0.8 C
New York
Monday, January 24, 2022

నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుందని ఎలా కనుకున్నానంటే? How I find out My Girlfriend is CHeating Me?

నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుందని ఎలా కనుకున్నానంటే? How I find out My Girlfriend is CHeating Me?

బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్లు రొమాన్స్ చేయడం డేటింగ్ చేయడం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండాలనుకోవడం లాంటివి చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి… అయితే వయసు వేడిలో ఉండే అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా ఎదుటి వారిని చాలా ఈజీగా నమ్మేస్తూ వుంటారు… ఒకవేళ వాళ్ళు మోసం చేసినా కూడా అంతే తొందరగా హర్ట్ అవుతూ కూడా ఉంటారు… సరిగ్గా లోకం గురించి ఏమీ తెలియని వయసులో లవ్ అంటూ డేటింగ్ అంటూ వాళ్ళు చేసే తప్పులకి ఒక్కోసారి వాళ్ళ జీవితాల్ని కోల్పోవాల్సి వస్తుంది… ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు అంత ఈజీగా తీసుకోరు… వల ఎమోషన్స్ అన్నీ కూడా చాలా పీక్ లెవల్లో కనిపిస్తూ ఉంటాయి… అందులోనూ ముఖ్యంగా మెచ్యూరిటీ అనేది కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా మనకి కనిపించదు… తమకు ఏది నచ్చితే అది చేస్తూ వెళుతూ ఉంటారు పైగా వాళ్ళు దేనికి కూడా రెస్పాన్సిబులిటీ తీసుకోవాలి అని ఆలోచించరు. తన బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తమని మోసం చేస్తే గనుక వాళ్లు తమ కోపాన్ని లేదా పగని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు… ఇప్పుడు మనం అలాగే తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన రవి అనే అబ్బాయి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకో పోతున్నాం…

రవి ముంబైకి చెందిన ఒక చాలా పేద కుటుంబలో పుట్టాడు… వాళ్ళ అమ్మ నాన్న రోడ్ల మీద కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు… రవి గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో చదివేవాడు… అప్పుడే ఇంటర్ లోకి ప్రవేశించిన రవి తన కాలేజీ లోనే చదివినా సీత అనే అమ్మాయిని ప్రేమించాడు… ముందుగా సీత రవి గురించి పట్టించుకోకుండా అతని ప్రేమను నిర్లక్ష్యం చేసింది… కానీ రవి ఆమెను వదిలి పెట్టకుండా సంవత్సరం పాటు ప్రేమ పేరుతో ఆమె వెనకాలే తిరిగాడు… చివరికి రవి ప్రేమను అర్థం చేసుకున్న సీత అతని ప్రేమకు ఎస్ చెప్పింది… దాంతో రవి ఇంక చదువు విషయం పక్కన పెట్టి సీతతో కలిసి సినిమాలు షికార్లు అంటూ ముంబై మొత్తం తిరిగేవాడు… రోజంతా కష్టపడి కూరగాయలు అమ్మితే వచ్చే డబ్బులను వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తనకు చదువు కోసం అవసరం ఉందని చెప్పి ఆ డబ్బులు తీసుకొని వాటితో సీతను బాంబే అంతా తిప్పడం ఆమెకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త గిఫ్ట్స్ కొనిపించడం లాంటివి చేసేవాడు.

అయితే తమ కొడుకు రవి లవ్ స్టోరీ గురించి అసలు ఏ విషయం తెలియని అతని తల్లిదండ్రులు రవి ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా కాదనకుండా ఇచ్చేవారు దానికోసం వాళ్లు కూడా ఇంట్లో పస్తులు ఉండేవారు… తమ కొడుకు బాగా చదివి తమను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకంతో వాళ్ళు రవి కోసం ఏమైనా చేయడానికి వెనుకాడే వారు కాదు… తల్లిదండ్రుల ప్రేమని అడ్వాంటేజ్ గా తీసుకున్న రవి వాళ్ల దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు వసూలు చేస్తూ బయట సీతతో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేవాడు… చివరికి రవి లవ్ స్టోరీ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్లకి తెలిసి అతన్ని గట్టిగా మందలించారు… దాంతో రవి ఆత్మహత్య ప్రయత్నం చేయబోతే సీత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు.

రవి చాలా హ్యాపీగా సీత దగ్గరికి వెళ్లి మన పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకున్నారు నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్లని ఒప్పించాలి అని చెప్పడంతో ఆ మాటలు విన్న సీత ఒక్కసారిగా షాక్ అయింది… అసలు ఇప్పటికే మన చదువు అయిపోలేదు మనం ఇంకా డిగ్రీ కూడా చేయాలి ఆ తర్వాత జాబ్ చూసుకోవాలి అప్పుడు కదా మనం పెళ్లి గురించి ఆలోచించాలి నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటూ సీత రవి మీద బాగా సీరియస్ అయింది… ఆమె మాటలకు రవి బాధ పడ్డా కూడా అదేంటి సీత మనం ఎప్పటికైనా పెళ్లి చేసుకునే వాళ్ళం కదా అని అడిగాడు దానికి సీత మనం పెళ్లి చేసుకునేది ఇప్పుడు కాదు కదా దానికి చాలా టైం ఉంది నువ్వు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు త్వరలోనే ఎగ్జామ్స్ వస్తున్నాయి బాగా చదివి పాస్ అని చెప్పి వెళ్ళిపోయింది.

రవి ముందు సీత మాటలను అంతగా పట్టించుకోకున్నా కూడా తను చెప్పింది కూడా మన మంచికే కదా మేము ఇద్దరం ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అయితే ఆ తర్వాత డిగ్రీ చేసి మంచి ఉద్యోగం చూసుకోవాలి కదా అని అనుకున్నాడు… దాంతో రవి తన చెడు తిరుగుళ్లు అని పక్కనపెట్టి చాలా సీరియస్‌గా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవసాగాడు… సీతను బయటికి తీసుకెళ్లడం తనతో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్లడం కూడా బాగా తగ్గించి వేశాడు… అటు సీత కూడా రవితో ఎక్కువగా మాట్లాడడం లేదు తనని బయటికి తీసుకు వెళ్దామని తనకి కొత్త గిఫ్ట్స్ కొనివ్వమని కూడా ఎప్పుడూ అడగడం లేదు… అయితే ఆమె అలా చేసినందుకు రవి కి ఎలాంటి అనుమానం రాలేదు ఎందుకంటే తను కూడా అ నాలాగే చదువు మీద శ్రద్ధ పెట్టింది అనుకున్నాడు… ఇంట్లో వాళ్లు కూడా రవి లో వస్తున్న మార్పును చూసి చాలా సంతోషించారు నిజంగా నువ్వు సీత బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే కచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి చేస్తాం అని వాళ్ళు మరొకసారి రవికి మాట ఇచ్చారు.

ఇంకొక రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయి అనగా ఒకసారి రవి బెస్ట్ ఫ్రెండ్ అయినా రాము రవి తో కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడాలి అని పిలిచాడు రవి ఎందుకు అలా రాము రమ్మంటున్నాడు అర్థం కాక అతని దగ్గరికి వెళ్ళాడు… అప్పుడు రాము రవి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్పాడు అదేంటంటే రవి ఎంతో సిన్సియర్‌గా ప్రేమిస్తున్న సీత అదే కాలేజీలో శేఖర్ అనే మరొక అబ్బాయి తో ఎఫైర్ పెట్టుకుంది అని చెప్పాడు అతని మాటలను నమ్మని రవి రామును తిడుతూ అనవసరంగా సీతను నువ్వు అనుమానిస్తున్నావు నేను నీలా తప్పుగా అనుమానించను ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడితే నీ కాళ్లు చేతులు విరగొడతాను అని వార్నింగ్ ఇచ్చి పంపించి వేశాడు.

ఆ తర్వాత సీత గురించి తాము చెప్పిన విషయాన్ని మర్చిపోవాలి అని రవి ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ అతని వల్ల కాలేదు… తనే డైరెక్ట్ గా వెళ్లి సీతను అడగాలి అనుకున్నాడు కానీ ఆమె బాధ పడుతుందేమో అని ఆలోచన విరమించుకున్నాడు… అయినప్పటికీ రవి లోపల చిన్నగా సీత మీద ఒక అనుమానం స్టార్ట్ అయింది… దాంతో రవి ఇక తనను తాను కంట్రోల్ చేసుకోలేక చాలా రహస్యంగా సీతను ప్రతిరోజు ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు… అలా రవి సీతను దాదాపు వారం రోజుల పాటు ఫాలో అయినప్పటికీ ఆమె గురించిన ఎలాంటి చెడు విషయాలు అతనికి తెలియలేదు… నా సీత బంగారం తను ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయదు అని అనుకున్న రవి ఇక ఆమెను ఫాలో అవ్వడం స్టాప్ చేశాడు… అయితే ఒకరోజు రాత్రి తమ కాలేజీ వెనకాల ఉండే ఒక చిన్న క్రాప్ షాప్ లో రవి కి ఏదో పని ఉండటంతో అక్కడికి వెళ్ళిన రవికి ఆ రాత్రి తమ కాలేజీ వెనకాల ఉన్న పొదల్లో సీత శేఖర్ తో శృంగారం చేస్తూ కనిపించింది అది చూసి ఒక్క సారిగా షాక్ అయిన రవి నమ్మలేనట్టు గా మళ్లీ మళ్లీ చూశాడు చివరికి అక్కడ శేఖర్ తో కలిసి శృంగారం చేస్తుంది ఎంతో ప్రాణంగా ప్రేమించిన సీత అని కన్ఫర్మ్ చేసుకుని అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయాడు… తన కళ్ళముందే వాళ్ళిద్దరూ శృంగారం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు కాలేజీ కి వచ్చిన సరిగ్గా చదవకుండా సీతను శేఖర్ ని వాళ్ళిద్దర్నీ చూస్తూ జరిగింది తలచుకుంటూ ఎంతో బాధపడ్డాడు… ఆ తర్వాత రవి ఇక తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ప్రతిరోజు సీతను శేఖర్ నువ్వు వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు… సరిగ్గా ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఎప్పట్లా నే ఆ పొదల్లో సీతా రవి శృంగారం చేసుకుంటూ రవి కి కనిపించారు… అప్పటికి ఆ క్రాప్ షాప్ లో నుంచి తెచ్చిపెట్టుకున్న ఒక రాడ్ తీసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లిన రవి కోపం పట్టలేక సీతను శేఖర్ ను తలమీద బలంగా కొట్టి చంపేశాడు… తను ఎంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా సీత తనని మోసం చేయడాన్ని రవి తట్టుకోలేకపోయాడు… ఆ వయసులో ఉండే ఆవేశం, కోపం అతన్ని హంతకుడిని చేశాయి.

సో ఫ్రెండ్స్ అదేంది టీనేజ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎంతోమంది ప్రేమ పేరుతో ఇతరులను మోసం చేస్తూ ఉంటారు… అయితే అది తప్పు అని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ల సుఖాల కోసం వారి సంతోషాల కోసం ఎదుటి వ్యక్తుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటారు… అయితే ఒక్కోసారి అలాంటి విషయాల్లో వాళ్లు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం చూసిన రవి లైఫ్ లో కూడా అలాగే జరిగింది… సో ఫ్రెండ్స్ మీకు ఇష్టముంటే ఒకరికి మనస్ఫూర్తిగా ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకోండి… ఇష్టం లేకపోతే డైరెక్టుగా వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేయండి అంతే కానీ ఒకరి జీవితంతో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆడుకోవాలి అనుకోవద్దు.

Related Articles

Stay Connected

0FansLike
3,134FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!