17.7 C
New York
Tuesday, October 19, 2021

Famous People Born on September 25 | Bishan Singh Bedi | Deen Dayal Upadhyaya | Shri Tv Wishes

సెప్టెంబర్ 25 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1.     Christopher Reeve: 

   ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టొఫర్‌ రీవ్‌ పుట్టినరోజు నేడు. 1952 సెప్టెంబర్‌ 25 పుట్టిన ఇతడు సూపర్ మ్యాన్ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రపంచంలో సూపర్ మ్యాన్ అంటే తెలియని వారుండరు. ఇతను  చదువుకునే రోజుల్లో 9 ఏళ్ల వయసు నుంచే నాటకాల ద్వారా నటన పట్ల ఆసక్తి పెంచుకున్న క్రిస్టోఫర్‌ రీవ్, విద్యార్థి దశలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెండితెరపై తొలిసారిగాగ్రే లేడీ డౌన్‌’ (1978) అనే సినిమాలో కనిపించాడు. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవుతో సన్నగా రివటలా ఉండే రీవ్, సూపర్‌మ్యాన్‌ పాత్ర కోసం కృత్రిమ కండరాలను అమర్చుకోడానికి ఇష్టపడకుండా రెండు నెలల పాటు వ్యాయామాలు చేసి పాత్రకు తగిన దారుఢ్యాన్ని పొందాడు. 1978లో విడుదలైనసూపర్‌మ్యాన్‌సినిమాతో రాత్రికి రాత్రి స్టార్‌ హోదా పొందాడు. సూపర్‌మ్యాన్‌ పాత్రతో ప్రాచుర్యం పొందినప్పటికీ ఇతడు ఇతర సినిమాల్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘ బోస్టోనియన్స్‌’  , ‘స్ట్రీట్‌ స్మార్ట్‌’, ‘ రిమైన్స్‌ ఆఫ్‌ డేలాంటి  చిత్రాలతో ఉత్తమ నటుడిగా ప్రశంసలు పొందాడు.   సూపర్‌మ్యాన్‌ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన మరో మూడు సినిమాల్లో నటించాడు. అయిదవ సినిమాగాసూపర్‌మ్యాన్‌ రీబార్న్‌లో నటించేలోగానే ప్రమాదానికి గురయ్యాడు. చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత కూడా రీవ్, హెచ్‌బీఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా స్వయంగా నటిస్తూ ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ 1954లో తీసినరేర్‌ విండోసినిమాను 1998లో రీమేక్‌ చేశాడు. ఇందులో నటనకు కూడా పురస్కారం అందుకున్నాడు. ఇతడి ఆత్మకథస్టిల్‌ మిసినిమా బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. తర్వాత అతడి రెండో పుస్తకంనథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌’ ప్రచురితమైంది.

2.    Will Smith : 

 విల్ స్మిత్ ప్రముఖ హాలీవుడ్ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 1968 సెప్టెంబర్‌ 25 పుట్టాడు.  చిన్నప్పుడే స్కూలు స్నేహితులతో కలిసి పాటలు పాడటం మొదలెట్టాడు. పన్నెండేళ్లకే స్నేహితుడితో కలిసి ర్యాపర్‌గా ఆకట్టుకున్నాడు, తర్వాత తాము పాడిన పాటలతో సింగిల్స్, ఆల్బమ్స్‌ విడుదల చేశాడు, వాళ్ల బృందం గ్రామీ అవార్డులు కూడా అందుకుంది. అలా విల్‌స్మిత్‌ యువ వయసులోనే ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టేంత డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. ఆపై టీవీల్లో నటుడిగా పేరు పొందాడు. తర్వాతమేడిన్ అమెరికా’, ‘సిక్స్‌ డిగ్రీస్‌ ఆఫ్‌ సెపరేషన్‌’ (1993), ‘బ్యాడ్‌బాయిస్‌’ (1995) సినిమాలతో వెండితెర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996లో వచ్చినఇండిపెండెన్స్‌ డేసినిమాతో హాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యాడు, సినిమా అత్యధిక వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఆపై వచ్చినమెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘ఏజెంట్‌ జె’, ‘ఎనిమీ ఆఫ్‌ స్టేట్‌’, ‘ మ్యాట్రిక్స్‌’, ‘మహమ్మద్‌ అలీ’, ‘ రోబోట్‌’ ‘ పర్‌స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’, ‘ఫోకస్‌’, ‘స్యూసైడ్‌ స్క్వాడ్‌’, ‘బ్రైట్‌లాంటి సినిమాలతో దూసుకుపోయాడు. అతడు నటించిన సినిమాలన్నీ కలిసి 2016 నాటికే 7.5 బిలియన్‌ డాలర్లు వసూలు చేసి అతడిని బ్లాక్‌బస్టర్‌ బాక్సాఫీస్‌ స్టార్‌గా మార్చాయి. కెరీర్లో విల్ స్మిత్ నటుడిగా, నిర్మాతగా, కమేడియన్‌గా, ర్యాపర్‌గా, గీతరచయితగా తన ప్రతిభను నిరుపించుకున్నాడు.

3.    Mark Hamill :  

మార్క్ హామిల్ ప్రముఖ హాలీవుడ్ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. కాలిఫోర్నియాలో 1951 సెప్టెంబర్‌ 25 ఏడుగురు సంతానంలో ఒకడిగా పుట్టిన ఇతడు, కాలేజి రోజుల్లోనే నటన వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాలు, టీవీల ద్వారా పేరు తెచ్చుకున్న మార్క్ వేరే సినిమాలో పాత్ర కోసం ఆడిషన్‌కి వెళ్లి, ‘స్టార్‌వార్స్‌సినిమాల్లో పాత్రకు ఎంపికయ్యాడు. నిజానికిఅపోకలిప్స్‌ నౌపాత్ర ఆడిషన్స్‌కి హాజరైన అతడిని గమనించిన స్నేహితుడు అదే చోట జరుగుతున్నస్టార్‌వార్స్‌ఆడిషన్స్‌కి వెళ్లమని ఇచ్చిన సలహానే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది సినిమాతో హామిల్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ‘స్టార్‌వార్స్‌సినిమాలో ల్యూక్‌ స్కైవాకర్‌ పాత్ర ద్వారా అతడు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకోవడమే కాదు, మూడు సీక్వెల్‌ సినిమాల్లో అదే పాత్ర పోషించినందుకు ఉత్తమ నటుడిగాశాటర్న్‌ అవార్డుఅందుకున్నాడు. ఎన్నో యానిమేషన్‌ పాత్రలకు డబ్బి చెప్పిన మార్క్ డబ్బింగ్ ఆక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడుబ్యాట్‌మేన్‌: యానిమేటెడ్‌ సిరీస్‌యానిమేషన్‌ చిత్రాల్లో సూపర్‌ విలన్‌జోకర్‌పాత్రకు ఇతడు చెప్పిన డబ్బింగ్‌ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. మార్క్ హామిల్  ‘కార్వెట్‌ సమ్మర్‌’, ‘ బిగ్‌ రెడ్‌ వన్‌’, ‘ నైట్‌ లైట్స్‌ వెంట్‌ ఔట్‌ ఇన్‌ జార్జియా’, ‘బ్రిటానియా హాస్పిటల్‌’, ‘స్లిప్‌స్ట్రీమ్‌’, ‘మిడ్‌నైట్‌ రైడ్‌లాంటి సినిమాల్లో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

4.    Bishan Singh Bedi :

 బిషన్ సింగ్ బేడి ప్రముఖ మాజీ భారత క్రికెట్ ప్లేయర్ నేడు ఆయన జన్మదినం. బిషన్ సింగ్ 25 సెప్టెంబర్, 1946లో పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. ముందుగా పంజాబ్ క్రికెట్ టీం కు రంజీ మ్యాచ్ లు ఆడిన నిషాన్ సింగ్ తర్వాత ఢిల్లీ కి షిఫ్ట్ అయ్యాడు. 1968-69లో జరిగిన రంజీ మ్యాచ్ లో 64వికెట్స్ తీసుకోవడం ద్వారా మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు. బేడీ తన ఫస్ట్ క్లాసు క్రికెట్ లో మొత్తం 1560 వికెట్లు తీసుకుని రికార్డు క్రియేట్ చేసాడు. ఈయన బౌలింగ్ శైలి విభిన్నగా ఉండి ప్రత్యర్థి బాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టేది. 1966 లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వార టెస్ట్ క్రికెట్లోకి వచ్చిన బిషన్ సింగ్ బేడి తన కారేర్లో మొత్తం 67 మ్యాచ్ లు ఆడి మొత్తం 266 వికెట్స్ తీసాడు ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్స్ ఒకసారి, 5 వికెట్స్ 14 సార్లు తీసాడు. బేడి తన తోలి వన్ డే మ్యాచ్ 1974లో ఇంగ్లాండ్ తో ఆడాడు కారేర్లో మొత్తం కేవలం 10 వన్ డే మ్యాచ్ లు మాత్రమె ఆడి ఏడు వికెట్స్ తీసుకున్నాడు. ఒక వన్ డే మ్యాచ్ లో అత్త్యత్తమ ప్రదర్శన 1975 వరల్డ్ కప్ లో 12 ఓవర్స్ వేసిన బేడి కేవలం 6 పరుగులే ఇచ్చి ఒక విక్కేట్ తెసాడు దానిలో 8 మెయిడెన్ ఓవర్స్ ఉన్నాయి ఇది వరల్డ్ రికార్డు కింద ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

5.    Deendayal Upadhyaya :

 దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రముఖ రాజకీయ నాయకుడు నేడు ఆయన జన్మదినం. 1916 సెప్టెంబర్ 25 ఉత్తర ప్రదేశ్‌ లోని మధుర దగ్గరనగ్ల చంద్రభాన్అనే గ్రామంలో జన్మించారు.  రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సిద్దాంతకర్త . 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు. 1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లొ జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు పదవిలో కొనసాగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపధంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నొ దినపత్రికస్వదేశ్లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. శంకరాచార్య జీవిత చరిత్ర, హిందీలోచంద్రగుప్త మౌర్యనాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు.

6.    Bhupathiraju Somaraju :

 భూపతి రాజు సోమరాజు ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు నేడు ఆయన పుట్టిన రోజు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో సెప్టెంబరు 25, 1948లో జన్మించాడు. 1970లో గుంటూరు మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ చేసారు. తర్వాత కార్డియాలజీ లో స్పెషలిస్ట్ గా చేసారు. తరువాత ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసులో కార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరాడు. ఉస్మానియా వైద్య కళాశాల, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశాడు. తర్వాత కేర్ హాస్పిటల్స్ స్థాపించి పేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో ఈయన చ్జేసిన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,988FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!