11.3 C
New York
Saturday, October 23, 2021

Famous People Born on September 19 | Vennela Kishore | Raja Ravindra | Shri Tv Wishes

సెప్టెంబర్ 19 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Vennela Kishore 

  వెన్నెల కిశోర్ ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు నేడు ఆయన జన్మదినం. సినిమాల్లోకి రాక ముందు ఈయన  అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.  వెన్నెల కిశోర్ వాళ్ళది నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో మధ్యతరగతి కుటుంబం, తండ్రి లక్ష్మీ నారాయణ ఆంగ్ల ఉపాధ్యాయుడు కిషోర్ ఏడో తరగతిలో ఉండగానే తండ్రి పదవీ విరమణ చేశాడు. ఆయన చిన్నప్పుడు ఇంట్లో నాన్న దగ్గరే పాఠాలు అభ్యసించాడు. కామారెడ్డి పాఠశాలలో పదో తరగతి దాకా చదివి ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చాడు. హైదరాబాదుకు వచ్చినప్పటి నుంచీ తరచు సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ పూర్తయిన తరువాత ఏడాదిన్నర పాటు కోర్సులో చేరాడు. కోర్సు వల్ల అమెరికా, ఆస్ట్రేలియాల్లోని రెండు విద్యాసంస్థల్లో దాదాపు ప్రవేశం ఖరారైంది. జీఆర్ఈ, టోఫెల్ లో కూడా మంచి స్కోరు సంపాదించాడు. తర్వాత అమెరికాలోని మాస్టర్స్ చదవడానికి  సీటు కూడా దొరికింది.
  మాస్టర్స్ పూర్తవగానే వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా ఉద్యోగం దొరికింది. అక్కడ ఉన్నప్పుడే వెన్నెల సినిమాకు దర్శకుడు దేవ కట్టా దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డి వీసా కుదరక పోవడంతో పాత్రలో కిశోర్ నటించాల్సి వచ్చింది. అలా మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
  వెన్నెల సినిమా విడుదలయ్యాక మూడేళ్ళు సినిమా ఊసే ఎత్తలేదు. అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నాడు. భార్య పద్మజ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. కిశోర్ అమ్మ సలహా మేరకు ఇద్దరూ భారత్ కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులన్నీ తీర్చుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమాలో కిశోర్ చేసిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు బిందాస్, పిల్ల జమీందార్, బాద్ షా, దూసుకేల్తా, ఆగడు లాంటి సినిమాల్లో తన కామెడీ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వెన్నెల కిశోర్ వెన్నెల ½, జఫ్ఫా అనే సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. తమిళ్ లో డైరెక్టర్ శంకర్ కమల్ హసన్ తో చేస్తున్న భారతీయుడు సినిమాలో ఆయనకు అవకాశం కూడా వచ్చింది.

  2.       Raja Ravindra 

  రాజ రవీంద్ర ప్రముఖ తెలుగు సినిమా నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈయన సెప్టెంబర్ 19, 1970లో భీమవరంలో జన్మించారు. 1994లో పచ్చ తోరణం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి పెద్ద హీరోలతో కలిసి నటించారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 60 పైగా సినిమాల్లో నటించారు. తెలుగు లో సునీల్, నిఖిల్ , రాజ్ తరుణ్ లాంటి హీరో పర్సనల్ మేనేజర్ గా పని చేస్తూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు.

  3.       Thapi Dharma Rao 

  తాపీ ధర్మారావు ప్రముఖ తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు ఈరోజు ఆయన జన్మదినం.  ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19 ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం. ఇతని తొలి రచన 1911లోఆంధ్రులకొక మనవిఅనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లోఆంధ్రవిశారదఅనే బిరుదు,చేమకూరి వెంకటకవి రచించినవిజయవిలాసంకావ్యానికి చేసినహృదయోల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తాపీ ధర్మారావు జయంతి అయిన సెప్టెంబర్ 19 నితెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటారు.

  4.       Salil Chowdhury 

   సలీల్ చౌదరి ప్రముఖ భారతీయ సినీ సంగీత దర్శకులు, కవి, నాటక రచయిత ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈయనకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉండేది తన చిన్నప్పుడు విపరీతంగా సంగీతం వినడంతో కాలేజీకి వచ్చే సమయానికే సొంతంగా ట్యూన్స్ చేయడం మొదలు పెట్టారు.  1949లో పరిబోతాన్ అనే బెంగాలి సినిమాతో ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా రంగానికి పరిచయం అయ్యారు. అయితే 1945లో ఈయన ట్యూన్ చేసిన సాంగ్ బెచార్పోటి టోమార్ బిచార్ అప్పటికే బాగా పాపులర్ అయ్యింది. దాదాపు 20 ఇయర్స్ హిందీ, బెంగాలి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన తర్వాత 1964లో ఈయన చేమ్మేన్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆయన కెరీర్ లో దాదాపు 13 భాషలలో సినిమాలకు మ్యూజిక్ చేసారు వాటిలో 75 హిందీ సినిమాలు, 41 బెంగాలి సినిమాలు, 27 మలయాళ సినిమాలు ఉన్నాయి. సలీల్ చౌదరి తన కెరీర్లో మొత్తం ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 1988లో సంగీత్ నాటక అకాడమి అవార్డు గెలుచుకున్నారు

  5.       Isha Koppikar 

   ఇషా కోపిక్కర్ ప్రముఖ హిందీ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. సెప్టెంబర్ 19, 1976లో ముంబైలో ఆవిడ జన్మించారు. ముంబైలోనే తన చదువు పూర్తీ చేసిన ఇషా గౌతం రాజధ్యక్ష అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలతో లోరెల్, రెక్సోన, కోకాకోల లాంటి యాడ్స్ లో నటించే అవకాశం సంపాదించింది. తర్వత 1995లో జరిగిన మిస్ ఇండియా పోటిలలో పాల్గొని మిస్ క్రౌన్ గెలుచుకుంది. 1998లో తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ అనే సినిమాతో తన సినీరంగ ప్రవేశం జరిగింది. తర్వాత ఆమె తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించింది. 2004లో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో లెస్బియన్ గా నటించడం పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. 2009లో ఇషా తిమ్మి నారంగ్ ను వివాహం చేసుకుంది వీరికి రియాన్న అనే కూతురు ఉంది. రాజకేయాల మీద ఇంట్రెస్ట్ తో ఇషా BJP పార్టీలో చేరింది. జంతు పరిరక్షణ సంస్థ పెటాలో ఇషా సభ్యురాలు కూడా.

 6       Kavya Madhavan

 కావ్యా మాధవన్ ప్రముఖ మళయాళ సినిమా హీరోయిన్ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. కావ్య సెప్టెంబర్ 19, 1984లో జన్మించారు. తనకు ఏడేళ్ళ వయసులో 1991లో పూక్కలం వారవాయి అనే మలయాళ సినిమాలో నటించింది. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి మలయాళ బిగ్ స్టార్స్ తో కలిసి చాలా సినిమాల్లో కావ్య మాధవన్ నటించింది. 2004లో వచ్చిన పెరుమజాక్కలం అనే సినిమాలో నటనకు గానూ ఆమెకు మంచి గుర్తింపు లభించింది అలాగే సినిమాకు ఉత్తమ నటిగా కేరళ స్టేట్ అవార్డు లభించింది. కేవలం నటిగానే కాకుండా పాటల రచయితగా, సింగర్ గా మలయాళం సినిమాల్లో ఆవిడా తన ప్రతిభ నిరుపించుకున్నారు. కావ్య మాధవన్ తన కెరీర్ లో మలయాళం, తమిళ్ సినిమాల్లో కలిపి సుమారు  74 సినిమాల్లో నటించింది

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!