23.2 C
New York
Sunday, June 26, 2022

గర్ల్ ప్రెండ్ తో ఫస్ట్ మీట్ లో ఈ చెత్త పనులు చేస్తే ..అదే లాస్ట్ మీట్

గర్ల్ ప్రెండ్ తో ఫస్ట్ మీట్ లో ఈ చెత్త పనులు చేస్తే ..అదే లాస్ట్ మీట్

ఇప్పుడు ఉన్న ఈ మోడరన్ వరల్డ్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఒకరిని ఒకరు ఇష్టపడితే ఆ తర్వాత వాళ్ళు ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్టుగా డేటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… అయితే ఒకసారి డేటింగ్ అని మొదలు పెట్టిన తర్వాత ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి అంటే వాళ్లు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనుకోవాలి అంటే కచ్చితంగా మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది… ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అమ్మాయి కోసం కానీ లేదా ఒక అబ్బాయి కోసం కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇష్టపడ్డ వాళ్ళని దక్కించుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డా కూడా తప్పు లేదు అన్నది నిజం… అయితే డేటింగ్ గురించి దాంట్లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్ గురించి మీకు సరైన అవగాహన నాలెడ్జి లేకపోతే కనుక కచ్చితంగా మీరు డేటింగ్లో సక్సెస్ అవలేక పోతారు… అలాంటి వారి కోసం ఢిల్లీకి చెందిన కొంతమంది డేటింగ్ ఎక్స్పర్ట్స్ కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు… మీరు గనక మీరు డేటింగ్ చేయాలి అనుకున్న పర్సన్ దగ్గర ఇవన్నీ అప్లై చేసినట్లయితే కచ్చితంగా మీరు ఎదుటి వ్యక్తిని ఆకట్టుకొని వారిని మీ జీవిత భాగస్వామిగా చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు…. మరి ఆ డేటింగ్ టిప్స్ ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి…

1. లేట్ గా రావడం!!!!

మీరు మీ జీవితంలో మీకు అప్పటి వరకు పరిచయం లేని ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది… వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది టైం సెన్స్ మెయింటెన్ చేయడం… ఎందుకంటే మీరు డేటింగ్ చేసిన వాళ్లతో పలాన ప్లేస్ కు వస్తానని వాళ్ళతో ముందే చెబుతారు కానీ మీరు ఆ టైం కన్నా చాలా లేట్ గా వాళ్ల దగ్గరికి వెళ్తారు దాంతో ఎదుటి వాళ్ళ దగ్గర మీరు ఆటోమేటిక్గా ఇంప్రెషన్ కోల్పోతారు… మీకు ఇలా చెప్పిన టైం కు రాకపోవడం టైమ్స్ పాటించకపోవడం అన్నవి బాగా అలవాటు అని మీ క్యారెక్టర్ అంత గొప్పగా లేదు అని వాళ్ళు అనుకుంటారు సో టైమ్స్ సెన్స్ మెయింటెన్ చేయడం అన్నది కచ్చితంగా చూసుకోండి.

2. వెయిటర్ తో కోపంగా అమర్యాదగా ఉండకండి!!!!

ఇంగ్లీషులో ఓ సామెత ఉంది మీరు ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ కు వెళితే అక్కడ ఉన్న వెయిటర్ తో అమర్యాదగా కోపంగా బిహేవ్ వాళ్ళు మీతో మాత్రం బాగా ఉంటే వాళ్లు కచ్చితంగా నటిస్తున్నారు అనుకోవచ్చు… సో మీరు గనుక ఒక పర్సన్ తో డేటింగ్ చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అది రెస్టారెంట్ అవ్వచ్చు అక్కడ వెయిటర్ తో లేదా ఏదైనా షాప్ లో ఉన్న పర్సన్స్ తో మీ ప్రవర్తన అన్నది వాళ్లకు మీరు ఏంటో చెప్పేస్తుంది… సో ఎదుటి వ్యక్తులతో గౌరవంగా ప్రేమతో ఉండడం బాగా అలవాటు చేసుకోండి.

3. ఎక్కువగా అట్రాక్ట్ అవకండి!!!!

మీరు ఆ మనిషిని ఇష్టపడే డేటింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్లకు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోవడం లాంటివి చేయకండి… ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డేటింగ్ ముగిసే సమయానికి ఏమైనా జరగొచ్చు… అందుకే ముందే ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా మీరు ఆశలు పెంచుకుంటే కనుక ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది.

4. మీ మాజీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గురించి అస్సలు మాట్లాడవద్దు!!!!

మీరు డేటింగ్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి మీ గురించి అన్ని వివరాలు చెప్పాలి అనుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ ఆ ప్రాసెస్ లో మీరు మరి నిజాయితీగా ఉండాలి అనుకుంటూ మీ జీవితంలో ఉన్న మాజీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ల గురించి వాళ్లకు గనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీ గురించి ఒక అంచనాకు వస్తారు… మీ క్యారెక్టర్ ఏంటి మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఎందుకు అన్ని సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యారు అన్న విషయాలు వాళ్లు పసిగట్టే ప్రమాదం ఉంటుంది దాంతో వాళ్లు మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లి పోవడానికి అవకాశం ఉంది.

5. సరైన క్వశ్చన్స్ అడగకపోవడం!!!!

ఒక కొత్త పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లతో ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అలా మాట్లాడటం ద్వారా మీరు ఏం అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నారు అన్న విషయాలు ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది… అందుకే మీరు డేటింగ్ చేస్తున్న వారితో మాట్లాడేటప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగడం వాళ్లు సర్ ప్రైజ్ అయ్యే విషయాల గురించి మాట్లాడటం అన్నది మీకు బాగా హెల్ప్ అవుతుంది.

6. మీ గురించి గొప్పలు చెప్పుకోవడం!!!!

ఎవరికైనా సరే ఒక వ్యక్తి తన గురించి తాను ఎక్కువ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే అస్సలు నచ్చదు… అలాంటిది మీరు డేటింగ్ చేస్తున్న పర్సన్ దగ్గర మీ గురించి అదేపనిగా చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ కూర్చుంటే వారు మీ గురించి తప్పుగా అర్థం చేసుకొని మీతో మధ్యలోనే బ్రేక్ అప్ చెప్పుకొని వెళ్లి పోయే అవకాశం ఉంటుంది. అందుకే మీ గురించి కేవలం అవసరమైనంత మాత్రమే అన్ని వివరాలు చెప్పి ఎదుటి వారి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది.

7. అదే పనిగా ఫోన్ చూసుకోవడం!!!!

తమ చేతిలో ఫోన్ ఉందని చాలామంది 24 గంటలు అదే పనిగా ఫోన్ వాడుతూ ఉంటారు… తమ ముందు ఒక పర్సన్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా కూడా అతనికి గౌరవం విలువ ఇవ్వకుండా ఎంతసేపు తమ ఫోన్లోనే మునిగిపోతూ ఉంటారు… మీరు డేటింగ్ చేస్తున్న పర్సన్ దగ్గర కూడా అలాగే మీరు ఎక్కువగా ఫోన్ వాడటం అంటూ జరిగితే ఎదుటి వ్యక్తికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరని మీతో ఉంటే లైఫ్ అంత బాగుండదని వాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది… అందుకే మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ అనేది ఎక్కువగా చూసుకోకండి.

8. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోండి!!!!

మీరు డేటింగ్ చేస్తున్న పర్సన్ ఇలాంటి వారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మాటలకి మీరు చేస్తున్న పనులకు వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న విషయాల గురించి మీరు కచ్చితంగా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది… ఎందుకంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే తమ ఇష్ట పడుతున్న పర్సన్ తమ ఫీలింగ్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని తమను పట్టించుకోవాలని ఎక్కువగా కోరుకుంటారు… ఆ పని మీరు అంత కరెక్ట్ గా చేసినట్లయితే వాళ్లు మీకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి యస్ చెప్పే అవకాశం ఉంటుంది.

9. మీ సిద్ధాంతాలు నమ్మకాలు ఎదుటి వాళ్ళ మీద రుద్దాలి అనుకోకండి!!!!

ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా తనకంటూ కొన్ని సపరేట్ నమ్మకాలు సిద్ధాంతాలు అలవాట్లు ఉంటాయి అయితే వాటిని ఎదుటి మనిషి మీద రుద్దాలి అనుకున్నప్పుడు మాత్రం కచ్చితంగా వాళ్లు ఎదుటి వ్యక్తికి మూర్ఖుడిలా కనిపిస్తారు దాంతో వాళ్లను ఇష్టపడే మనుషులు అయినా కూడా వాళ్లకు దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటారు… సో మీరు కూడా ఒక కొత్త వ్యక్తితో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి నమ్మకాలు సిద్ధాంతాలు ఉన్నా కూడా వాటిని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయకండి. మీరు అలా చేయాలి అనుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తిని మార్చాలి అనుకుంటున్నారని వాళ్ళు మీ గురించి తప్పుగా అనుకుంటారు.

10. అన్ని విషయాలు షేర్ చేసుకోవడం!!!!

మీరు డేటింగ్ చేస్తున్న పర్సన్ మీకు ఎంతగానో నచ్చిన కూడా వాళ్లతో మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా తమకంటూ కొన్ని పర్సనల్ విషయాలు ఖచ్చితంగా ఉంటాయి అవి పర్సనల్ కాబట్టి తన లైఫ్ పార్టనర్ అనుకునే వాళ్లకి కూడా చెప్పాలన్న రూల్ లేదు. సో అలా మీరు డేటింగ్ చేస్తున్న పర్సన్ దగ్గర అన్ని విషయాలు చెప్పకుండా మీకు అవసరం అనిపించిన విషయాలు చెప్పడం ద్వారా ఫ్యూచర్ లో మీ గురించి ఎలాంటి నెగెటివ్ పాయింట్స్ వారికి తెలియకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది.

సో ఫ్రెండ్స్ అవ్వండి మీరు గనుక ఎవరైనా ఒక పర్సన్ ని ఇష్టపడి వాళ్లతో డేటింగ్ చేయాలి అనుకుంటే కచ్చితంగా ఇక్కడ మీరు తెలుసుకున్న అన్ని డేటింగ్ టిప్స్ పాటిస్తూ వాళ్లతో నీతిగా నిజాయితీగా మనస్ఫూర్తిగా ఉంటే గనుక కచ్చితంగా వాళ్ళు మీకు చెప్పే అవకాశం ఉంటుంది… ఎందుకంటే అన్ని విధాలుగా అద్భుతంగా ఉండే వాళ్ళని వదిలి పెట్టుకోవాలని ఎవరు అనుకోరు… విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!