2.1 C
New York
Tuesday, January 18, 2022

మిమ్మల్ని ఎదుటి వారు ఇష్టపడుతున్నారో … లేదో సీక్రెట్ గా ఇలా తెలుసుకోండి

మిమ్మల్ని ఎదుటి వారు ఇష్టపడుతున్నారో … లేదో సీక్రెట్ గా ఇలా తెలుసుకోండి

మనల్ని ఎవరైనా ఇష్టపడినపుడు చాలాసార్లు అది మనకు తెలియక పోవచ్చు… ఎందుకంటే ఎక్కువ శాతం మంది మనల్ని ఇష్టపడితే దాన్ని మనకు చెప్పడానికి కొంచెం ఆలోచిస్తారు… అంటే ఇక్కడ వాళ్లకి వాళ్ళ పర్సనల్ కారణాలు ఎన్ని ఉన్నా కూడా తాము ఎదుటి వారినీ ఇష్టపడుతున్నాము అనే విషయం చెప్తే వాళ్లకి తాము ఎక్కడ చులకన అయిపోతా మేమోనని భయం కూడా చాలా మందిలో ఉంటుంది… ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల విషయంలో ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి… ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డా కూడా ఆ విషయం అతనికి అంత ఈజీగా చెప్పాలి అనుకోదు… ఒకవేళ ఆ విషయం కనుక అర్థం చేసుకునే స్థాయిలో అబ్బాయి ఉంటే అతను ఎత్తి పరిస్థితుల్లోనూ ఆమెను వదులుకోడు… కానీ అలా తెలియడం అన్నది ఇక్కడ చాలా పెద్ద సమస్య… ఎందుకంటే ఎదుటి వారు మనసులో దాచుకున్న విషయాలను మనం అంత త్వరగా పసిగట్టలేము… ఒకవేళ అలా తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ మైండ్ సెట్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి అనే విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలి… అయితే మనిషి మెంటాలిటీ లు వారి క్యారెక్టర్ ల మీద రీసెర్చ్ చేసిన కొంతమంది సైంటిస్టులు మిమ్మల్ని ఎదుటివారు ఇష్టపడుతున్నారో లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పారు… వాటిని మీరు తెలుసుకొని అర్థం చేసుకుంటే ఇక మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మీరు జీవితంలో అసలు మిస్ చేసుకోరు… ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా వాళ్ళని ఇష్టపడే లేకపోతే ప్రేమించిన వాళ్లే వారికి కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి…

1. వాళ్ళు ఏం చేస్తున్నారు??? ఏం మాట్లాడుతున్నారు??? అనే విషయాలను అబ్జర్వ్ చేయండి!!!!

నిజానికి మనలో చాలామంది గమనించరు కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనుల ద్వారా లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు ద్వారా వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లు గా చెప్పేస్తారు… కానీ అవేవీ తెలియని మనం ఆ విషయాలను అంతగా పట్టించుకోము… అలా జరిగినప్పుడు తాము ఇష్టపడుతున్న కూడా ఎదుటి వ్యక్తి తమను పట్టించుకోవడంలేదని వాళ్ళకి దూరంగా వెళ్లి పోయే అవకాశాలు ఉంటాయి… అలా ఒకసారి దూరంగా వెళ్ళిన వారిని మళ్ళీ మనం దక్కించుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది… సో ఇక నుంచి అయినా మీతో ఉండే మీ ఫ్రెండ్స్ లేదా మీ కొలీగ్స్ లేదా ఎవరైనా బయట వ్యక్తులు మీతో ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి అప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మీరు గమనించవచ్చు.

2. మీతో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు!!!!

ఈ రోజుల్లో ఎవరికైనా టైం చాలా ఇంపార్టెంట్… ఒక క్షణాన్ని కోల్పోయిన కూడా మళ్లీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మళ్లీ దాన్ని వెనక్కి తెచ్చుకోలేరు… సో అలాంటప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు నీతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఆలోచించరు… వాళ్లకి మీతో గడపడం అంటే ఇష్టంగా ఉంటుంది కాబట్టి టైమ్ ను అసలు పట్టించుకోరు… ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఏ మాత్రం టైం దొరికినా కూడా ఆ టైం మీతో స్పెండ్ చేయాలని చూస్తుoటారు… సో మీరు గనుక మీ లైఫ్ లో ఉన్న మనుషులు మీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అన్న విషయాలను గమనించగలిగితే కచ్చితంగా మీకు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరో చాలా ఈజీగానే తెలిసిపోతుంది.

3. మీ మాటలను వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు!!!!

బయట పది మంది తమను ఎన్ని మాటలు అన్నా కూడా ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు మీరు ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేక పోతారు… ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏమిటంటే తాము ఇష్టపడే లేదా ప్రేమించేవారు ఒక మాట అన్నా కూడా అది ఎదుటి వారికి చాలా బాధగా ఉంటుంది దాన్ని వాళ్ళు అస్సలు తట్టుకోలేక పోతారు… అందుకే మీరు వాళ్లతో ఉన్నప్పుడు మీరు అన్న మాటలకు లేదా వారి గురించి మీరు చేసే కామెంట్స్ కు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని పదేపదే గమనించండి ఒకవేళ వారు గనుక మీ మాటలకు ప్రభావితం అవుతున్నారు మీరు చెప్పే మాటలవల్ల వాళ్ళ ఫీలింగ్స్ హార్ట్ అవుతున్నాయి అనిపిస్తే మాత్రం వాళ్లు మిమ్మల్ని కచ్చితంగా ఇష్టపడుతున్నారు అని గుర్తుపెట్టుకోండి…

4. అందరిలో ఉన్నప్పుడు మీతో ఎలా ఉంటున్నారు!!!!

ఒక మనిషి మీద మనకి ఎక్కువ ఇష్టం ఉంటే కనక మనం ఎంత మంది లో ఉన్నా కూడా దాన్ని కచ్చితంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాం… ఎందుకంటే మనలో వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది… సో మిమ్మల్ని ఇష్టపడుతున్న వాళ్లు నీతో కలిసి ఎక్కడికైనా బయటకి వెళ్ళినపుడు కూడా మీ మీద ఉండే ప్రేమను ఖచ్చితంగా తమ మాటల ద్వారా లేదా చేతల ద్వారా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు… మీరు గనక ఇలాంటి విషయాలని గమనించగలిగితే… వాళ్ల ప్రేమ మీరు త్వరగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది… పది మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చెయ్యడం, మీ గురించి ఎక్కువగా కేర్ తీసుకోవడం లాంటివి వాళ్ళు చేశారంటే గనక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదులు కోకండి… 

5. ఒంటరిగా ఉన్నప్పుడు మీతో ఎలా ఉంటున్నారు!!!!

ఒక వ్యక్తి తో కలిసి మనం పర్సనల్ గా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ల మీద మనకు ఇష్టం గనుక ఉన్నట్లయితే కచ్చితంగా అప్పుడు మన ఫీలింగ్స్ మాటలు వేరే విధంగా ఉంటాయి… అదే మళ్లీ బయట వ్యక్తుల మధ్య కు వస్తే కచ్చితంగా తేడా కనబడుతుంది… దీనికి కారణం ఒక్కటే అదేంటంటే మిమ్మల్ని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు… ఎందుకంటే మీతో పర్సనల్ గా ఉన్నప్పుడు వాళ్లు చెప్పే మాటలు వాళ్ళు చేసే పనులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి… అదే పదిమంది లోకి వస్తే మీ మీద వాళ్లకు ఉన్న ప్రేమ ఎక్కడ బయట పడిపోతుంది అన్న భయంతో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు… మీతో ఉన్నప్పటితో పోలిస్తే వాళ్ళ ప్రవర్తన లో వచ్చిన మార్పు కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే మీరే తెలుసుకోగలుగుతారు.

సో ఫ్రెండ్స్ అవండి ఎదుటి వారు మీకు తెలియకుండా సీక్రెట్ గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అన్న విషయాలు ఎలా తెలుసుకోవాలి అన్న విషయాల గురించి మీకు బాగా ఉపయోగపడే టిప్స్… నిజానికి మనల్ని ఇష్టపడే వాళ్ళు అంత ఈజీగా మనల్ని వదిలి పెట్టరు… కానీ కొంత మంది సైలెంట్ లవర్స్ లాంటి వారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్న విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా మీకే అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది.

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!