23.2 C
New York
Tuesday, September 21, 2021

ఇలా ఫ్లర్ట్ చేస్తే ఎలాంటి అమ్మాయి అయినా ఇట్టే పడిపోవాల్సిందే

ఒక అందమైన అమ్మాయిని చూసిన ఏ అబ్బాయికయినా ఆమె దగ్గరకు వెళ్ళాలని ఆమెతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడాలో తెలియదు ఎలా అమ్మాయిలను అప్రోచ్ అవ్వాలో తెలియదు కేవలం ఈ డైలమ వల్లే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడానికి జంకుతారట… దాంతో తామొక ప్రెట్టి గర్ల్ ను చూసి ఇష్టపడ్డా తన దగ్గరకు వెళ్ళలేక స్టార్టింగ్ లోనే డ్రాప్ అయిపోతారు… అలాగే ఒకవేళ ఎవరైనా అమ్మాయితో లవ్ లో పడినా తనని కలిసినప్పుడల్లా తనతో ఏం మాట్లాడాలో తెలియదు… ఎలా తనని ఇంప్రెస్ చేయాలో తెలియదు దాంతో ఆ అమ్మాయి బోరింగ్ గా ఫీల్ అవడం అబ్బాయి మీద తనకు ఇంటరెస్ట్ తగ్గిపోవడం జరుగుతుంది. ఎలాంటి అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్ తనతో బాగా మాట్లాడాలని జోక్స్ చెప్పాలని తనని బాగా నవ్వించాలని కోరుకుంటుంది… ఆ లక్షణాలు లేకపోతే అబ్బాయికి బ్రేకప్ చెప్పడానికి ఏం మాత్రం వెనుకాడడు ఎందుకంటె లేడీస్ లవ్ కబుర్లు అండ్ గాసిప్స్… సో అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలతో మాట్లడలేక మీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడుంటారు కదా బట్ ఇప్పుడా టెన్షన్ ను మర్చిపొండి… ఎందుకంటె కోల్ కత్తాకు చెందిన శ్రిజిత్ ముఖర్జీ అనే ఒక సైకాలజీ ఎక్స్పర్ట్ ఈ విషయంలో రిసెర్చి చేసి అబ్బాయిలు ఎలా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారో అన్న విషయాల్ని చాలా క్లియర్ గా ఎక్స్ ప్లెయిన్ చేసాడు సో ఇంకెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకుందాం పదండి…

కొన్ని వందల ఏళ్ళ క్రితం అన్ని విధాల అర్హుడు, బలవంతుడు అయిన మగాడినే ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే వారు ఆ తర్వాత మారిన కాల క్రమంలో తనని ఎవరు బాగా చుసుకుంటారో మంచి జాబ్ చేస్తారో అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడున్న టైంలో లేడీస్ కూడా జాబ్స్ చేస్తున్నారు మగాడి మీద ఆధారపడి బ్రతకకుండా తమ లైఫ్ తాము లీడ్ చేయగల పొజిషన్ లో కూడా ఉంటున్నారు అందుకే ఏ అమ్మాయినయినా పడేయాలంటే అబ్బాయిలకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. తమని తన మాటలతో మాయ చేసే అబ్బాయిలకే అమ్మాయిలు ఎక్కువగా ఎస్ చెపుతున్నట్టుగా శ్రిజిత్ ముఖర్జీ రిసెర్చి లో తేలిందట. అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేయాలేని అంతగా సోషల్ స్కిల్స్ లేని అబ్బాయిలు ఈరోజుల్లో అమ్మాయిలను పడేయడం చాలా కష్టమని అలాంటి వాళ్ళంతా ఎక్కువ రోజులు సింగల్ గా ఉండక తప్పదని ఆయన చెపుతున్నారు. వెయిట్ వెయిట్… అంటే ఇంక నేను సింగల్ గా మిగిలిపోతానా అమ్మాయిలతో మాట్లడలేనా అని నిరాశ పడకండి ఒక్కసారి శ్రిజిత్ ముఖర్జీ చెప్పిన టిప్స్ గురించి మనం మాట్లాడుకుంటే మీకే ధైర్యం వస్తుంది.

1.సూటిగా అమ్మాయి కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి…

ఒక అబ్బాయితో ఆన్ లైన్ లో మాట్లాడినప్పుడు లేదా మేసేజ్ చేసేప్పుడు వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, మంచి సెన్సాఫ్ హుమార్ ఉంది అనిపిస్తారట… కానీ అదే అబ్బాయిని డైరెక్ట్ గా కలిశాకా కనీసం అమ్మాయిల కళ్ళలోకి సూటిగా చూడడానికి కూడా భయపడతారట ఇదే శ్రిజిత్ ముఖర్జీ తన రిసెర్చి లో చెప్పిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్… సో మీరొక అమ్మాయితో ఫోనులో ఎంత అద్భుతంగా చాటింగ్ చేసినా తనని డైరెక్ట్ గా కలిసినప్పుడు మాత్రం భయపడ్డా లేక తడపడ్డా ఇక అంతే సంగతులు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి బెదురూ తడబాటు లేకుండా ధైర్యంగా మాట్లాడండి.

2. అమ్మాయి పక్కన వున్నప్పుడు పక్క చూపులు చూడకండి.

బయట ఎక్కడైనా మనం జనరల్ గా గమనిస్తే ఒక అమ్మాయి పక్కన ఉన్న ఏ అబ్బాయైనా కొంచెం ఫోజులు కొడుతుంటాడు అబ్ నార్మల్ గా బిహేవ్ చేస్తుంటాడు. అయితే ఇవేవి అమ్మాయిలకు నచ్చవట… తమ పక్కన ఉంటే చేతులు కట్టుకోవడం, తమను చూడకుండా ఎటో చూడడం లేనిపోని బిల్డప్ లు ఇవ్వడం… ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే మార్చుకొమ్మని శ్రిజిత్ ముఖర్జీ సలహా ఇస్తున్నారు. అమ్మాయి పక్కనున్నప్పుడు తనని ఒక క్వీన్ లా చూడాలంట తన ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ వాటికి తగ్గట్టుగా మారాలంట, మీ ఫోకస్ అంతా అమ్మాయి మీద ఉండాలట.

3. బాడీ లాంగ్వేజ్ 

అబ్బాయిలు గుర్తించరట కానీ తమ పక్కన ఉండే అబ్బాయిల బాడీ లాంగ్వేజ్ ను అమ్మాయిలు చాలా అబ్జర్వ్ చేస్తారట దాన్ని బట్టే అతను వాళ్లకు కరక్టేనా తనలో ధైర్యం ఉందా నిజంగా తనని అతను ప్రొటెక్ట్ చేయగలడా అన్న విషయాల మీద ఎక్కువ ఆలోచిస్తారట… సో అబ్బాయిలు మీ బాడీ లాంగ్వేజ్ లో కాన్ఫిడెన్స్ ఉండేలా చూసుకోండి భయం, నర్వస్ నెస్, టెన్షన్ ఇలాంటివేవి మీలో ఉండొద్దు.

4. నవ్వుతూ ఉండండి

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చస్తారట… సో మీ ఫేస్ మీద స్మైల్ మైంటైన్ చేయండి… మీలో ఎలాంటి టెన్సన్స్ కనపడనీయకండి. మీ లైఫ్ లో మీకేన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తనతో వున్నప్పుడు అవేవి మీతో తీసుకెళ్ళకండి… మీతో ఉంటే తను హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం తనకు మీ మీద కలగాలి అప్పుడే తను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది. 

5. అంత తొందరగా పర్సనల్ విషయాలు తనకు చెప్పకండి, తనను కూడా అడగకండి.

అమ్మాయి మీతో క్లోజ్ గా మాట్లాడుతుంది కదా అని మీ పర్సనల్ విషయాలేవీ ఆమెకు చెప్పొద్దు… మెల్లిగా మీ మధ్య రిలేషన్ షిప్ పెరిగాకా అప్పుడు చెప్పండి… తను ఫీల్ అయితే తానే మీకు తన గురించి విషయాలన్నీ చెపుతుంది… సో తన వ్యక్తిగత వివరాలు అడగకండి ఆమె చెప్పే వరకూ వెయిట్ చేయండి.

6. తనకు రెస్పెక్ట్ ఇవ్వండి, అప్పుడప్పుడు తనని పొగడండి. 

పొరపాటున కూడా తన గురించి చులకనగా మాట్లాడకండి అలాగే ఇతరుల గురించి కూడా ఆమె దగ్గర చీప్ గా అస్సలు మాట్లాడొద్దు అలా చేస్తే తనకు మీ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అవకాశం వచ్చినప్పుడు తనకు కాంప్లిమెంట్స్ ఇవ్వండి తన డ్రెస్ బాగుందనో, తన స్మైల్ అంటే మీకిష్టం అనో చెప్పండి అలా అని తనను మరీ ఎక్కువగా పొగడడం కూడా అమ్మాయికి నచ్చదు. 

సో బాయ్స్ ఇవీ మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని మీ తెలివితేటలతో పడేసే టిప్స్… మీరు గనక ఈ టిప్స్ అన్నీ కరక్ట్ గా పాటించి అమ్మాయిని ట్రై చేస్తే మీ డ్రీం గర్ల్ మీకు పడిపోతుంది… ఇంకెందుకాలస్యం ఈ టిప్స్ తో ట్రై యువర్ లక్… అల్ ది బెస్ట్!!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!