20.1 C
New York
Thursday, October 21, 2021

Famous People Born on September 27 | Yash Chopra | Nagesh | Rahul Dev | Shri Tv Wishes

సెప్టెంబర్ 27 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

 
హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1.  Nagesh :   నగేష్ ప్రముఖ తమిళ సినిమా నటుడు నేడు ఆయన జన్మదినం. హాస్య నటుడు నాగేష్‌ అసలు పేరు చెయ్యూరు కృష్ణ నాగేశ్వరన్‌. పుట్టింది. స్కూలు చదువు అయ్యాకా నగేష్‌ కోయంబత్తూరులో ఇంటర్మీడియట్‌లో చేరి దానిని పూర్తిచేశాడు. తర్వాత చదువుకు స్వస్తి చెప్పి మద్రాసు చేరుకొని రైల్వేలో గుమాస్తా వుద్యోగం సంపాదించాడు. తనతోబాటు పనిచేసే రైల్వే వుద్యోగులుకంబ రామాయణంవంటి నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. రైల్వే సాంస్కృతిక సంస్థ ఒకసారి నాగేష్‌కు నటించే అవకాశం కల్పించింది. నాటకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం.జి.రామచంద్రన్‌ నాగేష్‌ నటనను మెచ్చుకున్నారు. దాంతో నాగేష్‌కు ఎక్కువ నాటకాల్లో నటించే అవకాశాలు మెరుగయ్యాయి. 1958లో పద్మా ఫిలిమ్స్‌ వారు నిర్మించినమనముళ్ళ మరుథ్ధారంసినిమాలో నగేష్‌ ఒక చిన్న పాత్రను పోషించే అవకాశాన్ని హీరో కె.బాలాజీ ఇప్పించాడు. అయితే 1962లో చిత్రాలయ పిక్చర్స్‌ అధినేత, దర్శకుడు సి.వి.శ్రీధర్‌ నిర్మించిన సూపర్‌ హిట్‌ మూవీనెంజిల్‌ ఒరు ఆలయం’ (తెలుగులోమనసే మందిరం’ -1966)లో పీటర్‌ పాత్రలో  నటించడంతో నగేష్‌ పేరు బాగా తెలిసివచ్చింది. 1964లో బాలచందర్‌ నాగేష్‌ని దృష్టిలో వుంచుకొనిసర్వర్‌ సుందరంఅనే రంగస్థల నాటకం రచించి తనే ప్రదర్శనలు ఇచ్చేవారు. నాటకం చూసి ప్రభావితమైన .వి.ఎం సంస్థ అధిపతి మెయ్యప్పన్‌ బాలచందర్‌ వద్ద నుంచి కథా హక్కులు కొని, కృష్ణన్‌ పంజు దర్శకత్వంలో అదే పేరుతో 1964లో సినిమాగా నిర్మించారు. నాటకంలో పోషించిన టైటిల్‌ పాత్రను సినిమాలో కూడా నాగేషే పోషించాడు. చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయచిత్ర బహుమతితో బాటు ఫిలింఫేర్‌ బహుమతి కూడా దక్కింది. సినిమా సూపర్‌ హిట్టై నాగేష్‌కు స్టార్ డమ్ పెంచింది. సర్వర్‌ సుందరం విజయంతో నాగేష్‌ మరుసటి సంవత్సరం ఏకంగా 35 సినిమాల్లో బుక్‌ అయ్యాడు. తెలుగులో నగేష్ ఎన్టీఆర్, ANR లతో కలిసి పలు సినిమాల్లో నటించాడు. నగేష్ నటించినసర్వర్‌ సుందరంసినిమాతో సహా చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆయన కెరీర్లో దాదాపు 1000 సినిమాల్లో నటించారు ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు.


2. Yash Chopra :  యష్ చోప్రా ప్రముఖ హిందీ సినిమా దర్శకుడు, నిర్మాత నేడు ఆయన పుట్టిన రోజు. ఆయన పూర్తి పేరు యష్‌ రాజ్‌ చోప్రా  1932 సెప్టెంబరు 27 అవిభాజ్య భారతదేశంలోని లాహోర్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. .ఎస్‌. ºహార్, అన్న బి.ఆర్‌ చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన యష్‌.. 27ఏళ్ల వయసులో తొలిసారిగాధూల్‌ కా పూల్‌’ (1959) చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్‌ తెరకు పరిచయమయ్యారు. స్వీయ నిర్మాణంలోధర్మపుత్రతీయగా చిత్రం ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు దర్శకుడిగా యష్‌కు తొలి ఫిలిం ఫేర్‌ను అందించింది. ఇక యష్‌కు తొలి బ్లాక్‌బస్టర్‌ అందించిన చిత్రంవక్త్‌’ 1965లో విడుదలైన సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 1973లో సోదరుడితో కలిసి సొంత బ్యానర్‌యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ను స్థాపించాక అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సత్తా చాటారు. దీవార్‌’ (1975) సినిమా విడుదల తర్వాత యష్‌ పేరు బాలీవుడ్‌లో బ్రాండ్‌గా మారిపోయింది, సినిమా తర్వాత యష్‌అమితాబ్‌ల కలయికలో వచ్చినకభీ కభీ’, ‘త్రిశూల్‌’, ‘కాలా పత్తర్‌’, ‘సిల్‌సిలావంటివన్నీ బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. ఇక యష్‌ తన తనయుడు ఆదిత్యా చోప్రాను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసినదిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995) చిత్రంతో భారతీయ చిత్రసీమకు గొప్ప గుర్తింపును అందించారు. ‘ధూమ్‌సిరీస్‌ చిత్రాలతో సినీ ప్రియులకు సరికొత్త యాక్షన్‌ ట్రెండ్‌ను పరిచయం చేశారు యష్‌ చోప్రా. ‘ఫనా’, ‘చక్‌ దె ఇండియా’, ‘ రబ్‌ నె బనాది ºడీ’, ‘సలామ్‌ నమస్తే’, ‘ఇష్క్‌ జాదె’, ‘బ్యాండ్‌ బాజా బారాత్‌వంటి మెచ్చుకోదగ్గ చిత్రాలన్నీ యష్‌ ప్రత్యేకతను బాలీవుడ్‌ ప్రేక్షకులకు రుచిచూపించాయి. మొత్తం ఐదు దశాబ్దాల పాటు సాగిన యష్‌ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, గౌరవాలను అందుకున్నారు. 2001లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును, 2005లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా నాలుగు ఫిల్మ్‌ అవార్డులను తీసుకున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రాలుగా ఆయన సినిమాలకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇది కూడా అరుదైన రికార్డ్.

3.  Gwyneth Paltrow : గ్వినెత్‌ పాల్ట్రో ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్, రచయిత నేడు ఆవిడ పుట్టిన రోజు. లాస్‌ ఏంజెలిస్‌లో 1972 సెప్టెంబర్‌ 27 పుట్టిన గ్వినెత్‌ది సినిమా కుటుంబమే. తండ్రి బ్రూస్‌ పాల్ట్రో దర్శక నిర్మాత. తల్లి బ్లిత్‌ డానర్‌ నటి. ‘షౌట్‌’ (1991) సినిమాతో తెరంగ్రేటం చేసిన గ్వినెత్‌ఫ్లెష్‌ అండ్‌ బోన్‌’, ‘మిసెస్‌ పార్కర్‌ అండ్‌ విషియస్‌ సర్కిల్‌’, ‘సెవెన్‌’, ‘ఎమ్మా’, ‘స్లైడింగ్‌ డోర్స్‌’, ‘ పెర్ఫెక్ట్‌ మర్డర్‌లాంటి సినిమాల్లో నటించింది. ‘షేక్స్పియర్ ఇన్‌ లవ్‌’ (1998) సినిమాతో ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు పొందడంతో పాటు, అంతర్జాతీయ గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. ఆమె నటించినఎవెంజర్స్‌4’ చిత్రం 2019 మే3 విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. వ్యాపారవేత్తగా, లైఫ్‌స్టైల్‌ గురుగా, గాయనిగా, ఆహారంపై పుస్తకాలు రాసిన రచయిత్రిగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది.

4.  Rahul Dev  :   రాహుల్ దేవ్ ప్రముఖ సినీ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. రాహుల్ దేవ్ సెప్టెంబర్ 27, 1968లో ఢిల్లీ లో జన్మించారు. రాహుల్ 2000 ఇయర్ లో ఛాంపియన్ అనే హిందీ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో విలన్ గా నటించిన రాహుల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ అయ్యారు. తర్వాత ఆయన మలయాళం సినిమాల్లో నటించారు, తెలుగులో సింహాద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన తెలుగులో మహేష్ బాబుతో టక్కరి దొంగ, నాగార్జున తో మాస్, బాలకృష్ణ తో అల్లరి పిడుగు, చిరంజీవితో జై చిరంజీవా అనే సినిమాల్లో నటించారు. రాహుల్ విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో తెలుగు సినిమాలు చేసారు. 2004లో ఫుట్ పాత్ అనే సినిమాకు రాహుల్ దేవ్ జీ సినీ అవార్డ్ గెలుచుకున్నారు. రాహుల్ సినిమాలు మాత్రమె కాకుండా కొన్ని టీవీ సీరియల్స్ కూడా చేసారు. రాహుల్ తన కెరీర్లో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలి, భోజ్ పురి భాషల్లో కలిపి దాదాపు 100 చిత్రాల్లో నటించారు.

5. Garikapati Varalaxmi : గరికపాటి వరలక్ష్మి ప్రముఖ అలనాటి రంగస్థల, సినిమా నటి నేడు ఆవిడ జన్మదినం. జి.వరలక్ష్మిగా అందరికీ సుపరిచితురాలైన ఈవిడ సెప్టెంబర్ 27, 1926లో ఒంగోలులో జన్మించారు. ఈవిడ చిన్నప్పటి నుంచే మంచి గాయని, 11యేళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి విజయవాడ వచ్చి అక్కడ తుంగల చలపతి, దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించింది. తర్వాత వరలక్ష్మి సక్కుబాయి, రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. నాటకాల్లో ఈవిడకు ఎంతో పేరు రావడంతో  కె.ఎస్.ప్రకాశరావు, హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా దిగ్గజాల దృష్టిలో పడింది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1940 నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో పాపులర్ నటిగా ఒక వెలుగు వెలిగింది. తర్వాత వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినిమాల్లో కెమెరామాన్ గా పని చేసారు. వరలక్ష్మి తెలుగులో చేసిన ద్రోహి, లేత మనసులు, కు; గోత్రాలు, కన్నా తల్లి, పెళ్ళి చేసి చూడు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. 1968లో వరలక్ష్మి మూగ జీవాలు అనే సినిమాకు దర్శకత్వం వహించారు, ఆమె తన కెరీర్లో తెలుగు, తమిళ భాషల్లో కలిపి మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు.

6.  Ravi Chopra  :  రవి చోప్రా ప్రముఖ హిందీ సినిమా దర్శకుడు, నిర్మాత ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈయన సెప్టెంబర్ 27, 1946లో జన్మించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన బి.ఆర్.చోప్రా కొడుకు అయిన రవి చోప్రా తన తండ్రి దగ్గరే దాస్తాన్, దుంద్ అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. అలాగే ఇత్తెఫాక్ అనే సినిమాకు యష్ చోప్రా దగ్గర కూడా అసిస్టెంట్ గా చేసారు. తర్వాత 1975లో జమీర్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. 1980లో ఈయన తీసిన బర్నింగ్ ట్రైన్ అనే సినిమా అప్పుడు ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత కాలంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. తర్వత దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ తన తండ్రి బి.ఆర్.చోప్రాతో కలిసి మహాభారత్ టీవీ సీరియల్ డైరెక్ట్ చేయడంతో మంచి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. తర్వాత ఆయనే సొంతంగా విష్ణుపురాన్, రామాయణ్ సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. తర్వాత 2003లో మళ్ళీ దర్శకుడిగా భాగ్బాన్ అనే హిందీ సినిమా తీసారు. రవి చోప్రా హిందీలో బూత్ నాథ్, బూత్ నాథ్ రిటర్న్స్ అనే సినిమాలు నిర్మించారు

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!