14.6 C
New York
Saturday, September 25, 2021

Famous People Born on September 13 || Kiran Kumar Reddy || Music Director Sri || Shri Tv Wishes

సెప్టెంబర్ 13 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.      NALLARI KIRAN KUMAR REDDY 

  ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పుట్టిన రోజు నేడు. నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ కూడా ఆంధ్ర ప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం కూడా వహించాడు. ఈయన రంజీ క్రికెట్ ఆడిన టైములో జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే లాంటి వాళ్ళు ఉన్నారు. ఈయన తండ్రి అమర్ నాథ్ రెడ్డి ఫై.వి. నరసింహారావు క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు. తండ్రి మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. మొదటగా వాయాల్పాడు నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ పార్టీ MLA గెలుపొందారు. దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర రెడ్డి తో ఈయన సన్నితంగా వఉండేవారు. 2004లో కిరణ్ కుమార్ కు చీఫ్ విప్ పదవి లభించింది. 2009లో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా కూడా ఈయన ఎన్నికయారు. తర్వాత  వైఎస్ రాజశేకర రెడ్డి మరణం, తెలంగాణా రాష్ట్ర పోరాటం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. యునైటెడ్ ఆంధ్ర ప్రదేశ్ కు ఈయనే చివరి ముఖ్యమంత్రి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూఅక్టోబర్ 10, 2014లో జై సమైక్యాంద్ర పార్టీ స్థాపించారు కానీ తర్వాత 2018లో దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసారు.

  2.       Sri (Music Director)

  ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ పుట్టిన రోజు నేడు. శ్రీ గాయకుడు, ఢబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ప్రఖ్యాత సంగీత దర్శకుడైన కె. చక్రవర్తి రెండవ కుమారుడు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. తొలిసారిగా బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా పోలీస్ బ్రదర్స్ ఆయన తొలిచిత్రం హీరోగా చేయమని చాలా మంది దర్శక నిర్మాతలు అడిగినా సున్నితంగా తిరస్కరించి సంగీత దర్శకుడుగానే తన సినీ ప్రయానాన్ని కొనసాగించాడు. సింధూరం సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి రుక్మిణి సినిమాలో హీరోగా చేయమని అడిగారు దానికి మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు అని శ్రీ చెప్పాడు. 1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అనేపాట చాలా పెద్ద హిట్ అయ్యింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనీ, మనీ మనీ, అనగనగా ఒకరోజు సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించాడు. సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సింధూరం చిత్రం అలాగే గులాబీ సినిమా పాటలు ఆయన కెరీర్‌లో బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్స్ గా నిలిచిపోయాయి. టిల్ సోల్జర్స్, ఆవిడా మా ఆవిడే, అమ్మోరు, నా హృదయంలో నిదురించే చెలి, కాశీ, సాహసం, ఆడు మగాడ్రా బుజ్జీ, చంటిగాడు, నీకే మనసిచ్చాను చిత్రాలకు శ్రీ సంగీతాన్ని అందించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రంలోని ఒక పాటను కూడా స్వరపరిచాడు.. హాయ్‌రబ్బా పేరుతో సింగర్ స్మితతో కలిసి ప్రైవేటు ఆల్బం రూపొందించారు. ‘సాహసం‘, ‘ఆడు మగాడ్రా బుజ్జి‘, ‘చందమామలో అమృతంఆయన సంగీతం అందించిన ఇతర సినిమాలు. తన కెరీర్ లో దాదాపు 20 సినిమాలకు శ్రీ సంగీతం అందించారు, అప్పూ అనే బాలల చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీ చివరి చిత్రం.

 2.       Sairam Shankar

  ప్రముఖ తెలుగు సినిమా హీరో సాయి రాం శంకర్ పుట్టిన రోజు నేడు. ఈయన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సొంత తమ్ముడు. అన్న అడుగు జాడల్లోనే నడుస్తూ మొదట దర్శకత్వంవైపు దృష్టిపెట్టారుబద్రి’, ‘బాచి’, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘భద్రతదితర చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘ఇడియట్‌తో నటుడిగా మారాడు. చిత్రంలో రవితేజకి మిత్రుడుగా తళుక్కు మెరిసి ఆకట్టుకున్న ఆయన ‘143’తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. తర్వాతడేంజర్‌లో కార్తీక్‌ అనే పాత్రని పోషించి అలరించాడు. కెరీర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తూహలో ప్రేమిస్తారాఅనే చిత్రంలో నటించారు. అయితే తర్వాత కథానాయకుడిగా చేసిన సినిమాలు కలిసి రాకపోవడంతో తిరిగి ఆయన అన్నయ్య మరోమారు తన తమ్ముడిని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా సొంత సంస్థలోనేబంపర్‌ ఆఫర్‌అనే చిత్రం నిర్మించారు. చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించినా, తర్వాత విజయాల్ని అందుకోలేకపోయారు. ‘వాడే కావాలి’, ‘యమహో యమః’, ‘వెయ్యి అబద్దాలు’, ‘దిల్లున్నోడుతదితర చిత్రాలు చేసినా అవి బాక్స్ ఆఫీసు దగ్గర ఫ్లాప్ అయ్యాయి. తర్వాత రామ్ శంకర్ గా పేరు మార్చుకుని కొన్ని సినిమాలలో నటించినా విజయాలు దక్కలేదు.

  4.       Aruna Mucherla

  ప్రముఖ తెలుగు హీరోయిన్ ముచ్చెర్ల అరుణ పుట్టిన రోజు నేడు. సీతాకోక చిలుక, పుత్తడి బొమ్మ, శ్రీ వారికి ప్రేమలేఖ లాంటి సినిమాలతో అరుణ తెలుగు ప్రేక్షకులను అలరించింది. అరుణ 1965 సెప్టెంబర్ 13 ఖమ్మం జిల్లా, కొత్తగూడెంలో జన్మించింది, ఆమె చదువంతా హైదరాబాదులోనే సాగింది. తండ్రి ఆదాయపన్ను శాఖలో ఆఫీసరుగా పనిచేసే వారు. మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత అవకాశాన్ని ఆమె వదులుకోలేదు. సినిమానే సీతాకోక చిలుక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  మంచి విజయం సాధించడంతో అరుణకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా తన సినిమా కెరీర్ లో సుమారు 70కు పైగా చిత్రాలలో నటించింది. సీతాకోక చిలుక, పుత్తడి బొమ్మ, శ్రీ వారికి ప్రేమలేఖ లాంటి సినిమాలు ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

  5.       Karthik 

  ప్రముఖ తెలుగు, తమిళ్ సినిమాల హీరో కార్తీక్ జన్మదినం నేడు. ఈయన అసలు పేరు మురళి కార్తికేయన్ ముత్తురామన్ కానీ తన స్టేజ్ నేమ్ కార్తీక్ తోనే సినిమాల్లో రాణించాడు. కార్తీక్ తమిళ నటుడు ఆర్. ముత్తురామన్ కుమారుడు 1981 లో ఓవతిళ్ళై (1981) చిత్రంలో భారతీరాజా అతన్ని తొలిసారిగా పరిచయం చేశారు సినిమా పెద్ద హిట్ అయ్యింది అదే సినిమాను తెలుగులో సీతాకోక చిలుక అనే పేరుతో కార్తీక్ నే తెలుగు తెరకు పరిచయం చేస్తూ రీమేక్ చేసారు సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది.  1986లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన మౌనరాగంలో కార్తీక్ పాత్ర ఆయనకు చాలా మంది మహిళా అభిమానులను సంపాదించిపెట్టింది. తెలుగులో కార్తీక్ హీరోయిన్ శోభనతో కలిసి చేసిన అభినందన ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తెలుగు, తమిళ్ లలో కలిపి కార్తీక్ సుమారు 125 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించారు.కార్తీక్ తన సినీ కెరీర్ లో తమిళ్ లో ఉత్తమ నటుడిగా నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, తమిళ్ నాడు స్టేట్ అవార్డ్స్ నాలుగు సార్లు అలాగే తెలుగులో అభినందన సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఈయన కొడుకు గౌతం కార్తీక్ ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నారు.

  6.       Claudette Colbert  
   హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న అందాల నటిగా పేరు పొందిన క్లాడటే కోల్‌బర్ట్ పుట్టిన రోజు నేడు. ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’ (1934) సినిమా అనే సినిమాతో ప్రపంచ సినీ అభిమానులందరికీ ఆమె సుపరిచయం. క్లాడటే ఫ్రాన్సులోని సెయింట్‌మాండేలో సెప్టెంబర్‌ 13, 1903లో జన్మించింది. గానంనటనఅందంచలాకీతనం ఇవన్నీ క్లాడటే కోల్‌బర్ట్ సొంతం అందుకే నాటక, టీవీ, ఫ్యాషన్, సినీ రంగాలు ఆమె కోసం ఎర్రతివాచీలు పరిచాయి. రెండు దశాబ్దాల కాలం పాటు హాలీవుడ్ లో ఆమెకు ఎదురులేకుండాపోయింది తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసింది. ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’ (1934) సినిమా ఆమెకు ఆస్కార్‌ను అందించింది, ‘క్లియోపాత్రా’ (1934), ‘ పామ్‌ బీచ్‌ స్టోరీ’ (1942) లాంటి సినిమాలు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. హాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో గొప్ప నటీమణిగా అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆమెను మరణాంతరం తరువాత 1999లో గుర్తించి గౌరవించింది. నటుడు దర్శకుడైన నార్మన్‌ ఫాస్టర్‌ను 1928 సంవత్సరంలో పెళ్లిచేసుకుంది. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురం 1935లో కలతలు వచ్చి విడిపోయారు. అటు పిమ్మట 1935లోనే డాక్టర్‌ జోయల్‌ ప్రెస్‌మెన్‌ను రెండో పెళ్లి చేసుకొంది. అతను 1968లో చనిపోయారు. తరువాత చనిపోయేంత వరకు ఒంటరిగానే జీవించారు క్లాడటే.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!