11.3 C
New York
Saturday, October 23, 2021

Famous People Born on September 22 | Vijaya Bapineedu | PB Srinivas| Unni Mukundan | Shri Tv Wishes

సెప్టెంబర్ 22 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

 హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1.     P.B.Sreenivas :

ప్రముఖ గాయకుడు  పి.బి. శ్రీనివాస్‌ జయంతి రోజు.  శ్రీనివాస్‌కు చిన్నతనం నుంచి మహమ్మద్‌ రఫీ పాటలంటే ప్రాణం. పన్నెండేళ్ళ వయసులో అతని మేనమామ శ్రీనివాస్‌ చేత ఒక నాటకంలో పాటలు పాడించారు. అలా సంగీతం మీద శ్రీనివాస్‌ ఆపేక్ష పెంచుకున్నారు.  తండ్రి శ్రీనివాస్పట్టుదల గ్రహించి 1951లో మద్రాసుకు తీసుకొనివెళ్లి తన బంధువైన ప్రముఖ వైణిక విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రికి అప్పజెప్పాడు. శంకరశాస్త్రి అప్పట్లో జెమినీ స్టూడియోలో ఉంటూ సాలూరు రాజేశ్వరరావు వద్ద సహాయకుడిగా పనిచేసేవారు. శంకరశాస్త్రి శ్రీనివాస్‌ను ఎస్‌.ఎస్‌. వాసన్‌కు పరిచయం చేశారు. వాసన్‌ ఎదుట శ్రీనివాస్‌దీదార్‌సినిమాలో మహమ్మద్‌ రఫీ పాడినహుయే హమ్‌ జిన్‌ కే లియే బర్బాద్‌పాటను పాడి వినిపించారు. వాసన్‌కు శ్రీనివాస్‌ పాడే తీరు నచ్చింది. ఆయన పి.బి.ని హిందీ చిత్రంమిస్టర్‌ సంపత్‌’ (1952)లో నేపథ్యగాయకుడిగా పరిచయం చేశారు. సినిమాలో పి.బి. శ్రీనివాస్‌ మూడు పాటలు పాడారు. తరవాత సౌండ్‌ రికార్డిస్ట్‌ జీవా సాయంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. ‘ఏలా దిగులేలా, కాలము మారునులే, మరువకే బేలా దిగులేలాఅనే పాట తెలుగులో శ్రీనివాస్‌ పాడిన తొలిపాట.  పి.బి. శ్రీనివాస్‌ బహుభాషా కోవిదుడు. ఆయనకు ఎనిమిది భాషల మీద మంచి పట్టుంది. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. సంగీత దర్శకత్వం కూడా చేసారు.  వేలకొద్దీ కవితలు రాశారు, ఆకాశవాణికి పాటలు పాడారు, మూడు నాలుగు కన్నడ సినిమాల్లో వేషాలు కూడా వేశారు. తెలుగులో ఆయన పాడిన తలచినదే జరిగినదా దైవం, ఎందులకో అందాల చిలకా అందుకో నా లేఖా, ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు అనే పాటలు క్లాసిక్స్ గా నిలిచాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కానంద, హిందీ, కొంకణి, తులు భాషల్లో కలిపి కొన్ని వందల పాటలు పాడారు. తమిళనాడు ప్రభుత్వం శ్రీనివాస్‌కుకలైమామణిపురస్కారం అందించింది. కర్నాటక ప్రభుత్వంరాజోత్సవపురస్కారం ఇచ్చి గౌరవించింది.

2.       Paul Muni  :  

పాల్ ముని ప్రముఖ హాలీవుడ్ నటుడు. నేడు ఆయన పుట్టిన రోజు.  తొలి సినిమా వేలియంట్‌’ (1929)లో నటనకే అతడికి ఆస్కార్‌ నామినేషన్‌ లభించింది. ఆపైశాక్రిఫైజ్‌’, ‘ యామ్‌ ఫ్యుగిటివ్ఫ్రమ్‌ చైన్‌గ్యాంగ్‌లాంటి సినిమాలు అతడిలోని ప్రతిభను చిత్రసీమకు పరిచయం చేశాయి. ప్రముఖ శాస్త్రవేత్త జీవితాధారంగా తీసిన స్టోరీ ఆఫ్‌ లూయిస్‌ పాశ్చర్‌సినిమాతో అతడి ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకింది. తర్వాత బయోపిక్‌ సినిమాలకు అతడే చిరునామా అయ్యాడు. ‘డిజ్రాయిల్‌’, ‘అలగ్జాండర్‌ హ్యామిల్టన్‌’, ‘వోల్టైర్‌’, ‘ లైఫ్‌ ఆఫ్‌ ఎమిలే జోలా’, ‘జ్యువారెజ్‌’, ‘ గుడ్‌ ఎర్త్‌లాంటి బయోపిక్స్‌లో అతడి నటన జేజేలు అందుకుంది.ముఖ్యంగా మేకప్‌పై అతడి శ్రద్ధ, అధ్యయనం అతడిని విలక్షణ నటుడిగా తీర్చిదిద్దాయి. పన్నెండేళ్ల వయసులో అతడు వేసిన మొదటి వేషమేంటో తెలుసా? 80 ఏళ్ల వృద్ధుడి వేషం. పాత్ర పోషణ కోసం అతడు వేసుకున్న మేకప్, శరీర భాష, సంభాషణలు పలికిన తీరు చూసి పెద్ద పెద్ద నటులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత హాలీవుడ్ సినిమాల్లో అతడొక సంచలనంగా మారిపోయాడు. నటుడు పాత్రను ఒప్పుకుంటే దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలనుకుంటాడు. కానీ పాల్‌ముని అలా కాదు. పాత్ర గురించి సమస్త సమాచారాన్ని సేకరించేవాడు. పాత్రకు సంబంధించిన పుస్తకాలన్నీ చదివేవాడు. పాత్రతో పరిచయం ఉన్నవారిని కలిసి, మాట్లాడి శరీర భాష, మాట్లాడే తీరులాంటి ఎన్నో సంగతులను ఆకళింపు చేసుకునేవాడు. తర్వాతనే పాత్రను పోషించేవాడు. అందుకే అతడు ధరించిన జీవిత పాత్రలు ఇన్నాళ్లకీ అద్భుతంగా కనిపిస్తాయి. ప్రముఖ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జీవితo ఆధారంగా తీసిన స్టోరీ ఆఫ్‌ లూయిస్‌ పాశ్చర్‌సినిమాతో అతడి ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకింది. తర్వాత బయోపిక్‌ సినిమాలకు అతడే చిరునామా అయ్యాడు. ‘డిజ్రాయిల్‌’, ‘అలగ్జాండర్‌ హ్యామిల్టన్‌’, ‘వోల్టైర్‌’, ‘ లైఫ్‌ ఆఫ్‌ ఎమిలే జోలా’, ‘జ్యువారెజ్‌’, ‘ గుడ్‌ ఎర్త్‌లాంటి బయోపిక్స్‌లో అతడి నటన జేజేలు అందుకుంది. పక్క సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూనే, నాటకాలు, టీవీల ద్వారా మేటి నటుడిగా ప్రాచుర్యం పొందాడు. ఆస్కార్‌ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నాడు.

3.       Vijaya Bapineedu  : 

విజయ బాపినీడు ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు నేడు ఆయన జన్మదినం. ఈయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కళాశాలలో బీఏ చదివిన ఆయన కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బాపినీడుకి మొదటినుంచీ రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉండేది. గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్‌ నవలలు రాసేవారు. తర్వాత భార్య విజయ పేరు కలిసి వచ్చేలా విజయ బాపినీడు పేరుతో రచనలు చేశారాయన. తన పుస్తకాలను వేరే వాళ్లు పబ్లిష్‌ చేయడం కంటే సొంతంగా పబ్లిష్‌ చేసుకుంటే సంపాదన పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, కుటుంబంతో సహా మద్రాసు వెళ్లారు. అక్కడ అప్పటికే పేరున్న రచయితలు విశ్వప్రసాద్, కొమ్మూరిలను బాపినీడు కలిశారు. ‘డిటెక్టివ్‌ నవలలు ప్రచురించడం వల్ల లాభం లేదుఅని వారు చెప్పడంతోబొమ్మరిల్లు, విజయఅనే మాస పత్రికలను ప్రారంభించారు. ఇండియన్‌ ఫిల్మ్, నీలిమ పత్రికలకు ఎడిటర్‌గానూ వ్యవహరించారు. బాపినీడుని ఫల్గుణా ప్రొడక్షన్స్‌ వారు పిలవడంతో తన దృష్టిని చలన చిత్రరంగంవైపు మళ్లించారు. ఆయన రాసినజగత్‌ జెట్టీలుకథను ఫల్గుణా ప్రొడక్షన్సవారు సినిమాగా తీశారు. తర్వాతహంతకులుదేవాంతకులుసినిమాకి కథ అందించారు బాపినీడు. తర్వాతరంభఊర్వశిమేనక, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టుకాటుక, రుద్రతాండవంవంటి సినిమాలు నిర్మించారాయన. ఇతర దర్శకుల దర్శకత్వంలో 12 సినిమాలు నిర్మించిన ఆయన. చిరంజీవి హీరోగా 1983లోమగ మహారాజుసినిమాతో దర్శకునిగా మారారు. తర్వాతమహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెం.786, గ్యాంగ్‌లీడర్,  బిగ్‌బాస్‌చిత్రాలను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. విజయబాపినీడు ఎంతోమందిని తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి. రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్ధన్‌లను దర్శకులుగా, ఎం.వి.రఘు, మహీధర్, శ్రీనివాసరెడ్డి, బాబు, ప్రసాద్‌లను కెమెరామేన్‌లుగా, పాటల రచయిత భువనచంద్రను, మాటల రచయిత కాశీ విశ్వనాథ్‌వంటి ఎందర్నో పరిచయం చేశారాయన.   విజయబాపినీడు మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, శోభన్‌బాబులతోనే ఎక్కువ సినిమాలు చేశారాయన.

4.    Unni Mukundan : 

ఉన్ని ముకుందన్ ప్రముఖ మళయాళ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. ఈయన సెప్టెంబర్ 22, 1987 కేరళలోని తిరుచూర్ లో జన్మించారు. ముకుందన్ 2011 లో సీదన్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. 2012 లో వచ్చిన మల్లు సింగ్ అనే సినిమాతో ఆయనకు బ్రేక్ వచ్చింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.అలాగే 2018 లో హీరోయిన్ అనుష్క నటించిన భాగమతి సినిమాలో ఆమెకు జోడిగా నటించారు. ముకుందన్ మలయాళం లో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ లతో కలిసి నటించారు. 2017 లో వచ్చిన ఆచయన్స్ అనే మలయాళ సినిమాతో లిరిక్ రైటర్, సింగర్ గా మారారు. ముకుందన్ నటుడిగానే కాకుండా పాటల రచయిత, సింగర్ గా కూడా కొన్ని సినిమాలు చేసారు.  ఉన్ని ముకుందన్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో కలిపి ఇప్పటి వరకు 34 సినిమాల్లో నటించారు. ముకుందన్ 2011లో బాంబే మార్చ్ 12 అనే సినిమాకు నూతన ఉత్తమ నటుడిగా ఆసియానెట్ అవార్డు గెలుచుకున్నారు.

5.    Indrajit Lankesh :  

ఇంద్రజిత్ లంకేష్ ప్రముఖ కన్నడ సినిమా దర్శకుడు, నిర్మాత నేడు ఆయన పుట్టిన రోజు. లంకేష్ కర్నాటకలోని షిమోగా లో జన్మించారు ఈయన ఫాదర్ పి.లంకేష్ కన్నడలో ప్రముఖ జర్నలిస్ట్ లంకేష్ పత్రికే అనే పేరుతో 1980 నుంచి వార పత్రికను నడుపుతున్నారు కర్ణాటకలో పత్రికకు మంచి ఆదరణ ఉంది. 2001 లో తుంట అనే కానంద సినిమాతో లంకేష్ తన సినీ ప్రయాణం మొదలు పెట్టారు. 2004 లో లంకేష్ దర్శకత్వం వహించిన మోనాలిస సినిమా కన్నడలో సంచలన విజయం సాధించింది సినిమాలో ప్రముఖ నటుడు ఉపేంద్ర హీరోగా నటించారు కర్ణాటకలో సినిమా 25 వారాలు పాటు ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. తర్వాత మోనాలిస సినిమా అన్ని సౌంత్ ఇండియన్ భాషల్లోకి డబ్బింగ్ అయ్యింది. ఉపేంద్ర హీరోగా 2006 లో ఐశ్వర్య అనే సినిమాకు దర్శకత్వం వహించారు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు.  లంకేష్ తన మొదటి సినిమా తుంటటకు ఉత్తమ నూతన దర్శకుడిగా వి శాంతారాం అవార్డు గెలుచుకున్నారు అలాగే మోనాలిస సినిమాకు కర్ణాటక స్టేట్ అవార్డు, ఐశ్వర్య అనే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.

6.    Ravi Jadhav  :

రవి జాదవ్ ప్రముఖ మరాఠీ సినిమా దర్శకుడు, నటుడు, రచయిత, నిర్మాత  నేడు ఆయన పుట్టిన రోజు.  ఈయన విజువల్ కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైనింగ లో డిగ్రీ చేసారు. 2010 నటరంగ్ అనే మరాఠీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత ఈయన తీసిన బాల గాంధర్వ అనే సినిమా కేన్స్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లలో స్క్రీనింగ్ అయ్యింది. రవి బోల్డ్ సినిమాలను తీయడానికి మాత్రం భయపడలేదు 2013 లో సెక్స్ ఎడ్యుకేషన్ మీద బాలక్ పాలాక్  అనే సినిమా తీసారు అలాగే 2018లో ఈయన తీసిన న్యూడ్ అనే సినిమా కూడా చాలా వివాదాస్పదం అయ్యింది. రవి జాదవ్ తీసిన నటరంగ్ అనే సినిమా ఉత్తమ మరాఠీ సినిమాగా నేషనల్ అవార్డు గెలుచుకుంది

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!