17.7 C
New York
Tuesday, October 19, 2021

Famous People Born on September 21 | Radhika Sarathkumar | Atlee | Kareena Kapoor | Shri Tv Wishes

సెప్టెంబర్ 21 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

 హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1.       Sangeetam Srinivasa Rao 

    సింగీతం శ్రీనివాసరావు ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, పాటల రచయితా, సింగర్ ఈరోజు ఆయన జన్మదినం. గూడూరులో 1931 సెప్టెంబర్‌ 21 పుట్టిన సింగీతం శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన మాతృభాష కన్నడం. నెల్లూరులో వుండి చదువుకోవడం వల్ల తెలుగులో ప్రావీణ్యం సిద్ధించింది. సింగితంకి, రానిదీ, తెలియనిదీ లేదు. ఒక చిత్ర దర్శకుడికి తెలియవలసిన విషయాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన చిత్రకారుడు. నాటకాలు రాశాడు. ఛందోబద్ధంగా పద్యాలు రాశాడు. కథలు రాశారు. ఇన్ని లక్షణాలతో శ్రీనివాసరావు సినిమాల్లో ప్రవేశించారు. ఆయన అభినివేశాలన్నీ కె.వి.రెడ్డికి నచ్చి, ‘మాయబజార్‌’’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు అక్కడే ఆయన పని నేర్చుకున్నారు. తర్వాత కె.వి.దగ్గరపెళ్లినాటి ప్రమాణాలు’, ‘జగదేకవీరుడు కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘సత్యహరిశ్చంద్రమొదలైన చిత్రాలకు సహకార దర్శకుడి హోదాలో పనిచేశారు. లోపల, సినిమా టెక్నిక్‌ అవగాహన, సినిమాకి సంబంధించిన ఇంగ్లిషు పుస్తకాలు, సినిమాలుస్ఫూర్తినిచ్చాయి. కన్నడంలో కీర్తిపొందిన అనంతమూర్తి నవలసంస్కారను సినిమా చెయ్యాలని పట్టాభిరామిరెడ్డి తలపెట్టి, సింగీతాన్ని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. అది, ప్రయోగాత్మక చిత్రం. కేంద్రప్రభుత్వం స్వర్ణ పతకం పాందింది. కె.వి.రెడ్డి కంపెనీలో మేనేజర్‌గా చేసిన శంకర రెడ్డిచిత్ర నిర్మాణం తలపెట్టి శ్రీనివాసరావును దర్శకుడిని చేశారు. ప్రయోగాలు చెయ్యడంలో కొత్త కథలు చెప్పడంలో శ్రీనివాసరావుకు ఆసక్తి. ‘దిక్కెట్ర పార్వతి’- తమిళంలో సి. రాజగోపాలచారి కథ తీసుకుని సహజ వాతావరణంలో చిత్రించారు. చిత్రానికి అవార్డులు వచ్చాయి. కమలహాసన్‌తో తీసినఅపూర్వ సహోదరులుకొత్త ఆలోచన. కష్టసాధ్యమైన టెక్నిక్‌తో తీశారు. ‘పంతులమ్మ’, ‘జమిందారుగారి అమ్మాయి’, ‘రామచిలుక’, ‘పిల్ల జమిందారు’, ‘గమ్మత్తుగూఢచారులు’, ‘సుగుణసుందరి’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘బృందావనం’, ‘మైకేల్‌ మదన కామరాజు’, ‘అమవాస్య చంద్రుడువంటివి ఆయన తీసిన చిత్రాలు. అయితేపుష్పక విమానంఅనే మాటలు లేని చిత్రం ఆయన తీస్తున్నప్పుడు విమర్శలు వినిపించాయి కానీ సినిమా మంచి విజయం సాధించింది. ఆయన తీసిన యానిమేషన్ సినిమా ఘటోత్కచ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. సిన్గేతం కొన్ని కానంద సినిమాలకు సంగీత దర్శకుడిగా చేసారు. సింగీతo ఛందోబద్దంగా పద్యాలు రాస్తారు. ‘భైరవద్వీపంలోవిరిసినది వసంతగానంపాట ఆయన రాసినదే. ఈయన తన కెరీర్లో 50 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే రెండు జాతీయ అవార్డ్ లు, ఏడు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు కర్ణాటక స్టేట్ అవార్డులు గెలుచుకున్నారు.

    2.       Radikaa Sarathkumar  : 

ప్రముఖ సినీ నటి రాధిక పుట్టిన రోజు నేడు. రాధిక తమిళ సినిమా సీనియర్‌ నటుడు ఎమ్‌.ఆర్‌.రాధ, గీత రాధ జంటకి ఆగస్టు 21, 1963 మద్రాసులో జన్మించారు. ‘న్యాయం కావాలితో తెలుగులోకి అడుగుపెట్టిన రాధిక, ‘రాధాకళ్యాణం’, ‘కిరాయి రౌడీలు’, ‘యమకింకరుడు’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మొండిఘటం’, ‘త్రిశూలం’, ‘ప్రేమ పిచ్చోళ్లు’, ‘పల్లెటూరి మొనగాడు’, రాముడు కాదు కృష్ణుడు’, ‘గృహలక్ష్మి’, ‘స్వాతిముత్యం’, ‘జీవనపోరాటం’, ‘దొంగమొగుడు’, ‘ఆరాధన’, ‘ఆత్మబంధువు’, ‘రాజా విక్రమార్క’, ‘స్వాతికిరణం’, ‘సూర్యవంశం’, ‘ప్రేమకథతదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. నిన్నటి తరానికి చెందిన పలువురు తెలుగు కథానాయకులతో కలిసి మరపురాని ఎన్నో చిత్రాల్లో నటించారు. 1980, 90 దశకాల్లో స్టార్‌ కథానాయికగా వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొన్నారు. కథానాయికగానే కాకుండా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటారు. నటన పరంగా కూడా ఆమె అన్ని రకాల పాత్రలు పోషించి ఆల్‌రౌండర్‌ అనిపించుకొన్నారు. చాలా రోజుల తరువాత హీరో రవితేజ నటించినరాజా ది గ్రేట్‌చిత్రంతో కానిస్టేబుల్‌ అనంతలక్ష్మిగా సహాయనటిగా తెలుగులోకి రీ ఏంట్రీ ఇచ్చారు. మొదట ప్రతాప్‌ కె.పోతన్‌ని వివాహం చేసుకొన్న రాధిక పెళ్లయిన ఏడాదికే ఆయన్నుంచి విడిపోయారు. తరువాత బ్రిటన్‌కి చెందిన రిచర్డ్‌ హార్డీని వివాహం చేసుకొన్నారు. ఆయన్నుంచి దూరమయ్యాక, ప్రముఖ కథానాయకుడు శరత్‌కుమార్‌ని 2001లో వివాహం చేసుకొన్నారు. తమిళంలోనే వందకిపైగా సినిమాలు చేసిన రాధిక, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు. కథానాయికగానే కాకుండా రాడన్‌ మీడియా వర్క్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించి, అందులో చిత్రాలతో పాటు, సీరియల్స్ కూడా తీసారు. రాధిక తన కెరీర్లో మొత్తం ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, మూడు తమిళనాడు స్టేట్ అవార్డ్స్, ఒక నంది అవార్డు గెలుచుకున్నారు.

3.     Kareena Kapoor Khan :

కరీనా కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. కరీనాకపూర్‌ 1980, సెప్టెంబర్‌ 21 బొంబాయి (ఇప్పుడు ముంబై)లో జన్మించారు, రణధీర్ కపూర్, బబిత తల్లితండ్రులు. కరీనా కడుపులో ఉన్నప్పుడు ఆమె తల్లి బబితాఅన్నా కెరెనినాఅనే పుస్తకం చదివారట. అందులోంచికరీనాఅన్న పేరుని తీసుకొని ఈమెకి పేరు పెట్టారట. ఇంట్లో అంతా సినిమా కుటుంబానికి చెందినవారవడంతో కరీనాకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది. నర్గిస్, మీనా కుమారిల నటన నుంచి కరీనా ప్రేరణ పొందారు. తర్వాత ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యుడైన కిషోర్‌ నమిత్‌ కపూర్‌ నటన సంస్థలో నటనలో శిక్షణ తీసుకున్నారు టైం లోనే రాకేష్‌ రోషన్‌ దర్శకత్వంలో ఆయన కుమారుడు హృతిక్‌ రోషన్‌ హీరోగాకహో నా ప్యార్‌ హైసినిమాలో అవకాశం వచ్చింది కరీనాకు. కొన్ని రోజుల షూటింగ్‌ తరువాత ప్రాజెక్టు నుంచి కరీనా తప్పుకొన్నారు. అయితే, అదే సంవత్సరం, జె.పి.దత్తా దర్శకత్వంలో అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా తెరకెక్కినరెఫ్యూజీసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కరీనా ఇందులోనాజ్‌అనే పాత్రలో నటించారు. చిత్రంలోని పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నారు కరీనా. ‘ముజే కుచ్‌ కెహనా హై’, ‘కభీ ఖుషి కభీ గంసినిమాలు హిందీ సినిమా పరిశ్రమలో కరీనా కపూర్‌ని ప్రముఖ నటిగా నిలబెట్టాయని కూడా ప్రశంసలు వచ్చాయి. ‘అశోకసినిమాతో భారీగా పారితోషికం తీసుకునేనటిగా కరీనా మారారని కూడా సినిమా విశ్లేషకులు అంటారు. 2002, 2003 సంవత్సరాలలో కరీనా నటించినముజ్‌ సే దోస్తీ కరోగీ’, ‘తలాష్‌’, ‘ఖుషి’, ‘మై ప్రేమ్‌ కి దివానీ హూ’, ‘జీనా సిర్ఫ్‌ మేరె లియేతదితర చిత్రాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ అయ్యాయి. యువ’, ‘దేవ్‌’, ‘ఫిదా’, ‘ఎత్రాజ్‌’, ‘హల్చల్‌’, ‘బేవఫా’, ‘క్యో కి’, ‘దోస్తీ’, ‘36 చైనా టౌన్‌’, ‘చుప్‌ చుప్‌ కేసినిమాలతో బిజీ గా మారారు. ‘ఓంకార, జబ్‌ వీ మెట్‌, ‘ఖుర్బాన్‌’, ‘3 ఇడియట్స్‌ లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. చమేలి అనే సినిమాలో సెక్స్ వర్కర్ గా నటించి ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కరీనా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను 2012లో వివాహం చేసుకున్నారు వీరికి తైమూర్ అనే కొడుకున్నాడు. కరీనా తన కెరీర్లో మొత్తం ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు అనేక ఇతర అవార్డులు గెలుచుకున్నారు అభిమానులు తనని బెబో అనే ముద్దు పేరుతో పిలిచుకుంటారు.

4.     William James Murray :

విలియం జేమ్స్‌ ముర్రే ప్రముఖ హాలీవుడ్ నటుడు, రచయిత నేడు ఆయన జన్మదినం. ఈయన అమెరికాలోని ఇల్లినాయిస్‌లో 1950 సెప్టెంబర్‌ 21 ఎనిమిది మంది సంతానంలో ఒకడిగా పుట్టిన ఇతడు కాలేజీ రోజుల్లో హాస్య ప్రదర్శనల వైపు ఆకర్షితుడయ్యాడు. ‘ఘోస్ట్‌ బస్టర్స్‌సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఇతడు తర్వాత కమేడియన్‌గా, నిర్మాతగా, రచయితగా ఎదిగాడు. ‘మీట్‌బాల్స్‌’, ‘క్యాడీషాక్‌’, ‘స్ట్రైప్స్‌’, ‘టూటైజ్‌’, ‘వాటెబౌట్‌ బాబ్‌’, ‘గ్రౌండ్‌హాగ్‌ డే’, ‘క్విక్‌ ఛేంజ్‌’, ‘రష్‌మోర్‌లాంటి సినిమాల ద్వారా కమేడియన్‌గా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.తన కామెడీ టైమింగ్ తో అద్భుత మైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. టీవీలు, నాటకాలు, సినిమాల్లో అతడికి అనేక అవార్డులు వచ్చాయి. తన కెరీర్లో ముర్రే ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టా, మార్క్‌ట్వైన్‌ ప్రైజ్‌ ఫర్‌ అమెరికన్‌ హ్యూమర్‌ లాంటి అవార్డులు గెలుచుకున్నాడు.

5.    Gurajada Apparao :

గురజాడ అప్పారావు ప్రముఖ రచయిత ఈరోజు ఆయన జన్మదినం.  గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. ఈయన రాసిన కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. 1892లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. 1896లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1910లో అప్పారావు రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం చాలా ప్రసిద్ధి చెందింది. మహాకవి శ్రీశ్రీకన్యాశుల్కము నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదుఅన్నారు.

6.    Atlee Kumar : 

అట్లీ ప్రముఖ తమిళ సినిమా దర్శకులు నేడు ఆయన పుట్టిన రోజు. 2010 లో ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర సూపర్ స్టార్ రోబో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లీ పని చేసారు. తర్వాత శంకర్ దగ్గరే 2012లో విజయ్ హీరోగా వచ్చిన నన్బన్ సినిమాకు పని చేసిన తర్వాత 2013లో రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారారు. సినిమాలో నయనతార, నజ్రీయ, ఆర్య, జై లు నటించారు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అవడంతో 2016లో తమిళ్ టాప్ హీరో విజయ్ తో తేరి అనే సినిమా చేసారు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తర్వాత వరుసగా విజయ్ తో మెర్సాల్, బిజిల్ అనే సినిమాలు తీసారు. అట్లీ నిర్మాతగా కూడా మారి హీరో జీవాతో సంగిలి బుంగిలి కదవ తోరే అనే తమిళ్ సినిమా నిర్మించారు. రాజా రాణి సినిమాకు గానూ అట్లీ విజయ్ అవార్డు ను ఉత్తమ నూతన దర్శకుడు కేటగిరిలో అందుకున్నారు.    

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,988FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!