20.1 C
New York
Thursday, October 21, 2021

హాట్ టాపిక్ గా మారిన ‘టక్ జగదీష్’ ఓటీటీ వివాదం

థియేటర్స్ వెంటనే ఓపెన్ చేయాలి.. థియేటర్స్ పై ఆధారపడి కొన్ని లక్షలమంది బతుకుతున్నారు..థియేటర్స్ యాజమాన్యాల మరియు డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలంటూ” ఈవెంట్స్ లో, సోషల్ మీడియాల్లో చిలుక పలుకులు పలికిన హీరోలు థియేటర్స్ తెరుచుకున్నాక మాత్రం వారి సినిమాల విడుదలకు ఓటీటీ వైపు మొగ్గు చూపడం తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. “సినిమా అంటే మన సంప్రదాయం, థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూడటం మన రక్తంలోనే ఉందని, అన్నింటికంటే ముందు థియేటర్స్ ని మూసి చివరికే థియేటర్స్ తెరుస్తారని” పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఇటీవల “తిమ్మరుసు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైర్ అయిన హీరో నాని తను నటించిన సినిమా రిలీజ్ సమయం వచ్చేసరికి థియేటర్స్ కష్టాలను మరిచి ఓటీటీ వైపు వెళ్ళిపోతున్నాడు. “పెరుగుతున్న నిత్యావసర ధరలను, పెట్రోల్ రేట్లను గుర్తు చేస్తూనే పబ్బులు, రెస్టారెంట్ల కంటే సినిమా థియేటర్స్ చాలా సేఫ్” అని చెప్పిన ఆ నానినే “టక్ జగదీష్” సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థలో సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓటీటీ భారీగా ఆఫర్ చేయడంతో సినిమా థియేటర్స్ కష్టాలను నాని మరిచిపోయాడో లేదా పెరుగుతున్న నిత్యావసర ధరలను సైతం ప్రశ్నించిన నాని తన సినిమాకి సంబంధించిన నిర్మాతలను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఒప్పించలేక పోయాడో తెలీదు కాని నాని తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ కి ప్రస్తుతం తను చేస్తున్న పనికి ఏ మాత్రం పొంతన లేదని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారని సమాచారం. హీరో నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదల వివాదం ముదిరి పాకాన్న పడింది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే తమ డిమాండ్‌ను పక్కన పెట్టి.. ఓటీటీలో విడుదలకు సిద్ధం కావడం న్యాయం కాదంటూ ఎగ్జిబిటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్న రోజునే.. నాని నటించిన ‘టక్ జగదీష్’ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవడాన్ని కూడా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లంతా సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎగ్జిబిటర్లు.. నానిపై కొన్ని సంచలమైన కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా ‘టక్ జగదీష్’ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నాని బాధ్యతగా స్పందించాలని, లేకపోతే భవిష్యత్తులో మేమంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ‘తిమ్మరుసు’ ఆడియో వేడుకలో నాని మాట్లాడుతూ తన థియేటర్‌లో విడుదల కావడమే తనకు ఇష్టమని, ఓటీటీలో వల్ల నష్టమేనని చెప్పారని.. ఆ మాటలు విని ఓటీటీ వాళ్లు.. ‘టక్ జగదీష్’ నిర్మాతలు అడిగిన దానికంటే రూ.4 కోట్లు ఎక్కువ ఇచ్చి ఆ సినిమాను తీసుకున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. ‘‘హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’’ అని ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పండుగ రోజుల్లో ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం వల్ల అంతా నష్టపోతాం. ఇప్పటికైనా ‘టక్ జగదీష్’ నిర్మాతలు నిర్ణయం మార్చుకోవాలి. ఆ ఓటీటీ సంస్థతో మాట్లాడి ‘టక్ జగదీష్’ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఓటీటీ వల్ల భవిష్యత్తులో నిర్మాతలకే ప్రమాదమని, డిస్ట్రీబ్యూటర్లు నిర్మాతలకు డబ్బులు కట్టరని చెప్పారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేయడానికి ముందు ఎగ్జిబిటర్ల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని తెలిపారు. మల్టీఫ్లెక్స్ యాజమాన్యం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైతే ఓటీటీల్లో సినిమా వేస్తారో.. వారి సినిమాలపై లైఫ్‌టైమ్‌ బ్యాన్ తప్పదని హెచ్చరించారు. ఇటీవల ‘టక్ జగదీశ్’ మూవీపై నాని చేసిన ట్వీట్.. నేపథ్యంలో థియేటర్ యాజమానులు ఇలా తమ నిరసన వ్యక్తం చేశారు. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలపై వస్తున్న ప్రచారానికి నాని ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్‌లో నిలబడినట్టు అయ్యిందని తెలిపాడు. సినీ అభిమానిగా తనకు కూడా ప్రేక్షకులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు ఇష్టమని నాని లేఖలో తెలిపాడు. ‘టక్ జగదీశ్’ మూవీని థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తీశామన్నాడు. కానీ కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోకపోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయాన్ని వారికే వదిలేశానని తెలిపాడు. నిర్మాతలు థియేటర్లలో రిలీజ్‌కు అంగీకరిస్తే మొదట సంతోషించేది తానని నాని తెలిపాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా.. సహకరిస్తానని, తుది నిర్ణయం వారిదేనని తెలిపాడు.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!