19 C
New York
Thursday, October 21, 2021

Famous People Born on September 24 | Sreenu Vaitla | Rajesh Kattar | Shri Tv Wishes

సెప్టెంబర్ 24  మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1.       SREENU VAITLA: 

  శ్రీను వైట్ల ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు నేడు పుట్టినరోజు. ఈయన  తూర్పు గోదావరి జిల్లా, కందులపాలెంలో జన్మించారు.  సినిమాలపై ప్రేమతో మద్రాసు వెళ్లారు. ముందు దర్శకుడు సాగర్ దగగ్ర సహాయ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీను వైట్ల 1999లోనీకోసంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చిత్రం తర్వాత ఉషాకిరణ్‌ మూవీస్‌లోఆనందంతెరకెక్కించారు. సినిమాతో  కామెడీపై పట్టున్న దర్శకుడు అనే పేరు తెచ్చుకొన్నారు. ఆనంద్ సినిమాతో శ్రీనువైట్ల పేరు మారుమోగిపోయింది. ఆతర్వాతసొంతం’, ‘ఆనందమానందమాయే’, ‘వెంకీ’, ‘అందరివాడు’, ‘ఢీ’, ‘దుబాయ్‌ శీనుతదితర చిత్రాలు చేశారు. అవన్నీ ఒకెత్తైతే, తర్వాత చేసినరెడీమరో ఎత్తు.  శ్రీను వైట్ల కామెడీ మార్క్‌ ఎంత బలంగా ఉంటుందో చిత్రంతో మరోమారు రుజువైంది.   తర్వాత మహేష్‌బాబుతోదూకుడుతెరకెక్కించి బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ము దులిపెసారు. తర్వాత వెంకటేష్‌ కథానాయకుడిగా తెరకెక్కించిననమో వెంకటేశాయ’, నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కించినకింగ్‌’, ఎన్టీఆర్‌తో తీసినబాద్‌షాచిత్రాలు శ్రీను వైట్లకి మంచి పేరు తీసుకొచ్చాయి.   జంధ్యాల, ఈవీవీ తర్వాత కామెడీ పరంగా అంత ప్రభావం చూపించిన ఘనత శ్రీనువైట్లకే దక్కుతుంది. ‘ఆగడునుంచి ఆయనకి పరాజయాలు ఎదురయ్యాయి. ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్‌’ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీతదితర చిత్రాలు నిరాశకు గురిచేశాయి.  అగ్ర కథానాయకులతో సినిమాలు చేసిన శ్రీను వైట్ల తన తోలి సినిమా ఆనందం కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు,దూకుడు సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయనకి భార్య రూప వైట్లతోపాటు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

2.       Koratala Satyanarayana :

 కొరటాల సత్యనారాయణ (సెప్టెంబరు 24, 1923 – జూలై 1, 2006) ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు నేడు ఆయన జన్మదినం.గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో 1924 సెప్టెంబరు 24 పిచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించాడు భారత కమ్యూనిస్టు పార్టీమార్క్సిస్టు (సి.పి.ఎం) యొక్క పాలిట్‌బ్యూరో సభ్యుడు. గుంటూరు జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునాదులు వేశాడు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసాడు.  తెలుగు నాట సామ్యవాద ఉద్యమానికి ఆద్యులలో ఒకడు సత్యనారాయణ. పాఠశాల దశలోనే న్యాయ పోరాటమునకు తొలి అడుగులు వేశాడు. 1938-39 తురుమెళ్ళ పాఠశాలలో పరీక్షా విధాన పద్ధతిని వ్యతిరేకించి 11 రోజులు ఉద్యమము చేశాడు. సందర్భములో గుంటూరులో ఉన్న విద్యార్థి నాయకుడు మాకినేని బసవపున్నయ్యను సత్యనారాయణ కలవడం జరిగింది. ఆయన ప్రభావంతో సత్యనారాయణలో కమ్యూనిస్ట్ భావాలు ఏర్పడ్డాయి. 1942లో గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరాడు ఆపై విద్యార్థి నాయకుడుగా ఎదిగాడు. క్విట్ ఇండియా ఉద్యమo, గుంటూరులో విద్యార్థుల మీద పోలీసు కాల్పులు విద్యార్థుల మరణం ఆయనలో ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1943లో జిల్లా విద్యార్థి సంఘ సభ్యుడయ్యాడు. దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన ఎన్నో మంచి పనులు చేసారు.

3.       Mohinder Amarnath : 

మోహిందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఈరోజు ఆయన జన్మదినం. ఈయన 1950 సెప్టెంబర్ 24 పాటియాలాలో జన్మించారు. అసలు పేరు భరద్వాజ్ మోహిందర్ అమర్‌నాథ్, తండ్రి లాలా అమర్‌నాథ్ భారత తోలి క్రికెట్ జట్టు కెప్టెన్.1969లో ఆస్ట్రేలియాపై చెన్నైలో మోహిందర్ అమర్‌నాథ్ తన తొలి టెస్ట్ ఆడాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గా పేరుపొందాడు, మేటి బౌలర్స్ అనదగ్గ ఇమ్రాన్‌ఖాన్, మాల్కం మార్షల్ లాంటి బౌలర్లు అమరనాథ్ గురించి గొప్పగా పొగిడారు. సునీల్ గవాస్కర్ తను రచించిన “Idols” పుస్తకంలో ప్రపంచంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా మోహిందర్ అమర్‌నాథ్ ను కీర్తించాడు. ఈయన తొలి సెంచరీని పెర్త్ లో ఆస్ట్రేలియా పై సాధించాడు, జెఫ్ థాంప్సన్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించడం విశేషం. మోహిందర్ అమర్‌నాథ్ తన కెరీర్లో 69 టెస్టులు ఆడి 4378 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ లో 85 మ్యాచ్‌లు ఆడి 1924 పరుగులు చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 102. భారత్ విజయం సాధించిన 1983 ప్రపంచ కప్ సిరీస్ లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ  మోహిందర్ అమర్‌నాథ్  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. అభిమానులు తనని జిమ్మీ అనే ముద్దు పేరుతో పిలుస్తారు.

4.       Dhulipala Seetarama Sastry : 

ధూళిపాళ సీతారామ శాస్త్రి ప్రముఖ తెలుగు సినిమా నటుడు నేడు ఆయన జన్మదినం. ధూళిపాళగా ప్రసిద్ధి చెందిన ఈయన సెప్టెంబర్ 24, 1922లో గుంటూరులో జన్మించారు. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించినశకునిపాత్రే కళ్లముందు మెదులుతుంది అంతగా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి..సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి..సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు గారు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి చిత్రాల్లో ఆయన నటన మరువలేనిది. తెలుగు నాటక, సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన ధూళిపాళ గారికి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.
వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ, ఆత్మగౌరవ పురస్కారం లాంటివి ఉన్నాయి. తమిళ పత్రికలు సైతం ఆయననునడిప్పిళ్‌ పులి నడత్తళ్‌ పసువుఅని అభివర్ణించారు. అంటేనటనలో పులినడతలో గోవు అని అర్థం.

5.       Arati Gupta Saha  : 

 ఆరతి సాహా ప్రముఖ ఇండియన్ స్విమ్మర్ నేడు ఆవిడ జన్మదినం.  ఈవిడ సెప్టెంబర్ 24, 1940లో జన్మించింది. ఆరతి తన నలుగ ఏట నుంచే స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన భారతీయ స్విమ్మర్ మిహిర్ సేన్ ను చూసి ఇన్ స్పైర్ అయ్యింది. తను కూడా ఇంగ్లీష్ ఛానల్ ఈదాలన్న పట్టుదలతో ప్రయత్నించి సెప్టెంబర్ 29, 1959 ఇంగ్లీష్ ఛానల్ ఈది ఘనత సాధించిన తోలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. ఆరతి ఫ్రాన్స్ లోని కేప్ గ్రీస్ సెజ్ నుండి ఇంగ్లాండ్ లోని సాండ్ గేట్ వరకు 21 మైళ్ళ దురాన్ని 16 గంటల 20 నిమిషాలలో పూర్తీ చేయగలిగింది. 1960లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 1998 లో వివిధ రంగాలలో భారతీయ మహిళల కృషికి గుర్తింపుగా, ఆర్తీ గుప్తాకు కూడా పోస్టల్ స్టాంపును భారత ప్రభుత్వం విడుదలచేసింది.

6.       Rajesh Khattar :  

 రాజేష్ కట్టర్ ప్రముఖ భారతీయ నటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ నేడు ఆయన జన్మదినం. ఈయన 1966లో జన్మించారు.. రాజేష్ హిందీ సినిమాల్లో గత కొన్నేళ్లుగా నటిస్తున్నారు వాటిలో డాన్, డాన్ 2, కిలాడి 786, రేస్ 2 సినిమాలు చెప్పుకోతగ్గవి. ఈయన శర్పేస్ పెరెల్ అనే ఇంగ్లీష్ టెలివిషన్ సిరీస్లోనూ అలాగే ఫిస్ పస సి పస కా అనే ఫ్రెంచ్ టీవీ సిరీస్ లో నటించారు. రాజేష్ అనేక యానిమేషన్ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసారు అలాగే ఈయన ముఖ్యంగా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు హిందీ డబ్బింగ్ చెపుతుంటారు అలా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలకు రాజేష్ డబ్బింగ్ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ తల్లి నీలిమ అజీం ను పెళ్ళి చేసుకుని తర్వత విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇషాన్ కట్టర్ కు ఈయన కొడుకే.  

 ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!