10.4 C
New York
Saturday, October 23, 2021

Famous People Born on September 29 | Shraddha Srinath | Khushbu Sundar | Shri Tv Wishes

సెప్టెంబర్ 29  మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1. Mehmood :

 ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు మెహమూద్ పుట్టిన రోజు నేడు. మెహమూద్ గా పిలుచుకొనే బాలీవుడ్ హాస్యనటుడు అసలుపేరు మెహమూద్ ఆలి. సెప్టెంబరు 29, 1932 న మెహమూద్ బొంబాయిలో జన్మించారు. అతని తండ్రి ముంతాజ్ ఆలి చాలా కాలం క్రితమే బొంబాయి వచ్చి రంగస్థల నటుడుగా స్థిరపడ్డారు. మెహమూద్ తాత ఆర్కాట్ నవాబుగా వుండేవారు. అతణ్ణి నవాబ్ ఆఫ్ కర్ణాటక గా కూడా పిలిచేవారు. మెహమూద్ సినీ ప్రస్థానం బాలనటుడుగా మొదలైంది. తన తండ్రితో కలిసి మెహమూద్ సినీ స్టూడియోలకు వెళుతూ వుండేవారు. అప్పుడే బాంబే టాకీస్ వారు నిర్మించిన కిస్మత్’ (1943) చిత్రంలో మదన్’ అనే బాలుడి పాత్రను మెహమూద్ తొలిసారి పోషించారు  బిమల్ రాయ్ నిర్మించిన దో బిఘా జమీన్’ చిత్రంలో చిరువ్యాపారి పాత్ర దొరికింది. ఆ తర్వాత ఖైది నంబర్ 911 కాగజ్ కే ఫూల్’ (1959) ‘పర్వరిష్ ‘గృహస్తి’, ‘భరోసా’, ‘జిద్ది’, ‘లవ్ ఇన్ టోక్యో సినిమాల్లో తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెహమూద్ తన నలభై ఏళ్ళ కెరీర్లో మొత్తం మూడు వందల చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించారు. దిల్ తేరా దీవానా’ (1963) సినిమాలో నటనకు మెహమూద్ కి ఉత్తమ సహాయనటుడిగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఉత్తమ హాస్యనటుడిగా ప్యార్ కియే జా’, ‘వారిస్’, ‘పారస్’, ‘వర్దాన్’ సినిమాల్లో నటనకు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి.

  1. Greer Garson:

 గ్రీర్‌ గార్సన్‌  ప్రముఖ బ్రిటిష్ నటి, సింగర్ నేడు ఆవిడ జన్మదినం. ఈవిడ పూర్తీ పేరు ఐలీన్‌ ఇవెలిన్‌ గ్రీర్‌ గార్సన్‌, ఇంగ్లండ్‌లో 1904 సెప్టెంబర్‌ 29న పుట్టిన గార్సన్‌ నాటక రంగంలో ఆకట్టుకునిమోడలింగ్‌లో మెరిసివెండితెరపై వెలిగింది.  గుడ్‌బై మిస్టర్‌ చిప్స్‌’, ‘ప్రైడ్‌ అండ్‌ ప్రెజుడీస్‌’, ‘వెన్‌ లేడీస్‌ మీట్‌’, ‘బ్లోజమ్స్‌ ఇన్‌ ద డస్ట్‌’, ‘రాండమ్‌ హార్వెస్ట్‌’, ‘మేడమ్‌ క్యూరీ’, ‘జులియా మిస్‌ బిహేవ్స్‌లాంటి సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను అలరించింది. మిసెస్‌ మినివర్‌’ (1949) సినిమాకి ఆస్కార్‌ అందుకున్న ఈమె ఆ వేడుక వేదికపై 5 నిమిషాల 30 సెకన్ల పాటు మాట్లాడింది. అందుకు ఆమెకు అతి ఎక్కువ సమయం మాట్లాడిన ఆస్కార్‌ అవార్డీగా గిన్నిస్‌ రికార్డు వచ్చింది. ఆ తర్వాత ఆస్కార్‌ కమిటీ అవార్డీలు మాట్లాడే సమయంపై ఆంక్షలు విధించడం విశేషం. గ్రీర్‌ గార్సన్‌ తన కెరీర్లో ఏడుసార్లు ఆస్కార్‌ నామినేషన్లు అందుకోవడం ఒక విశేషం.

  1. Flora Saini :  

ఫ్లోరా శైని ప్రముఖ భారతీయ సినీ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. ఈవిడ అసలు పేరు ఆశా శైని కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఫ్లోర శైని గా పేరు మార్చుకుంది. ఈవిడ చండీఘర్ లో ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి మిస్ కోల్ కతా పోటిలలో పాల్గొంది. 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. 2002 లో ఆమె టి. పి. అగర్వాల్ నిర్మించిన భారత్ భాగ్య విధాత సినిమాతో హిందీ సినిమాలోకి ఎంటర్ అయ్యింది. తెలుగులో నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప గా బాగా ఫేమస్ అయ్యింది. ఈవిడ తన కెరీర్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో కలిపి 62 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మెయిడ్ ఇన్ ఇండియా, గండి బాత్, ఇన్సైడ్ ఎడ్జ్, ట్రిపుల్ ఎక్స్, బాంబర్స్, మయా నగరి అనే వెబ్ సిరీస్ లలో నటించింది.

  1. Shraddha Srinath  :

  శ్రద్ధా శ్రీనాథ్ ప్రముఖ హీరోయిన్ నేడు ఆవిడ జన్మదినం. తండ్రి ఆర్మీ ఆఫీసర్,  సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్ లో చదువుకున్న శ్రద్ధా శ్రీనాథ్ బెంగుళూర్ లో లా చదివారు ఆ తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లో లీగల్ అడ్వయిసర్ గా పని చేసారు ఆ టైం లోనే చిన్న చిన్న యాడ్స్ లో నటించేవారు, నాటకాలు వేసేవారు. 2015లో కోహినూర్ అనే మలయాళం సినిమాతో ఆవిడ సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. 2016లో కన్నడలో చేసిన యు టర్న్ అనే సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తమిళ్ లో మణిరత్నం సినిమా కాతరు వేలియడై సినిమాలో చిన్న పాత్ర చేసింది. తమిళ్ లో విక్రం వేదా సినిమాలో ఆవిడ హీరో మాధవన్ తో కలిసి నటించారు ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి 100 కోట్లు సాధించడంతో శ్రద్ధా శ్రీనాథ్ కు అవకాశాలు పెరిగాయి. తెలుగులో హీరో నానితో కలిసి జెర్సీ అనే సినిమాలో, ఆదితో కలిసి జోడీ అనే సినిమాలో నటించారు. మిలన్ టాకీస్ అనే సినిమాతో 2019లో హిందీ సినిమాకి పరిచయం అయ్యారు. తన కెరీర్లో తెలుగు, తమిళ్. కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి శ్రద్ధా శ్రీనాథ్ మొత్తం 17 సినిమాల్లో నటించారు.

  1. Khushbu Sundar :

 కుష్బూ ప్రముఖ తమిళ సినిమా నటి నేడు ఆమె పుట్టిన రోజు. కుష్బూ 1980లో ద బర్నింగ్ ట్రైన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ ఆతర్వాత నసీబ్, లవరిస్, కాలియా సినిమాల్లో నటించింది. కుష్బూ 1985లో తన మొదటి సినిమా జానూ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా మారింది. 1990లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దీవానా ముజ్ సా నహిన్ అనే సినిమాలో కుష్బూ డాన్స్ చేసిన సోలో సాంగ్ ‘సారే లాడ్కోన్ కి షాది కరో’ చాలా పెద్ద హిట్ అయ్యింది ఈ సాంగ్ ఇప్పటికీ లేడీస్ ఫంక్షన్ లలో వినిపిస్తుంటుంది. 1986లో వెంకటేష్ తో చేసిన కలియుగ పాండవులు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈవిడ ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించింది రజనీకాంత్ తో ధర్మాతిన్ తలైవన్ అనే సినిమాతో ఆవిడ తమిళ్ సినీ రంగ ప్రవేశం జరిగింది. తమిళ్ లో రజనీకాంత్, కమలహాసన్, విజయ్ కాంత్, సత్యరాజ్, పార్తిబన్, ప్రభు లాంటి హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఖుష్బూ కెరీర్ పీక్స్ లో వున్నప్పుడు తమిళ నాడులో ఆవిడ అభిమానులు ఖుష్బుకు గుడి కూడా కట్టారు. తెలుగులో స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్కగా, అజ్ఞాతా వాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించింది. ఖుష్బూ తన కెరీర్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కలిపి మొత్తం 200 సినిమాలకు పైగా నటించింది.  ఆ తర్వాత ఖుష్బు టీవీ వ్యాఖ్యాతగా పలు షోస్, ప్రోగ్రామ్స్ చేసింది అలాగే నిర్మాతగా తమిళ్ లో టీవీ సీరియల్స్ కూడా నిర్మించింది. ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత అయిన సుందర్.సి. ని 2000లో ప్రేమ వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

  1. Anita Ekberg

 అనితా ఎక్బెర్గ్‌ ప్రముఖ స్వీడిష్ నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. ఈవిడ సెప్టెంబర్ 29, 1931లో స్వీడన్ లో జన్మించింది. స్వీడన్‌లో పుట్టినా అమెరికా వచ్చి సెటిలైపోయింది. మోడల్‌గా ఏ బ్రాండ్‌కి చేసినా దాని అమ్మకాలు ఆకాశంలోనే, నటిగా ఏ సినిమాలో నటించినా కాసుల వర్షమే. ఎనిమిది మంది సంతానంలో ఒకతిగా పుట్టిన అనిత తన తల్లి ప్రోత్సాహం మీద మోడల్‌గా ఎదిగింది. ఓ అందాల పోటీకి వెళితేనిర్వాహకులు అవార్డు ఇచ్చి చప్పట్లు కొట్టేశారు. ఆ చప్పట్లే ఆమెను మిస్‌ స్వీడన్‌గా కూడా ఎంపికయ్యేలా చేశాయి. దాంతో అమెరికాలో మిస్‌ యూనివర్స్‌’ పోటీ రమ్మని పిలిచింది అందులో అవార్డు రాలేదు కానీ బోలెడు సినిమా అవకాశాలు వచ్చేశాయి. ద మిసిసిపి గాంబ్లర్‌’, ‘ఎబ్బట్‌ అండ్‌ కాస్టెలో గో టు మార్స్‌’, ‘టేక్‌ మీ టు టౌన్‌’, ‘ద గోల్డెన్‌ బ్లేడ్‌’, ‘ఆర్టిస్ట్స్‌ అండ్‌ మోడల్స్‌’, ‘హాలీవుడ్‌ ఆర్‌ బస్ట్‌’ ఇలా ఎన్నో సినిమాల్లో అందంతో తళుక్కుమంది. ప్లేబాయ్‌ లాంటి ఎన్నో మేగజైన్ల ముఖచిత్రాల్లో మెరిసి సెక్స్‌ సింబల్‌గా పేరు తెచ్చుకుంది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!