2.1 C
New York
Tuesday, January 18, 2022

Famous Persons Born on Jan 11 || Rahul Dravid || Sukumar || Shri Tv Wishes

Famous Persons Born on Jan 11 || Rahul Dravid || Sukumar ​|| Shri Tv Wishes

జనవరి 11 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Rahul Dravid   :  రాహుల్ ద్రావిడ్ ఇండియన్ వాల్ గా పిలబడే ఈ మాజీ ఇండియన్ క్రికెటర్ పుట్టిన రోజు నేడు. రాహుల్ ద్రావిడ్ జనవరి11, 1973లో మధ్య పదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు, ఈయన పూర్తి పేరు రాహుల్ శరద్ ద్రావిడ్. ఈయన తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అండర్-15, అండర్-17 కర్ణాటక టీంకి ఆడాడు. తన కెరీర్లో మొత్తం 298 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడి, 23,794 పరుగులు చేసాడు. ఇందులో 68సెంచరీలు, 117హాఫ్ సెంచరీలు చేసాడు తన టాప్ స్కోర్ 270. ద్రావిడ్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ 1996లో ఇంగ్లాండ్ తో ఆడాడు అలాగే తన కెరీర్లో మొత్తం 164 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 13,288 పరుగులు చేసాడు. ఇందులో 36సెంచరీ లు, 63 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి, తన టాప్ స్కోర్ 270గా నిలిచింది. అలాగే తన మొదటి వన్డే 1996లో శ్రీలంకతో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 344వన్డేలు ఆడి 10,889 పరుగులు చేసాడు. అందులో 12 సెంచరీ లు, 83 హాఫ్ సెంచరీలు ఉండగా తన టాప్ స్కోర్ 153గా నిలిచింది. ఈయనకు 1998లో అర్జున అవార్డు, 2004లో పద్మ శ్రీ, 2013లో పద్మ భూషణ్ అవార్డ్స్ లభించాయి.

  2.    Sukumar       : సుకుమార్‌  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ డైరెక్టర్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాజోలుకి సమీపంలోని మట్టపర్రులో తిరుపతిరావు నాయుడు, వీరవేణి దంపతులకి 1970 జనవరి 11న జన్మించారు. చిన్నప్పట్నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఊళ్లో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివేశారు. పాఠశాలలోనే కవితలు రాయడం అలవాటు చేసుకొన్నారు. గణితంపై పట్టు పెంచుకొన్న ఆయన చదువుకొంటూనే రాజోలులో ట్యూషన్లు చెప్పేవారు. కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం పొందిన ఆయన ఆ తరువాత సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట్లో ఎడిæర్‌ మోహన్‌ దగ్గర శిష్యరికం చేసిన ఆయన 2004లో ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జగడం’ ‘ఆర్య2’, ‘100%లవ్‌’, ‘1 నేనొక్కడినే’,  ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాలతో తనదైన ముద్ర వేసారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన అందులోనే తన స్నేహితులతో కలిసి ‘కుమారి 21 ఎఫ్‌’, ‘దర్శకుడు’ చిత్రాల్ని నిర్మించారు.

  3.    B. Jaya : తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకురాలుగా రాణించి విజయాల్ని అందుకొన్న దర్శకురాలు బి.జయ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతంలో 1964 జనవరి 11న జన్మించిన జయ 1986 నుంచి ఆంధ్రజ్యోతిలో పాత్రికేయురాలిగా ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ పనిచేస్తూనే పాత్రికేయుడు, నిర్మాత అయిన బి.ఎ.రాజుని వివాహం చేసుకొన్నారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, జ్యోతిచిత్ర పత్రికల్లోనూ పనిచేసిన ఆమె తన భర్తతో కలిసి సూపర్‌హిట్‌ పత్రికని స్థాపించారు. ఆ తర్వాత దర్శకురాలిగా మారి ఆమె తీసిన ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘ప్రేమలో పావని కల్యాణ్‌, ‘గుండమ్మగారి మనవడు’, ‘సవాల్‌’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’ చిత్రాలు ఇంటిల్లిపాదినీ అలరించాయి. వనిత పత్రికలో ప్రచురితమైన ‘ఆనందో బ్రహ్మ’ కథకిగానూ జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలాగే ఆ కథని పద్నాలుగు భాషల్లో అనువదించింది అకాడమీ. ‘స్పర్శ’ కథకి సంక్రాంతి పురస్కారం లభించింది. ‘నీతి’ అనే కథతో చక్రపాణి పురస్కారం అందుకొన్నారు.

  4.    Shweta Basu Prasad  : శ్వేతా బసు ప్రసాద్ కొత్తబంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అందం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. జనవరి 11, 1991లో బీహార్ లోని జంషెద్ పూర్ లో జన్మించారు. ఈవిడ 2002లో వచ్చిన హిందీ సినిమా మక్దీ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసారు. ఆ తర్వాత 2005లో వచ్చిన ఇక్బాల్, వాహ్ లైఫ్ హో తో ఐసి, డర్నా జరూరి హై, బద్రీనాథ్ కి దుల్హనియా, మార్డ్ కొ దర్ద్ నహి హోతా, ద తాష్కెంట్ ఫైల్స్, శుక్రను, లాంటి సినిమాల్లో నటించింది. ఈవిడ తెలుగులో కొత్త బంగారు లోకం, కాస్కో, రైడ్, కల్వర్ కింగ్, ప్రియుడు, నువ్వేక్కడుంటే నేనక్కడుంట, లాంటి సినిమాల్లో నటించింది. శ్వేత బసు ప్రసాద్ మక్డీ సినిమాకి బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు,ఇక్బాల్ సినిమాకి బెస్ట్ సప్పోర్టింగ్  అవార్డులు అందుకుంది.

  5.    Fatima Sana Shaikh   : మీకు అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా గుర్తుందా అందులో గీత కుమారి ఫోగాట్ పాత్ర చేసి అమ్మాయి గుర్తుందా ఆవిడే ఫాతిమా సన షైక్ నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ జనవరి11, 1992లో హైదరాబాద్ లో జన్మించారు. ఈవిడ మొదట చైల్డ్ ఆర్టిస్టుగా 1997లో వచ్చిన ఇష్క్ సినిమాలో నటించింది. ఆ తర్వాత చాచి 420, బడే దిల్ వాల, వన్ 2 క 4 లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత 2008లో తహాన్ సినిమాలో నటించింది అలాగే, బిట్టూ బాస్, ఆకాష్ వాణి, దంగల్, ధగ్స్ అఫ్ హిందూస్తాన్ సినిమాల్లో నటించింది. ఈ హైదరాబాది అమ్మాయి దంగల్ సినిమాకి న్యూస్ 18మూవీ అవార్డు, జాకీ చాన్ ఆక్షన్ మూవీ అవార్డు లను సొంతం చేసుకుంది. తెలుగులో నువ్వు నేను ఒకటవుదాం అనే సినిమా చేసింది. ఈవిడ ఇప్పటివరకు తన కెరీర్లో హీరోయిన్ గాను, చైల్డ్ ఆర్టిస్టు గాను మొత్తం 10 సినిమాల్లో నటించింది.    

  6.    Kiran Rathod    : కిరణ్ రాథోడ్ ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ జనవరి11, 1981లో రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించారు. ఈవిడ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా 1996లో వచ్చిన హిందీ సినిమా బాల్ బ్రంహచారి సినిమా చేసింది. ఆ తర్వాత యాదేయిన్, జాని దుష్మన్: ఎక్ అనోఖి ఖహని, సావన్ ద లవ్ సీజన్, కుశల్ మంగల్, లాంటి సినిమాల్లో నటించింది. ఈవిడ తమిళ్ లో జెమినీ, విలన్, అన్బె శివం, దివాన్, పరసురాం, వాడా, జగ్గు భాయ్, సగుని, సర్వర్ సుందరం లాంటి సినిమాల్లో నటించింది. తెలుగులో 2001లో వచ్చిన సిద్ధూ సినిమాతో పరిచయమై, శుభకార్యం, నువ్వులేక నేను లేను, శ్రీరాం, నాని, అందరూ దొంగలే దొరికితే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హై స్కూల్, కెవ్వు కేక, లాంటి సినిమాల్లో నటించింది. కిరణ్ రాథోడ్ జెమినీ సినిమాకి సినిమా ఏక్స్ ప్రెస్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. ఈవిడ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 46సినిమాల్లో నటించింది.   

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు 

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!