19.5 C
New York
Tuesday, September 28, 2021

ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్” – రామ్ గోపాల్ వర్మ

ఎవరేం అనుకుంటే నాకేంటి.. ఉన్నదున్నట్లు మాట్లాడతా.. ఎవడొస్తాడో చూసుకుంటా.. ఇదే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దారి. ఆయన దారికి ఎవరూ అడ్డు రాకూడదు.. వచ్చినా ఆయన పట్టించుకోడు. తాను చేయాలనుకున్నది చేస్తుంటాడు. ఇప్పుడు కూడా-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో జోష్ రప్పించే ప్రయత్నమే చేశాడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ.. ఎపుడు ఎవరిని ఏ రేంజ్‌లో సెటైర్లు వేస్తాడో చెప్పడం కొంచెం కష్టమే. తాజాగా ఆర్జీవి.. పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకడంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ అభిమానులకు జోష్ రప్పించేలా ట్వీట్ చేసాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. . గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, నివేదితా ధామస్-వంటి సినీ సెలబ్రిటీలో కొందరు కరోనా బారిన పడ్డారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసిన సంగతి తెలిసిందే.! డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు  కరోనా సోకింది. ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ.. హే పీకే ఫ్యాన్స్.. కరోనా వైరస్‌ను పచ్చడి చేసి చంపేయండి. అంటూ కాస్తా వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు. మరీ ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన రేర్ పర్సనాలిటీ.. వన్ పీస్ అనేసాడు. వెరీ యూనిక్ అంటూ చెప్పాడు వర్మ. తాను సినిమాల పరంగా చిరంజీవిని ఇష్టపడతానని.. రాజకీయ నాయకుడిగా కాదని క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇక తన దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరన్న రామ్ గోపాల్ వర్మ.. ఫ్యూచర్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ అనే వాడు ఒక్కడే ఉంటాడు.. అది యూనిక్. పవన్ రాజకీయమంటే నాకు చాలా ఇష్టం అంటూ పొగిడేసాడు ఈ దర్శకుడు. ఇపుడీ ట్వీట్ సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత వర్మ నోటి నుంచి సెటైర్లు కాకుండా పాజిటివ్ పదాలు వచ్చాయి.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!