22.1 C
New York
Sunday, June 26, 2022

ఆ పనిని నిర్లక్ష్యం చేస్తే…మీ పార్టనర్ చేసే ఫస్ట్ పని ఏమిటో తెలుసా.? | SARAYU

ఆ పనిని నిర్లక్ష్యం చేస్తే…మీ పార్టనర్ చేసే ఫస్ట్ పని ఏమిటో తెలుసా.? | SARAYU

అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉండే రిలేషన్షిప్ లో ఎప్పుడూ ఏవో గొడవలు, అలకలు, అపోహలు, అపార్థాలు ఇలా ఎన్నో వస్తుంటాయి అయితే చాలా మంది అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకుని తమ రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకొని విడిపోతూ ఉంటారు… ఆ తర్వాత అనవసరంగా తొందర పడ్డామని బాధపడుతూ ఉంటారు… అయితే ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంతే దాంట్లో ఉన్న ఇద్దరు పార్ట్నర్స్ కు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తమ రిలేషన్ షిప్ నిలబెట్టుకోవడానికి వాళ్లు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి అన్న విషయాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా ఆ విషయంలో మీరు చేసే తప్పులు …తెలియకుండా చాలా పెద్దవి అయ్యిపోతాయి. ఈ విషయం మీద కొంతమంది డేటింగ్ ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలు సూచనలు చేశారు… అవి గనక ఒక రిలేషన్ షిప్ స్టార్ట్ చేద్దాం అనుకునే అమ్మాయిలు అబ్బాయిలు పాటించినట్లయితే కచ్చితంగా వాళ్ళ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుందని ఒక వేళ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేసుకుని కలిసి ఉండగలుగుతారు అని చెబుతున్నారు. మరి ఇప్పుడు ఆ క్వాలిటీస్ ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి….

  1. పర్సనల్ గ్రోత్ & డెవలప్మెంట్ = ఒక రిలేషన్ షిప్ లో ఉండే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఖచ్చితంగా తమ జీవితాల్లో గొప్ప విజయాలు సాధించాలని అనుకున్నప్పుడే ఆ రిలేషన్ షిప్ అన్నది అద్భుతంగా ఉంటుంది… ఎందుకంటే మీరు మీ జీవితంలో ఎన్నో గోల్స్ పెట్టుకున్న తర్వాత మరొక వ్యక్తితో మీ జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు వాళ్లు కూడా మీలాంటి ఆశలు గోల్స్ పెట్టుకుని తమ జీవితంలో ఎదగాలి అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే మీ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ర్యాపో పెరిగి మీ పర్సనల్ జీవితాల్లో విజయాలు సాధించడంతో పాటు అలాగే ఇద్దరూ కలిసి మీ జీవితంలో డెవలప్ అవడం కూడా జరుగుతుంది.
  1. కామన్ ఇంట్రెస్ట్ లు = ఒక రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళు ఇద్దరికీ ఉండే కామన్ ఇంట్రెస్ట్ లు షేర్ చేసుకోవడం అలాగే తమకున్న ఇష్టాలను మరొకరితో పంచుకుంటూ ఉండడంతో ఇద్దరి మధ్యన ఉండే బంధం అన్నది కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది… అలాగే ఇద్దరి ఇష్టాలు ఒకటే అయితే గనక వారి మైండ్ సెట్ లు కూడా సరిగ్గా మ్యాచ్ అవుతాయి దాంతో ఎదుటి వ్యక్తి ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు కూడా తమకు నచ్చి ఆ పర్సన్ తో ఉండడాన్ని ఆ రిలేషన్ షిప్ ను ఎంజాయ్ చేస్తారు. దాంతో ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు, గొడవలు వచ్చినా కూడా వాటిని ఇద్దరూ అర్థం చేసుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని తప్పులు చేసినా మళ్ళీ ఒక మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేయాలని ప్రయత్నిస్తారు… దాని వల్ల ఆ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ షిప్ అన్నది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది.
  1. ఫైనాన్షియల్ ప్రయారిటీస్ = రిలేషన్ షిప్ లో ఉన్న పార్టనర్స్ ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్న ఫైనాన్షియల్ విషయాల గురించి కచ్చితంగా ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది… ఇద్దరికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి సరైన అవగాహన ఉందా లేదా అసలు వాళ్ళు డబ్బు గురించి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు?? ఒకవేళ ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ రిలేషన్ షిప్ లో ఉండాలి అనుకుంటే అప్పుడు వాళ్ల ప్రయారిటీ స్ ఎలా ఉంటాయి??? డబ్బుకు వాళ్ళు ఇస్తున్న విలువ ఏంటి??? తమ లైఫ్ లో పర్సనల్ గా ఏమైనా డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నారా??? అలాగే తమ పార్టనర్ తో కూడా కలిసి వారి రిలేషన్ షిప్ కోసం డబ్బులు ఏమైనా సేవ్ చేయాలనుకుంటున్నారా ఇలాంటి విషయాల మీద కూడా ఇద్దరికి ఒక క్లారిటీ ఉండాలి… మీకు డబ్బు గురించి ఉన్న అవగాహన ఎదుటి వ్యక్తి కి కూడా ఉండగలిగితే అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి… ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని గురించి మీ పార్టనర్ కు మీకు మంచి ఐడియా ఉండడం అన్నది మీ ఇద్దరికీ మంచే చేస్తుంది.
  1. ఆ పని = మీరు ఒక పర్సన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వాళ్లతో రహస్యపు జీవితం ఎలా ఉంది అన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఆ  విషయంలో ఎదుటి వ్యక్తి నుంచి సరైన సహకారం లేకపోతే అప్పుడు మీరు వాళ్లతో చేసిన ఆ పని  విషయంలో అసంతృప్తికి గురి కావాల్సి వస్తుంది అది మీ ఇద్దరి మధ్య గొడవలు దారి తీసి మీ రిలేషన్ షిప్ బ్రేక్ అవడానికి కూడా కారణం అవుతుంది. ఎందుకంటే అలాంటి  విషయం దగ్గరికి వచ్చేసరికి దాని గురించి ఒక్కో వ్యక్తికి ఒక విధంగా ఆశలు కోరికలు ఉంటాయి అది ఎదుటి వాళ్లు అర్థం చేసుకొని ఆ పనిలో  విషయంలో వారిని సంతృప్తి పరచగలిగితే అపుడు వారి మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా దాన్ని  నిర్లక్ష్యం చేసినట్లయితే అది వారు చేసే చాలా పెద్ద తప్పు అవుతుంది.

5.ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ = మీరు ఒక వ్యక్తితో కలిసి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్లతో మీరు ఎంత వరకు కలిసి ఉంటారు అనేది కచ్చితంగా మీ కుటుంబానికి అలాగే మీ స్నేహితులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ జీవితంలో అప్పుడే కొత్తగా వచ్చిన వ్యక్తి కంటే మీ గురించి మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ స్నేహితులకు ఎక్కువగా తెలుస్తుంది సో మీరు గనక మీరు రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ వాళ్లకి పరిచయం చేసినట్లు అయితే అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేయడానికి మళ్లీ మీ ఇద్దరూ కలిసి ఉండడానికి మీ ఫ్యామిలీ కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఒక పర్సన్ తో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వారిని మీ కుటుంబానికి మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయాలి అనుకున్నప్పుడు కచ్చితంగా మీరు వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతున్నారు వాళ్లతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు వారు చేసే తప్పులను కూడా పట్టించుకోకుండా కలిసి ఉందాం అనుకుంటున్నారు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్లని మీ వాళ్ళకి పరిచయం చేయండి.

  1. అలవాట్లు = కామన్ అలవాట్లు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరి పట్ల ఒకరు ఎక్కువగా రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అలా వారిద్దరిని తమ లైఫ్ స్టైల్ తమలో ఉండే అలవాట్లు ఒకటిగా కలిపి ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఒక్కోసారి మీకు ఎదుటి వ్యక్తి అలవాట్లు నచ్చనప్పుడు అందులోనూ మీరు రిలేషన్ షిప్ లో ఉన్న పర్సన్ అలవాట్లు మీకు నచ్చకపోతే ఒకవేళ మీరు వారితో రిలేషన్షిప్ కొనసాగించాలి అనుకుంటే ఖచ్చితంగా వారి అలవాట్లను కూడా మీరు ఒప్పు కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇబ్బంది పడినట్లు అయితే అది ఎదుటి వారికి తెలిసిపోయి బాధపడతారు. మీరు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి వాళ్లతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు వారిలో ఉన్న నెగటివ్ పాయింట్స్ అలాగే చెడు అలవాట్లు అన్నవి చూసిచూడనట్లు వదిలేయాలి కాని వాటిని పెద్దగా పట్టించుకోకూడదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఒకవేళ వారు మీ మాట వింటే గనుక మెల్లగా వారితో ఆ చెడు అలవాట్లు మాన్పించడానికి ప్రయత్నం చేయండి.
  1. స్పిరిచువల్ కనెక్షన్ = ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వారిద్దరిలో ఉన్న నమ్మకాలు సిద్ధాంతాలు అన్నవి ఒకే విధంగా ఉండకపోవచ్చు… అయితే ఒక్కోసారి అవి కలిసి ఇద్దరూ ఒకే స్పిరిచువల్ కనెక్షన్ అనుభవిస్తూ కూడా ఉండొచ్చు ఒకవేళ అలాంటి ది గనుక మీ రిలేషన్ షిప్ లో జరిగితే అప్పుడు మీరు చాలా లక్కీ అనుకోవాలి ఎందుకంటే స్పిరిచువల్ గా ఇద్దరూ ఒకే ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు జీవితంలో కూడా కలిసి ఉండటం అన్నది మీకు అతి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దాని ద్వారా ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో పాటు మీ మధ్య ఎలాంటి గొడవలు అపార్ధాలు అనేది కూడా రాకుండా ఉంటుంది. మీ ఇద్దరి ఆలోచనలు భావాలు కూడా సమానంగా ఉండటంతో పాటు మీ ఇద్దరు సంతోషం అన్నది కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అవండి అనగా ఒక పర్సన్ ఇష్టపడి వాళ్లతో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే కచ్చితంగా ఈ విషయాలన్నిటినీ మీద మీరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే వాళ్లతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతగానో ఇష్టపడి ప్రేమించి ఏదో మిమ్మల్ని ప్రేమించిన వాళ్లని చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో లేదా అపార్ధాలతో వదులు కోవడం అన్నది మీకు చాలా బాధాకరంగా ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!