14.6 C
New York
Saturday, September 25, 2021

Famous People Born on September 14 | Lakshmi Parvathi | Robin Singh | Garikapati | Shri Tv Wishes

సెప్టెంబర్ 14 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు


హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Nandamuri Lakshmi Parvathi  

  లక్ష్మీపార్వతి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు. ఈవిడ 1962, ఆగష్టు 10 జన్మించింది. స్వతహాగా రచయిత అయిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు వీరాభిమాని తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవితచరిత్ర రాయాలన్న ఉద్దేశముతో ఆయన్ని కలుసుకున్నది. కానే మొదట్లో ఎన్టీఆర్ దానికి ఒపుకోలేదు. అయినా కూడా లక్ష్మీపార్వతి పట్టుదలతో ప్రయత్నించి రామారావు గారి జీవితచరిత్ర వ్రాయటానికి అనుమతి సంపాదించి 1987లో రామారావు ఇంట్లోనే ఉంటూ ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాయడం మొదలు పెట్టింది. సమయంలోనే లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుల మధ్య ప్రేమ ఏర్పడి  1993లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి  1993లో లక్ష్మీపార్వతి తన మొదటి భర్త అయిన వీరగంధం వెంకట సుబ్బారావు నుండి గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకుంది. తన మొదటి భర్త అయిన వీరగంధం వెంకట సుబ్బారావు హరికథా కళాకారుడు. 1993, సెప్టెంబరు 10 రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. మర్నాడు సెప్టెంబరు 11 తిరుపతిలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. అయితే లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకోవడం ఎన్టీఆర్ కుటుంబ సభ్యలకు ఎవరకీ ఇష్టం లేదు దాంతో వారంతా పెళ్లిని వ్యతిరేకించి క్రమంగా ఎన్టీఆర్ కు దూరం అయ్యారు. 1996 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలలో శ్రీకాకుళము జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి MLA గా గెలిచారు. ఎన్టీ రామారావు మరణానంతరము ఆయన జీవితచరిత్రనుఎదురులేని మనిషిఅన్న పేరుతో 2004లో విడుదలచేసింది.

  2.       Robindra Ramnarine Singh (Robin Singh)

  రాబిన్ సింగ్ ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఈరోజు ఆయన జన్మదినం. రాబిన్ సింగ్ సెప్టెంబర్ 14, 1963లో ట్రినిడాడ్ లో జన్మించారు. తనకు 19 ఏళ్ళ వయసునప్పుడు ఆయన కుటుంబం చెన్నై కు షిఫ్ట్ అయ్యింది. 1985 లో చెన్నై లో రాబిన్ సింగ్ తన ఫస్ట్ క్లాసు క్రికెట్ ఆడారు. సుమారు 6000 పరుగులు చేసి అలాగే 172 వికెట్స్ తీసి అల్ రౌండర్ అనిపించుకున్నాడు. తర్వాత 1989 లో వెస్ట్ ఇండీస్ తో వన్ డే మ్యాచ్ ఆడటం ద్వారా రాబిన్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. తన కెరీర్ మొత్తంలో 136 వన్ డే లు ఆడిన రాబిన్ 25.95 సగటుతో 2336 పరుగులు చేసాడు, 69 వికెట్స్ తీసుకున్నాడు. రాబిన్ తన కెరీర్  లో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు టెస్ట్ మ్యాచ్ ఆడాడు. క్రికెటర్ గా రిటైర్ అయ్యాకా రాబిన్ సింగ్ కోచ్ గా తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆయన మొదటగా హాంగ్ కాంగ్ కు కోచింగ్ ఇచ్చారు రాబిన్ కోచింగ్ ఫలితంగానే టీం 2004 లో ఆసియా కప్ కు అర్హత సాధించింది. రాబిన్ ప్రతిభను గుర్తించి ఆయనకు 2006 లో ఇండియా కోచింగ్ భాద్యతలు అప్పగించారు.   

  3.       Garikipati Narasimha Rao 

  గరికిపాటి నరసింహారావు ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు. నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14 తేదీన జన్మించారు. ఈయన ఎం.., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశారు, ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. శ్రీ గరికిపాటి నరసింహారావు దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు.
  ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు. శతావధానగీష్పతి,
  అవధానశారద,ధారణబ్రహ్మరాక్షస,అమెరికా అవధానభారతి అనే బిరుదులూ కూడా పొందారు. శ్రీ గరికిపాటి నరసింహారావు 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారo అందుకున్నారు.

  4.       Gadicherla Harisarvottama Rao

  గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా రచయిత, సాహితీకారుడు నేడు ఆయన జన్మదినం. ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సెప్టెంబర్ 14, 1883లో కర్నూలులో జన్మించారు. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906లో మద్రాసులో ఎం. డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ఇష్టమైన గ్రంథాలయోద్యమం వైపు వచ్చాడు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి రాయలసీమ ప్రాంతానికి పేరు పెట్టింది ఆయనే 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన పేరు పెట్టాడు. స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం అనే పుస్తకాన్ని రాశారు. ఆయన రాసిన శ్రీరామ చరిత్ర అనే పుస్తకాన్ని 11 తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది. ఆయన రచించిన పౌరవిద్య అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.

  2.      Nigel John Dermot “Sam” Neill 

  ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్‌ నీల్‌జురాసిక్ పార్క్ సినిమా సిరీస్ లతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు .నేడు ఆయన జన్మదినం. నార్తెన్‌ ఐలాండ్‌లో సెప్టెంబర్‌ 14, 1947లో పుట్టిన శామ్‌ నీల్‌ 1975లోల్యాండ్‌ఫాల్‌అనే చిత్రంతో సినీ రంగం ప్రవేశం చేశాడు. శామ్‌ నీల్‌గా ప్రఖ్యాతుడైనా అసలు పేరు నిగెల్‌ జాన్‌ డెర్మాట్‌ నీల్‌ అతడి గురించి చెప్పాలంటే ఆనాటిఓమెన్‌నుంచి ఈనాటిజురాసిక్‌ పార్క్‌దాకా చెప్పాలి. సైతానే మళ్లీ పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టిన వ్యక్తిగా, రాకాసి బల్లులను తప్పించుకుంటూనే వాటిని కాపాడే డాక్టర్‌గా రెండు సినిమాల్లోని పాత్రలే కాదు, అతడు పాత్రలో నటించినా దానికి గుర్తింపును, ప్రశంసను అందుకున్న నటుడతడు. ఈయన న్యూజిలాండ్‌ నటుడు. ‘ఓమెన్‌3: ఫైనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌’, ‘పొసెషన్‌’, ‘డెడ్‌కామ్‌’, ‘ పియానో’, ‘జురాసిక్‌ పార్క్‌’, ‘మెర్లిన్‌’, ‘ హంట్‌ ఫర్‌ రెడ్‌ అక్టోబర్‌’, ‘పీకీ బ్లైండర్స్‌’ ‘ టుడోర్స్‌లాంటి సినిమాలు అతడి నటనలోని విలక్షణతను చూపిస్తాయి. ‘ఈవిల్‌ ఏంజెల్స్‌సినిమాలో మైకేల్‌ చెంబిర్లిన్‌ పాత్రలో నటించినందుకుగాను ఏఏసీటీఏ సంస్థఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో సహాయక నటుడిగా రాణించారు. బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. ‘ది ట్రైయాంగిల్‌సీరీస్‌గాను ఉత్తమ సహాయనటుడిగా అవార్డు ఇచ్చారు. 2019లోప్లామ్‌ బీచ్‌’, ‘బ్లాక్‌బర్డ్‌సినిమాల్లో కనిపించి మురిపించారు.

  6.       Kodavatiganti Rohini Prasad

  కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత ఈయన జన్మదినం నేడు. 1949 సెప్టెంబర్ 14 తెనాలిలో ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, వరూధిని లకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేసారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఏంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన తన నాలుగో ఏటనే తనంతట తానుగా సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టి, హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలో క్రమంగా మంచి ప్రావీణ్యం సంపాదించాడు. సర్వశ్రీ పండిట్ ఎల్.ఆర్.కేల్కర్ (గ్వాలియర్ ఘరానా), ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (సితార్) వద్ద శిష్యరికం చేసి సితార్ వాయిద్య నైపుణ్యం సంపాదించి తన పదహారో ఏటనే సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 1978లో ఆయన నేపథ్య సంగీతం సమకూర్చి, బాంబేలో ప్రదర్శించినకుమార సంభవంఅనే నృత్య నాటిక ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే ఆయన 2003లో కూచిపూడి కళా కేంద్రం వారి నృత్యరూపకంకృష్ణ పారిజాతంలోనితులాభారంఅంకానికి స్వరపరిచిన సంగీతం అందరినీ అలరించింది

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!