-2.7 C
New York
Wednesday, January 26, 2022

Famous Persons Born on Jan 09 || Farah Khan || Hima Das || Shri Tv Wishes

Famous Persons Born on Jan 09 || Farah Khan || Hima Das || Shri Tv Wishes

జనవరి 9 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 
హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Farah Khan   : ఫరాఖాన్‌ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. 1965 జనవరి 9న జన్మించిన ఫరాఖాన్‌    ప్రముఖ పాప్‌ గాయకుడు, డ్యాన్సర్‌ మైకేల్‌ జాక్సన్‌ను స్ఫూర్తిగా తీసుకొని నృత్య దర్శకురాలిగా మారింది. 1992లో వచ్చిన ‘జో జీతా వో సికిందర్‌’ సినిమాతో ఫరా తొలిసారి వెండితెరకు నృత్య దర్శకురాలిగా పరిచయమైంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు షారుఖ్, సల్మాన్‌ల నుంచి మొదలు అనేక మంది యువహీరోలతో కలిసి చేసిన ఫరా ఇప్పటి వరకు సుమారు 80కి పైగా చిత్రాలకు కోరియోగ్రఫీ చేసింది. వీటిలో ‘కోయి మిల్‌ గయా’ (2004) చిత్రానికి గానూ తొలిసారి ఉత్తమ నృత్య దర్శకురాలిగా జాతీయ అవార్డును అందుకొంది ఫరాఖాన్‌. ఫరా కొరియోగ్రాఫర్‌గా కేవలం హిందీ సినిమాలే కాకుండా ‘మ్యారీగోల్డ్‌: యాన్‌ అడ్వెంచర్‌ ఇండియా’, ‘బాంబే డ్రీమ్స్’ ‘పర్హాప్స్‌ లప్‌’, ‘కుంగ్‌ ఫూ యోగ’లకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఘనత ఫరా సొంతం. ఈ సినిమాలకు ఆమె టోని, గోల్డెన్‌ హార్స్‌ అవార్డులను అందుకోవడం విశేషం. ఇక ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘మై హూనా’ 2004. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్ అయ్యింది. ఆ తరువాత ‘ఓం శాంతి ఓం’, ‘తీస్‌ మార్‌ ఖాన్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘ది గృహ ప్రవేశ్‌ పూజ ఎట్‌ కర్నాటక తంబు చెట్టే పాల్యా బెంగళూరు’ వంటి సినిమాలు చేసింది. ఫరా కేవలం వెండితెరపైనే కాక బుల్లితెరపైనా తన ప్రతిభను చూపించారు ఇండియన్‌ ఐడల్, డ్యాన్స్‌ ఇండియా డాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్, జో జీతా వో సూపర్‌ స్టార్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కేలియే కుఛ్‌ భీ కరేగా వంటి ప్రముఖ రియాలిటీ షోలకు జడ్జీగా, అలాగే బిగ్‌బాస్‌ సీజన్‌ 8కు హోస్ట్‌ గా చేసారు.

  2.    Farhan Akhtar : ఆల్‌రౌండర్‌ అన్న పదానికి అసలు సిసలు నిర్వచనం ఫర్హాన్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1974 జనవరి 9న ప్రముఖ రచయితలు జావేద్‌ అక్తర్, హనీ ఇరానీ దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచీ సినీ నేపథ్య వాతావరణంలో పెరగడం వల్ల ఆ ప్రభావంతోనే సినీ రంగంవైపు అడుగులు వేశాడు ఫర్హాన్‌. కెరీర్‌ తొలినాళ్లలో ‘లమ్హే’ ‘హిమాలయ పుత్ర’ వంటి హిట్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఫర్హాన్‌ తొలిసారి ‘దిల్‌ చాహ్తా హై’ (2001) సినిమాతో దర్శక,నిర్మాతగా మారాడు ఈ సినిమా ఉత్తమ ఫీచర్‌ ఫిలింగా జాతీయ అవార్డును అందుకుంది. దీని తరువాత ‘లక్ష్య’ ‘డాన్‌’ సినిమాలు చేసాడు.  ఫర్హాన్‌ తొలిసారి ‘ద ఫకీర్‌ ఆఫ్‌ వెనిన్‌’ చిత్రంతోనే నటుడిగా మారినప్పటికీ ‘రాక్‌ ఆన్‌’ చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తరువాత ‘జిందగీ నా మిలేగి దోబరా’ చిత్రంతో రెండు ఫిలింఫేర్‌ పురస్కారాలను, ‘డాన్‌ 2’ సినిమాతో దర్శకుడిగా భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఇక ఇవన్నీ ఒకెత్తయితే 2013లో వచ్చిన ‘భాగ్‌ మిల్ఖా భాగ్‌’ మరొక ఎత్తు. ఇందులో మిల్ఖా సింగ్‌ పాత్ర కోసం ఫర్హాన్‌ తనని తాను మార్చుకున్న తీరు.. ఆ పాత్రలో అతను ఒదిగిపోయి నటించిన విధానం సినీప్రేమికులతో పాటు విమర్శకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ను అందుకున్నాడు ఫర్హాన్‌. ఈ సినిమా తరువాత నటుడిగా అతను చేసిన ‘రాక్‌ ఆన్‌2’, ‘దిల్‌ ధడకన్‌ దో’, ‘వజీర్‌’, ‘డాడీ’ ‘స్కై ఈజ్‌ పింక్‌’వంటి సినిమాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

  3.    Hima Das   : హిమా దాస్ ప్రముఖ భారత అథ్లెట్, ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమ దాస్‌ చరిత్ర సృష్టించింది ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. అస్సాం రాష్ట్రంలోని నాగోల్‌ జిల్లా డింగ్ పట్టణానికి సమీపం లో ఉన్న కంధూలిమారి గ్రామంలో రోంజిత్ మరియు జోనాలి దాస్ దంపతులకు జన్మించారు. హిమా దాస్ డింగ్ ఎక్స్‌ ప్రెస్ అనే మారు పేరుతో, అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రజలు  పిలుస్తారు. పాఠశాల చదవు కోసం కిలోమీటర్ల కొద్ది కొండలు దాటిన హిమ సహజసిద్ధమైన అథ్లెట్‌గా ఎదిగింది. ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమ దాస్‌ చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హిమ దాస్‌.. 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సాధించింది, హిమదాస్‍‌ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2018లో అర్జున్ అవార్డు ఇచ్చి సత్కరించింది. 

  4.    Nithin Sathya : నితిన్ సత్య ప్రముఖ తమిళ నటుడు, ప్రొడ్యూసర్ ఈరోజు ఆయన పుట్టినరోజు. నితిన్ సత్య జనవరి9, 1980లో తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఈయన 2002లో వచ్చిన సినిమాతో పరిచయమై కలట్ పడాయ్, వసూల్ రాజ MBBS, డ్రీమ్స్, జి, మజా, చెన్నై 600028, తోజ్హ, సరోజ, ముతిరై, బిర్యానీ, అమ్మని, చెన్నై 600028-2, పండిగై, జరుగండి, మార్కెట్ రాజ MBBS లాంటి తమిళ సినిమాల్లో నటించారు. నితిన్ సత్య ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 28సినిమాల్లో నటించారు. ఈయన యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా జరుగండి, లాకప్ సినిమాలు చేసారు. 

  5.    Sharad Malhotra  : శరద్ మల్ హోత్ర ప్రముఖ భారతీయ టీవీ నటుడు నేడు ఆయన పుట్టినరోజు. శరద్ జనవరి8, 1983లో ముంబైలో జన్మించారు. ఈయన తన కెరీర్ ని 2006లో వచ్చిన కభి తో నజర్ మిలావో అనే సీరియల్ తో స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత బనో మే తేరి దుల్హన్, భారత్ క వీర్ పుత్రా- మహారాణ ప్రతాప్, కసం తేరే ప్యార్ కి, కామెడీ నైట్స్ బచావో, ముస్కాన్ లాంటి టీవీ సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత 2012లో ఫ్రం సిడ్నీ విత్ లవ్, 2016లో ఎక్ తెర సాత్ లాంటి సినిమాల్లో నటించారు. శరద్ కి బనో మే తేరి దుల్హన్ సీరియల్ కి గోల్డ్ అవార్డ్స్, కళాకార్ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, జీ రిశ్తి అవార్డ్స్, లాంటి అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు.    

  6.    Sunderlal Bahuguna   :  సుందర్‌లాల్ బహుగుణ గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త ఈరోజు ఆయన పుట్టిన రోజు.  1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో ఉన్న మరోడా గ్రామంలో జన్మించాడు. సమాజంలో వున్న అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. తరువాత 1965 నుండి 1970 వరకు తన మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని గిరిజన మహిళలతో కలసి చేపట్టాడు. అతను చెట్టు, పర్యావరణం, మానవ సమాజం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. కొన్నేళ్లుగా హిమాలయాలలో అడవుల సంరక్షణ కోసం పోరాడుతున్నాడు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. గాంధీ స్ఫూర్తితో, హిమాలయ అడవులు, కొండల గుండా 4,700 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి, హిమాలయాల దుర్భలమైన పర్యావరణ వ్యవస్థపై మెగా అభివృద్ధి ప్రాజెక్టులు చేసిన నష్టాన్ని, తరువాత గ్రామాల్లో సామాజిక జీవితం క్షీణించడాన్ని గురించి ప్రచారం చేసాడు.ఇలా బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అంతటా వ్యాపించింది. గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిపినందున ఈ ఉద్యమాన్ని ‘అడవి సత్యాగ్రహం’ అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.చిప్కో ఉద్యమం తరువాత కర్ణాటకలోని అప్పీకో ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. చిప్కో ఉద్యమం అతను చేసిన పర్యావరణ వాదానికి చేసిన కృషిలో ఒకటిగా నిలిచింది. 1981లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. కానీ అతను దానిని తిరస్కరించాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!