14.6 C
New York
Saturday, September 25, 2021

Famous People Born on September 09 || Akshay Kumar || Manjula || C H Malla Reddy || Shri Tv Wishes

సెప్టెంబర్ 9 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 

 1. Akshay Kumar
   
   బాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత, మార్షల్ కళాకారుడు  అక్షయ్ కుమార్ పుట్టిన రోజు రోజు.  రీసెంట్ గా ఫోర్బెస్ కంపెనీ ప్రకటించిన మిలియనీర్స్ జాబితాలో ఇండియా నుంచి అత్యదిక సంపాదన కలిగిన  హీరోగా జాబితాలో చోటు సంపాదించాడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన ఆయన దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు 1990ల్లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించారు ఆయన. వక్త్ హమారా హై, మోహ్రా, ఎలాన్, సుహాగ్, సపూట్, జాన్వర్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత 2000 సంవత్సరo ఆరంభం నుంచి అక్షయ్ కుమార్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ లుగా నిలిచాయి. ముఖ్యంగా ఆయన సినిమాలు అటు ఓవర్ సీస్ లో కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడంతో అక్షయ్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. దడ్కన్, అందాజ్, నమస్తే లండన్, హీరా ఫేరి, భూల్ భులయ్యా, సింగ్ ఇజ్ కింగ్ లాంటి సినిమాలతో అక్షయ్ సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. అక్షయ్ కుమార్ తన వంతు భాద్యతగా ప్యాడ్ మాన్, టాయిలెట్ లాంటి సందేశాత్మక సినిమాల్లో కూడా నటించారు. 2008లో పీపుల్ పత్రిక అక్షయ్ కుమార్ ను ఆసియాలోనే సెక్సిఎస్ట్ మాన్ ఎలైవ్ గా పేర్కొంది.  అక్షయ్‌ కుమార్‌ అడపాతడపా బుల్లితెరపైనా మెరిశారు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానెల్‌లో ప్రసారమైనసెవెన్‌ డీడ్లీ ఆర్ట్స్‌ విత్‌ అక్షయ్‌ కుమార్‌అనే మినీ సిరీస్‌కి అక్షయ్‌ కుమార్‌ హోస్ట్‌గా వ్యవహరించారు.  ఉత్తమ నటుడిగా రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం, ‘రుస్తుం’, ‘ఎయిర్‌ లిఫ్ట్‌సినిమాలకు ఉత్తమ నటుడిగా జాతీయ సినిమా అవార్డును గెలుచుకున్నారు అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ అవార్డును అక్షయ్ కుమార్ అందుకున్నారు.  అభిమానులు అక్షయ్ ను ఇండియన్ జాకీ చాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

  2.  Manjula
    బంగారు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తార మంజుల జయంతి రోజు.  1965లోశాంతి నిలయంచిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు తరువాత ఎంజీఆర్ నటించినరిక్షాకారన్తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. 1970ల్లో మంజుల హీరోయిన్‌గా అగ్రస్థాయికి చేరుకున్నారు. అయితే 80 దశకంలో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్‌కుమార్, కమల్‌హాసన్, రజనీకాంత్ తదితరులతో కలిసి నటించారామె. గిన్నిస్ రికార్డు చిత్రంస్వయంవరంలోను ఆమె నటించారు. ‘ఉన్నిడం మయంగురేన్షూటింగ్ లో సమయంలో విజయ్‌కుమార్, మంజుల ప్రేమలో పడ్డారు. తరువాత కొంతకాలానికే వివాహం చే సుకున్నారు. ఎంజీఆర్ దగ్గరుండి వివాహం జరిపించారు. మంజుల తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మాయదారి మల్లిగాడు చిత్రంలో అమాయక పల్లెపడుచుగా, మంచి మనుషులు చిత్రంలో భగ్న ప్రియురాలిగా, చంటి సినిమాలో నాలుగు గోడల మధ్య నలిగే ఉమ్మడి కుటుంబ జమీందారిణి అమ్మగా, జగపతి సంస్థకు ఆస్థాన హీరోయిన్ గా రాణించి అందాల తారగా వెలిగిందామె.

  3.   Mahabub Khan

      భారతీయ సినిమా చరిత్రలో మదర్ ఇండియా సినిమా ఒక క్లాసిక్ . సినిమాను డైరెక్ట్ చేసింది మెహబూబ్ ఖాన్. ఆయన జయంతి రోజు.   సినిమా 1958లో జరిగిన ఆస్కార్ బహుమతుల పోటీలో విదేశీ భాషా చిత్రాల విభాగంలో అర్హత సాధించి చివరి దశకు చేరుకుంది గానీ అవార్డు గెలుచుకోలేక పోయింది. మెహబూబ్ ఖాన్ పూర్తిపేరు మెహబూబ్ ఖాన్ రంజన్ ఖాన్.  ఒకసారి దక్షిణాదికి చెందిన దర్శకుడు చంద్రశేఖర్ దృష్టిలో మెహబూబ్ ఖాన్ పడడం జరిగింది. మెహబూబ్ ఖాన్ కు సినిమాల మీద వున్న ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్ అతణ్ణి బాంబే స్టూడియోలో సహాయ దర్శకుని గా నియమించి శిక్షణ ఇప్పించారు.  మొదటగా 1929లో నెలకొల్పిన సాగర్ మూవిటోన్ సంస్థ నిర్మించినఆల్ హిలాల్జడ్జిమెంట్ ఆఫ్ అల్లాఅనే టాకీ చిత్రానికి మెహబూబ్ ఖాన్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.  సినిమా బాగా విజయవంతమైంది.   తర్వాతడెక్కన్ క్వీన్’(1936), ‘జాగిర్దార్’ (1937), ‘హమ్ తుమ్ అవుర్ ’(1938), ‘ఏక్ హి రాస్తా’(1939), ‘ఆలీబాబా’(1940), ‘అవురత్’(1940), ‘బెహన్’(1941) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించినా మదర్ ఇండియా సినేమ్మాతో ఆయన కీర్తి పతాక స్థాయికి చేరింది. దర్శకునిగా 24 సినిమాలు, నిర్మాతగా ఏడు సినిమాలు, నటునిగా నాలుగు సినిమాలు చేసారు.   భారత ప్రభుత్వం మెహబూబ్ ఖాన్ కుహిదాయత్ కర్ఆజంఅనే బిరుదు ప్రదానం చేసింది.

  4.  Cliff Robertson 

       స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. సినిమాలు చూసిన వారెవరికయినా అంకుల్‌ బెన్‌ ఎవరో చెప్పక్కర్లేదు. పాత్రలో దాదాపు జీవించిన క్లిఫర్డ్‌ పార్కర్‌ రాబర్ట్‌ సన్‌ పుట్టిన రోజు నేడు. 1923 సెప్టెంబర్‌ 9 అమెరికాలోని కాలిఫోర్నియా లో పుట్టారు. ‘ఛార్లీసినిమాతో ఆస్కార్‌ అవార్డు అందుకున్న రాబర్ట్‌ సన్, ‘పిటి 109’ సినిమాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నడీగా నటించి మెప్పించాడు. ‘స్పైడర్‌ మ్యాన్‌ట్రాయాలజీ సినిమాల్లో అంకుల్‌బెన్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. ‘వాషింగ్‌టన్‌: బిహైండ్‌ క్లోజ్డ్‌ డోర్స్‌’ , ‘ది ఫైలట్‌’, ‘స్టార్‌ 80’, అలాగే టెలివిజన్‌ చిత్రాలైనది కీ టు రెబక్కా’, ‘డెడ్‌ రిక్కోనింగ్‌లాంటి చిత్రాల్లో నటించాడు. చివరగా 2002లోస్పైడర్‌ మ్యాన్‌’, 2004లోస్పైడర్‌ మ్యాన్‌2’ 2007లోస్పైడర్‌ మ్యాన్‌3’ మూడు చిత్రాల్లో చివరి రెండు సినిమాల్లో బెన్‌ పార్కర్‌ పాత్రలో నటించి అలరించారు. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌అవార్డు సంపాదించాడు. నటునిగా పార్కర్ ప్రస్థానం టీవీ, వెండితెరలపై 50 ఏళ్ల పాటు సాగడం విశేషం. తన సినీ జీవితంలో ఎన్నో గొప్ప పాత్రాల్లో జీవించిన పార్కర్ సెప్టెంబర్‌ 10, 2011 న్యూయార్కులోని స్టోనీ బ్రూక్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు.

  5.   Adam Sandler

  హాలీవుడ్ కామెడీ హీరో   ఆడమ్‌ రిచర్డ్‌ శాండ్లర్‌ పుట్టిన రోజు రోజు. ఆయన నటించిన సినిమాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డాలర్లను వసూలు చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన హాలీవుడ్‌ బంగారు బాతులాంటి వాడు . ఆడమ్‌ రిచర్డ్‌ శాండ్లర్‌ అమెరికాలో జన్మించారు. ‘బిల్లీ మాడిసన్‌’, ‘హ్యాపీ గిల్‌మోర్‌’, ‘ వార్‌ బాయ్‌’, ‘ వెడ్డింగ్‌ సింగర్‌’, ‘బిగ్‌ డాడీ’, ‘పంచ్‌డ్రంక్‌ లవ్‌’, ‘ఎయిట్‌ క్రేజీ నైట్స్‌’, ‘ఫన్నీ పీపుల్‌’, ‘జాక్‌ అండ్‌ జిల్‌’, ‘పిక్చల్స్‌లాంటి సినిమాల ద్వారా ఆకట్టుకున్నాడు. రిచర్డ్‌ నటుడే కాదు మాటల రచయితగా నిర్మాత, మంచి మ్యూజిషియన్‌ కూడాను ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘పంచ్‌డ్రంక్‌ లవ్‌చిత్రానికి ఉత్తమ నటుడుగాగోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుఇచ్చారు. ‘ది వెడ్డింగ్‌ సింగర్‌చిత్రానికి బెస్ట్‌ కామెడిక్‌ నటనకు ఎమ్‌టీవీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. గ్రామీ అవార్డ్సు, హాలీవుడ్‌ ఫిల్మ్‌ అవార్డ్సును సంపాదించారు.

  6.Ch Malla Reddy

  మంత్రి, MLA, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు సి.హెచ్. మల్లారెడ్డి పుట్టిన రోజు రోజు. MLR గా ప్రసిద్ధి ఆయన మంచి మాటకారి, సరదా మనిషి.  మల్లారెడ్డి  తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు. ముందుగా మల్లారెడ్డి టిడిపి పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 2014, ఏప్రిల్ 9 మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16 జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. తర్వాత కాలంలో ఆయన తెలుగు దేశం పార్టీని వీడి 2016 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 19 ఫిబ్రవరి 2019 కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా చేరాడు.  

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!