14.6 C
New York
Saturday, September 25, 2021

ఈ సంకేతాలు ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోడు,వదిలేస్తాడు!!!!

అమ్మాయిలు అబ్బాయిలు మధ్య రిలేషన్ షిప్స్ ఈ మోడ్రన్ వరల్డ్ లో చాలా కొత్త పుంతలు తొక్కుతున్నాయి… పాత రోజుల్లో లాగా వాళ్ళు వుండడం లేదు… చాలా అడ్వాన్స్ గా వుంటున్నారు… ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ లవ్ లో పడినా లేక డేటింగ్ చేస్తున్నా కూడా తమ అభిప్రాయాలను పార్టనర్ కు ఖచ్చితంగా చెపుతున్నారు… ఇప్పుడంతా లేటెస్ట్ ఫ్యాషన్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాదు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉంటారు ఇంకొకరికి అది నచ్చకపోతే ఇద్దరూ విడిపోతారు… ఎలాంటి మనుషుల్ని అయినా కలిపి ఉంచేది భారతీయ సంస్కృతి లో ఉన్న పెళ్లి అనే గొప్ప బంధం… అబ్బాయిలయినా అమ్మాయిలయినా తాడు బొంగరం లేకుండా తిరుగుతారు అనే పెళ్లి అనే ఒక పవిత్ర బంధంతో ఇద్దరినీ కలిపి ఉంచే గొప్ప పరిష్కారాన్ని కనిపెట్టారు… అయితే ఇప్పుడు లవ్ లో పడిన తర్వతా చాలా మంది అబ్బాయిలు తమ లవర్ తో ఎంజాయ్ చేద్దామని లేకపోతే వాడుకుని వదిలేద్దాం అనే ఆలోచనతో వాళ్ళకు ప్రేమ పేరు చెప్పి ముగ్గులోకి దింపుతున్నారు తీరా పెళ్లి అనగానే హ్యాండ్ ఇచ్చి పారిపోతున్నారు… ఇది చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న సమస్యనే కొంత మంది తెగించి పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం లాంటివి చేస్తుంటే మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు… ఇంకొందరు మౌనంగా ఆ మోసాన్ని భరించి జీవితంలో ముందుకు వెళుతున్నారు. అయితే ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ అసలు మీ బాయ్ ఫ్రెండ్ కు నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా?? తను నిజంగా మిమ్మల్ని ప్రేమించాడా లేదా?? అసలు ఆ విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలి అన్న టాపిక్ మీద ఒక సర్వే చేశారట… సో అమ్మాయిలు ఇప్పుడు ఆ సర్వే వివరాలు మీకోసం…

1. ఈ సొసైటీ కోసం పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు!!!

తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని ఏ బాయ్ ఫ్రెండ్ అయినా ఆమెతో మొదటగా చెప్పే మాట ఇదేనట… ప్రేమ అంటూ వెంటపడి అమ్మాయి కూడా ఎస్ చెప్పిన తర్వతా తనతో అన్నీ విధాల ఎంజాయ్ చేస్తూ ఉండే అబ్బాయిలు పెళ్లి అనే మాట తీసుకురాగా నే పారిపోతారట… ఎక్కువసార్లు పెళ్లి అనే టాపిక్ రాగానే దాన్ని డైవర్ట్ చెయ్యడానికి ట్రై చేస్తారు… ఇక తప్పదు ఏదో ఒకటి చెప్పాల్సిందే అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఇలా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం పెళ్లి చేసుకోవడం ఏంటి అది మనకు అవసరం లేదు అంటూ సొల్లు మాటలు చెపుతారాట. 

2. అతనికి లైఫ్ లాంగ్ మీతో వుండడం ఇష్టం లేదు!!!!

చాలా మంది అమ్మాయిలకు ఇదొక షాకింగ్ విషయమే… ఎందుకంటే ఎప్పుడూ తనకు ఫోన్ చేస్తూ తనని కలవాలి అంటూ ఇబ్బంది పెడుతూ తాము కలిసినప్పుడల్లా ముద్దులు పెడుతూ రొమాన్స్ చేస్తూ వుండే తమ బాయ్ ఫ్రెండ్ కు తనతో లైఫ్ లాంగ్ వుండడం ఎందుకు ఇష్టం ఉండదు??? ఇక్కడే అసలు కిటుకు ఉంది… పెళ్ళి కాకుండా అయితే తను మీతో ఎలా అయినా వుండొచ్చు పైగా మీకు అతని మీద ఏ హక్కు, అధికారం ఉండవు… అదే పెళ్ళయితే అమ్మాయిలకు ఆటో మేటిక్ గా ఆడాళ్ళ కు సర్వ హక్కులూ అధికారాలు వస్తాయి ఎందుకంటే అది మన చట్టాల్లో ఉంది… గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంజాయ్ చేయడానికి పనికొచ్చే ఎంజాయ్ మెటీరియల్ అనే ఫీలింగ్ చాలా మంది అబ్బాయిల్లో వుంటుంది… పెళ్ళి చేసుకుని తనకు powers ఇవ్వడం అన్నది వాళ్ళకు నచ్చదు.

3. పెళ్ళి చేసుకున్న తన ఫ్రెండ్స్ గురించి జోక్స్ వేస్తాడు.

మా అశోక్ గాడు పెళ్లి చేసుకున్నాడట… పాపం అమాయకుడు బలై పోయాడు అంటూ తమ ఫ్రెండ్స్ గురించి కామెంట్స్ జోక్స్ వేసుకుంటూ ఉంటారు… దీనర్థం తమకు పెళ్లి గురించి ఇంట్రెస్ట్ లేదని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగొద్దు అని తమ గర్ల్ ఫ్రెండ్ కు హింట్స్ ఇవ్వటమే నట… పెళ్ళి అనేది రాంగ్ డిసిషన్ అని అది చేసుకున్న వాళ్ళు ఫూల్స్ అంటూ మాట్లాడుతారు… మ్యారేజ్ అనేది ఒక పెద్ద బర్డెన్ అని తాము దాన్ని మోయలేననీ కూడా మాట్లాడుతారు.

4. పిల్లలంటే ఇష్టం ఉండదు!!!!

 కల్లా కపటం తెలియని పసి పిల్లలు అంటే ఇష్టం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి… కానీ పెళ్లి మాట ఎత్తగానే జారుకునే బాయ్ ఫ్రెండ్స్ మాత్రం అదే జాతి కిందకు వస్తారట… ఇలాంటి వాళ్ళు ఏ కోశానా పిల్లల్ని ఇష్ట పడరు… పైగా పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాల్సి వస్తుంది అన్న ఆలోచన కూడా వీళ్ళను తమ గర్ల్ ఫ్రెండ్ దగ్గర పెళ్లి గురించి నెగిటివ్ గా మాట్లాడేలా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పేలా చేస్తుందట.

5. కమిట్ మెంట్ ఇవ్వలేరు!!!!

నిజానికి పెళ్లంటే అది లైఫ్ లాంగ్ కమిట్ మెంట్!!!! అంటే జీవితాంతం నేను నీతోనే వుంటాను అని బహిరంగంగా చెప్పడం… ఇలాంటి కమిట్ మెంట్ వాళ్ళు ఇవ్వలేరు… ఈ గర్ల్ ఫ్రెండ్ పోతే ఇంకో అమ్మాయి అనే మైండ్ సెట్ తోనే ఇలాంటి వాళ్ళు అమ్మాయిలతో రిలేషన్ షిప్ స్టార్ట్ చేస్తారట… సో తనకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నప్పుడు అతను మీకు ఒక్కరికే కమిట్ మెంట్ ఇవ్వడానికి ఎప్పటికీ ఒప్పుకోడు. 

6. అతని లవ్ స్టోరీ లన్నీ షార్ట్ టర్మ్ వే!!!!

ఇలాంటి అబ్బాయిలు ఓకే అమ్మాయిని జీవితాంతం ప్రేమించలేరు… అదేదో సినిమాలో చెప్పినట్టు లైఫ్ లాంగ్ ప్రేమ అనేది వీళ్ళ దృష్టిలో ఉండదు… అందుకే వీరి లవ్ స్టోరీ లన్నీ చాలా షార్ట్ గా వుంటాయి… ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రేమ విఫలం అయితే గుండె పగిలే గొప్ప ప్రేమికులుగా వీళ్ళు వుండలేరు కాబట్టి ఒక అమ్మాయితో బ్రేకప్ అయితే ఇంకో అమ్మాయి కోసం వెతికే రకం కాబట్టి ఎన్ని సార్లు లవ్ ఫెయిల్ అయినా పెద్దగా ఫీల్ అవరు…. అసలు లవ్ లో పడ్డ ఎవరయినా తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రేమ విఫలం అయినప్పుడు ఆ బాధ వుంటుంది కానీ వీళ్లకు అసలు పెళ్లనే కాన్సెప్ట్ మీదే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వీరి లవ్ స్టోరీ లన్నీ షార్ట్ గానే వుంటాయి. తను ప్రేమించిన అమ్మాయితో విడిపోవడం అంటే ఏ అబ్బాయికయినా అది చాలా పెయిన్ ఫుల్ గా వుంటుంది కానీ వీళ్ళకి మాత్రం ఆ ఫీలింగ్స్ ఉండవు చాలా ఈజీ గా విడిపోతారు… మళ్లీ ఇంకో అమ్మాయిని చూసుకుంటారు.

సో అమ్మాయిలు… మీరు ప్రేమిస్తున్న మీ బాయ్ ఫ్రెండ్ కు అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్నీ అతనిలో వున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరే అతనికి దూరంగా జరగండి… ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించకండి… పెళ్ళి అంటే ఇష్టమని అబ్బాయిలు చాలా డేంజర్ మిమ్మల్ని వాడుకుని మీతో ఎంజాయ్ చేయడం అనేదే వాళ్ళ ప్రధాన ఉద్దేశం సో అలాంటి వారికి మీరు ఛాన్స్ ఇచ్చి మోసపోకండి… ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!