10.4 C
New York
Saturday, October 23, 2021

Famous People Born on September 28 | Lata Mangeshkar | Puri Jagannadh | Ranbir Kapoor | Shri Tv

సెప్టెంబర్ 28  మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

 

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1. Lata Mangeshkar :  లతామంగేష్కర్‌ ప్రముఖ భారతీయ సినీ గాయని, సంగీత దర్శకురాలు నేడు ఆవిడ జన్మదినం. ఈవిడ సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్ లో జన్మించారు. తండ్రి దీనా నాథ్ సుప్రసిద్ధ సంగీతకారుడు, అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడంపాడడంతప్ప మరోలోకం లేదు. దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్ లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటించింది. లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో ఆవిడ సినీ ప్రస్థానం మొదలైంది. అల్బేలాఛత్రపతి శివాజీఅనార్కలీలోని పాటలు హిట్ అయ్యి ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తర్వాత అందాజ్బడీ బహన్బర్సాత్ఆవారాశ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి సంగీత ప్రపంచానికి రారాణిని చేసాయి. హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్లక్ష్మీకాంత్-ప్యారేలాల్కళ్యాణ్ జీ-అనంద్ జీతర్వాత బప్పీలహరిరాంలక్ష్మణ్ నుంచి ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. లతాజీ కసీసం వెయ్యి చిత్రాలలో పాడి ఉంటారని అంచనా. ఈ పాటలకు భాషాబేధం లేదు. దేశంలోని దాదాపు అన్ని భాషలలోనూ ఆమె పాడారనే అనుకోవాలి. మన తెలుగులో అయితే..ఆమె పాడిన పాటలలో ఎవ్వరూ మర్చిపోలేని పాట సంతానంలోని నిదురపోరా తమ్ముడా. నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాకతన పేరుతోనే రామ్‌రామ్‌ పహ్వానే’ అనే మరాఠీ చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఆ తర్వాత లతాజీ తన పేరు మార్చుకుని ఆనంద్‌ ఘన్‌’ అనే పేరు పెట్టుకొని మరో నాలుగు మరాఠీ చిత్రాలకూ సంగీత దర్శకురాలిగా పనిచేశారు. 1953లో ఆమె వాదాల్‌’ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. తరువాత, 1955లో ఝంఝర్‌’, ‘కంచన్‌’ చిత్రానూ, 1990లో లేకిన్‌’ చిత్రాన్నీ నిర్మించారు. ఆవిడ ఇప్పటి వరకు 20 భాషల్లో కలిపి 980 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ కు 1969లో పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, 2001లో భారత రత్న అవార్డులు వచ్చాయి. ఈవిడకు గాన కోకిల అనే బిరుదు కూడా ఉంది.
  1. Paidi Jairaj:    పైడి జయరాజ్‌ ప్రముఖ భారతీయ సినీ నటుడు నేడు ఆయన పుట్టిన రోజు.. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుతెచ్చుకున్న సరోజని నాయుడు జైరాజ్‌కు మేనత్త. విద్యాభ్యాసం రిషి వ్యాలీలోతరవాత కాలేజీ విద్య హైదరాబాద్‌ నిజాం కాలేజీలో జరిగింది. నాటకాలంటే ఎంతో ఇష్టపడే జైరాజ్‌ కాలేజీ ఉత్సవాలలో షేక్స్‌ఫియర్‌ నాటకాలలో నటించి మంచి పేరు తెచ్చున్నారు. ఆయనకు సినిమాలలో నటించాలనే కోరిక బాగా వుండేది. బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేస్తానని ఇంటిలో చెబితే ఒప్పుకోలేదు దాంతో ఇంటిలో చెప్పకుండా 1929లో బొంబాయి వెళ్లిపోయారు. శారదా ఫిలిం కంపెనీ వారు నిర్మించిన జాగ్మతి జవాని’ అనే మూకీ చిత్రంలో హీరోకి స్నేహితుడుగా నటించే అవకాశం వచ్చింది. అయితే తను నటించిన రెండవ చిత్రం రసీలి రాణి’ ముందుగా విడుదలైంది. ఆ చిత్ర విజయంతో 1931 వరకు పదకొండు మూకీ చిత్రాల్లో జైరాజ్‌ హీరోగా నటించారు. వాటిలో ట్రయాంగిల్‌ ఆఫ్‌ లవ్‌’, ‘మాతృభూమి’, ‘ఆల్‌ ఫర్‌ లవ్‌’, ‘ఫ్లైట్‌ ఇంటు డెత్‌’, ‘మై హీరో’ చిత్రాలు బాగా విజయవంత మయ్యాయి. 1931లో తొలి హిందీ టాకీ ఆలం ఆరా’ విడుదలయ్యాక జైరాజ్‌ 1932లో షికారి’ చిత్రంలో హీరోగా నటించారు. పులులుసింహాలుపాములు వంటి అడవి జంతువులతో నిర్మించిన ఈ చిత్రం బాగా ఆడింది. ప్రముఖ హిందీ నటి సురయ్యాతో జయరాజ్‌ సింగార్‌’ (1949), ‘రాజపుట్‌’ (1951), ‘రేషమ్’ (1952), ‘కంచన్‌’ (1955) సినిమాల్లో హీరోగా నటించారు జైరాజ్‌-సురయ్యా జంటను ఆ రోజుల్లో వెండితెర వేల్పులుగా కొలిచేవారు. తన కెరీర్లో జైరాజ్‌ ఎన్న చారిత్రాత్మక పాత్రలు ధరించి మెప్పించారు అరవయ్యో దశకం మధ్య నుంచి క్యారక్టర్‌ నటుడుగా రాణిస్తూ వచ్చారుపరదేశి, ‘మాయ, ‘నైన్‌ అవర్స్‌ టు రామ అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించిన అనుభవం జైరాజ్‌కు వుంది. జైరాజ్‌ దర్శకుడిగా సాగర్‌, ‘మాల’, ‘మొహర్‌’, ‘రాజ్‌ ఘర్‌’ సినిమాలకు పనిచేశారు. తానా-బనా’, ’కథా సాగర్‌’ వంటి రెండు టెలివిజన్‌ సీరియళ్లకు దర్శకత్వం వహించారు. మరాఠీగుజరాతీ చిత్రాల్లో కూడా నటించారు. హిందీమరాఠీగుజరాతీ భాషల్లో నిర్మించిన 356 చిత్రాల్లో జైరాజ్‌ నటించారు. 1980లో జైరాజ్‌కు భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డును ఇచ్చి గౌరవించింది. నటుడుగా ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న మొట్ట మొదటి తెలుగువాడు జైరాజ్‌.
  1. Puri Jagannadh  : పూరీ జగన్నాద్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు నేడు ఆయన పుట్టిన రోజు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వద్ద సహాయకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. రాంగోపాల్‌ వర్మకు సహాయకుడిగా ఎన్నో సినిమాలకు పని చేశారు. తన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్ తో చేసిన బద్రి ఈయన హీరో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్‌ ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే’సినిమాలు చేసారు.మహేష్ బాబుతో చేసిన పోకిరి రికార్డులు తిరగరాసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్‌ రాజ్‌ కుమార్‌ తో కలిసి అప్పు అనే సినిమా చేసారు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమా చేసారు.  దూకుడుగా ఉండే హీరో పాత్రలు, పంచ్ డైలాగ్స్ ఆయన సినిమాల్లో ప్రత్యేకతలు. పోకిరి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్, నేనింతే సినిమాకు ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డ్ గెలుచుకున్నారు. పూరి తన కెరీర్లో మొత్తం 38 సినిమాలకు దర్శకత్వం వహించారు. వైష్ణో అకాడమి పేరుతో బ్యానర్ స్థాపించి తమ్ముడు సాయి రామ్ శంకర్ ని హీరో గా పరిచయం చేస్తూ 143 అనే సినిమా తెసారు ఆ తర్వత కొడుకు ఆకాష్ తో మెహబూబా అనే సినిమా తీసారు.
  1. Ranbir Kapoor : రణ్‌బీర్‌ కపూర్‌ప్రముఖ బాలీవుడ్ హీరో నేడు ఆయన పుట్టిన రోజు. రణ్‌బీర్‌ ప్రముఖ నటుడు రిషి కపూర్ కొడుకు, హీరో రాజ్ కపూర్ మనవడు, పృథ్వీరాజ్‌ కపూర్‌కి ఈయన ముని మనవడు.ముంబైలోని ఎచ్‌.ఆర్‌.కామర్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌ విద్యను అభ్యసించారు రణ్‌బీర్‌. ఆ తరువాత న్యూయార్క్‌ సిటీలో స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌ నేర్చుకున్నారు. తరువాత లీ స్టాస్ర్‌బెర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నటనను అభ్యసించారు. అక్కడ, ‘ప్యాషన్‌ టు లవ్‌’, ‘ఇండియా 1964’ అనే రెండు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించి దర్శకత్వం వహించారు.మొదట తన తండ్రి దర్శకత్వం వహించిన ఆ అబ్‌ లౌట్‌ చలే’ అనే సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు రణ్‌బీర్‌ ఆ తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన బ్లాక్‌’ సినిమాకు సహాయ దర్శకుడిగా వర్క్‌ చేశారు. ఆ చిత్ర దర్శకుడు భన్సాలీ సావరియా’ అనే సినిమాలో హీరోగా రణ్‌బీర్‌కు అవకాశం ఇచ్చారు. సావరియా’ సినిమా కమర్షియల్‌గా విజయవంతం కానప్పటికీయాష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ కామెడీ బచ్నా ఏ హసీనో’ సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగారు.  తర్వత  వేక్‌ అప్‌ సిడ్‌ ‘అజాబ్‌ ప్రేమ్‌ కి గజాబ్‌ కహా ‘రాకెట్‌ సింగ్‌: సేల్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్  ‘రాజనీతి’. ‘అంజానా అంజాని ‘రాక్‌ స్టార్‌’, ‘బర్ఫీ’, ‘బొంబాయి టాకీస్‌’, ‘యే జవానీ హై దీవానీ’, ‘బేషరం’, ‘భూత్‌ నాధ్‌ రిటర్న్స్’, ‘బొంబాయి వెల్వెట్‌’, ‘తమాషా’, ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’, ‘జగ్గా జాసూస్‌’, ‘సంజు సినిమాల్లో నటించారు. సావరియా’ సినిమాకి గానూ బెస్ట్‌ మేల్‌ డెబ్యూ ఫిలింఫేర్‌ అవార్డుని అందుకొన్నారు. వేక్‌ అప్‌ సిడ్‌’, ‘అజాబ్‌ ప్రేమ్‌ కి గజాబ్‌ కహానీ’, ‘రాకెట్‌ సింగ్‌: సేల్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డును అందుకొన్నారు. రాక్‌ స్టార్‌’ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డునిఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డుని అందుకొన్నారు. బర్ఫీ’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డుని అందుకొన్నారు. సంజు’ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ పురస్కారాన్ని పొందారు.
  1. Brigitte Bardot:   బ్రిజెట్‌ బర్డోట్ ప్రముఖ ఫ్రెంచ్ నటి నేడు ఆవిడ జన్మదినం. ప్యారిస్‌లో 1934 సెప్టెంబర్‌ 28న పుట్టిన ఈమె చిన్నప్పుడే పాటనృత్యం నేర్చుకుంది. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది, మోడల్‌గా మెరిసింది. ఫ్రెంచి సినిమా అండ్‌ గాడ్‌ క్రియేటెడ్‌ ఉమన్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. వివా మారియా’, ‘క్రేజీ ఆఫ్‌ లవ్‌’, ‘మానియా ద గర్ల్‌ ఇన్‌ ద బికిని’, ‘ద లాంగ్‌ టీత్‌’, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లవ్‌’, ‘నాటీ గర్ల్‌’, ‘ద బ్రైడ్‌ ఈజ్‌ మచ్‌ టూ బ్యూటిఫుల్‌’, ‘ద నైట్‌ హెవెన్‌ ఫెల్‌’, ‘ద ఫిమేల్‌’, ‘డియర్‌ బ్రిగెట్‌లాంటి సినిమాలతో యువతను ఉర్రూతలూగించింది. నటిగాగాయనిగామోడల్‌గానే కాదు శృంగార తారగా కూడా పేరొందింది. ఫ్రెంచి ప్రభుత్వం అత్యున్నత పురస్కారo లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ అనే ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటిస్తే ఆమె తిరస్కరించి సంచలనం సృష్టించింది. ఆపై వణ్యప్రాణుల హక్కుల కోసం ఉద్యమించింది, అక్రమ వలసలుఫ్రాన్స్‌ లో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.
  1. Janeane Garofalo:  జనీనే గరోఫలో ప్రముఖ హాలీవుడ్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టాండప్ కమెడియన్, రచయిత నేడు ఆవిడ పుట్టిన రోజు. న్యూజెర్సీలో 1964 సెప్టెంబర్‌ 28న పుట్టిన ఈమెకాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ కామెడీ టాలెంట్‌ సెర్చ్‌లో గెలిచి ఫన్నీయస్ట్‌ పెర్సన్‌ ఇన్‌ రోడ్‌ ఐలాండ్‌’ టైటిల్‌ సాధించింది. ఇక ఆపై ఆ నవ్వులే ఆమెను ముందుకు నడిపించాయి.  తర్వాత ద ట్రూత్‌ ఎబౌట్‌ క్యాట్స్‌ అండ్‌ డాగ్స్‌’, ‘వెట్‌ హాట్‌ అమెరికన్‌ సమ్మర్‌’, ‘ద మ్యాచ్‌ మేకర్‌’, ‘రియాలిటీ బైట్స్‌’, ‘స్టీల్‌ దిస్‌ మూవీ’, ‘క్లే పీజియన్స్‌’, ‘స్వీట్‌ హార్ట్స్‌’, ‘మిస్టరీ మెన్‌’, ‘ద ఇండిపెండెంట్‌’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. నాటకటీవీ రంగాల్లో హాస్య కార్యక్రమాలతో ఇంటింటి అభిమానులను సంపాదించుకుంది. హాస్య ప్రదర్శనలుటీవీ కార్యక్రమాలుసినిమాలతో విలక్షణ నటిగా పేరు పొందింది. నటిగాకమేడియన్‌గారచయితగా జనీనే గరోఫలో. వెండితెర అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!