21.9 C
New York
Tuesday, September 28, 2021

అతని క్రీడా ప్రస్థానం యువతకు ఓ స్ఫూర్తి పాఠం – పవన్ కళ్యాణ్

టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడా విభాగంలో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ సెమీస్ లో ఓటమిపాలైనప్పటికీ, ఆమె పోరాడిన విధానంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లవ్లీనా నిన్న టర్కీ బాక్సర్, వరల్డ్ చాంపియన్ బుసానెజ్ సెర్మినెల్లి చేతిలో ఓడిపోయింది. దాంతో లవ్లీనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనాకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న దశలోనే లవ్లీనా ఒలింపిక్స్ కాంస్యం దక్కించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడల్లో గెలుపోటములు సహజం అని, అయితే ఎంత చిత్తశుద్ధితో పోరాడామన్నది ముఖ్యమని, లవ్లీనా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే టోక్యో ఒలింపిక్స్ లో 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత వస్తాదు రవికుమార్ దహియా రజతం సాధించడంపై కూడా జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. హర్యానాకు చెందిన రైతుబిడ్డ రవి దహియా టోక్యో ఒలింపిక్స్ లో విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయం అని, రెజ్లింగ్ లో రజతం సాధించి దేశానికి మరో పతకం అందించిన రవి దహియాకు తన తరుఫున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు పవన్ ఓ ప్రకటనలో తెలియజేసారు. నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ క్రీడా ఆణిముత్యం రెజ్లింగ్ లో ఎదిగిన తీరు, అతని క్రీడా ప్రస్థానం యువతకు ఓ స్ఫూర్తి పాఠం అని,. రాబోయే రోజుల్లో రవి మరిన్ని ఘన విజయాలు సొంతం చేసుకుని దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తాడని ఆశిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!