిమాలో పాడారు. తర్వాత తను గాయకుడిగా రాణిoచలేననే భయంతో డబ్బింగ్ వైపు వేల్లియ ఆయన దశ తిరిగిండానే చెప్పాలి ఎం.జి. రామచంద్రన్, జెమినీ గణేశన్, నాగేష్, కమల హాసన్, రజనీకాంత్, హిందీ నటుడు సంజీవకుమార్, కన్నడ రాజకుమార్‌ వంటి నటులకు గాత్రదానం చేశాడు. సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేసినా అవి విజయవంతం అవలేదు చివరికి 1973లో వచ్చిన శారద సినిమాతో చక్రవర్తి పేరు మారుమోగిపోయింది సినిమాలో శారద నను చేరదా అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. 1982-88 మధ్య కాలంలో అద్భుతమైన అవకాశాలు చక్రవర్తి వెంట నడిచాయి. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్‌ నడుపుతున్న ఎన్‌.టి.రామారావు  సినిమాలకు ఆయన పాటలు ప్రాణమై నిలిచాయి. ముందుగా రాసిన పాటకు బాణీ కట్టడం అంటే చక్రవర్తికి ఇష్టం. కానీ ఎక్కువగా ట్యూనుకే పాటలు రాయించేవారు దర్శకులు, నిర్మాతలు. చక్రవర్తిది అంతా సంచలనమే. ఒక గంటలోనే ఏడు పాటలకు బాణీలు కట్టి రికార్డింగ్‌ చేయించిన ఘనత చక్రవర్తిది. దాదాపు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఏడాదికి 40కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రోజులున్నాయి. చక్రవర్తి సంగీత దర్శకత్వం అందించిన చిత్రాల సంఖ్య 959.   చక్రవర్తికి ఉత్తమ సంగీత దర్శకుడిగానేటిభారతం’ (1983), ‘శ్రావణ మేఘాలు’ (1986) చిత్రాలకు నంది బహుమతులు లభించాయి.

  3.  MM Srilekha
  ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ పుట్టిన రోజు రోజు.  సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, ప్రముఖ దర్శకులు రాజమౌళికి శ్రీ లేఖకి వరుసకు సోదరులవుతారు. పాటలు కంపోజ్‌ చేసేందుకు కీరవాణి కోసం ఇంటికి కారు రావడం చూసిన శ్రీలేఖ కూడా కారు రాక కోసం సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. బాల్యం నుంచి రాగాలతో సాన్నిహిత్యాన్ని, సాహిత్యంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తానూ కూడా కీరవాణిలాగ ప్రముఖ సంగీత దర్శకురాలు  కావాలనుకున్నారు.  అతి చిన్న వయస్సులోనే సంగీత దర్శకురాలిగా మారి ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేశారు. తన తోలి సినిమా ఇప్పుడు తమిళ్‌లో స్టార్‌ హీరోగా ఉన్న విజయ్‌ మొదటి సినిమాకి సంగీతం అందించింది శ్రీలేఖే. కానీ, మారుపేరుతో సంగీతాన్ని సమకూర్చారు.   తెలుగులో దాసరి నారాయణరావునాన్నగారుచిత్రానికి ఆఫర్‌ ఇచ్చారు. శ్రీలేఖ కంపోజ్‌ చేసినతాజ్‌ మహల్‌సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆమె సంగీతం సమకూర్చిన పాటలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. మూవీ మొఘల్‌గా ప్రఖ్యాతి గాంచిన నిర్మాత డాక్టర్‌ రామానాయుడి సంస్థలో ఎదిగిన శ్రీలేఖ అనతి కాలంలోనే కొన్ని విజయవంతమైన చిత్రాలకు పనిచేసారు.  శ్రీలేఖ పేరు చెప్పగానేమంచుకొండల్లోని చంద్రమా’, ‘చెప్పనాచెప్పనాచిన్న మాట’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా’, ‘నీకోసం నీకోసంవంటి ఎన్నో హిట్టు పాటలు గుర్తుకొస్తాయి. సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ 80 సినిమాలకు వర్క్‌ చేశారు.  

  4. parupalli kashyap

  భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ పుట్టిన రోజు ఈరోజు. 11 ఏళ్ల క్రితం పారుపల్లి కశ్యప్ హైదరాబాద్ లో ఎస్.ఎం.ఆరిఫ్ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో మొదట చేరాడు. కశ్యప్ తండ్రి ఉద్యోగస్తుడు, ఆయన బదిలీ అయినప్పుడు వారి కుటుంబం కూడా మారుతూ ఉండేది. వీరు బెంగుళూర్ కి మారినపుడు కశ్యప్పడుకొనే అకాడమీలో చేరాడు.   తర్వాత పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి గోపీచంద్ శిక్షణలో రాటు దేలాడు 2005లో కశ్యప్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించి నేషనల్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో బాలుర సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు.2006 నుంచి అంతర్జాతీయ పోటిలలో పాల్గొనడం మొదలు పెట్టిన కశ్యప్ హాంగ్ కాంగ్ ఓపెన్ లో ఇతను ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో అప్పటి ప్రపంచ నెంబర్ 19 “ప్రీజీమీస్లా వాచను ఓడించాడు, 2006లో తన ప్రపంచ ర్యాంకింగ్ లలో 100 స్థానం నుండి 64 స్థానానికి చేరుకున్నాడు. 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్) పై గెలిచాడు. 1982లో సయ్యద్ మోడీ తరువాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడిగా కశ్యప్ ఘనత సాధించాడు. బ్యాడ్మింటన్ లో కశ్యప్ సాధించిన విజయాలకు గానూ భారత ప్రభుత్వం ఇతన్ని అర్జున అవార్డుతో సత్కరించించింది.

  5.  PVP
  ప్రముఖ తెలుగు నిర్మాత, రాజకీయ నాయకుడు  ప్రసాద్ వి. పొట్లూరి పుట్టిన రోజు రోజు. పి.వి.పిగా సుపరిచితుడు అయిన ఈయన ప్రముఖ విద్యావేత్త. విజయవాడలో జన్మించిన  ఆయన తెలుగులో స్వంతంగా పి.వి.పి సినిమా అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. పివిపి సినిమా బేనర్‌పై ఇప్పటి వరకు తమిళం, తెలుగులో పలు భారీ సినిమాలు నిర్మించాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చినఈగచిత్రాన్ని తమిళంలోనాన్ఈపేరుతో పివిపి సినిమా వారు ప్రొడ్యూస్ చేసాడు. గ్లోబల్ అవుట్ సోర్సింగ్ సర్వీసు రంగంలోని సీరియల్ వ్యవస్థాపకునిగా ఆయన మూడు కంపెనీలను విజయవంతంగా నిర్మించి వాటినిఫోర్టూన్ 1000 మార్కెట్ ప్లేస్యొక్క అవసరాలను తీర్చడానికి అమ్మారు. గ్లోబల్ ఇన్వెస్టుమెంటు సమాజంలో ఆయన గౌరవ ప్రథమైన నాయకుడు.  పి.వి.పి గ్రూపు భారతీయ మీడియా&ఎంటర్‌టైన్‌మెంటు రంగంలోపిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్ద్వారా అడుగు పెట్టింది. ఇది భారతీయ ఎంటర్‌టైన్‌మెంటు పరిశ్రమ యొక్క ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించే భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత మీడియా కేపిటల్ హౌస్. పి.హె.ఎం.ఎల్ ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో పి.వి.పి సినిమా బ్యానర్ తో అడుగు పెట్టింది.

  6.   Ronnie Screwvala
    రోనీ స్క్రూ వాలా పేరు వింటేనే చాలా విచిత్రంగా ఉంది కదా కానీ ఈయన బాలీవుడ్ లో పెద్ద ప్రొడ్యూసర్, UTV అధినేత. ఆయన పుట్టిన రోజు రోజు. రోనీ స్క్రూ వాలా   బొంబాయిలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. ముంబైలోని జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారు. తర్వాత సిడేన్హం కాలేజీ చేసాడు.  చిన్నప్పటి నుంచే రోనీ స్క్రూ వాలా ధియేటర్ మీద చాలా ఇష్టంతో ఉండేవాడు ఆయన బొంబాయి ధియేటర్ లో కొన్ని నాటకల్లో కూడా నటించాడు. 1990లో UTV ని స్థాపించారు. క్రమంగా సినిమా వైపు వచ్చిన రోనీ స్క్రూ వాలా UTV PICTURES, RSVP PICTURES మీద హిందీలో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో రంగ్ దే బసంతి, జోదా అక్భర్, బర్ఫీ లాంటి సినిమాలు ఎన్నో అవార్డు లు గెలుచుకున్నాయి

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!