23.2 C
New York
Tuesday, September 21, 2021

నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి నా భర్తతో కలిసి ఏం చేసిందంటే..???

ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అవి ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప బంధాలు… ఒక మంచి ఫ్రెండ్ ఉంటే జీవితంలో అంతకంటే మంచి విషయం వేరే ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి అలాంటి ఫ్రెండ్స్ వల్లే జీవితంలో ఎంతో కోల్పోవాల్సి వస్తుంది. కొంచెం వినడానికి ఇబ్బందిగా అనిపించినా ఒక్కోసారి మనం బాగా నమ్మిన మన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మనల్ని మోసం చేస్తారు పైకి అద్భుతంగా నటిస్తూ లోపల కుళ్లు కుతంత్రాలు పెట్టుకుంటారు. అలాంటి సంఘటనే కోల్ కత్తా లో ఒకటి జరిగింది. 

రేహా అనే ఒక అమ్మాయి తన స్నేహితురాలి ని పూర్తిగా నమ్మి చివరకు ఆ ఫ్రెండ్ చేసిన మోసంతో తన భర్తకు దూర అయ్యింది. తాను ఎంతో నమ్మిన ఫ్రెండ్ అలా చేస్తుందని తాను కలలో కూడా ఊహించలేదు… ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది మనుషులు ఇలాగే వుంటున్నారని తమ అవసరాల కోసం తమ స్వలాభం కోసం ఎంతకైనా తెగిస్తారనీ తమ వారిని కూడా మోసం చేస్తారని అలాంటి వారికి దూరంగా వుండమని ముందే జాగ్రత్త పడమని ఒక హెచ్చరికగా చెప్తూ తనకు జరిగిన మోసాన్ని ఆవిడ తన పర్సనల్ బ్లాగ్ లో షేర్ చేసుకుంది… ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం…

రెహా చక్రవర్తి కోల్ కత్తా లో ఒక పెద్ద కంపనీలో మంచి జాబ్ చేస్తుంది లక్షల్లో తన జీతం లైఫ్ అంతా బాగుంది తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసే కుటుంబం పైగా తనకు ఎప్పుడూ అండగా నిలిచే తన బెస్ట్ ఫ్రెండ్ నిమ్మి… ఈ లైఫ్ కు ఇంకేం కావాలని అనుకుంది రేహా… అయితే ఆ తర్వాతే అనుకోకుండా ఆవిడ లైఫ్ టర్న్ అయ్యింది. 

ఒకరోజు తన కార్ లో ఆఫీస్ కు వెళుతూ అనుకోకుండా వేరే కార్ ను గుద్దింది రేహా దాంతో పెద్ద గొడవ జరిగింది ఆ కార్ లో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఆమెతో గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళదామని తమ కార్ ఆవిడ బాగు చేయించాలని అన్నారు… రేహ సడెన్ గా అందరి ముందు తన పరువు పోవడంతో బాగా ఫీల్ అయ్యింది. అదే టైమ్ కు ఆ కార్ లో ఉన్న ఇంకొక అబ్బాయి కిందకు దిగి తన ఫ్రెండ్స్ ను కూల్ చేసి మ్యాటర్ సెట్ చేశాడు. పోలీస్ స్టేషన్ కు వద్దని రెహ మన కార్ బాగు చేయిస్తుందని డైరెక్ట్ గా రిపేర్ షాప్ కు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గంటలో కార్ రిపేర్ అయిపోయింది. రేహకు పెద్ద డబ్బు ఖర్చు కూడా ఏం కాలేదు… దాంతో తను ఊపిరి పీల్చుకుంది… తనకు అలా హెల్ప్ చేసిన అతనే సత్యజిత్… మంచి అందగాడు అంతకు మించి చాలా మంచి వాడు తనకు సత్యజిత్ చేసిన హెల్ప్ కు రెహ ఫిదా అయిపోయింది… తనకు చిన్న ట్రీట్ లాంటిది ఇచ్చి థాంక్స్ చెప్పాలని ఆ నెక్స్ట్ డే తనని ట్రీట్ కు పిలిచింది.

జస్ట్ ఒక్క ట్రీట్ తో మొదలైన వాళ్ళ పరిచయం ఇక అక్కడి నుంచి ఆగలేదు అలా కంటిన్యూ అయ్యింది… ఈలోపు రెహ కంపనీనీ ఎవరో పెద్ద బిజినెస్ మాన్ కొన్నాడనీ రెహ జాబ్ కూడా పోవచ్చని తెలిసింది దాంతో తను చాలా బాధపడింది… అప్పుడు తనకు తెలిసిన విషయమే తను పని చేస్తున్న కంపనీ కొన్నది ఎవరో కాదు సత్యజిత్ అని అతనో పెద్ద కోటీశ్వరుడు అని అది తెలిసి రెహ షాక్ అయ్యింది… ఒకరోజు రెస్టారెంట్ లో నన్ను పెళ్లి చేసుకుంటావా అని సత్యజిత్ ఆమెను అడిగాడు ఒక వారంలో పెళ్లి జరిగిపోయింది… ఆ తర్వాత తను ఒక ఎంప్లాయ్ గా పని చేసిన కంపనీ నికి రెహ ఎమ్.డి. అయ్యింది.

రేహా లైఫ్ అద్భుతంగా అలా అలా హాయిగా సాగిపోతుంది… అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్ లో సడెన్ గా ఒకరోజు రేహా ఆఫీస్ కు వచ్చిన తన ఫ్రెండ్ నిమ్మీ తనని తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని తన దగ్గరున్న డబ్బు నగలు అన్నీ తీసుకుని పారిపోయాడని ఇప్పుడు తన బతుకు రోడ్డున పడిందని తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది… తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ అలా అవడంతో తట్టుకోలేని రేహా నిమ్మిని ఓదార్చి తన కంపనీ లోనే ఆమెకు మంచి జాబ్ ఇచ్చింది. కొన్ని రోజులు బాగానే పనిచేసిన నిమ్మి ఆ తర్వాత నుంచి తన గేమ్ స్టార్ట్ చేసింది… సత్యజిత్ తో క్లోజ్ గా ఉండేది. అతనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిది… భార్య భర్త లు ఎక్కడికెళ్లినా తను కూడా వస్తానంటూ వాళ్లిద్దరి మధ్య ఎంటర్ అయ్యేది… అలా అలా మెల్లిగా వారి ఇంటికి ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేసింది. 

రేహా ను సత్యజిత్ తో తన శృంగారం ఎలా ఉందని అడగడం రేహా సత్యజిత్ ను శాటిస్ ఫై చేయడం లేదు అని అబద్ధాలు చెప్పి ఆమెను మేకప్ పేరుతో చిత్ర విచిత్రంగా తయారు చేయడం భర్తతో కొంచెం ఆవేశంగా కోపంగా బిహేవ్ చేసేలా ప్రేరేపించడం లాంటివి చేసింది. దాంతో కొన్ని రోజుల్లోనే సత్యజిత్ కు రేహాకు మధ్య గొడవలు జరిగి ఒకరికి ఒకరు దూరం అయ్యారు. కంపెనీకి వచ్చినా మాట్లాడుకునే వారు కాదు ఓకే బెడ్ మీద పడుకున్న ఒకరినొకరు టచ్ చేసుకునే వారు కాదు… అలా వారిద్దరి మధ్య ఇక మళ్ళీ కలవనంత గ్యాప్ తీసుకొచ్చిన తర్వాత నిమ్మి మెల్లిగా సత్యజిత్ కు దగ్గరవడం మొదలు పెట్టింది.

ముందుగా సత్యజిత్ మంచివాడని తనకు రేహా కరక్ట్ కాదని అతనికి ఓదార్పు మాటలు చెపుతూ అవకాశం దొరకగానే అతనితో శారీరకంగా దగ్గరయింది. ఇక అక్కడి నుంచి సత్యజిత్ ను తన వెంట తిప్పుకుంటూ అటు రేహా మళ్లీ అతనితో కలవకుండా జాగ్రత్త పడుతూ చక్రం తిప్పిన నిమ్మి కొద్ది రోజుల్లోనే సత్యజిత్ ను తన గ్రిప్ లో పెట్టుకుని కంపనీ లో నుంచి రేహాను తీసేయించింది… సత్యజిత్ తనను ఇంతగా ద్వేషిస్తూన్నాడ అనుకున్న రిహా అతనికి ఇంకా దూరంగా వెళ్లిపోయింది.

అయితే నిమ్మి మాత్రం తన తప్పు ఏం లేనట్టు రెగ్యులర్ గా రీహా తో మాట్లాడుతూ కావాలంటే తను కూడా కంపనీ లో జాబ్ మానేస్తానని అనేది కానీ తన కుట్రలు తెలియని అలా చేస్తే నిమ్మి కి ఇబ్బంది అని వద్దు అనేది. ఇక అక్కడి నుంచి నిమ్మి ఇంకా రెచ్చిపోయి సత్యజిత్ ను ఒక ఆడుకుంటూ తానే ఆ కంపెనీకి ఎమ్. డి. అయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్ యే కదా కంపనీ కి ఎండీ అయ్యింది అని సంతోష పడ్డ రెహ కు ఆ తర్వాత అదే కంపనీ లో పని చేసి నిమ్మి వల్ల జాబ్ పోగొట్టుకున్న సునీత అనే అమ్మాయి ద్వారా మొత్తం నిమ్మి చేసిన మోసం అంతా తెలిసి షాక్ అయ్యింది.

అనవసరంగా నిమ్మి మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకున్నానని అర్థం చేసుకున్న రెహ్యా మళ్లీ సత్యజిత్ ను కలవడానికి ట్రై చేసినప్పటికీ నిమ్మి తనకు ఆ అవకాశం ఇవ్వలేదు… అటు ప్రేమించిన సత్యజిత్ ను దూరం చేసుకుని ఇటు లైఫ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ చేతిలోనే దారుణంగా మోసానికి గురి అయ్యి ఎంతో మానసిక వేదన అనుభవించిన రే హా కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళి పోయింది… కానీ తన ఫ్యామిలీ సపోర్ట్ తో మళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది… మన అనుకునే వాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలనీ ఎవరు ఎప్పుడూ ఎలా మారతారో మనం గుర్తించలేని జాగ్రత్తలు చెప్తుంది.

సో ఫ్రెండ్స్ అదండీ తన బెస్ట్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన రేహ జీవిత అనుభవాలు… ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ లేకపోతే మనం ఒక మనిషిని ఎంత ఎక్కువగా నమ్మినప్పటి కి కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!